జుట్టు ఎంత అందంగా, అరోగ్యంగా ఉంటే అంతటి ప్రెష్ లుక్ వస్తుంది. జుట్టును కట్టిపడేసే కుదుళ్లలోకి వెళ్లి వాటిని బలాన్ని అందించి మరింత ధృడంగా చేసేవి చాలా ఉన్నాయి. మంచి పరిశుభ్రత, క్రమం తప్పని హెయిర్ కట్, హాని చేయని ఉత్పత్తులు. అయితే తినే ఆహారం కూడా బలమైన తంతువులకు దోహదం చేస్తుందని తెలుసా? ప్రత్యేకంగా జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు సహాయపడే ఒక మాక్రోన్యూట్రియెంట్ ప్రోటీన్ అని తెలుసా.?
జుట్టులో ఎక్కువ భాగం ప్రోటీన్ తో (వాటిలో కొద్దిగా కొవ్వు, కొన్ని ఇతర కాంపోనెంట్లతో) ఆ ప్రత్యేకమైన ప్రోటీనే కెరాటిన్. ఈ కెరాటీన్ తోనే జుట్టు రూపొందించబడింది. ఆహారంలో పొందే ప్రొటీన్ జుట్టు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది అని అషిరా డెర్మటాలజీ చీఫ్ వెల్నెస్ డైరెక్టర్ షానీ ఫ్రాన్సిస్ చెప్పారు. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్ గురించి తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ అందిస్తున్నాం. ఇందులో ప్రోటీన్, జుట్టు రాలడం మధ్య సంబంధం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఉత్తమమైన ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ షేక్స్, పౌడర్‌లు మంచివేనా? అన్న అంశాలు అందిస్తున్నాం.
జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ సహాయం చేస్తుందా? Does Protein Help Hair Growth?
జుట్టు పెరగడానికి, ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్స్ అయిన అమైనో ఆమ్లాలు చాలా అవసరం. అయితే మొత్తంగా జుట్టుకు అవసరమయ్యే 20 అమైనో ఆమ్లాలలో 11 అమైనా యాసిడ్లను మన శరీరమే ఉత్పత్తి చేయగలదు. అయితే మిగిలిన తొమ్మిది అమెనో అమ్లాలను – జుట్టు పోషణకు, పెరగడానికి అత్యంత ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అని పిలుస్తారు. ఇవి మనం తీసుకునే ఆహారం నుండి పొందవలసి ఉంటుంది. అందుకే తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది, ఈ ప్రోటీన్ జుట్టు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు రాలుతుందా? Lack Of Protein Is The Cause for Hair Loss?
డెర్మటాలజీ ప్రాక్టికల్ & కాన్సెప్టువల్‌లోని జనవరి 2017 నివేదిక ప్రకారం, ఆహారం నుంచి శరీరం గ్రహించాల్సిన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు.. పూర్తిగా తక్కువ స్థాయిలో ఉన్నపక్షంలో, జుట్టు రాలవచ్చు. కాబట్టి ఇతర మాటలలో, అవును, తక్కువ ప్రోటీన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీనికి తోడు, మనం తినే ప్రొటీన్‌లో లభించే బి విటమిన్ అయిన బయోటిన్, అమైనో ఆమ్లాలను జీవక్రియ చేయడంలో సహాయపడుటంతో పాటు బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుకు తోడ్పడుతుంది. అయితే మరీ అత్యల్ప స్థాయిలో బయోటిన్ సప్లిమెంట్లు ఉన్నవారికి తప్ప మిగతావారు బయోటిన్ ప్రోటీన్ పై అధారపడాల్సిన అవసరం లేదని డెర్మటాలజీ అండ్ థెరపీలో ఆధ్వర్యంలో మార్చి 2019 నిర్వహించిన ఓ పరిశోధన పేర్కోంది.
