ప్రకృతి ఇమ్యూనిటీ బూస్టర్ ‘తిప్పతీగ’: అద్భుత అరోగ్య ప్రయోజనాలు - Unlocking the Potential Health Benefits of Giloy: Nature's Miracle Herb in Telugu

0
Benefits of Giloy

మానవుడు తానకు మాత్రమే జ్ఞానం ఉందని.. ప్రకృతి శాసించే స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాడు కానీ.. ప్రకృతిని మధ్య తాను ఒకడిలా జీవిస్తే.. రోగాల బారిన పడకుండా ఉంటాడన్నది వాస్తవం. మన మధ్య ఉన్న ఎన్నో ఔషధ మొక్కలు మనకు కాలనుగూణంగా సంక్రమించే రోగాలను కూడా నయం చేసే గుణాలున్నాయి. ఈ విషయాన్ని సంప్రదాయ భారతీయ వైద్యం ఆయుర్వేదం కూడా ఎన్నో శతాబ్దాలుగా దీనిని చాటుతూనే వస్తుంది. అయినా అభివృద్ది ముసుగులో నగరీకరణ పేరుతో మానవుడు దానిని పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతున్నాయి. కాగా క్రమంగా మునుపెన్నడూ కనీ, విని ఎరుగని కరోనా వైరస్ లాంటి రోగాలు.. మూకుమ్మడి మరణాలకు కారణం అవుతున్న క్రమంలో మానవుడు తన దృష్టిని ప్రకృతిలోని ఔషధీయ మొక్కల వైపు తిప్పకతప్పలేదు. ఈ క్రమంలో మానవాళి ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలపై దృష్టిని కేంద్రీకరించాడు.

మానవాళికి సంక్రమించే అనేక రుగ్మతలను పారద్రోలి పరిరక్షించే అమృతం లాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్క తిప్పతీగ. తిప్పల్లో పెరుగుతుందన్న దీనికి ఆ పేరు వచ్చిందేమో కానీ దీని అసలు పేరు మాత్రం అమృతవల్లి. ఆంగ్లంలో గిలోయ్ (సైంటిఫిక్ పేరు టినోస్పోరా కార్డిఫోలియా) పేరుతో పిలిచే ఈ ప్రసిద్ధ ఔషధ మొక్కను భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. దీనిని “అమృత” అని పిలువడానికి ఇందులోని “అమరత్వం లక్షణాల మూలం” కారణం. దీనిని కొన్ని ప్రాంతాల్లో గుడూచి, అమృతబల్లి అని కూడా పిలుస్తారు. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, గోవా, కర్ణాటకలతో పాటు ఉత్తర భారతంలో బీహార్‌, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, పశ్చిమ భారతంలోని గుజరాత్‌, మహారాష్ట్ర, ఈశాన్య భారతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, సిక్కింలలో పెరుగుతుంది.

ఈ తీగ ఆకులు, తీగ, వేర్లు కూడా ఔషధ గుణాలతో కూడుకున్నవే. దీని ఆకులలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు దీనిలో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌ సి కూడా ఉంది. దీంతో తిప్పతీగ ఆకుల సారంలో స్టెరాయిడ్లు, ఆల్కలాయిడ్లు, టానిన్లు, సపోనిన్లు, విటమిన్లు, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్‌ కాంపౌండ్లు ఉన్నట్టు పరిశోధనలో తేలింది. తిప్ప తీగ కాండంలో టినోస్పోరాన్‌, టినోస్పోరిక్‌ ఆమ్లం, సిరంగెన్‌, బెర్బెరిన్‌, గిలెనిన్‌, పిక్రోటీన్‌, బెర్గెనిన్‌, గిలోస్టెరాల్‌, గ్లూకాన్‌ పాలీసాకరైడ్‌, కార్డిఫోల్‌, సిటోస్టెరాల్‌, మాగ్నోఫ్లోరిన్‌, టెంబెటరిన్‌, ఐసోకోలమ్బిన్‌ వంటి కాంపౌండ్లు ఉన్నాయి. దీంతో పాటు రాగి, జింక్‌, ఇనుము, కాల్షియం, భాస్వరం, మాంగనీస్‌ వంటి ఖనిజాలు కూడా ఈ మొక్కలో పుష్కలంగా లభిస్తాయి. దీంతో ఈ తీగలోని ఏ భాగమైనా అరోగ్యానికి మేలు చేసేవే కావడం గమనార్హం.

