తెల్లజుట్టు వచ్చేసిందా.? ఇలా సహజ పద్దతులలో నివారించండి - Natural Home remedies to turn up grey hair to black in Telugu

0
Remidies to turn gray hair to black

తెల్లజుట్టు ఇప్పుడిది పెద్ద సమస్యగా మారింది. వయస్సు పైబడినవారికి ఎలాగూ తెల్లజుట్టు వస్తుందని తెలుసు. కానీ జుట్టును, తలకు అందించాల్సిన పోషకాల విషయంలో అవగాహనా రాహిత్యం కారణంగా.. టీనేజీ కుర్రాళ్ల నుంచి ఇరవై ఏళ్ల వయస్సులోకి యువతకు కూడా తెల్లజుట్టు వచ్చేస్తోంది. సంప్రదాయ ఔషధగుణాలు కలిగిన శిఖాకాయ్, కుంకుడు గింజలను వినియోగించి తలంటు స్నానం ఆచరించడం గ్రామాల్లోనూ అదృశ్యం కావడంతో నూనుగు మీసాల వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తోందంటే అతిశయోక్తి కాదు. వీటిని తోసిరాజుతూ అందుబాటులోకి వచ్చిన ఘాటైన షాంపూలు, సబ్బులను తలకు, వెంట్రుకలకు హాని చేస్తున్నాయి. జుట్టు నాణ్యతను, కుదుళ్ల నుంచి గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో తెల్లజుట్టు మాత్రమే కాదు.. బట్టతల, జుట్టు రాలిపోయే సమస్యలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అసలు తెల్ల జుట్టు ఎవరికి, ఎందుకు వస్తుంది.? ప్రి మెచ్యూర్ ఏజింగ్ లక్షణాలు ఎందుకు.? అన్న వివరాల్లోకి వెళ్తే..

తెల్ల జుట్టు రావడానికి కారణాలు అనేకం. జన్యుపరమైన లోపాలన్నది ముఖ్యకారణం, వంశపారంపర్యమన్నది రెండవ కారణం, పోషకాల లోపమన్నది మూడో కారణం. అయితే అవన్నీ కరెక్టేనా అంటే.. కరెక్టే అని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఏ కారణంగా జుట్టు తెల్లబడుతుందన్నది ఇప్పటికీ శాస్త్రీయంగా రుజువు కాలేదు. దీంతో కారణాలుగా చెబుతున్నవన్నీ అనుమానాలుగానే మిగిలిపోయాయి. తెల్లజుట్టు రావడానికి కారణాలు మాత్రం ఇప్పటికీ నిశితంగా తెలియదు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన కారణాల్లో ఒకటైన వంశపారంపర్యం, రెండవది ఒత్తడి మాత్రం కాదనలేం. వంశపారంపర్యం అంటే తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి ఆస్తులనే కాదు తెల్లజుట్టు కూడా సంక్రమిస్తుందని తేలింది. ఇక మరో కారణం ఒత్తిడి. తీవ్రమైన పని ఒత్తడి, లేక మానసిక ఒత్తిడి కారణంగా కూడా తెల్లజుట్టు రావచ్చు. ఇక ధూమపానం కూడా తెల్లజుట్టు రావడానికి మరో కారణంగా మారుతుందని పరిశోధనల్లో తేలింది. పోగను విడచి, ఒత్తిడిని తగ్గించుకుని జీవనశైలిని మారిస్తే తెల్లజుట్టు రాకుండా నివారించవచ్చు.