ప్రొటీన్‌ను ఉపయోగించడం విషయంలో శరీరం ప్రాధాన్యతలలో ఒకటి, ఆరోగ్యకరమైన కండరాల కణజాలానికి మద్దతు ఇవ్వడం, ఆ తరువాతే జుట్టు పరిరక్షణ కోసం వెచ్చిస్తుంది. ఈ క్రమంలో ప్రోటీన్ లేని ఆహారం తీసుకోవడం కారణంగానో.. లేక కండరాల శక్తిని పుంజుకునేలా వ్యాయామం చేయని వారిలో ఆ కణజాలానికి మద్దుతు ఇవ్వడానికే ప్రోటీన్ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ప్రోటీన్ లోపం ఏర్పడి జుట్టు రాలడానికి దారితీస్తుంది. ప్రాథమిక కండరాల పనితీరును నిర్వహించడానికి శరీరానికి తగినంత పోషకాలు లభించకపోతే, దాని ప్రభావం మొదట జుట్టుపైనే పడుతుంది. తద్వారా జుట్టు రాలిపోతుంది. ఈ క్రమంలో శరీరం చాలా ముఖ్యమైన వాటిన్నింటినీ ఉంచడానికి ప్రతిదాన్ని ఉపయోగిస్తోంది,” చీఫ్ వెల్నెస్ డైరెక్టర్ షానీ ఫ్రాన్సిస్ చెప్పారు.
అమెరికా జాతీయ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, యూఎస్లో శాఖాహార ఆహారాలను అనుసరించే వారిలో కూడా ప్రోటీన్ లోపం చాలా అరుదు. అయినప్పటికీ, ప్రజలు తాము తగినంత పోషకాలను పొందుతున్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, జుట్టు పెరుగుదలతో పాటు మొత్తం అరోగ్యానికి అమెరికన్లలోని పెద్దలకు అవసరమైన ప్రోటీన్ ఎంత అవసరమో క్రింది పట్టిక సూచిస్తుంది
- స్త్రీలు, యువతులు ప్రతీరోజు తీసుకోవాల్సిన ప్రోటీన్: 46 గ్రా
- పురుషులు, యువకులు ప్రతీరోజు తీసుకోవాల్సిన ప్రోటీన్: 56 గ్రా
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, తగినంత ప్రోటీన్ లభించని రెండు నుండి మూడు నెలల తర్వాత, ఒక వ్యక్తి జుట్టు రాలడాన్ని గమనించడం ప్రారంభం అవుతందని సూచిస్తుంది
ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్రోటీన్-రిచ్ ఫుడ్స్: Protein-Rich Foods for Healthy Hair
జుట్టు పెరగడానికి, అరోగ్యంగా ఉండటానికి దోహదపడే ప్రోటీన్‌ను లభ్యం కావడం కోసం ఈ క్రిందనున్న సహజమైన ఆహార వనరులు ఉపయోగపడతాయి. వాటిలోని పుష్కలంగా లభించే పోషకాలను తినడం ద్వారా ప్రోటీన్ పెరుగడానికి ఉత్తమ మార్గమని తెలిసింది.
ప్రోటీన్, పోషక మూలాలు:
- చేప
- చికెన్ వంటి లీన్ పౌల్ట్రీ
- గుడ్లు
- తక్కువ కొవ్వుతో కూడిన పెరుగు, కాటేజ్ చీజ్ వంటి పాల ఉత్పత్తులు
- నట్స్, నట్ బట్టర్
- విత్తనాలు
- బీన్స్, పప్పులు, చిక్కుళ్లు వంటి కాయధాన్యాలు
- సంపూర్ణ గోధుమ పాస్తా, క్వినోవా వంటి తృణధాన్యాలు
- టోఫు, టేంపే వంటి సోయా ఉత్పత్తులు
ఇవన్నీ తీసుకోవడంతో వాటిలోని ప్రోటీన్లు సంపూర్ణంగా శరీరం సంపూర్ణంగా గ్రహించి.. జుట్టు పెరుగుదలతో సహా సాధారణ విధులను నిర్వహించడానికి అవసరమైన పోషణను అందిస్తుంది. అయితే జంతు మాంసం ద్వారా లభించే ప్రోటీన్ సర్వింగ్ పరిమాణం చాలా చిన్నదిగా ఉండాలి. మొత్తంగా ఇది మూడు ఔన్సులు లేదా కార్డ్ డెక్ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే జంతు ఉత్పత్తులు – చికెన్, చేపలు, ఎముకల పులుసుతో సహా – మన శరీరంలో సహజంగా కొల్లాజెన్ అని పిలువబడే మరొక రకమైన ప్రోటీన్‌ను కూడా కలిగి ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం, కొల్లాజెన్‌ను తయారు చేసే అమైనో ఆమ్లాలు, ఒకసారి తీసుకున్న తర్వాత, కెరాటిన్‌ను సృష్టించేందుకు మళ్లీ కలపవచ్చు, తద్వారా బలమైన జుట్టుకు మద్దతు ఇస్తుంది.
జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ షేక్స్: Protein Shakes for Hair Growth
జట్టు పెరుగుదలకు లేదా ధృడత్వానికి ప్రోటీన్ల అవసరం చాలా ఉంది కాబట్టి సాధ్యమైనప్పుడల్లా హోల్ ఫుడ్స్ తీసుకోవాలని, వాటి నుండి శరీరానికి పోషకాలు అందుతాయని డాక్టర్ ఫ్రాన్సిస్ సిపార్సు చేశారు. ఈ సందర్భంగా సమయానుకూలంగా ఎప్పటికప్పుడు శరీరానికి తగినంత ప్రోటీన్ అందేలా చూడటం చాలా ముఖ్యమైనదన్నారు. కాగా, ” అవసరమైన ప్రోటీన్ కోసం కొంతమంది ప్రోటీన్ బార్‌లు లేదా షేక్‌లను ఎంచుకుంటారని చెప్పిన ఆమె ఇలా సులభంగా ప్రోటీన్ పోందాలని అలోచించి, తీసుకునే వారి పట్ల తాను ఎలాంటి వివక్ష చూపనని, ఎలాగైతేనేం శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందిందా లేదా అన్నదే ముఖ్యమని” అమె అన్నారు. షేక్ లతో ప్రోటిన్ పొందడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇప్పటికీ పోషకాలతో కూడిన సహజ వనరులతో వాటిని ఎంచుకోవచ్చు లేదా తయారు చేసుకోవచ్చు. అవేంటంటే:
- హెర్బెడ్ అవోకాడో షేక్ (19 గ్రా ప్రోటీన్)
- రాస్ప్బెర్రీ-కవర్డ్ పీనట్ బటర్ షేక్ (16 గ్రా ప్రోటీన్)
- సముద్రపు ఉప్పుతో వేగన్ చాక్లెట్ నట్ షేక్ (11 గ్రా ప్రోటీన్)
జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ పౌడర్ Protein Powder for Hair Growth
సాధారణంగా ఆహారం ద్వారా ప్రోటీన్‌ను పొందడం ఉత్తమమైన మార్గం. కాగా, కోందరు తమ మాత్రం తమ ఆహారాన్ని ప్రోటీన్ పౌడర్ తో బర్తీ చేసి ప్రయోజనం పోందుతారు. కొంతమంది వ్యక్తులు తాము ఆహారం నుంచి పోందిన ప్రోటీన్‌ను తమ శరీరం కండరాల కణజాలానికి వినియోగిస్తుందని ఏకంగా తమ జుట్టుకు ప్రోటీన్‌ను అందించేందుకు ప్రోటీన్ పౌడర్ ను అప్లై చేస్తారు. అయితే ఇలా కూడా ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందవచ్చు. వీరితో సహా:
- కండరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నవారు
- గాయం లేదా శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నవారు
- బరువు పెరగాల్సినవారు
- అంతర్లీన అనారోగ్యం కారణంగా అదనపు పోషకాహారం అవసరమైనవారు
అదేవిధంగా, దీర్ఘకాలికంగా ప్రోటీన్ తక్కువగా ఉన్నట్లయితే, ఆహారం ద్వారా లభించే పోషకాలలో ప్రోటీన్ దానిని అధిగమించలేని పక్షంలో భోజనంలో ప్రోటీన్ పౌడర్‌ను జోడించడం చేస్తారు. దీని వల్ల తగినంత పోషకాలతో పాటు ప్రోటీన్ ను అందించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇలా ప్రోటీన్ పోడర్ తీసుకోవడం వల్ల జుట్టు సన్నబడటం లేదా రాలడం వంటి లోపాల లక్షణాలను సరి చేయడంలో సహాయపడుతుంది.
