మనం ఏమీ భోజనం తింటున్నామన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత అధికంగా రెడీ మేడ్ బోజనాలకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే తాజా అహారం కన్నా వారు బయట ఎక్కడెక్కడో తిరిగేసి.. చేతిలోని ఫోన్లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లను వినియోగించుకుని ఎలా తయారు చేశారో, ఎంతటి నాణ్యతతో కూడిన పదార్థాలను వినియోగించి ఆహారాన్ని వండివర్చారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక మరికోందరు ఏకంగా రోడ్లకు ఇరువైపులా ఉండే హోటళ్ల వద్ద కూడా తమ ఆహారాన్ని అస్వాదిస్తుంటారు. ఆ రోడ్డులో వెళ్తున్న వాహనాల సంఖ్య, వాటి పోగ ఆహార పదార్ధాలకు సోకడంతో మనకు తెలియకుండానే పోగను కూడా తినేస్తున్నాం. దీంతో ఏమి తింటున్నామో.. ఎక్కడ తింటున్నామో కూడా చాలా ముఖ్యం.
వీటితో పాటు మరో ముఖ్యమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదేటంటే ఎప్పుడు తింటున్నాం.? ఈ అంశం కూడా మన రోజువారి వ్యవహార శైలితో పాటు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడానికి చాలా ముఖ్యం. రోజు వారీగా మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో ఏమి తింటున్నామన్న దానిపై ఆధారపడి మన శరీర బరువు మరియు మొత్తం ఆరోగ్య నిర్వహణ ఉంటుంది. ఏ సమయంలో తింటే ఏముందిలే అనుకునేందుకు ఏ మాత్రం వీలు లేదు. ఎందుకంటే తినే సమయంతో పాటు ఏమి తింటున్నాము, ఎక్కడ తింటున్నామన్న అంశాలు మన ఆరోగ్యంతో పాటు శరీర బరువును కూడా ప్రభావితం చేస్తాయి. మీ భోజనం మరియు స్నాక్స్ కోసం సాధారణ షెడ్యూల్‌ను నిర్వహించడం ద్వారా మీరు మెరుగైన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు నుండి ప్రయోజనం పొందవచ్చు.
అల్పాహారం తినడానికి ఉత్తమ సమయం Best Time To Eat Breakfast

అల్పాహారం సాధారణంగా చాలామంది దీనికి ప్రాధాన్యతను ఇవ్వరు. అయితే అలాంటివారు తీవ్రమైన ఒత్తిడి, అలసట వంటి పరిస్థితులను అనుభవిస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అల్పాహారానికి బదులు ఏకంగా భోజనాన్ని అస్వాధించి బయటకు వెళ్లడం అనవాయితి. పట్టణాల్లో, నగరాల్లో చాలామందికి అల్పాహారం తీసుకునే అలవాటు ఉంది. అయితే దానిని వారు ఎప్పుడు తీసుకుంటారన్నదే ఇప్పుడు చర్చ. ఉదయం ఆరు గంటలకు నిద్రలేచినా.. కనీసం పదిగంటల వరకు కూడా స్నానాదులు చేసుకోకుండా మెల్లిగా 11 నుంచి 12 గంటల మధ్య అల్పాహారం తీసుకుంటారు. కానీ నిఫుణులైన డైటీషియన్లు, న్యూట్రీషియన్లు మాత్రం నిద్రలేచిన రెండు గంటలలోపు అల్పాహారం తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే మీరు లేచిన వెంటనే అల్పాహారం తీసుకోవడం వల్ల మీ మెటబాలిజంలో గణనీయమైన ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ఆహారం యొక్క కంటెంట్ ఎంత ముఖ్యమైనదో మీ భోజనం యొక్క సమయం కూడా అంతే ముఖ్యం.
పోషకమైన అల్పాహారం Nutritious Breakfast


ఉదయం నిద్ర లేచిన రెండు గంటల లోపు అల్పాహారం తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారని చెప్పాం కాబట్టి. ఎంత బడితే అంత, ఏది పడితే అది తీసుకోకూడదు. అల్పాహారం అన్నది ఒక పోషకమైన ఫలహారంలా ఉండాలే తప్ప.. మీరు తీసుకున్న అల్పాహారం జీర్ణం కావడానికే మీ శక్తి సరిపోని విధంగా ఉండకూడదు. మీరు తీసుకునే అల్పాహారం ఆ రోజును సవ్యంగా ముందుకు సాగేందుకు మీ శరీరానికి శక్తిని అందించాలని నిఫుణులు ఊటంకిస్తున్నారు. సాధారణంగా ఉదయాన్నే నూనెలో ఫ్రై చేసిన ఆహారం, లేదా వేయించిన ఆహారాలు (అయిలీ ఫుడ్) తీసుకోరాదు. అంటే గారెలు, పూరీలు, బొండాలు, దోశలు వంటి అల్పాహారాలకు దూరంగా ఉండటం మంచిది.
