పరగడుపున పాలు తాగొచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది..

0
Milk On An Empty Stomach

రోజు ప్రారంభం అయ్యిందంటే చాలా వరకు అన్ని ఇళ్లలో ఉదయం టీ, లేదా కాఫీతో ప్రారంభం అవుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా మంది పాలతోనే తమ దినచర్యను ప్రారంభిస్తారు. పాలు అందించే పోషక విలువలు అన్నిఇన్నీ కావు. పాలలోని కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ప్రోటీన్‌, కార్బోహైడ్రేట్స్‌, విట‌మిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు పాల‌లో నిండి ఉంటాయి. అందుచేత పిల్ల‌లు, పెద్ద‌లు మొదలు అందరూ వీటిని తాగడానికి ఎంతో ఇష్టపడతారు. వీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి చక్కని ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధి ప్రమాదాన్ని నివారించ‌డంలోనూ, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గించ‌డంలోనూ, నిద్ర బాగా ప‌ట్టేలా చేయ‌డంలోనూ, జుట్టును దృఢంగా మార్చ‌డంలోనూ, మానసిక స‌మ‌స్య‌ల‌ను ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేయ‌డంలోనూ, ఎముక‌ల‌ను బ‌లంగా త‌యారు చేయ‌డంలోనూ పాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే ఇన్ని అరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పాలను.. ఎంత మేర తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయాలు కూడా తెలుసుకోవాల్సిందే. ఈ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే.. దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం కూడా పోంచివుందని తెలుసుకోవాలి. ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అరోగ్య ప్రయోజనాలు చేకూరగా.. మరికొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంపై దుష్ర్పభావాలు చూపనున్నాయి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నిమ్మరసం తేనే కలుపుకుని తాగితే దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే నానబెట్టిన నాలుగు బాదం పప్పులు తిన్నా అవి అరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఖాళీ కడుపుతో అరటి పండు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రి బోజనం చేయకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరం నీళ్ళు తాగితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలను కూడా ఖాళీ కడుపుతో తీసుకోవచ్చా.? అన్న విషయంతో పాటు పాలను తాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాల్సిందే. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ కడుపుతో పాలు తాగుతుంటారు. ఇది అరోగ్యానికి శ్రేయస్కరమా.? లేక అనారోగ్యానికి కారణమా.? అన్న సందేహాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి.

అయితే ఇప్పటికే వైద్యులు, డైటీషియన్లు ఈ విషయంలో స్పష్టతను ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతోంది అన్న విషయాన్ని వెళితే.. పాలతో రోజును ప్రారంభించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తుంది ఆయుర్వేదం. కాబట్టి పాలు తాగడానికి సరైన సమయం ఏది? అదే సమయంలో ఎందుకు తీసుకోవాలి? చూద్దాము. మీరు మీ రోజును పాలతో ప్రారంభించాలా? శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. నిస్సందేహంగా ఇది రోజుకి ఖచ్చితమైన ప్రారంభాన్ని ఇస్తుంది.

కానీ చాలా మంది నిపుణులు దానిపై విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. ఒక గ్లాసు పాలు, తృణధాన్యాలతో రోజు ప్రారంభించడం భారీ భోజనంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం ఉదయం పాలు మానేసి, తేలికపాటి ఆహారంతో రోజు ప్రారంభించాలని సూచించింది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల మేలు కంటే హానే ఎక్కువగా జరుగుతుందని చెబుతారు. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ స్థాయిలను పెంచడం ద్వారా చర్మం దెబ్బతింటుందని హెచ్చరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీర్ణవ్యవస్థపై భారీ పనిని నిర్వహించడం మంచిది కాదు. ఎందుకంటే కడుపునొప్పికి కారణమయ్యే భారీ భోజనం జీర్ణం కావడంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో తిమ్మిర్లు మరియు వాంతులు వస్తాయి.

చిన్నపిల్లలు, యుక్తవయస్సువారు ఖాళీ కడుపుతో పాలు త్రాగినా వారిలో జీర్ణశక్తి మెరుగ్గా పనిచేస్తుంది కాబట్టి వారికి జీర్ణంఅవుతాయి. అదే పెద్దలు ఖాళీ కడుపుతో పాలను తీసుకుంటే జీర్ణం అవ్వడం కాసింత కష్లం. కడుపులో మంట మొదలవుతుంది. కడుపులో వికారం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇలా తీసుకోవడం ద్వారా శరీరంలో చక్కర స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనికి తోడు ఎసిడిటీ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. పాలే కాదు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చింతపండు కూడా తినకూడదు. అది విరోచనాలు దారి తీసే ప్రమాదముంది. పసుపు మరిగించిన నీళ్ళు త్రాగినా కాసేపు అన్నవాహిక తీవ్రంగా మండుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు టీ తాగినా.. లేక నీళ్లు ఎక్కువగా తీసుకున్న తరువాత టీ తాగినా అరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఖాళీకడుపుతో మనం చాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిలో ఆముదం ఒకటి. ఇది ఖాళీ తింటే శరీరంలో ఉప్పు స్థాయి తగ్గిపోతుంది. అలాగే ఖాళీ కడుపుతో అరటికాయ కూర తినడం కూడా మంచిది కాదు. దుంపకూరలు ఉడికించుకుని తినవచ్చు గాని… కానీ ఖాళీ కడుపుతో తింటే మాత్రం శరీరంలో గ్లూకోజ్ లెవెల్ పడిపోతుంది. దుంప కూరలు త్వరగా అరిగే అవకాశం ఉండదు.

పాలు త్రాగడానికి ఉత్తమ సమయం ఏది?

ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం పాలు తాగడం ఉత్తమం. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. మీరు విశ్రాంతి తీసుకునేటప్పుడు అవి శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి కూడా సహాయపడతాయి. అలాగే ఉదయం పూట పాలు తాగితే బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పూట దీన్ని తాగడం వల్ల నిద్రకు, నరాల సడలింపుకు సహాయపడుతుంది.