అయితే, ప్రోటీన్ పౌడర్ అనేది జుట్టు పెరుగుదల కోసం వినియోగించే మాయాతీత పొడి అనేది అర్థం కాదు. సరైన పోషకాలను తీసుకుంటున్న తరుణంలో ఎలాంటి పోషకాల లోపం లేకపోయినా మీరు ప్రోటీన్ సప్లిమెంట్లను వాడినంత మాత్రాన జుట్టు పెరుగుతుందా.? అన్న విషయంలో డెర్మటాలజీ ప్రాక్టికల్ అండ్ కాన్సెప్చువల్ రీసెర్చ్ చేసిన అధ్యయనం ప్రకారం, ఈ విషయం ఇప్పటికీ ఇంకా అస్పష్టంగా ఉంది. అయినా, మనిషి తగినంత ప్రోటీన్ తీసుకోవాలన్నది అత్యంత ముఖ్యమైన విషయమని డాక్టర్ ఫ్రాన్సిస్ తెలిపారు. కాగా, జట్టుకు ఆరోగ్యానికి దోహదపడే ఒక సప్లిమెంట్ వెయ్ ప్రోటీన్. ఇది సాధారణంగా పాలలో కనిపించే ప్రోటీన్. ఇది సాధారణంగా తీసుకునే పానీయాలు, వోట్మీల్, పెరుగు, ఇష్టమైన ఇతర వంటకాలకు జోడించడానికి పొడిరూపంలో లభిస్తుంది. సాధారణంగా తినడానికి, ఇతర పానీయాలలో కలుపుకుని తీసుకునేందుకు ఇది సురక్షితం. అయినా వీరు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. వారు ఎవరంటే:
- పాలంటే అలెర్జీ ఉన్న వ్యక్తులు
- లాక్టోస్ అసహనం లేదా పాలు పడని వ్యక్తులు
- యాంటీబయాటిక్స్, కొన్ని బోలు ఎముకల వ్యాధి మందులు, కొన్ని పరాన్నజీవులను చంపే మందులతో సహా కొన్ని మందులు తీసుకునే వ్యక్తులు
మాక్రోలో ప్యాక్ చేయడంలో సహాయపడటానికి కొన్ని ప్రోటీన్ పౌడర్ షేక్ వంటకాలు:
- గ్రీన్ ప్రోటీన్ స్మూతీ (36 గ్రా ప్రోటీన్)
- బ్లూబెర్రీ ప్రోటీన్ పవర్ స్మూతీ (32 గ్రా ప్రోటీన్)
- గుమ్మడికాయ ప్రోటీన్ స్మూతీ (18 గ్రా ప్రోటీన్)
జుట్టుకు ప్రోటీన్‌ను ఎలా జోడించవచ్చు? How Can You Add Protein to Your Hair?
సమయోచితంగా మీ జుట్టుకు ప్రోటీన్‌ను ఎలా జోడించాలనే దాని కోసం కొన్ని వ్యూహాలు ఉన్నప్పటికీ, కైజర్ పర్మనెంట్ ప్రకారం, ఆరోగ్యకరమైన తంతువులకు మద్దతు ఇవ్వడానికి పోషకాలను ఉపయోగించడం ఉత్తమ మార్గం. మొత్తం ఆరోగ్య శ్రేయస్సును నిలబెట్టుకోవడంలో సహాయపడటానికి తగినంత ప్రోటీన్‌ని తీసుకోవడం కూడా ముఖ్యం. అందుకు సహజమైన ప్రోటీన్ డ్రింక్‌తో లేదా ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం ద్వారా దీనిని నివారించవచ్చు.
పాలవిరుగుడు ప్రోటీన్ జుట్టు రాలడానికి కారణమవుతుందా? Does Whey Protein Cause Hair Loss?
పాలవిరుగుడు ప్రోటీన్ జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తుందని లేదా జుట్టుపై దుష్ప్రభావాలను కలిగిస్తుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కానీ ఈ వెయ్ ప్రోటీన్ పౌడర్ వల్ల జుట్టు రాలడాన్ని అనుభవించినట్లు చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ప్రొటీన్ పౌడర్ జుట్టు రాలడానికి కారణం కానప్పటికీ, పాలవిరుగుడు ప్రోటీన్ వల్ల జుట్టు రాలేందుకు దోహదపడే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. పాలు, ప్రోటీన్ తో మిళితమైన జీర్ణక్రియ కలత వంటివి ఇందుకు పరోక్షంగా దోహదపడవచ్చు. అయితే, రిస్క్ గ్రూపుల్లోకి వచ్చే వ్యక్తులు ముఖ్యంగా పాలంటే అలెర్జీ ఉన్నవారితో పాటు లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారు, యాంటీబయాటిక్స్, కొన్ని బోలు ఎముకల వ్యాధి మందులు, కొన్ని పరాన్నజీవులను చంపే మందులతో సహా కొన్ని మందులు తీసుకునేవారు మినహాయించి ఇతరులు వెయ్ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం సురక్షితంగా పరిగణించబడుతుంది.