జుట్టు రాలుతుందా?: ఈ సహజ చిట్నాలతో నివారించండి

0
Tips to Prevent Hair Loss Hair Fall

నేటి యువతను విపరీతంగా బాధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. ఒకప్పుడు అమ్మాయి అనగానే అమె వాటు జడ చూశావా.? అని అనేవాళ్లు.. అలాంటిది ఇప్పటి యువతుల్లో వాలు జడ కనిపించడమే లేదని చెప్పవచ్చు. యువతులే కాదు యువకుల జుట్టు కూడా చేయితో పట్టుకుంటే గుబురుగుబురుగా ఉండేది. మరీ ఇప్పుడు యువకుల జుట్టును చూస్తే.. ఇరవై ఏళ్లకు తెల్లని వెంట్రుకలు వస్తున్నాయి. పాలికేళ్లకే బట్టతల వచ్చేస్తోంది. అయితే ఇందుకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణంలో మార్పులు, నానాటికీ పెరుగుతున్న కాలుష్యం లేదా అధిక పని ఒత్తిడి, లేదా మానసిక ఒత్తిడి లేదా తినే ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య రానురాను మరింత తీవ్రతరం అవుతుంది.

ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదిస్తూ.. వారి సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటున్నారు యువత. అదికాకపోతే నెట్టింట్లో వెతికి.. మార్కెట్ లో లభించే షాంపూలను ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కానీ జుట్టు రాలే సమస్యను దూరం చేసే అనేక ప్రాచీన మార్గాలు ఉన్నాయని.. వాటిని విరివిగా వాడిన మన పెద్దలు తమ జుట్టును అరవై ఏళ్లు వచ్చినా బట్టతల రానీయకుండా కాపాడుకున్నారని తెలుసా.! పెద్దల మాట చద్దన్నమూట అంటారు. మరి అలాంటిది వారు ఆచరించిన విధానాలను మనం కూడా పాటిస్తూ జుట్టును రాలకుండా బలంగా మెరుగుపర్చుకోవడం ఎలా..

ఇక మన పెద్దలు అత్యంత అరుదుగా హోటళ్లను ఆశ్రయించి అక్కడ లభించే ఆహారాన్ని తీసుకునేవారు. అందులోనూ తాము నివసిస్తున్న ప్రాంతం కాకుండా ఏక్కడైన విహారయాత్రకో లేక పుణ్యక్షేత్ర దర్శనానికో వెళ్తే తప్ప బయట పూటకూళ్ల ఇళ్లను ఆశ్రయించేవారు కాదు. కానీ నేటి యువత.. చిరుతిళ్ల కోసం వంటింట్లో తక్కువ.. బజార్లలోని హోటళ్లలో ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తమ సమస్యలను అధిగమించవచ్చని వారికి తెలియదు. మానవ శరీరం సహజంగా విటమిన్లు, ఖనిజాలను పొందినప్పుడు, ఎటువంటి సమస్యలు ఉండవు. జుట్టు కూడా అందంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టుకు కూడా బాగా ఉపయోగపడతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జాజికాయ:

Nutmeg

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి జాజికాయ చాలా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలలో జాజికాయ పొడి మరియు ఆలివ్ గింజలను కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాంబినేషన్ తీసుకుంటే జుట్టు రాలడంతోపాటు స్ట్రాంగ్ గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

మెంతులు:

Fenugreek

డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కరస్థాయిలను తగ్గించి మేలు చేసే మెంతులు.. దాంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నయం చేయడంలో దోహదపడుతాయి. వంటింట్లో వుండే ఈ గింజల్లో చక్కని ఔషధ ఉన్నాయి. ఇవి మనిషిలోని పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మీరు ఆహారంలో మెంతులు ఎక్కువగా ఉపయోగిస్తే, అది హార్మోన్ల సమస్యలను తగ్గిస్తుంది. ఆనారోగ్య మీ దరి చేరకుండా కూడా దోహదపడుతుంది.

