అన్యోన్య భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేసే ఉత్తమ మార్గాలివే.! - Strengthening the Ties that Bind the Husband-Wife Relationship In Telugu

0
Husband Wife Relationship

పెళ్లి అనే బంధంతో ఒక్కటైన ఇరువురి మధ్య ప్రేమ బంధం కూడా కలిస్తే ఆ జంట కలకాలం ఒకరికోకరు జీవిస్తారన్నది కాదనలేని సత్యం. ఇలా ఇరువురినీ ప్రేమకు మరింత చేరువ చేసే ఆహ్లాదకర, ఉత్తేజకరమైన మార్గాలు ఇవే. ఒక్క చేత్తో గాల్లో ఎంత ఊపినా చప్పుడు రాదు.. అదే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. అలానే పెళ్లీ, దాంపత్యం, సంసారం అనే బంధం చిగురించాలంటే భార్యభర్తలు ఇద్దరి నుంచి ఈ మార్గం వైపు పయనం ఉండాలి. వారి అభిరుచి, నిబద్ధత, నిరంతర ప్రయత్నం కొనసాగాలి.

దీర్ఘకాలంలో బంధం మరింత ధృడంగా మారుతుంది. కానీ తరచూ విసుగు, ఒత్తిడిల కారణంగా ఈ బంధాన్ని కొనసాగించడంలో సవాళ్లు, ఆటుపోట్లు ఎదురవుతాయి. అయినా బంధాన్ని ఎలా ధృడంగా మార్చుకోవాలి.. ఎలా ఇద్దరి మధ్య అనురాగ, అప్యాయతలు బలోపేతం కావాలి.. అందుకు దోహదపడే మార్గాలేమిటో తెలుసుకుందాం. మీ దాంపత్య జీవితంలోకి మళ్లీ కొత్త వెలుగులును తీసుకువచ్చేలా.. ఒకరితో ఒకరికున్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ క్రింది మార్గాలను ఫాలో అయితే చాలు. అవేంటో ఓసారి పరిశీలిద్దామా.

1. మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు చక్కగా వినండి: Practice Active Listening Skills

Practice Active Listening Skills

భార్యభర్తల బంధంలో మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు చక్కగా వినడం కూడా వారిని మీరు అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. దీంతో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనుమతించిన వారవుతారు. మీ భాగస్వామి మాటలకు మధ్యలో అంతరాయం కలిగించకుండా చూసుకోండి. ముఖ్యంగా వారు మాట్లాడేటప్పుడు పరధ్యానంగా కనిపించండి లేదా వాటిని పూర్తి చేయడానికి తొందరపెట్టడం వంటివి చేయరాదు. దీంతో మీ భాగస్వామి మాటలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదని, వారు చెప్పేది శ్రద్ధగా వినడం లేదని అనిపిస్తుంది. వారి మాటలను మీరు శ్రద్దగా విన్నాం అనిపించేలా చేయండి. భాగస్వామి మాట్లాడటం పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి.

2. తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఒకరికోకరు చర్చించండి: Discuss Each Other’s Goals

Discuss Each Others Goals

భవిష్యత్ లక్ష్యాలను చర్చించడం అనేది సమర్థవంతమైన నమ్మకాన్ని పెంపొందించడమే. ఒకరి లక్ష్యాల గురించి ఒకరు మాట్లాడుకోవడం దంపతుల మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదు వారి లక్ష్యాలను చేరుకోవడానికి భాగస్వామి తన వంతు సహాయం అందించేలా చేస్తుంది. మీ కలలు, లక్ష్యాలు, అవసరాలను మీ భాగస్వామికి వ్యక్తపర్చడం ద్వారా వారి సంబంధంలో ఎక్కువ సంతోషం, సంతృప్తి లభిస్తుంది. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, స్వంత వ్యాపారాన్ని సెటప్ చేయడం, ప్రస్తుత వృత్తిని మార్చుకోవడం, వంటివి ఏవైనా కావచ్చు. తమ లక్ష్యాలు ఎందుకు ముఖ్యమో చర్చించుకొని అర్థం చేసుకోవడం వారి బంధాన్ని దృఢంగా బలపడుతుంది.

3. అభిరుచిని జంటగా కలసి కొనసాగించండి: Pursue A Hobby Together

Pursue A Hobby Together

జిమ్‌లో వర్కవుట్ చేసినా లేదా కలిసి ఆర్ట్ క్లాస్‌, లేదా సంగీత క్లాసుకు హాజరైనా, మీరిద్దరూ జంటగా ఇష్టపడే హాబీని ఎంచుకోవడం గొప్ప యాక్టివిటీ. ఇద్దరూ కలిసి సమయాన్ని గడపడం, జట్టుగా ఏదైనా చేయడం, బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇది సహాయపడతుంది. ఇది సంబంధానికి ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా, మీ భాగస్వామితో మెరుగ్గా కనెక్ట్ అవ్వడంలోనూ, మీరిద్దరి మధ్య మరింత అన్యోన్యత పెనువేసుకోవడంలోనూ ఇది మీకు సహాయపడుతుంది.