వీటికి తోడు అధికంగా కొబ్బరి చట్నీని కూడా వేసుకోరాదు. ఇవి రాత్రంతా కాసింత విశ్రాంతి తీసుకుని కడుపుని పూర్తిగా క్లీన్ చేసిన ఉదరంలోకి తేలికగా జీర్ణమయ్యే ఆహారం వెళ్తే.. వెంటనే శక్తిని ఉత్పత్తి చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇలాంటి అయిలీ ఫుడ్ తినడం వల్ల ఉదరంపై భారం పడి, ఆ రోజును డీలా చేస్తుంది. తేలికైన, చక్కగా జీర్ణమయ్యే పోషకాలతో కూడిన ఆల్పాహారం తీసుకుంటే మీ జీవక్రియను చక్కగా ప్రారంభిస్తుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది మరియు అభిజ్ఞా పనితీరును పెంచుతుంది.
మీరు ఉదయం వ్యాయామం చేసినప్పుడు When you do workout in the morning
ఉదయాన్నే వ్యాయామం చేసేవారు సాధారణంగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. అయితే చాలా ఆకలి వేస్తున్నా లేదా తినకపోవడం వల్ల శరీరం సహకరించక పోవచ్చు అని భావించిన తరుణంలో, వ్యాయామం చేసే సమయానికి 20-30 నిమిషాల ముందు అరటిపండు లేదా అవోకాడో టోస్ట్ వంటి తేలికపాటి పండ్లు తీసుకోండి. అయినప్పటికీ, ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు మీ శరీరం మెరుగ్గా పనిచేస్తే, మీరు మీ వ్యాయామ సెషన్ తర్వాత ఉడికించిన కొడిగుడ్డు, పాలను తీసుకోవచ్చు. రీఫ్రెష్ అయిన తరువాత అల్పాహారాన్ని ఎంచుకోవచ్చు.
అల్పాహారం దాటవేయడం Skipping breakfast


మన దేశంలో ఇప్పటికీ రోజుకు రెండు పూటలా అన్నం దొరకని కుటుంబాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటివారు అల్పాహారం గురించి ఏ నాడు అలోచించరు. వీరితో పాటు ఊభకాయులు, బరువు నిర్వహించాలని నిర్ణయించుకున్నవారు ఒక్కరు కాదు ఇలా చాల రకాల మనుషులు అల్పాహారం దాటవేయడానికి ప్రయత్నిస్తుంటారు. అల్పాహారం తినడం వల్ల తాము లావు అవుతున్నామని, లేదా లావు తగ్గలేమని భావించిన వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. అయితే వీరి అలోచన సబబేనా అంటే కాదని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు న్యూట్రీషియన్లు.
అల్పాహారం తీసుకోకపోవడం లేదా దానిని దాటవేయాలని భావించడం మొత్తం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందని అల్పాహారం తీసుకోవడం అన్నది మన శరీరానికి ప్రారంభ శక్తిని అందజేసే ఇంధనం అని, అయితే అది తేలికపాటిదై ఉండాలని కూడా సూచిస్తున్నారు. అల్పాహారం తీసుకోని పక్షంలో అది మొత్తం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది, ఇది ఒత్తిడి, అలసట, ఊబకాయం మరియు మధుమేహం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అల్పాహారం దాటవేయడం వల్ల మన ఆకలి హార్మోన్లకు అంతరాయం ఏర్పడుతుంది, ఫలితంగా రోజులో అధికంగా తినాలని అనిపించడం.. తద్వారా మరింత లావుగా మారేందుకు అవకాశం ఉంది.
