గుండెపోటు లక్షణాలు: మహిళలు, పురుషులలో వేర్వేరుగా ఉంటాయా?

0
Heart Attack in Women Men

గుండెపోటు లక్షణాలు

గుండెపోటు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కోంటున్నారు. లింగబేధం లేకుండా, వయస్సుతో పనిలేకుండా ఎందరో ఈ పరిణామాన్ని చవిచూస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోంటున్న అనేకులలో ఛాతి నొప్పి అనేది విశ్వవ్యాప్తంగా కనిపించే తొలి లక్షణం. కాగా గుండెపోటుకు గల కారణాల గురించి అందరికీ తెలిసిందే. గుండెలోని రక్తనాళాలు కూరుకుపోయినప్పుడు అది క్రమంగా గుండెపోటుకు కారణం అవుతుంది. అయితే గుండెపోటు వచ్చే సమయంలో మహిళలతో పాటు పురుషులలో కొన్ని సర్వసాధారణ లక్షణాలు కనిపిస్తుండగా, మరికొన్ని మాత్రం అటు మహిళల్లోనూ వేరుగా, ఇటు పురుషుల్లో వేరుగా ఉంటాయి. దశాబ్దాల పరిశోధనలో లక్షణాలు ఎల్లప్పుడూ అంత స్పష్టంగా ఉండవని నిరూపించబడ్డాయి. అంతేకాదు గుండెపోటు లక్షణాలు లింగం, వయస్సు, ఆరోగ్య ప్రొఫైల్‌తో సహా అనేక అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయని స్పష్టమైంది.

గుండెపోటు లక్షణాలపై జరిగిన తాజా అధ్యయనంలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. గుండెపోటును సూచించే వివిధ రకాల లక్షణాలను అందరికీ అర్థమయ్యేలా పరిశోధకులు కృషిచేస్తున్నారు. అంతేకాదు.. గుండెపోటు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చునని ఈ తరుణంలో వ్యక్తిలోని లక్షణాలను గమనించి వైద్య సంరక్షణ పోందేలా నిర్ణయించడంలో ఈ సంకేతాలపై జరిగిన రీసర్చ్ మీకు సహాయం చేస్తుంది.

గుండెపోటు ప్రారంభ లక్షణాలు

గుండెపోటు వచ్చిన వెంటనే తొలి రెండు గంటలు అత్యంత కీలకం. ఈ సమయంలో గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఎంత త్వరగా వైద్య సాయం అందితే అంత మేలు చేకూరుతుంది. ఎందుకంటే ఎవరిలోనైనా గుండెపోటు వచ్చిందంటే ప్రారంభ రెండు గంటల్లో జరిగే నష్టమే అధికం. ఈ సమయంలో వారిలోని ప్రారంభ లక్షణాలను గమనించి వాటిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. గుండెపోటుకు ఎంత త్వరగా వైద్యసహాయం అందితే అంత మంచిది.

కార్డియోవాస్కులర్ పేషెంట్ కేర్ సొసైటీ ప్రకారం, గుండెపోటు ఉన్నవారిలో దాదాపుగా 50 శాతం మందిలో ప్రారంభ గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది. అయితే మిగతా యాభైశాతం మందిలో లక్షణాలు ప్రస్సుటించవు. ఈ విషయాన్ని పక్కనబెడితే లక్షణాలు కనిపించే వారు గుండెపోటుకు గురవుతున్న సమయంలో వచ్చే సంకేతాలు ఇలా ఉంటాయి.

Heart Attack Symptoms

గుండెపోటు ప్రారంభ లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉండవచ్చు:

  • ఛాతీలో తేలికపాటి నొప్పి, అసౌకర్యం కలగవచ్చు, “మాటలు నత్తిగా రావడం” ఛాతీ నొప్పి కూడా రావచ్చు.
  • భుజం నొప్పి
  • మెడ లేదా దవడ నొప్పి
  • చెమటలు పట్టాయి
  • వికారం లేదా వాంతులు
  • తలతిరగడం లేదా మూర్ఛపోవడం
  • ఊపిరి ఆడకపోవడం
  • “వినాశనం జరగబోతున్న” భావన
  • తీవ్రమైన ఆందోళన లేదా గందరగోళం

గుండెపోటు లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంటాయి. అంతేకాదు ఒకసారి ఒక వ్యక్తికి వచ్చిన గుండెపోటు అదే వ్యక్తికి మరోసారి వచ్చే గుండెపోటుకు కూడా భిన్నంగా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు విశ్వసించడం. మీ శరీరం అందరికంటే మీకు బాగా తెలుసు. ఏదైనా తప్పుగా అనిపిస్తే, వెంటనే అత్యవసర సంరక్షణ పొందండి.

