ఐదు లక్షల యూరిన్ ఇన్ఫెక్షన్లకు ఆ బ్యాక్టీరియానే కారణం: స్టడీ - Meat-borne Bacteria Linked to Over 500,000 Cases of UTIs, Study Finds in Telugu

0
Meat borne Bacteria Cases

కరోనా వైరస్ దశల వారి దాడితో మూడు, నాలుగు పర్యాయాలు యావత్ ప్రపంచం తీవ్ర విషాధకర, దిగ్భ్రాంతికర పరిస్థితులను ఎదుర్కోందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కంటికి కనబడని శత్రువు అగ్రరాజ్యం అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోందని తేలింది. అయితే ఈ పరిణామాలు కరోనాకు ముందునుంచే కొనసాగుతున్నాయన్న వార్తలు వినబడుతున్నాయి. అమెరికాలోని మాంసాహారం తీనేవారినే ఈ. కొలి బ్యాక్టీరియా టార్గెట్ చేసిందని.. మరీ ముఖ్యంగా ఇది మహిళలను టార్గెట్ చేస్తుందని వెల్లడైంది.

అగ్రరాజ్యంలో ప్రతీ ఏడాది ఐదు లక్షల మందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. అయితే కేవలం వృద్దుల్లో మాత్రమే ఈ సమస్య తీవ్రమై మరణాలు నమోదవుతున్నాయి. యువత, నడి వయస్కులలో మాత్రం సమస్య తీవ్రమైనా చికిత్సలతో నయమవుతోంది. ఇంతకీ ఏమిటా బ్యాక్టీరియా.? శరీరంలోని ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది. అధికంగా ప్రభావితం అవుతున్న వారెవరూ.. చిన్నారులా.? యువతా.? నడి వయస్కులా.? వృద్దులా..? ఇది ఎలా సంక్రమిస్తుంది.? ఇది అంటువ్యాధేనా అన్న వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలో కల్లోలం రేపుతున్న బ్యాక్టీరియా ఈ.కొలి. ఇది సీనియర్ అమెరికన్లలో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇది ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తున్నా.. అందులోనూ వృద్దులలో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. ఇది ఎక్కువగా మాంసాహారం తినడం వల్లే ఇది సంక్రమిస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గొడ్డు మాంసాన్ని ఆహారంగా తీసుకునేవారినే ఈ బ్యాక్టీరియా లక్ష్యంగా చేసుకుంటోంది. గోడ్డు మాంసంలో ఉన్న బ్యాక్టీరియా.. మనుషుల జీర్ణయాశంలోకి వెళ్లి అక్కడి నుంచి మూత్రనాళంలో తిష్టవేసి.. కొంత కాలం తరువాత అక్కడి నుంచే తన ప్రభావాన్ని చూపుతుంది.

E coli bacteria
Src

అగ్రరాజ్యంలో ప్రతీ ఏడాది ఐదు లక్షల మందికి పైగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడటం అక్కడి ప్రభుత్వంతో పాటు అరోగ్య విభాగాన్ని కూడా కలవరపర్చింది. దీంతో దీనిపై అధ్యయనాలకు కూడా స్వీకారం చుట్టింది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే కారణాలను విశ్లేషించి రాకుండా చర్యలు తీసుకున్నవారిలోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. మరీ ముఖ్యంగా పరిశుభ్రంగా ఉన్నావారితో పాటు శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేసిన మహిళల్లోనూ ఈ సమస్య ఉత్పన్నం కావడం వారికిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

కాగా ఈ సమస్యపై అధ్యయనం చేసిన ఆరోగ్య విశ్వవిద్యాలయం మాంసంలోని బ్యాక్టీరియా కారణమవుతుందని సూచించింది. మాంసం నుండి వచ్చే ఈ.కొలి బ్యాక్టీరియాతో ప్రతి ఏడాది అమెరికాలో లక్షల మంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతుందని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రచురించింది. 85 శాతం మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఈ.కొలి వల్ల సంభవిస్తున్నాయని, ఈ ఇన్ఫెక్షన్లలో 8 శాతం మాంసం నుండి సంక్రమిస్తున్నాయని పరిశోధనలో తేలింది. జర్నల్ వన్ హెల్త్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం మానవుల నుండి 1,188 ఈ.కొలి నమూనాలను, చికెన్, టర్కీ, పంది మాంసంతో సహా మాంసం నుండి 1,923 నమూనాలను పరిశీలించింది. మొదటిసారిగా, ఆహార పదార్ధ ఈ.కోలి జాతులు ప్రతి సంవత్సరం 640,000 మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.