4. ప్రశంసనీయకర జాబితాను రాసిపెట్టుకోండి: Create An Appreciation List

Create An Appreciation List

ఒకరికోకరి మధ్య అన్యోన్యత మరింతగా బలపడాలంటే మీ భాగస్వామి చేసిన ఏదైనా పని మీకు నచ్చితే వెంటనే ఆ విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పండి. మరోలా అంటే మీ భాగస్వామే కదా అని చులకనగా చూడకుండా.. ఆఫీసులో మీ లేడీ బాస్ అనుకుని వారిని ఎలా ప్రశంసిస్తారో అలాగే మీ భాగస్వామికి చెప్పండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ముఖ్యమైన వాటి గురించి మీరు ఇష్టపడే అన్ని విషయాలలో వారు మిమల్ని మరింతగా ప్రేమింస్తున్నారని, సురక్షితమని, ప్రశంసనీయమని భావించే అన్ని చర్యలను రాసిపెట్టుకోండి. ఇది అవతలి వ్యక్తిని విలువైనదిగా భావించడమే కాకుండా సంబంధాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్తేంది.

5. డిజిటల్ ఫాస్టింగ్ చేయడం మరవద్దు: Digital Fasting Exercise

Digital Fasting Exercise

డిజిటల్ ఫాస్టింగ్ చేయాలి. ఈ రోజుల్లో టీవీ, ఓటిటిలు వచ్చేయడంతో ఎప్పుడు చూసినీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేదా టీవీ వీక్షణ చేయడంతోనే సమయం గడిచిపోతోంది. అందుచేత మీ భాగస్వామిని అర్థం చేసుకునే సమయమే లభించడం లేదు. ఇలా మనుషుల మధ్య బంధాన్ని తెంచుకోవడం కంటే డిజిటల్ ఫాస్టింగ్ వ్యాయామాన్ని రోజులో, వారంలో చేర్చుకుని ఆ సమయంలో మీ భాగస్వామితో గడపండి. ఇద్దరూ ఫోన్‌లు, ఐప్యాడ్‌లు, టీవీలు కట్టేసి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఇద్దరూ కలసి ఆసక్తికరంగా అనిపించే ఏదైనా కార్యాచరణను ప్లాన్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి, మాట్లాడటానికి లేదా పాల్గొనడానికి ఈ సమయాన్ని ప్రత్యేకంగా మీ భాగస్వామితో గడపండి.

6. ఒకరికోకరు నిజాయితీగా వ్యవహరించండి: Indulge In The Game of Honesty

Indulge In The Game of Honesty

భార్యభర్తల బంధాన్ని అన్యోన్యంగా, జీవితాంతం కొనసాగించాలంటే అందుకు ముఖ్యమైన వారధి నిజాయితి. ఈ వారధిని ఇరువురు ఎల్లవేళలా కొనసాగించాలి. ఒకరికోకరు ఇస్తూ, పుచ్చుకుంటూ ఉండాలి. ఇది మీ సంబంధంలో వాస్తవ పరిస్థితిని గుర్తించడానికి, భాగస్వాముల మధ్య నమ్మకాన్ని పెంచడానికి గొప్ప మార్గం. తీర్పుకు భయపడకుండా మీ నిజమైన కోరికను వెల్లడించడానికి మీ ఇద్దరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. భాగస్వాములు ఒకరికొకరు గౌరవంగా ఉన్నప్పుడు, నిజాయితీతో కూడిన విషయాలను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఈ విషయాలపై వారు ఎలా భావిస్తున్నారో ఒకరికొకరు చెప్పుకోవచ్చు. ఇది మీ ఇద్దరికీ సులభంగా రాజీ పడటానికి, అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

7. ఇద్దరూ కలిసి సరదా కార్యకలాపాలలో పాల్గోనండి: Fun Activities You Both Can Do Together