బిజీ సమయాల్లో ఆరోగ్యకర ఆహార నిర్వహణకు మార్గాలు Ways To Maintain a Healthy Diet During Busy Timings
ఉదయపు రద్దీ యొక్క గందరగోళంలో అల్పాహారం తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది, కానీ అది అలా ఉండవలసిన అవసరం లేదు. మీకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ, పోషకమైన అల్పాహారం తినడానికి ఇక్కడ కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
- ముందుగా ప్లాన్ చేసుకోండి
- మీ ఎంపికలను సరళీకృతం చేయండి
- పెద్దమొత్తంలో ఉడికించాలి
లంచ్ తినడానికి ఉత్తమ సమయం Best Time To Eat Lunch


భోజనం సాధారణంగా అల్పాహారం తర్వాత నాలుగు నుండి ఐదు గంటల తర్వాత షెడ్యూల్ చేయబడుతుంది. ఉదాహరణకు, మీరు ఉదయం 7 గంటలకు అల్పాహారం తీసుకుంటే, మీ భోజనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం వరకు చేయాలి. అయితే, పరిస్థితులు మిమ్మల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం చేయకుండా నిరోధించినట్లయితే, ఈ రెండు భోజనాల మధ్య చిరుతిండిని చేర్చడం మంచిది. ఇక సాధారణంగా మధ్యాహ్న భోజనానికి ఉత్తమ సమయం ఏదీ అంటే మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటలు అన్న విషయాన్ని డైటీషియన్లు నొక్కి చెబుతున్నారు.
మధ్యాహ్న భోజనం ఎందుకు అవసరం? Why is lunch essential?
బహుళ కారణాల వల్ల భోజనం చేయడం చాలా అవసరం, ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో, శక్తి క్రాష్లను నివారించడంలో మరియు చిరాకును తగ్గించడంలో ఇది ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఉదయం పది గంటల లోపు భోజనాలు చేస్తారు కాబట్టి వారు మధ్యాహ్న వేళలో భోజనానికి బదులు టీ, స్నాక్స్ తీసుకుంటారు. అలా కాకుండా చపాతి, జొన్న రోట్టే తీసుకున్నా ఫర్వాలేదు. కానీ మధ్యాహ్నం మాత్రం ఏదో ఒక అహార పదార్థం తీసుకోవాలి. ఎందుకంటే ఉదరాగ్ని బాగా పెరిగిన సమయంలో ఆహారం తీసుకోకపోతే అది నీరసం, అలసట, ఒత్తిడికి దారి తీస్తుంది.
రెగ్యులర్ భోజన సమయాలకు కట్టుబడి ఉండటం Adhering To Regular Meal Times


అలాగే, రెగ్యులర్ భోజన సమయాలను పాటించడం వల్ల శరీరం యొక్క సర్కాడియన్ లయలు, జీర్ణక్రియ మరియు మొత్తం ఆరోగ్యం మెరుగుపడతాయి. ఒక నిర్దిష్ట సమయంలో నిరంతరంగా భోజనం చేయడం కూడా భాగం నియంత్రణలో సహాయపడుతుంది, ఎందుకంటే ఆకలి తరచుగా అతిగా తినడానికి దారితీస్తుంది.
జీర్ణక్రియ Digestion
భోజనం మరియు జీర్ణక్రియ యొక్క సమయం సిర్కాడియన్ రిథమ్‌తో సహా శరీరంలోని వివిధ సహజ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రక్రియలకు అంతరాయం కలిగించని విధంగా భోజన సమయాలను మరియు జీర్ణక్రియను సమలేఖనం చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించవచ్చని సాధారణంగా నమ్ముతారు.
బరువు తగ్గడం Weight loss
సాధారణ అల్పాహారం మరియు ముందుగా భోజనం చేయడం బరువు తగ్గడంలో సహాయం చేస్తుతుందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, వ్యక్తిగత జన్యుపరమైన కారకాలు కూడా పాత్ర పోషిస్తాయని గుర్తించడం చాలా అవసరం.