తెల్లజట్టు రావడానికి కారణాల్లో.. జుట్టును దుమ్ముధూళికి వదలేయడం, బ్లీచింగ్ చేయించడం, వెడల్పాటి దువ్వెన బదులు బ్రష్ లతో దువ్వడం, కర్లింగ్ చేయడానికి అధిక వేడిమికి గురిచేయడం, ఘాటైన షాంపూలు, సబ్బులను వాడటం, ఎక్కువ సార్లు కడగటం కూడా తెల్లజుట్టుకు కారణాలే. అంతేకాదు ఎండ, చలిలో జుట్టును వదులుగా వదిలేసి తిరగడం కన్నా వేసవిలో క్యాప్, చలిలో మంకీ క్యాప్ లాంటివి వాడకపోవడం కూడా తెల్లజుట్టుకు కారణాలే. జట్టును స్వల్పకాలిక సమయంలో తమకు నచ్చిన విధంగా తిరగడం కోసం రసాయనాలతో కూడిన జెల్, రంగులు వాడటం కూడా జుట్టు తెల్లబడటానికి కారణం కావచ్చు. కాగా, హాయిగా ఆడుకుని ఎలాంటి చింతలు, చికాకులు లేని చిన్నారుల్లో తెల్లజుట్ట రావడానికి ఒత్తడి కానీ, విటమిన్ల లోపం కారణంగా చిన్నారుల్లో తెల్లజుట్టు వస్తుంది. తెల్లజుట్టు వచ్చిన చిన్నారుల్లో విటమిన్ బి-12, డి, ఈ, ఏ, బ్లోటిన్ లోపం ఉందా.? లేక మైక్రో న్యూట్రియంట్లు జింక్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఐరన్ లోపమేమైనా ఉందా? అని తెలుసుకోవాలి.

చిన్నారుల్లో తెల్లజుట్టును సరిచేయడానికి విటమిన్లు, న్యూట్రీషియన్లను తగెు పరిమాణంలో జోడించి ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి ఎండలో (ఔట్ డోర్ గేమ్స్) అడుకునేలా ప్రోత్సహించాలి. విటమిన్లు, న్యూట్రియంట్ల కారణంగా జుట్టు తెల్లబడితే.. వారికి సంబంధిత విటమిన్లు, న్యూట్రియంట్లు కలిగిన పోషక పదార్థాలను అధికంగా ఇచ్చి.. బ్యాలెన్సింగ్ డైట్ చేస్తే తెల్లజుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇందుకు జీవనశైలి విధానాన్ని మార్చడం ముఖ్యం. ఇక తెలియని కారణాలు కారకంగా, లేక వంశపారంపర్యంగా, లేక ఒత్తడి కారణంగా జుట్టు తెల్లబడితే మాత్రం.. ఈ క్రింది విధంగా చెప్పిన విధంగా ఓపికతో నెలల తరబడి చేయగలిగితే.. క్రమంగా మీ జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

Natural methods for gray hair

పరిష్కార మార్గాలు:

1) గానుగలో ఆడించిన లీటరు కొబ్బరినూనెలో 40 కరివేపాకులు వేసి ఉడికించాలి. నూనె నల్లగా మారుతున్న తరుణంలో కొబ్బరినూనెను బాటిల్ లో పోసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతీరోజు తలకు పట్టిస్తే క్రమంగా తెల్లజుట్టు పెరగడం ఆగిపోతుంది.

మరో విధంగా: అరకప్పు కరివేపాకు, అరకప్పు పెరుగు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని జుట్టు, తలకు పట్టించి బాగా మర్థన చేయాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే తెల్లజుట్టును నివారిస్తుంది.

2) మెంతులను రాత్రివేళ నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ గింజలను, తాజా కలబంధలోని తెల్లని గుజ్జును వేసి మెత్తిని పేస్టులా నూరుకోవాలి. దీనిని స్కాల్ప్ కు రాసుకుని 3 గంటలపాటు అరనివ్వాలి. ఇది కూడా జుట్టును తెల్లబడటాన్ని నిలువరిస్తుంది.

ఈ పేస్టు రోజు విడిచి రోజు తలకు అప్లై చేయాలి. ఇది జుట్టు పెరగడానికి బలాన్నివ్వడంతో పాటు న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తలలో ఉండే ఇన్ఫెక్షన్లను కూడా నయం చేయడంతో పాటు జుట్టు కుదళ్లను బలపర్చి.. జుట్టురాలడాన్ని అరికడుతుంది.

3) ఉసిరికాయలు: అనేక ఔషధ గుణాలు ఇమిడివున్న ఉసిరికాయల రసాన్ని ప్రతిరోజూ ఆరు ఔన్సుల చోప్పున సేవించాలి. దీంతో పాటు ప్రతి వారం ఒకసారి తలకు, జుట్టుకు ఉసిరి నూనెతో మసాజ్ చేయండి. దీంతో తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

4) మందార పువ్వులు, లేత ఆకులను కలిపి పేస్టుగా చేసుకుని తలకు పట్టించి 2 గంటలు అరనివ్వాలి. ఆ తరువాత కడివేయాలి. ఇలా నాలుగైదు నెలల పాటు చేస్తే.. తెల్ల జుట్టు రాకుండా నివారించవచ్చు.