పురుషులలో గుండెపోటు సందర్భంలో కనిపించే లక్షణాలు:

సాధారణంగా మహిళలతో పోల్చుకుంటే పురుషులు గుండెపోటుకు ఎక్కువగా గురవుతుంటారు. మగవారి కన్నా మహిళల కన్నా గుండెపోటు మగవారిలో రెట్టింపు స్థాయిలో ఉంటుందని తేలింది. మహిళలతో పోలిస్తే జీవితాల్లోకి గుండెపోటు ముందుగానే వచ్చింది. అందుకు గుండెపోటుకు గురైన కుటుం నేపథ్యం ఉంటడం కూడా కారణం కావచ్చు. లేదా ధూమపానం, అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఊబకాయం లేదా ఇతర ప్రమాద కారకాల చరిత్ర ఉంటే, మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

Heart Attacks in Men

పురుషులలో కనిపించే లక్షణాలు:

  • మీ ఛాతీలో నోప్పి రావడం.. ఏకంగా మీ ఛాతిపై ఏనుగు కూర్చుందా అని అనిపించేలా ఒత్తిడి, భారం లేదా వత్తిడి కొంత సేవు ఉండటం తరువాత ఉపశమనం ఆ తరువాత మళ్లీ పునరావృతం కావడం.. లేదా ఛాతిలో నోప్పి స్థిరంగా, తీవ్రంగా ఉండటం
  • చేతులతో పాటుగా శరీరం పైబాగంలో నోప్పి లేదా అసౌకర్యంగా ఉండటం లేదా ఎడమ భుజం, వీపు, మెడ, దవడ కడుపులో అసౌకర్యం కలగడం
  • వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన
  • అజీర్ణం లేదా కడుపులో అసౌకర్యం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తగినంత గాలి లభించడం లేదన్నట్లుగా అనిపించడం.. ఇది మీరు విశ్రాంతి తీసుకునే సమయంలోనూ అనిపించవచ్చు.
  • మైకము లేదా మీరు నిష్క్రమించబోతున్నట్లుగా అనిపించడం
  • చల్లని చెమటలు రావడం

పురుషుల్లో గుండెపోటు వచ్చేముందు లక్షణాలు మేము సరిగ్గా వివరించలేకపోవచ్చు. మీరు ఏదైనా తప్పుగా అనిపిస్తే మీ భావనలనే విశ్వసించండి.

మహిళల్లో గుండెపోటు సందర్భంలో కనిపించే లక్షణాలు

మహిళలలో గుండెపోటు సంభవించే ప్రారంభంలో వారిలో కనిపించే లక్షణాలు పురుషులకు భిన్నంగా వున్నట్లు ఇటీవలి కొన్ని దశాబ్దాలు ఈ తేడాను పరిశోధకులు గుర్తించారు.

ఛాతీలో నొప్పి, లేదా ఛాతిలో పిండేస్తున్నట్లుగా వారు బాధను అనుభవించడం మహిళల్లో ఒకింత సాధారణ లక్షణాలే అయినా.. చాలా మంది గుండెపోటుకు గురవుతున్న సందర్భంలో వారు వైద్యులతో పేర్కోన్న లక్షణాలు పురుషులకు పూర్తి భిన్నంగా ఉన్నాయని పరిశోధలకు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. మహిళలు సాధారణంగా అయితే పురుషులతో పోల్చితే ఈ అసాధారణ, భిన్నంగా ఉండే లక్షణాల కారణంగా వారు గుండెపోటుతో బాధపడుతున్నారని అనుమానించినా.. దానిని నిర్థారించుకునేందుకు పురుషుల కంటే ఎక్కువసేపు వేచి ఉండి.. ఆ తరువాత వైద్య సంరక్షణ కోసం కదలివెళ్తారు. వారిలో కనిపించే లక్షణాలు భిన్నంగా ఉన్న కారణంగా.. అవగాహన లేకపోవడం కూడా వారికి వైద్యసంరక్షణకు చేర్చడంలో ఆలస్యానికి కారణం అవుతోంది.

Heart Attacks in Women

మహిళల్లో కనిపించే లక్షణాలు:

  • అసాధారణ అలసట చాలా రోజులు లేదా ఆకస్మిక తీవ్రమైన అలసట
  • నిద్ర ఆటంకాలు
  • ఆందోళన
  • కాంతిహీనత
  • శ్వాస ఆడకపోవుట
  • అజీర్ణం లేదా గ్యాస్ లాంటి నొప్పి
  • ఎగువ వెనుక, భుజం లేదా గొంతు నొప్పి
  • దవడ నొప్పి లేదా నొప్పి మీ దవడ వరకు వ్యాపిస్తుంది
  • ఛాతీ మధ్యలో ఒత్తిడి లేదా నొప్పి, ఇది మీ చేతికి వ్యాపించవచ్చు

అయితే గుండెపోటు లక్షణాలు మీకు గుర్తించలేని పక్షంలో.. సాధారణమైన బాధే అయితే వేచివున్నా ఫర్వాలేదు. కానీ అదే అసాధారణమైన నోప్పి అనిపిస్తే మాత్రం వెంటనే దానిపై శ్రద్ధ వహించాలి. ఇంతకు మునుపెన్నడూ మీకు రానీ నోప్పి ఛాతిలో వచ్చిందనుకుంటే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. వైద్యులు కూడా అది సర్వసాధరణమే అని అంటే వెంటనే రెండోవ వైద్యడిని అభిప్రాయాన్ని కూడా సేకరించడం సముచితం.