గట్ ఫ్రెండ్లీ మైక్రోబయోమ్ Gut friendly Microbiome
అలాగే, ప్రారంభ లంచ్ ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌కు దోహదం చేస్తుందని ఉద్భవిస్తున్న పరిశోధనలు చెబుతున్నాయి. మైక్రోబయోమ్ మానవ గట్ మరియు శరీరంలోని బ్యాక్టీరియా సేకరణను సూచిస్తుంది, ఇది మొత్తం ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
రాత్రి భోజనం చేయడానికి ఉత్తమ సమయం Best Time To Eat Dinner


రాత్రి భోజనం కాసింత త్వరగా చేయడం వల్ల మీ శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. రాత్రి భోజనం ఎప్పుడు చేయాలంటే మధ్యాహ్న భోజనం చేసిన తరువాత ఐదు నుండి ఆరు గంటల వ్యవధి లోపు చేయడం ఉత్తమం. ఇక నిద్రించేందుకు మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయాలంటే కనీసంగా దానిని రాత్రి 7.30 లోపు ముగించేయడం ఉత్తమం. రాత్రి భోజనం చేయడం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా పెరుగుతాయి మరియు తగ్గుతాయి. రాత్రి 8 గంటల తర్వాత మీరు ఇంటికి చేరుకున్నా.. మీకు బాగా ఆకలి వేస్తున్నా ఏది కనిపిస్తే అది తినడం లేదా భోజనం చేయడాన్ని మానుకోవాలి. అంతగా ఆకలిగా ఉంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మరుసటి ఉదయం అల్పాహారం ఉదయాన్నే తీసుకోవడం మంచిది.
శ్రద్ధ వహించండి Pay attention
మీ శరీరం యొక్క ఆకలి మరియు సంపూర్ణత సంకేతాలపై శ్రద్ధ చూపడం చాలా అవసరం. రాత్రి 8 గంటల తర్వాత మీకు నిజంగా ఆకలిగా అనిపిస్తే, తర్వాత సమయంలో రాత్రి భోజనం చేయడం మంచిది.
అర్థరాత్రిళ్లు మెలకువగా ఉండేవారి కోసం For late owls
అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తులకు, ముఖ్యంగా బెంగళూరు, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని అనేక నగరాల్లో సాప్ట్ వేర్ ఉద్యోగులు పాశ్చత్య దేశ సంస్థల సమయాలకు అనుకూలంగా మన దేశంలోని ముఖ్య నగరాల నుండే పనిచేస్తుంటారు. అందువల్ల వారు రాత్రంతా జాగారణ చేయాల్సి వస్తుంది. లేదా దాదాపుగా అర్థరాత్రి రెండు నుంచి మూడు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరితో పాటు ఆయా సంస్థల్లో పనిచేసే హౌజ్ కీపింగ్ స్టాప్, సెక్యూరిటీ, సహా వీరికి అర్ధరాత్రి ఏం కావాలన్నా ఇచ్చేందుకు రెడీగా ఉండే క్యాంటీన్ స్టాప్ ఇలా చాలా మంది నగరాల్లో అర్థరాత్రిళ్లు నిద్రకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే వీరు త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల తర్వాత మళ్లీ ఆకలి వేస్తుంది. అయినా ఏమీ కాదని తింటే అది క్రమంగా ఫుడ్ పాయిజన్ గా కూడా మారే అవకాశం ఉంది. మీ జీవనశైలి మరియు ప్రాధాన్యతలకు సరిపోయే సమతుల్యతను కనుగొనడం చాలా అవసరం.
అర్థరాత్రి ఆకలి Late night hunger


మీరు తరచుగా అర్థరాత్రి ఆకలిని అనుభవిస్తుంటే, అధిక ఆకలి మరియు అతిగా తినడానికి సంభావ్యతను నివారించడానికి చిన్న, బాగా సమతుల్యమైన చిరుతిండిని తీసుకోండి.
ప్రభావవంతమైన తినే షెడ్యూల్ నిర్వహణకు చిట్కాలు Tips for Maintaining an Effective Eating Schedule
పని లేదా పాఠశాల గారడి చేయడం, వ్యాయామం చేయడం మరియు సరిగ్గా తినడం సవాలుగా ఉంటుంది. మీరు మీ రోజులో ప్రతిదీ సరిపోతారని నిర్ధారించుకోవడానికి ఇక్కడ కొన్ని విలువైన చిట్కాలు ఉన్నాయి:
ముందుగా ప్లాన్ చేసుకోండి Plan ahead
మీ భోజనాన్ని ముందుగానే వండుకోవడానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా మీరు వాటిని ఉత్తమ సమయాల్లో సిద్ధంగా ఉంచుకోవచ్చు.