అనేక రకాలుగా మేలు చేసే ఈ మెంతులు జుట్టు రాలడాన్ని కూడా అరికట్టడంలో సాయం చేస్తోంది. మెంతి గింజలను కొబ్బరినూనెలో వేసి వేడి చేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు అందంగా పెరుగుతుంది. స్నానం చేయలేని వారు పెట్టుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్ గింజలు:

Olive seeds
Src

ఆలివ్ గింజలను ఉదయం నీటిలో నానబెట్టి, రాత్రి పడుకునే ముందు పాలతో తీసుకోవాలి. పాలలో తీసుకోకూడదనుకునే వారు ఆలివ్ గింజలు, కొబ్బరి, ఇతర డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి కలిపి లడ్డూలు చేసి తినవచ్చు. ఈ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉండి జుట్టు బలంగా పెరుగుతుంది.

వేడి నూనె మసాజ్:

Oil Hair Massage

కొద్దిగా నూనె (ప్రాధాన్యంగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె) వేడి చేసి.. చల్లారిన తరుణంలో నెమ్మదిగా మీ చేతివేళ్లు ఉపయోగించి మీ తలపై అప్లై చేసి.. జట్టు కుదుళ్లుకు చేరేలా మసాజ్ చేయాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, మీ జుట్టు మూలాల బలాన్ని పెంచుతుంది.. మీ స్కాల్ప్‌ను కండిషన్ చేస్తుంది.

ఉల్లిపాయ రసం:

onion juice
Src

సల్ఫర్ జుట్టు రాలడాన్ని అరకడుతుంది. ఈ సల్పర్ ఉల్లిపాయ రసయంలో అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు రాలడాన్ని నయం చేస్తుంది. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు కుదుళ్లను పునరుద్ధరించి మంటను తగ్గిస్తుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల జుట్టు రాలడానికి దారితీసే స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మక్రిములను చంపడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్ రసం:

Beetroot juice

దాదాపు అన్ని శరీర సంబంధిత సమస్యలకు వంటగదిలోనే పరిష్కారం దొరుకుతుంది అనే పెద్దలు చెప్పకనే చెప్పారు. అంతేకాదు వారు ఆచరించి మనకు మార్గాలను కూడా చూపారు. జుట్టు రాలడానికి కారణమయ్యే మీ పోషకాహార లోపాన్ని భర్తీ చేయడానికి బీట్‌రూట్ మీకు సహాయపడుతుంది. కాబట్టి దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలే సమస్యతో పోరాడుతుంది.

గ్రీన్ టీ:

Green Tea

గ్రీన్ టీ జుట్టు కుదుళ్లను పునరుద్ధరించడంతో పాటు జుట్టు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఇది జుట్టు పెరుగుదల రేటును పెంచుతుంది. గ్రీన్ టీ ద్రావణంతో మీ జుట్టును కండిషన్ చేసిన తరువాత మీ జుట్టులో మార్పును గమనించండి.

ధ్యానం చేయండి:

Meditation

జుట్టు రాలేందుకు మానసిక, శారీరిక ఒత్తిడి కూడా ఓ కారణం కావచ్చు. మరీ ముఖ్యంగా ఒత్తిడిని జయించేందుకు ధాన్యం మీకు దోహదపడుతుంది. మనకు వచ్చే చాలా సమస్యలను జయించేందుకు సాయం చేసే ధాన్యం.. జుట్టు రాలడాన్ని కూడా జయిస్తుంది. ఇది మీమల్ని పట్టి పీడించే చికాకులను దూరం చేసి.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.. దీంతో మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మీలోని రుగ్మతలు తొలగిపోతాయి. మీ దినచర్యలో ధ్యానాన్ని చేర్చుకోండి జట్టును సంరక్షించుకోండి.

ఇండియన్ గూస్‌బెర్రీ (ఉసిరికాయ):

Indian Gooseberry
Src

ఉసిరి కంటే జుట్టు సంబంధిత సమస్యలకు చికిత్సకు మేలైనది ఏమిటీ? జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి విటమిన్ సి లోపం. అయితే ఉసిరిలో విటమిన్ సి నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఈ లోపాన్ని సరిచేసి మన శరీరంలోకి కావల్సినంత సి విటమిన్ ను అందించడంలో ఉసిరికి మరోకటి సాటిలేదు. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్‌ను నివారిస్తాయి. ఉసిరి జుట్టు మూలాలకు అవసరమైన పోషణను అందించి వాటిని బలంగా, మెరిసేలా చేస్తుంది.. అంతేకాదు, స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచడంలోనూ దోహదపడుతుంది.