ఈ తీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరి, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నందున ఇది అనేక వ్యాధులతో పాటు క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేసే గుణం కలిగివుంది. జ్వరం, కామెర్లు, రక్తపోటు, షుగర్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి, మూత్ర సంబంధ వ్యాధులతో పాటు.. ఆస్తమా, దగ్గుల వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి కూడా ఉపశమనం కల్పిస్తోంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల సంక్రమించే జ్వరాలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతోంది. అంతేకాదు తిప్పతీగ బరువును నియంత్రించే సామర్థ్యాన్ని కలిగివుంది. తిప్పతీట రసంలో ఒక టీస్పూన్ తేనె కలిసి తీసుకోవడం ద్వారా ఊభకాయం సమస్యను అధిగమించవచ్చు. అందోళన, మానసిక ఒత్తిడి నుంచి కూడా ఈ తీగ పరిరక్షిస్తుంది. అంతేకాదు ఒత్తిడి కారణంగా రాలుతున్న జుట్టు, చండ్రు సమస్యను కూడా నివారిస్తుంది.

తిప్పతీగలో దాగివున్న ఔషధ గుణాలు ఏమిటీ.?

Giloy medicinal herb
Src

ఆయుర్వేద వైద్యంలో సాధారణంగా ఉపయోగించే తిప్పతీగలో ఉన్న రసాయన లక్షణాలివే:

ఆల్కలాయిడ్స్:

తిప్పతీగలో మాగ్నోఫ్లోరిన్, బెర్బెరిన్, కొలంబిన్ వంటి వివిధ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి.

  • మాగ్నోఫ్లోరిన్ ఆల్కలాయిడ్ ఆందోళన, నిద్రలేమి, జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. మాగ్నోఫ్లోరిన్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచించాయి.
  • బెర్బెరిన్ ఆల్కలాయిడ్ అతిసారం, మంట, ఇన్ఫెక్షన్‌లను నయం చేస్తుంది. షుగర్ పేషంట్లలో రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. కాలేయ పనితీరును మెరుగుపర్చడంతో సహా అనేక సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
  • కొలంబిన్ ఆల్కలాయిడ్స్ నొప్పులు, వాపులను నివారించడానికి ఇది సంప్రదాయ ఔషధం. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు సూచించాయి.

గ్లైకోసైడ్లు:

ఈ తీగలో సిరింగిన్, టినోస్పోరాసైడ్, కార్డిఫోలియోసైడ్ ఏ, బి వంటి అనేక గ్లైకోసైడ్‌లను కలిగి ఉంది.

  • సిరింగిన్: దీని సంభావ్య యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలలో క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. రక్తపోటు, షుగర్, ఆర్థరైటిస్ లపై ప్రభావవంతం.
  • టినోస్పోరాసైడ్: దీని పొటెన్షియల్ ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. జ్వరం, కామెర్లు, మధుమేహం వంటి పరిస్థితులకు చికిత్స చేస్తుంది.
  • కార్డిఫోలియోసైడ్ ఏ, బి: ఇది కూడా యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ప్రభావాలు కలిగింది. అంతేకాదు యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంది. జ్వరం, దగ్గు, గాయాల చికిత్సకు ఉపయోగించబడుతోంది.

పాలీసాకరైడ్లు:

తిప్పతీగలో అరబినోగలాక్టన్, గెలాక్టోమన్నన్, గ్లూకాన్ వంటి వివిధ పాలిసాకరైడ్‌లు ఉన్నాయి.

  • ఈ పాలీసాకరైడ్లలో ప్రీబయోటిక్ లక్షణాలున్నాయి. ఇవి జీర్ణాశయంలో జీర్ణక్రియను మెరుగుపర్,చి రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణాశయంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
  • ఈ పాలిసాకరైడ్‌లు ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలున్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి పరిస్థితులకు చికిత్సలో ఉపయోగపడుతుంది.