ప్రయోగం Experiment
ప్రతిరోజూ మీ తినే సమయాన్ని కొద్దిగా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించండి మరియు మీరు ఖచ్చితమైన సమతుల్యతను కనుగొన్న తర్వాత, దాని ప్రభావాన్ని కనుగొనడానికి మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చండి. మీరు రాత్రిపూట వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నప్పటికీ, మీ ఆహారపు అలవాట్లు మారినందున ఉదయం మీకు బాగా పని చేస్తుంది.
చివరిగా.!


మనం తీసుకునే భోజనం ఎంత నాణ్యతతో కూడుకున్నది, దానిని ఎక్కడ కూర్చుని అస్వాదిస్తున్నాము అన్నది ఎంత ముఖ్యమో అంతకంటే దానిని తీసుకునే సమయం కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. తాజాగా వండి వార్చిన ఆహారమైనా సరే.. దానిని తీసుకునే సమయంది దాటిన తరువాత తీసుకుంటే అరోగ్యానికి అనర్థమే. అందుకునే ఆహారం తీసుకునే సమయం మీ మొత్తం ఆహారపు అలవాట్లలో ముఖ్యమైన భాగం. అయితే ఇది కేవలం మనం తీసుకునే భోజనానికి మాత్రమే పరిమితం కాదు.. రోజలో ఒకటి రెండు పర్యాయాలు తీసుకునే స్నాక్స్ కు కూడా వర్తిస్తుంది. అయితే స్నాక్స్ అనగానే ఏదైనా తీసుకోవడం కాదు అది కూడా నాణ్యత కూడినదా లేదా అన్నది కూడా అంతే ముఖ్యం.
ఏ సమయంలో ఆహారం తీసుకోవడం అనారోగ్యకరం అన్న విషయాల గురించి సర్వసాధారణంగా అందరూ తెలుసుకుంటారు. కానీ దానిని ఆచరణలో పెట్టేవారు మాత్రమే చాలా అరుదు. కాగా, ఆహారాన్ని ఎప్పుడూ నిద్రవేళకు దగ్గరగా గణనీయమైన లేదా భారీ భోజనం తినడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. నిద్రవేళకు ముందు పెద్ద భోజనం తీసుకోవడం జీర్ణక్రియ మరియు నిద్ర నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఒకరు తమ రోజువారీ ఆహారంలో ఎక్కువ భాగాన్ని రోజు ఆలస్యంగా తీసుకోవడం వల్ల కాలక్రమేణా ఊబకాయం ఏర్పడుతుంది.
చాలా ఆకలితో ఉన్నా.. లేదా అత్యంత రుచికరమైన పదార్థాలతో కూడిన ఆహారం వండి వార్చిన నేపథ్యంలో చాలా ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. అయితే ఇలా అతిపెద్ద భోజనం ఎప్పుడు, ఏ సమయంలో చేస్తే బాగుంటుంది? అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. కాగా, ఆహారం అనేది మన రోజువారీ కార్యకలాపాల ద్వారా శక్తికి అవసరమైన శక్తిని ఇచ్చే ఇంధనం. గణనీయమైన రాత్రి భోజనం అందునా నిద్రవేళకు కొన్ని గంటల ముందు తీసుకోవడం వల్ల ఆహార ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి వృధా అవుతుంది. మరోవైపు, అతి పెద్ద భోజనాన్ని మధ్యాహ్నం తీసుకుంటే అసహ్యకరమైన పతనాన్ని నివారించవచ్చు. తద్వారా, పెద్ద భోజనం ఇచ్చిన శక్తిని మిగిలిన రోజులో విజయవంతంగా నావిగేట్ చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించవచ్చు.
రాత్రి భోజనం తిన్న కనీసంగా గంట సమయం వేచి ఉన్న తరువాత నిద్రించవచ్చా అన్న ప్రశ్నలు కొందరి నుంచి వినిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి భోజనం చేసిన తరువాత చాలా మంది నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వారు క్రమంగా ఊభకాయానికి చేరువవుతున్నారు. అయితే రాత్రి భోజనం తరువాత కనీసంగా ఎంత సమయం వేచి ఉండాలి అంటే.. కనీసం మూడు గంటలు. భోజనం తర్వాత పడుకునే ముందు కనీసంగా మూడు గంటలు వేచి ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ సమయ వ్యవధి మీ శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి అనుమతిస్తుంది. ఈ నిబంధనను పాటించడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి లేదా నిద్రకు భంగం కలిగించే యాసిడ్ రిఫ్లక్స్ వంటి అసౌకర్యాలు ఏవీ దరిచేరవు.