సహజ జుట్టు ముసుగు:

Hair Mask

హెయిర్ మాస్క్‌లు జుట్టుకు రక్షణ కల్పిస్తాయి. అయితే అవి రసాయన ఆధారితంగా కాకుండా సహజ పదార్ధాల మిశ్రమంతో కూడుకున్నవి అయితే జుట్టుకు మేలు చేస్తాయి. అరటిపండు, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, తేనె వంటి సహజ పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కోసం తేనె ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్ చేయండి. ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల తేనె.. అదే మొత్తంలో ఆలివ్ నూనె కలపండి. దీనికి చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపండి. దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసి మీ జుట్టుకు అప్లై చేయండి.

Avocado hair mask

అవకాడో హెయిర్ ప్యాక్ అప్లై చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే మరో హెయిర్ ప్యాక్. 2-3 అవోకాడో పండ్లను తీసుకుని వాటిని తొక్కండి. విత్తనాలను తీసిన తర్వాత, వాటిని ఒక గిన్నెలో ఉంచండి. అందులో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి ఈ ప్యాక్‌ని మీ జుట్టుకు అప్లై చేయండి. అవోకాడోలో విటమిన్లు K, C, B5, B6, E, పొటాషియం, ఫోలేట్ వంటి వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో తక్కువ పరిమాణంలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, విటమిన్ A, B1 (థయామిన్), B2 (రిబోఫ్లేవిన్) ఉంటాయి. B3 (నియాసిన్), రాగి, ఇనుము, జింక్, ప్రోటీన్. ఈ కారణంగా, అవకాడోలు ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

వేప ఆకులు:

Neem Leaves

వేపలో ఔషధ గుణాలకు ప్రసిద్ధి.. ఇది జుట్టు రాలడాన్ని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వేప చుండ్రును అరికట్టడానికి ఒక అద్భుతమైన మార్గం. ఇది హెయిర్ ఫోలికల్స్ బలంగా మారడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలోనూ దోహదపడుతుంది. ఈ వేప ప్యాక్ ను మీరు కూడా ప్రయత్నించవచ్చు. వేప ఆకులను గ్రైండ్ చేసి ఉడకబెట్టి పేస్ట్ లా చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ పేస్టును మీ తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు ప్రక్రియను పునరావృతం చేస్తే జట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

కలబంద:

Aloe vera

కలబందలో జుట్టు పెరుగుదలను నేరుగా ప్రోత్సహించే ఎంజైమ్‌లు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ కలబందను తీసుకోవడంతో పాటు మీ తలపై అలోవెరా జ్యూస్ లేదా జెల్ అప్లై చేయడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కలబంద మీ జుట్టులోని మూలాలను మూసుకుపోయేలా చేసే మీ స్కాల్ప్ నుండి మృతకణాలను తొలగిస్తుంది. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి బ్యాక్టీరియాతో పోరాడి వ్యాధులను దూరం చేయడంతో పాటు శిరోజాలను చల్లగా ఉంచుతాయి. అలోవెరా స్కాల్ప్ pH సమతుల్యతను పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కలబందను ఆముదంతో కలిపి తలకు పట్టిస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అందువలన, ఇది స్కాల్ప్ నుండి మృతకణాలను తొలగించడం, తంతువులకు హైడ్రేషన్ అందించడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

గుడ్డులోని తెల్లసొన, పెరుగు పేస్ట్:

Egg White Curd Paste

గుడ్డులోని తెల్లసొన, పెరుగుల మిశ్రమం జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. గుడ్లులో సల్ఫర్ మెండుగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుకు అవసరమైన పోషకం. గుడ్డులోని సల్ఫర్ కెరాటిన్, కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది చుండ్రును నివారిస్తుంది. ఈ అద్భుతమైన హెయిర్ ప్యాక్ కు పెరుగు, వేప పౌడర్ ను జోడిస్తే మరింత ప్రయోజనకరం. 2 గుడ్లు తీసుకుని, ఒక గిన్నెలో వాటి తెల్లసొనలను తొలగించండి. దీనికి, 2 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు జోడించండి. దానికి వేప పొడిని కూడా మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. అరగంట నుండి గంట పాటు వేచిన తరువాత కడిగేయండీ. ఇవే కాదు, పెరుగులో ఉండే నెయ్యి, ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా, క్యాల్షియం, విటమిన్ డి వంటి కొవ్వు పదార్థాలు, అనేక ఖనిజాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.