Fun Activities You Both Can Do Together

ఎల్లకాలం మీ అనోన్యమైన బంధం కొనసాగాలంటే అందుకు అనుసరించాల్సిన మార్గాలలో ఒకటి మీరుద్దరూ ఒక జట్టుగా ఏర్పడి చేసే పనులలో నిమగ్నం కావడం. అయితే అది పనే కాకుండా సరగా ఆటలైనా పర్వాలేదు. ఇలా ఆడటం ద్వారా మీలో ఒకరిపై మరోకరికి ప్రేమ, జట్టుగా గెలవాలన్న పట్టుదల, కాంక్ష మిమల్ని మరింత చేరువై, మీ బంధం మరింత ధృఢంగా తయారైయ్యేలా చేస్తుంది. అవకాశం చిక్కినప్పుడల్లా భాగస్వామితో చేయాలనుకున్న కార్యకలాపాలను చేర్చండి. ఇది హైకింగ్, ప్రయాణం, వంట చేయడం, గేమింగ్ లేదా మీ భాగస్వామితో క్యాంపింగ్ చేయడం వంటి ఏదైనా కావచ్చు.

8. తప్పులను అంగీకరించి భాగస్వామికి క్షమాపణ చెప్పండి: Confess And Apologize To Your Partner

Confess And Apologize To Your Partner

ఎవరితోనైనా తప్పులు జరగడం సర్వసాధారణం. అయితే, తప్పులు జరిగిన నేపథ్యంలో ఆ విషయాలను సరిదిద్దుతూ, మీ భాగస్వామికి కలిగిన బాధను తగ్గించాలి. నిజం తెలియడం కారణంగా మీ భాగస్వామి కలత చెందుతుందని తెలిసి దాచడం కంటే.. నిజాన్ని చెప్పి తప్పును అంగీకరించడం, క్షమాపణలు చెప్పడం అన్యోన్యతను బలపరుస్తుంది. బాధ, నొప్పి మొదట్లో అనుభవించవచ్చు, అయితే నిజాయితీగా వ్యవహరించి బయటకు రావడం నమ్మకాన్ని పెంపొందించి, సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ తప్పులను మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవడం కూడా మర్చిపోరాదు.

9. ఒకరికోకరు ప్రేమ సందేశాలను పంపుకోవడం: Keep A Detailed Journal

Keep A Detailed Journal

హృదయాలను చక్కదిద్దాలన్నా, సానుకూల వైబ్‌లను సృష్టించాలన్నా ఆ బలం కేవలం అక్షరాలకే. అక్షర మాలను పదాలుగా మార్చి పలికించే నిజమైన శక్తి భావాలదే. ఆ భావాలతో మీ భాగస్వామిని మధురమైన, ప్రేమపూర్వకంగా ప్రశంసించండి. ఇలా ఒకరికోకరు ప్రేమ సందేశాలను పంపించుకోవడం మీ మధ్యలో బంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే ఇందులో ఫిర్యాదులు, తీర్పులు మాత్రమే కాకుండా, ప్రశంసలు, కృతజ్ఞతా కోటేషన్లు నుండి అన్నింటినీ చేర్చండి. ఇది మీ భాగస్వామి మీ గురించి ఆలోచించేలా చేసి.. ఒకరి నుంచి మరోకరు ఏం కోరుకుంటున్నారో కూడా వ్యక్తపరుస్తుంది.

10. ఒకరికొకరు ప్రశ్నించుకోవడం.. తెలుసుకోవడం: Ask Questions To Each Other

Ask Questions To Each Other

ఒకరికొకరు తెలుసుకోవడం కూడా భార్యభర్తల బంధాన్ని మరింత ధృడంగా మార్చుతుంది. అయితే ఇందుకు ఒకరికోకరు అర్ధవంతమైన ప్రశ్నలను అడగడం ద్వారానే మీ భాగస్వామి గురించి తెలుసుకోగలరు. భాగస్వామిలను అడిగే ప్రశ్నల సరళిని మార్గనిర్దేశం చేయడానికి ఆన్‌లైన్ వనరులు చాలనే ఉన్నాయి. ఈ ప్రశ్నలను అడగడం అనేది సాన్నిహిత్యాన్ని పెంపొందించే కార్యకలాపంలో ఒక భాగంగానో లేక భాగస్వాములు మెరుగ్గా బంధంలోకి రావడానికి సహాయపడుతుంది. ఒకరికొకరు సన్నిహితంగా ఉండటానికి, శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పారదర్శకతతో నిజాయితీగా సమాధానమివ్వాలి.

