అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని అందంగా మలచుకోవచ్చని చెప్తున్నారు బ్యూటీషియన్స్. మరి అవేమిటో ఒక్క లుక్ వేద్దామా….
- మనం ఉల్లిపాయలు తొలిగేటపుడు కళ్లలోనుంచి నీరు రావడం సహజం. అందుకే వాటిని ఎంత త్వరగా కట్ చేస్తే అంత మంచిది అనుకుంటాము. కానీ, ఉల్లిపాయలు తొరిగిన తర్వాత వాటిలోంచి ఒక ముక్కను తీసుకుని మన కనుబొమ్మలకు రాసుకుంటే కనుబొమ్మలు నున్నగా వచ్చి మంచి షేప్ లోకి తయారవుతాయట. అలాగే ముఖానికి ఆనియన్ ముక్కలను రుద్దుకుంటే ముఖం నున్నగా అందంగా తయారవుతుంది. మరి దీన్ని ట్రై చేయండి.
- బంగాళదుంపలు తొక్కు తీసిన తర్వాత వాటిని చక్రాలుగా తొరిగి దాన్ని కంటికింది పెట్టుకుంటే కంటికింద వచ్చే నల్లని మచ్చలు తొలగిపోతాయి. అలాగే, కీరా ముక్కలను పెట్టుకున్నా ఈ మచ్చలు పోతాయంటున్నారు నిపుణులు.
- అలోవీరాని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత హెయిర్ బాత్ చేస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది. అలాగే, అలోవీరాని బుగ్గలకు రాసుకుంటే బుగ్గలు మెరుస్తూ ఉంటాయి.
- ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దానిమ్మగింజల రసాన్ని పెదవులకు రాసుకుంటే పెదాలు రోజంతా ఎర్రగా ఉంటాయి. స్నానం చేసిన తర్వాత లిప్ స్టిక్ కి బదులుగా కూడ దీనిని రాసుకోవచ్చు.
- చాలామందికి శరీరంలో చంకల కింద నల్లగా ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో నిమ్మకాయ ముక్కని ప్రతిరోజు రుద్దుకుంటే వారం రోజుల్లో నల్లని మచ్చలు తొలగిపోతాయి.