డైటెర్పెనెస్:

ఇది టినోస్పోరిన్, టినోకార్డిఫోలిన్, టినోకార్డిసైడ్ వంటి వివిధ డైటర్పెన్‌లను కలిగి ఉంది.

  • టినోస్పోరిన్: వాపు, మంటను తగ్గించి ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని నయం చేస్తుంది. వీటిలోని యాంటీ అక్సిడెంట్లు క్యాన్సర్, గుండెజబ్బులు, అటో ఇమ్యూన్ వ్యాధులు, అలెర్జీ, షుగర్ ను నయం చేసే గుణాలున్నాయి. అంటువ్యాధుల నివారిస్తాయి.
  • టినోకార్డిఫోలిన్: వాపు, నోప్పులను తగ్గించి గాయాలు నయం చేస్తుంది. యాంటీమైక్రోబియల్ ఏజెంట్లను అభివృద్ది చేస్తుంది. అధిక రక్తపోటును, కోలెస్ట్రాల్ నియంత్రించి.. గుండె వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు ఇది యాంటీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.
  • టినోకార్డిసైడ్: రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. హృదయనాళ వ్యవస్థపై ప్రయోజనకర ప్రభావం కనబర్చి, హైబిపిని తగ్గిస్తుంది. ఇది ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్లకు చికిత్స చేస్తుంది. దీంతో పాటు యాంటీమైక్రోబియల్ యాక్టివిటీ కలిగివుంది.
Giloy Immune system
Src

ఫినోలిక్స్:

తిప్పతీగలో క్యాటెచిన్స్, ఎపికాటెచిన్స్, ఫ్లేవోన్‌లు వంటి వివిధ ఫినాలిక్ కాంపౌండ్స్ ఉన్నాయి.

  • ఫినోలిక్స్ కాంపౌండ్స్ లో వాపులు, నోప్పులను తగ్గించే శక్తితో పాటు బరువును నియంత్రించే గుణం కూడా ఉంది. ఇది అభిజ్ఞ కార్యాలను, జ్ఞాపకశక్తిని పెంపోందిస్తుంది. వయస్సు పైబడిన కొద్ది వచ్చే మతిమరుపును నివారిస్తుంది.
  • ఫినోలిక్స్ కాంపాండ్స్ లోని కాటెచిన్స్, ఎపికాటెచిన్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అల్ట్రా వైయిలెట్ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇవి రక్తపోటును తగ్గించడం, లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపర్చి.. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.

స్టెరాయిడ్స్:

ఇందులో సిటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, కొలెస్ట్రాల్ వంటి వివిధ స్టెరాయిడ్లు ఉన్నాయి.

  • కొలెస్ట్రాల్: ఇది శరీరం అవసరమైన కొవ్వు. కొలెస్ట్రాల్ హార్మోన్లు, విటమిన్ డి, పిత్త ఆమ్లాలను తయారు చేస్తుంది. ఇది కణ త్వచాలను ఏర్పరుస్తుంది. కాగా, అధిక కొలెస్ట్రాల్ హానికరం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
  • సిటోస్టెరాల్, స్టిగ్మాస్టరాల్: ఈ రెండూ కొలెస్ట్రాల్‌తో సమానమైన ప్లాంట్ స్టెరాల్స్. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఖనిజాలు:

తిప్పతీగలో కాల్షియం, ఫాస్పరస్, ఇనుము వంటి అనేక ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది.

  • కాల్షియం, ఫాస్పరస్, ఇనుము సహా తిప్పతీగలో ఉండే పలు ఖనిజాలు శరీరంలోని వివిధ ఉపయోగాలను చేకూర్చుతాయి.