11. ఒకరితో ఒకరు నేరుగా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడండి: Practice Eye Contact With Each Other

Practice Eye Contact With Each Other

ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం పెళ్లైన కొత్తలో జరుగుతుంది. ఆ తరువాత కొన్నాళ్లకు ఐ టు ఐ కాంటాక్ట్ అరుదుగా మారుతుంది. భాగస్వామితో ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కానీ ఇలా కళ్లల్లోకి నేరుగా చూసి మాట్లాడటం మీ భాగస్వామితో ఉద్రిక్తతలను తగ్గించి తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ఒక మార్గమని గుర్తించండి. కళ్లలోకి చూడటం ద్వారా మీ భాగస్వామి చెప్పేదానిపై మీ ఆసక్తి ఉందని భావించేలా చేస్తుంది. ఇది కూడా ఒక రకమైన గౌరవం, జంటగా సాన్నిహిత్యాన్ని పునరుద్ధరిస్తుంది.

12. శ్రద్ధ వహించే విషయాలపై జంటగా కలిసి పనిచేయండి: Volunteer Together For Things That You Care About

Volunteer Together For Things That You Care About

సురక్షితమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి మీ భాగస్వామితో కలిసి స్వయంగా పని చేయడం ఉత్తమమైన కార్యకలాపాలలో ఒకటి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా వచ్చే సంతృప్తి, బహుమతిని అనుభవించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ హృదయానికి దగ్గరగా ఉన్న కారణం, దాతృత్వం లేదా మీరు, మీ భాగస్వామి మక్కువ చూపే స్వచ్ఛంద సేవల నుండి ఏదైనా ఎంచుకోవచ్చు. స్వయంగా శ్రమించి సేవ చేయడం వల్ల జంటలు తమ దృక్కోణాలను మార్చుకోవడం, జీవితంలో శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన సమస్యలను చూడటం, గొడవలను అస్కారం లేకుండా చేయడంతో పాటు వాదనలను అదిలోనే తుంచివేయడంలో సహాయపడుతుంది.

13. ఇష్టమైన ప్రదర్శనలను కలిసి చూడండి: Binge-Watch Your Favourite Show Together

Binge-Watch Your Favourite Show Together

మీ భాగస్వామిని నచ్చిన హీరో, దర్శకుడి చిత్రాలను లేదా చక్కని కామెడీ చిత్రాలను లేదా టీ షోలు కలసి చూడటం ద్వారా భార్యభర్తల బంధాన్ని ధృడపరుస్తుంది. మీరిద్దరూ కలసి ఏదైనా చలనచిత్రం లేదా షోని ఎంచుకుని, దానిని కలిసి చూడటానికి నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి. ఇది జంటల మధ్య గొప్ప అనుబంధం పెనవేసుకునే ఆలోచనను కలిగిస్తుంది. దీనికి తక్కువ ప్రయత్నం అవసరం, మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

14. అలసినప్పుడు భాగస్వామికి మసాజ్‌ చేయండి: Offer Massages To Each Other

Offer Massages To Each Other

మీ భాగస్వామి పనులలో బిజీగా మారి అలసిపోయినప్పుడు లేదా ఇంటి పనులను చక్కబెట్టి టయర్డ్ అయినప్పుడు.. ఒళ్లు నోప్పులు అనగానే ఏదో ఒక మాత్రను వారి చేతికిచ్చి అది వేసుకో తగ్గిపోతుంది అన్నారో.. యుద్దమే. అలా కాకుండా చెంతకు చేరి వారికి ఓదార్పునిస్తూ.. ట్రాఫిక్ ఎక్కువగా ఉందా.? ఆఫీసులో పని ఎక్కువైందా.? అంటూ మాటల్లో ముంచుతూ ఒంటి నోప్పులను మర్చిపోయేలా చేసి.. వారి చేతులు, భుజాలు, వెన్ను, తల.. ఇలా శరీర అవయవాలపై కొబ్బరి నూనె, ఆముదం, బామ్ లతో మసాజ్ చేస్తే.. వారి కష్టమంతా ఇట్టే ఎగిరిపోతుంది. జంట మసాజ్ థెరపీ విభిన్నమైన స్పర్శ, అనుభూతినిస్తుంది. దీంతో మీ భాగస్వామితో మీ బంధం మరింత బలోపేతంగా మారుతుంది.

15. హాలిడే రోజుల్లో కలిసి ట్రిప్ ప్లాన్ చేయండి: Plan A Trip Together

Plan A Trip Together

మీ నివాస ప్రాంతానికి చేరువలో ఉన్న చక్కని, చిన్న హిల్ స్టేషన్‌, లేదా మరేదైనా పర్యాటక ప్రాంతాన్ని అన్వేషించి.. హాలిడే రోజుల్లో మీ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేయండి. మీరు, మీ భాగస్వామి హైకింగ్‌కు వెళ్లి ప్రకృతిని దాని నిజమైన రూపంలో అనుభవించవచ్చు. అయితే మోకాళ్ల నోప్పులు, చీలమండలు బెణుకు వంటి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి ఏ సమయంలోనైనా బాధించగలవు.