50 ఏళ్లు పైబడిన మహిళల్లో గుండెపోటు

మహిళలు రుతువిరతి తర్వాత క్రమంగా గుండెపోటుకు గురవుతుంటారు. ఎందుకంటే సాధారణంగా 50 ఏళ్ల వయస్సులో మహిళల్లో రుతువిరతి సంభవిస్తుంది. ఈ క్రమంలో మీ శరీరంలో ఉత్పత్తయ్యే ఎస్ట్రోజన్ అనే హర్మోన్ స్థాయి రుతువిరతి తరువాత తగ్గుతుంది. అయితే ఈ ఎస్ట్రోజన్ హర్మోన్ గుండె సంరక్షణకు, అరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. తద్వారా మహిళలతో పోల్చితే పురుషుల్లో మొదటి గుండెపోటు సగటు వయస్సు ఐదేళ్లు ముందుగానే సంభవిస్తుందని వైద్యపరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Heart Patients

50 ఏళ్లు పైబడిన మహిళలు ఎదుర్కోనే గుండెపోటు అదనపు లక్షణాలు:

  • తీవ్రమైన ఛాతీ నొప్పి
  • ఒకటి లేదా రెండు చేతులు, వెనుక, మెడ, దవడ లేదా కడుపులో నొప్పి లేదా అసౌకర్యం
  • వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన
  • చెమటలు పట్టాయి

ఈ లక్షణాలపై అవగాహన కలిగివుండండి, మీ డాక్టర్‌తో రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను షెడ్యూల్ చేయండి.

అకస్మాత్తుగా సంభవించే గుండెపోటు లక్షణాలు

అకస్మాత్తుగా సంభవించే గుండెపోటుకు లక్షణాలను చూపుతూ వచ్చే గుండెపోటుకు పెద్ద తేడా ఏమీ లేదనే చెబుతున్నారు వైద్యులు. ఇది కూడా సాధారణంగా వచ్చే గుండెపోటేనని పేర్కోంటున్నారు. అయితే ఈ గుండెపోటు క్షణాలు లేకుండా సంభవిస్తుందని అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు గుండెపోటును అనుభవించినట్లు కూడా మీరు గ్రహించలేరు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అంచనా ప్రకారం 170,000 మంది అమెరికన్లు తమకు తెలియకుండానే ప్రతి సంవత్సరం గుండెపోటుకు గురవుతున్నారు. పూర్తి గుండెపోటు కంటే తక్కువ లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఈ సంఘటనలు గుండెకు హాని కలిగిస్తాయని.. పైపెచ్చే భవిష్యత్తులో కూడా గుండెపోట్ల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కోన్నారు. మధుమేహ వ్యాధి ఉన్నవారిలో, గతంలో గుండెపోటు ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్‌లు సర్వసాధారణమని అంటున్నారు.

Silent heart attack symptoms

నిశ్శబ్ద గుండెపోటును సూచించే లక్షణాలు:

  • మీ ఛాతీ, చేతులు లేదా దవడలో తేలికపాటి అసౌకర్యం విశ్రాంతి తీసుకున్న తర్వాత పోతుంది
  • శ్వాస ఆడకపోవడం, సులభంగా అలసిపోవడం
  • నిద్ర ఆటంకాలు, పెరిగిన అలసట
  • కడుపు నొప్పి లేదా గుండెల్లో మంట
  • చర్మం బిగుతుగా ఉంటుంది

నిశ్శబ్ద గుండెపోటు తర్వాత, మీరు మునుపటి కంటే ఎక్కువ అలసటను అనుభవించవచ్చు లేదా వ్యాయామం మరింత కష్టతరం అవుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా శారీరక పరీక్షలు చేయించుకోండి. మీకు గుండె సంబంధిత ప్రమాద కారకాలు లేదా గుండె జబ్బు కుటుంబ నేపథ్యం ఉంటే, మీ గుండె పరిస్థితిని పరిశీలించడానికి పరీక్షలు చేయించుకోవడం సముచితం.

టేకావే

రెగ్యులర్ చెకప్‌లను షెడ్యూల్ చేయడం, గుండెపోటు లక్షణాలను గుర్తించడం నేర్చుకోవడం ద్వారా, మీరు గుండెపోటు నుండి తీవ్రమైన గుండె దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇది మీ జీవన కాలపరిమాణాన్ని కూడా పెంచుకునేందుకు దోహదపడుతోంది.