కాల్షియం:

  • బలమైన ఎముకలు, దంతాల నిర్మాణం, నిర్వహణ
  • గుండెతో సహా కండరాల పనితీరును నియంత్రణ
  • రక్తం గడ్డకట్టడంలో సహాయం
  • నరాల ప్రసారం, కమ్యూనికేషన్

భాస్వరం:

  • బలమైన ఎముకలు, దంతాల నిర్మాణం, నిర్వహణ
  • శక్తి ఉత్పత్తి, జీవక్రియలో సహాయం
  • మూత్రపిండాల పనితీరు మెరుగు
  • శరీరంలో పిహెచ్ స్థాయిలను నియంత్రణ

ఇనుము:

  • ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా
  • రోగనిరోధక పనితీరుకు మద్దతు
  • శక్తి ఉత్పత్తి, జీవక్రియలో సహాయం
  • శరీర ఉష్ణోగ్రత నియంత్రణ

ఆరోగ్యాంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారం ద్వారా ఈ ఖనిజాలను తగిన మొత్తంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, బలవర్థకమైన ఆహారాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. భాస్వరం అధికంగా మాంసం, చేపలు, పౌల్ట్రీ, డైరీ, ధాన్యాల్లో లభిస్తుంది. ఐరన్-రిచ్ ఫుడ్స్‌లో రెడ్ మీట్, పౌల్ట్రీ, సీఫుడ్, బీన్స్, ఫోర్టిఫైడ్ తృణధాన్యాల్లో ఉంటుంది.

ఈ రసాయన లక్షణాలు తిప్పతీగకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీఆక్సిడెంట్, హెపాటోప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్ లక్షణాలతో పలు రకాల క్యాన్సర్ లను నిరోధించి.. వివిధ చికిత్సా లక్షణాలను అందిస్తాయి. ఈ ఔషధ తీగలోని ఇమిడి ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమైనవి కాబట్టే దీనిని అమృతవల్లి అని కూడా పిలుస్తారు. ఈ అద్భుత పురాతన మూలికలోని 10 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామాయి:

Giloy as Tinospora Cordifolia

1. ఇమ్యునోమోడ్యులేటర్

తిప్పతీగ మాక్రోఫేజ్‌ల ఫాగోసైటిక్ చర్యను పెంచుతాయి, ఇవి మన శరీరం రక్షణ వ్యవస్థలో మొదటి వరుసలో నిలిచే సైన్యం. దీనికి తోడు సహజమైన (నాన్‌స్పెసిఫిక్), అనుకూల (నిర్దిష్ట) రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇది సైటోకిన్‌ల ఉత్పత్తిని, ఇంటర్‌లుకిన్-6 (ఐఎల్-6) అప్-రెగ్యులేషన్‌ను అసాధారణంగా పెంచుతుంది, తద్వారా యాంటిజెన్ నిర్దిష్ట రీకాల్ ప్రతిస్పందనను పెంచుతుంది.

2. యాంటీఆక్సిడెంట్

తిప్పతీగలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉండటం దాని ఫ్రీ రాడికల్ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. తిప్పతీగలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే న్యూట్రాస్యూటికల్స్ మూలంగా పనిచేస్తుంది. దీని ఫలితంగా ఆరోగ్య ప్రయోజనాలతో దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో, వాటి నుంచి ఉపశమనం కల్పించడంలో సహాయపడుతుంది.

3. యాంటీ ఆర్థరైటిక్

తిప్పతీగ IL-1β, IL-17, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్-α వంటి ప్రోఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల సంశ్లేషణను తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

4. యాంటీ-ఆస్టియోపోరోటిక్

తిప్పతీగ ఆస్టియోబ్లాస్ట్‌ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది, కణాలను ఆస్టియోబ్లాస్టిక్ పరంగా విభజించి, ఎముక మాతృక ఖనిజీకరణను మెరుగుపరుస్తుంది. తద్వారా ఆస్టియోపోరోసిస్ బాధ నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది.

5. హెపాటోప్రొటెక్టివ్

తిప్పతీగ అనేది సమర్థవంతమైన హెపాటోప్రొటెక్టివ్ ఏజెంట్.. హెపాటిక్ పునరుత్పత్తిని ప్రోత్సహించే ఫ్రి రాడికల్ డ్యామేజీని నియంత్రిస్తుంది. గ్లూటాతియోన్ (GSH) స్థాయిని పెంచుతుంది, శరీరం నుండి విష వ్యర్థాలను డీటాక్సీఫై చేయడానికి కాలేయానికి మద్దతు ఇస్తుంది.

