ఆరోగ్యకరమైన ఈ హెల్తీ అల్పాహారాల గురించి తెలుసా?

0
Nutritionous Breakfast

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. అరోగ్యం ఉంటే చాలు.. ఐశ్వర్యం ఉన్నట్లే అని వారు భావిస్తుంటారు. ఇది నిజమా అంటే ముమ్మాటికీ నిజమే. ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. అదే లేని నాడు ఎంత సంపద ఉన్నా అసుప్రతుల పాలవుతుందే తప్ప, అనుభవించే పరిస్థితి మాత్రం ఉండదు. ఏం తినాలన్నా ఆంక్షలు.. తీపి తినరాదు, ఉప్పు తినరాదు, కారం తినరాదు.. నూనె తినరాదు ఇలా అన్ని అంక్షల నడుమ జీవితాన్ని ఎలా అనుభవిస్తాం. ఏం తినాలన్నా అంక్షలే. కాసింత పిలుపు ఎక్కువైందా.. అల్సర్ అంటూ బాధపడేవాళ్లు ఉన్నారు. కాసింత పప్పు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ అనేవాళ్లూ ఉన్నారు. ఇలా ఎంతో ఐశ్వర్యం ఉండి కూడా ఏదీ తీసుకోలేక బాధపడేవారి వద్దకు వెళ్తే వారే చెబుతారు. ఆరోగ్యం ఉంటే చాలు.. దానిని మించిన ఐశ్వర్యం లేదు అంటారు.

ఇక దీనికి తోడు కాలుష్యపు కోరల్లో ఉన్న నేటి మనిషి ఆయుర్ధాయాన్ని కూడా కాలుష్యమే కాటువేస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం మనిషి సగటు అయుర్థాయం పెరిగినప్పటికీ.. అదేమంత సంతోషించదగ్గ విషయంగా మాత్రం మారడం లేదు. ఎన్నో అనారోగ్య సమస్యలు దీనికి కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో వచ్చిన మార్పులు.. నకిలీల బెడద మనిషి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. అయితే గాఢాంధకారంలోనూ మనకు వెలుగు చూపే ఓ చిరుదివ్వె ఉన్నట్లు.. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదన్న విషయాలపై మాత్రం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలకు బదులు, హానిచేసే వాటి వినియోగం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మధ్యహ్నం తీసుకునే ఆహారం విషయం కన్నా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం విషయంలో కూడా మనలో అనేక సందేహాలు.. పోంతలేని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో అల్పాహారంలో మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? అన్న వివరాలు ఇలా ఉన్నాయి. బ్రేక్ ఫాస్ట్ కోసం ఆరోగ్యకరమైన వాటిని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ (ఆల్పాహారం)కు ప్రాధాన్యం ఇవ్వరు. ఉదయం తీసుకునే ఆహారం పాత్ర ఆరోగ్యంపై ఎంతో ఉంటుంది. ఫైబర్ తో కూడిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు తిరిగి ఆకలి అవకుండా ఉంటుంది. తగినంత ప్రొటీన్లు, ఫ్యాట్స్, పోషకాలు బ్రేక్ ఫాస్ట్ లో ఉండాలి. అధిక కార్బోహైడ్రేట్స్ తో కూడిన వాటిని తీసుకోకూడదు. వీటివల్ల తిన్నది వేగంగా జీర్ణమై, రక్తంలోకి అధిక గ్లూకోజ్ చేరిపోతుంది. దీర్ఘకాలంలో ఇది మధుమేహం, ఇతర సమస్యలకు దారితీస్తుంది.

Healthy Breakfast

గుడ్లు

వయసుతో సంబంధం లేకుండా కోడి గుడ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు. ఉదయం బాయిల్ చేసిన గుడ్డు తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. లేదంటే ఆమ్లెట్ వేసుకుని అయినా తీసుకోవచ్చు.

ఓట్ మీల్

ఓట్స్ లో ఫైబర్ పుష్కలం. ఐరన్, బీ విటమిన్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం లభిస్తాయి. పోషకాలు, ఫైబర్ తగినంత ఉన్న ఓట్స్ ను ఉదయం తీసుకుంటే ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు.

కాయగూరల సలాడ్

ఆకు కూరలు, కాయగూరలను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల తగినన్ని విటమిన్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రొటీన్ లభిస్తాయి. అంతేకాదు, సహజ ఫైబర్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

హోల్ వీట్ టోస్ట్

ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ (ఒకేసారి విడుదల కాని) ఉన్న హోల్ వీట్ టోస్ట్ ను తీసుకోవడం వల్ల రక్తంలోకి ఒకేసారి అధిక మోతాదులో గ్లూకోజ్ చేరకుండా ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది.

పండ్లు

ఉదయం అల్పాహారంగా పండ్లను కూడా తినొచ్చు. ఫ్రూట్ సలాడ్ గానూ తీసుకోవచ్చు. కాకపోతే ఫైబర్ ఉండే పండ్లకు చోటు ఇవ్వాలి.

పోహా

చాలా అవసరమైన ఉదయం పోషణను అందించే సులభమైన అల్పాహారం పోహా. మీకు ఇష్టమైన కొన్ని కూరగాయలు, మసాలా దినుసులతో వండిన పోహా గుడ్ మార్నింగ్ ప్లేట్‌గా తయారవుతుంది.