White Hair Home remedies

ఇవే కాకుండా తెల్లజుట్టును నివారించే మరికొన్ని గృహచిట్కాలు: Other Home remedies for gray hair

  • కొబ్బరి నూనే: ప్రతిరోజూ, పడుకునే ముందు, కొబ్బరి నూనెను మీ జుట్టు, తలపై మసాజ్ చేయండి. మరుసటి రోజు ఉదయం, మీ జుట్టును ఎప్పటిలాగే కడగాలి.
  • అల్లం: ప్రతి రోజు, ఒక టీస్పూన్ తాజా తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తినండి.
  • నల్లబడిన మొలాసిస్: ప్రతిరోజూ, ఒక టేబుల్ స్పూన్ చెరకు రసం నుండి తీసిన బ్లాక్‌స్ట్రాప్ మొలాసిస్ తినండి. ఇది తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది.
  • నల్ల నువ్వులు: వారానికి రెండు నుండి మూడు సార్లు, ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను తింటే తెల్లజుట్టను నల్లజుట్టుగా రివర్స్ చేస్తుంది.
  • నెయ్యి: వారానికి రెండుసార్లు, జుట్టు తలపై స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో మసాజ్ చేయండి.
  • అమరాంత్ (అమరాంతస్). వారానికి మూడు సార్లు, జుట్టుకు తాజా ఉసిరికాయ రసాన్ని అప్లై చేయండి.
  • గోధుమ గడ్డి రసం: ప్రతిరోజూ రెండు ఔన్సుల తాజా గోధుమ గడ్డి రసం తాగినా.. లేక సూప్‌లు, స్మూతీలలో 1 టేబుల్ స్పూన్ గోధుమ గడ్డి పొడిని జోడించినా తెల్లజుట్టు రాదు.
  • ఫో-టి: సాంప్రదాయ చైనీస్ మెడిసిన్‌లో జుట్టు నెరిసే ప్రక్రియను తిప్పికొట్టడానికి ఫో-టిని అంతర్గతంగా సప్లిమెంట్‌గా తీసుకుంటారు.
  • ఉల్లిపాయ: ఒక ఉల్లిపాయ రసం తీసి వారానికి రెండుసార్లు తలకు రుద్దండి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై షాంపూతో తలస్నానం చేస్తే తెల్లజుట్టు రాదు.
  • క్యారెట్ రసం: ప్రతి రోజు 8 ఔన్సుల క్యారెట్ జ్యూస్ తాగండి.
  • ఉత్ప్రేరకాలైన ఆహారం అధికంగా తీసుకోండీ మరీ ముఖ్యంగా.. వెల్లుల్లి, క్యాబేజీ, చిలగడదుంప, కాలే, బ్రోకలీ, బాదంపప్పులు తీసుకోవడం తెల్లజుట్టును నివారిస్తాయి.
  • అశ్వగంధ: ఆహారంతో అశ్వగంధ సప్లిమెంట్ తీసుకోండి. అశ్వగంధను భారతీయ జిన్సెంగ్ అని కూడా అంటారు.
  • బాదం నూనె: బాదం నూనెలో సమపాళ్లలో నిమ్మరసం, ఉసిరి రసాన్ని వేసి.. ఈ మిశ్రమంతె రోజుకు రెండుసార్ల చోప్పున 3 నెలల పాటు తలను మసాజ్ చేయాలి.

సహజ పదార్థాలతో హెయిర్ డై తయారీ ఇలా: Natural hair dye

gray to black hair

ఇక తెల్లజుట్టు వచ్చినవారు తలకు సహజ పదార్థాలతో తయరయ్యే రంగును వాడటం జుట్టును అరోగ్యంగా ఉంచడానికి సాయపడుతుంది. సహజ పదార్థాలతో తయారు చేసుకునే హెయిర్ డై.. రసాయన పదార్థాలతో తయారు చేసిన కెమికల్ డై తరహాలో జుట్టును అప్పటికప్పుడు నల్లబర్చకపోయినా.. జట్టుకు మాత్రం నష్టం కలిగించదు. అంతేకాదు జట్టును క్రమంగా రివర్స్ చేసి తెల్లజట్టును నల్లగా మార్చి.. మిమల్ని నిత్య యవ్వనంగా కనబడేలా చేయడంలోనూ సాయపడుతుంది. ఇక సహజ హెయిర్ డైని వివిధ మూలికలతో తయారు చేసుకోవచ్చు. వర్ణాన్ని బట్టి సూచించబడిన ప్రాథమిక పదార్థాలు:

  • అందగత్తె జుట్టు: చమోమిలే పువ్వు టీ, నిమ్మ తొక్క, కుంకుమ పువ్వు, బంతి పువ్వు
  • ఎర్రటి జుట్టు: దుంప రసం, క్యారెట్ రసం, గులాబీ రేకులు,
  • గోధుమ జుట్టు: కాఫీ, దాల్చిన చెక్క
  • నల్ల జుట్టు: నల్ల వాల్నట్, బ్లాక్ టీ, సేజ్, రేగుట

సహజ సౌందర్య సాధనాల న్యాయవాదులు సూచించిన కొన్ని హెయిర్ డై వంటకాలు:

home remedies for gray hair
  • బీరకాయ: కొబ్బరి నూనెలో బీరకాయను వేసి నల్లగా మారే వరకు (నాలుగు గంటలు) ఉడకబెట్టండి. అది చల్లబడిన తరువాత దానిని ఓ గాజు సీసాలోకి వేసుకోవాలి. కొద్దిగా నూనెను తలకు జుట్టుకు పట్టిస్తే.. 45 నిమిషాల తర్వాత, మీ జుట్టు నల్లగా మారుతుంది. వారానికి రెండు మూడు సార్లు రిపీట్ చేయండి.
  • భృంగరాజ్: తక్కువ వేడి మీద ఒక చిన్న పాన్లో, 1 టీస్పూన్ బృంగరాజ్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. వెచ్చని మిశ్రమాన్ని మీ జుట్టు, తలపై రుద్దండి. ఒక గంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు రిపీట్ చేయండి.
  • నల్ల మిరియాలు: 1 టేబుల్ స్పూన్ తాజాగా గ్రౌండ్ బ్లాక్ పెప్పర్, 1 టీస్పూన్ తాజా నిమ్మరసాన్ని ½ కప్పు సాదా పెరుగులో కలపండి. మిశ్రమాన్ని మీ జుట్టుకు మసాజ్ చేయండి, 1 గంట పాటు ఉంచి, ఆపై దానిని శుభ్రం చేసుకోండి. వారానికి మూడు సార్లు రిపీట్ చేయండి.
  • హెన్నా: ఒక కప్పు బ్లాక్ టీ లేదా కాఫీలో తగినంత హెన్నా పౌడర్ వేసి దానిని తగినంత పెరుగుతో స్థిరత్వం వచ్చేలా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో ఉంచి దానిపై మూతపెట్టండి. ఆరు గంటల తరువాత దానిలో ఎక్సట్రా వర్జిన్ ఆలివ్ అయిల్ ను వేసి కలిపిన మిశ్రమాన్ని మీ తలకు పట్టించండీ. మూడు గంటల తరువాత తలను కడిగేయండీ.

తెల్లజుట్టు వచ్చినవారు మరింతగా పెరగకుండా నిలుపుదల చేయవచ్చు. దీంతో క్రమంగా తెల్లజుట్టు నల్లబడటాన్ని గమనించవచ్చు. అయితే శరీర తత్వాన్ని, మీ జుట్టు రకాన్ని బట్టి ఏదో ఒక పరిష్కారం తెల్లజుట్టు సమస్యను రూపుమాపుతుంది. అయితే అందరికీ ఒకే చిట్కా పనిచేయాలని లేదు. లేక అలా పనిచేయకూడదని లేదు. అయితే తమ తత్వాన్ని బట్టి ఒక్కో జుట్టుకు ఒకో రకమైన పరిష్కారం పనిచేయవచ్చు. ఇందుకోసం ఏ చిట్కా పనిచేస్తుందోనన్నది నిషితంగా ఓపికతో పరిశీలించాల్సి ఉంటుంది. కాగా, ఇవి మీ తెల్లజుట్టును నల్లగా మార్చలేకపోయినా.. జుట్టుకు మాత్రం నష్టాన్ని కలిగించవు. జుట్టుకు బలాన్ని అందించి, కుదుళ్లను గట్టిపర్చడంలో దోహదపడతాయి. అయితే వీటిలో ఏ పరిష్కారం మీ జట్టుకు పనిచేస్తుందో గమనించండి.