6. కార్డియోప్రొటెక్టివ్

తిప్పతీగ గ్లూకురోనైడ్, కొలెస్ట్రాల్‌ను నిరోధించడం ద్వారా లిపిడ్ జీవక్రియను పునరుత్తేజం కల్పిస్తుంది. దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు హృదయనాళ వ్యవస్థను పరిరక్షించడంతో పాటు గుండెలో బ్లాకేజీలు ఏర్పడకుండా చూస్తుంది.

Thippa thiga consumed in many forms
Src

7. న్యూరోప్రొటెక్టివ్

తిప్పతీగ ముఖ్యమైన న్యూరోప్రొటెక్టివ్ చర్యను కలిగి ఉంది. ఇది మెదడు కణజాలం యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ వ్యవస్థను మాడ్యులేట్ చేస్తుంది, డోపమినెర్జిక్ న్యూరాన్‌లను సంరక్షిస్తుంది. ఈ ఔషధ తీగ ఎసిటైల్కోలిన్ న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణను పెంచడం ద్వారా జ్ఞానాన్ని (లెర్నింగ్, మెమరీ) కూడా పెంచుతుంది.

8. యాంటీ డయాబెటిక్

తిప్పతీగ హైపోగ్లైసీమిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది; ఇది ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ స్రావం ఉత్పత్తిని ప్రేరేపించి తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక సెల్యులార్ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది, ఇది మధుమేహాన్ని చక్కగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

9. శ్వాసకోశ వ్యాధులను నివారించండి

బ్రోన్కైటిస్, దీర్ఘకాలిక దగ్గు వంటి వ్యాధుల చికిత్సకు తిప్పతీగకు సాంప్రదాయకంగా ప్రాధాన్యత ఎంపిక. దాని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఇది శ్వాసకోశ వ్యవస్థ శ్లేష్మ పొరను శాంతింపజేస్తుంది, తద్వారా ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

10. యాంటీ ఏజింగ్

తిప్పతీగ యాంటీ ఏజింగ్ లో వినియోగించే ఒక ప్రభావవంతమైన మూలిక. ఇందులో పుష్కలంగా ఉన్న ఫ్లేవనాయిడ్‌లు సెల్ డ్యామేజ్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి, కొత్త కణాల పెరుగుదలను ప్రారంభించడంతో సహాయపడతాయి. ఇది చర్మానికి పోషణనిచ్చి, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

అయితే తిప్పతీగను ఎలా తీసుకోవాలి.. Thippa thiga can be consumed in many forms

తిప్పతీగను ఎలాంటి రుగ్మతలు లేని వారి నుంచి ఆరోగ్య రుగ్మతలు ఉన్నవారికి వరకు దీనిని రోజు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. అయితే దీని నుంచి ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. దీనిని జ్యూస్, కాషాయం, చూర్ణం, ట్లాబెట్స్, క్యాప్సూల్స్‌ రూపంలో రోజు తీసుకోవచ్చు. తిప్పతీగ అందుబాటులో ఉన్నవారు రోజు తాజా ఆకులను జ్యూస్ చేసుకుని సేవించవచ్చు. లేదా కాషాయం చేసుకుని తాగవచ్చు. అయితే తిప్పతీగ అందుబాటులో లేనివారు, లేక దానిని గుర్తించలేమని భావించేవారు ఆయుర్వేద దుకాణాల్లో తిప్పతీగ ట్యాబెట్లు, క్యాపుల్స్, చూర్ణం, పోడి అందుబాటులో ఉంటాయి.

తిప్పతీగ తీసుకోవాల్సిన మోతాదులు:

తిప్పతీగ జ్యూస్‌ : పెద్దలు 2-3 టీస్పూన్లు. రుగ్మత తీవ్రతను బట్టి రెండుసార్లు.
తిప్పతీగ చూర్ణ: రోజుకు రెండుసార్లు 1/4-1/2 టీస్పూన్‌.
తిప్పతీగ కషాయం: దీనిని రోజుకు రెండుసార్లు త్రాగాలి (అల్పాహారం, రాత్రి భోజనం ముందు లేదా తరువాత).
తిప్పతీగ టాబ్లెట్‌: రోజు రెండుసార్లు 1-2 మాత్రలు.
తిప్పతీగ క్యాప్సూల్‌: రోజుకు రెండుసార్లు 1-2 క్యాప్సూల్స్‌.

తిప్పతీగ తాజా ఆకుల రసంతో కామెర్లు నయం అవుతాయి. కామెర్ల వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనతతో బాధపడే మహిళలకు ఈ జ్యూస్‌ పరమౌషధం. చర్మవ్యాధులను కూడా ఇది నయం చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలపై ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పులు, దగ్గు నుండి కాపాడి ఊపిరితిత్తులను ఆరోగ్యవంతం చేస్తుంది. మద్యం సేవకుల కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. కళ్ల మంటలు, ఎరుపు, దురద వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తిప్పతీగలోని ఔషధ గుణాలు: Tippa Teega Medicinal Benefits

Tippa Teega Medicinal Benefits
Src

అధిక బరువును తగ్గాలంటే 1 టీస్పూన్‌ తేనె, తిప్పతీగ రసం కలిపి ప్రతి రోజు వాడాలి.
రోజు ఉదయం సాయంకాలల్లో 20 మిలీ తిప్పతీగ రసం తీసుకుంటే..
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చుండ్రును అరికడుతుంది.
మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
ఎర్ర, తెల్లరక్తకణాలు లోపించడం, జీర్ణక్రియ సమస్యను అధిగమించవచ్చు.
క్యాన్సర్‌ కు చికిత్స పొందుతూ, రేడియోథెరపీ, కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.

ఇంట్లో తిప్పతీగ జ్యూస్‌ తయారు చేయడం ఎలా:

ఇంట్లో తిప్పతీగ రసాన్ని తయారు చేసుకోవడం సులభం. తిప్పతీగ కాండాన్ని కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, రోటిలో చూర్ణం చేయండి, తరువాత గ్రైండర్‌లో వేసి, నీటిని జోడించి గ్రైండ్‌ చేసాక.. పల్చని గుడ్డతో వడకట్టితే జ్యూస్ రెడీ. ఈ రసాన్ని గాజు సీసాలో వేసి రెండు వారాల వరకు వాడుకోవచ్చు

చిన్న మంటపై ఒక పాత్రలో చెంచాడు కాండం పొడిని మరిగించి, ఈ మిశ్రమాన్ని ఒక కప్పుకు సగానికి తగ్గించేంత వరకు కలిపి అందులో 3 దంచిన మిరియాల పోడిని జోడిరచి బాగా కలపి దించాలి. ఇక దీని సేవించేప్పుడు తేనెను జోడిరచుకోవచ్చు. దీనిని కూడా గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు.

ఇంట్లో తిప్పతీగ కాషాయం తయారు చేయడం ఎలా:

కొన్ని తాజా తిప్పతీగ ఆకులు లేదా కాండం ముక్కలు తీసుకొని వాటిని నీటిలో (400 మి.లీ) మరిగించాలి. నాలుగింట ఒక వంతుకు నీరు తగ్గగానే ఆ ద్రవాన్ని చల్లబర్చి వడకట్టాలి. అంతే ఇక తిప్పతీగ కాషాయం తయారైనట్లే, దీనిని ఉదయం పరిగడుపున తీసుకుంటే అధిక ఆరోగ్య ప్రయోజనం.

తిప్పతీగ మొక్క లభ్యం కానిపక్షంలో ఆయుర్వేద దుకాణం నుండి తిప్పతీగ పొడిని కొనుగోలు చేసుకుని కూడా కాషాయం తయారు చేసుకోవచ్చు, ఒక టేబుల్‌ స్పూన్‌ పొడిని, 2 కప్పుల నీటిలో వేసి.. నాలుగో వంతు వరకు మరిగించి, వడకడితే కషాయం రెడీ. తిప్పతీగ చెంతనున్నవారు రెండు తాజా అకులను నమిలినా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.