“వండని మాంసాన్ని తినడం లేదా మాంసం నుండి బ్యాక్టీరియాను అనుకోకుండా తీసుకోవడం వల్ల కడుపు నొప్పిగా ఉంటుందని చాలామంది బాధపడుతున్నారని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పర్యావరణ, ఆరోగ్య శాస్త్రవేత్తలలో ఒకరైన లాన్స్ బి. ప్రైస్ అన్నారు. “కానీ పచ్చి మాంసం నుండి వచ్చే నిర్దిష్ట రకాల ఈ.కొలి కూడా వందల వేల మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని తెలుస్తుందన్నారు.” ఆహారం ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందీ, దానిని ఎలా నివారించవచ్చో అర్థం చేసుకోవడానికి అధ్యయనం విస్తరించిందని ప్రైస్ చెప్పారు.

జార్ఝ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనంలో మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పాల్గొన్న శాస్త్రవేత్తల బృందంలోని.. సిండి లియు అనే శాస్త్రవేత్త జన్యు విధానాన్ని ఉపయోగించి ఈ.కోలి ఇన్‌ఫెక్షన్ల మూలాలను తెలుసుకున్నారు. “ఈ ఈ.కోలి బ్యాక్టీరియా ఏ జంతువులో ఉంటే దానికి అనుగుణంగా ఉంటుంది, కాబట్టి తాము కనుగొన్న ప్రతి బ్యాక్టీరియా నమూనా దాని స్వంత డిఎన్ఏ ప్యాకెట్‌ను కలిగి ఉంటుంది, ”అని ప్రైస్ చెప్పారు. “అప్పుడు ఒక గణాంక నమూనాను అభివృద్ధి చేసి, దానిని మొత్తం విశ్లేషించి, ఆ బ్యాక్టీరియా ఏ జంతువు నుండి వచ్చిందో అంచనా వేసాము,’’ అని అన్నారు. దీంతోనే మాంసంలోని బ్యాక్టీరియా ఈ.కొలి ద్వారా తేలింది.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎంత ప్రమాదకరమైనవి?

Urinary tract infections

అమెరికాలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు చాలా సాధారణం; సంవత్సరానికి 60 లక్షల నుండి 80 లక్షల మంది ప్రజలు వాటిని ఎదుర్కోంటారు. మహిళలు వారి శరీర నిర్మాణాల కారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రైస్ చెప్పారు. డైపర్‌ల వాడకం, ఆపుకొనలేని లేదా బాత్‌రూమ్‌లకు పరిమిత ప్రాప్యత వంటి కారణాల వల్ల పిల్లలు వృద్ధులు కూడా ఇతర సమూహాల కంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని ఆయన చెప్పారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చునని పరిశోధన బృందంలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో జెరియాట్రిక్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టీన్ కిస్ట్లర్ అన్నారు.

“చాలామందిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఈ.కొలి వలన సంభవిస్తాయి. మూత్రాశయాన్ని తరచుగా ఖాళీ చేయకున్నా.. లేదా తప్పుగా వదిలేసినా ఇన్ఫెక్షన్లు సంభివిస్తాయని” అధ్యయనంలో పాల్గొనని ప్రోఫెసర్ కిస్ట్లర్ చెప్పారు. “కానీ మాంసాహారానికి సంబంధించిన లింక్ చాలా ఆసక్తికరంగా ఉంది. కలుషిత ఆహారాన్ని ఈ.కొలిని కలిగి ఉంటే, అది సాధారణంగా ప్రేగులలో కనిపిస్తుంది. అయినప్పటికీ, వృద్ధులకు తరచుగా వారి మూత్రాశయాలలో బ్యాక్టీరియా ఉంటుందని, అవి సమస్యలను ఉత్పత్తి చేయవని, చికిత్స చేయకూడదని ఆమె ఎత్తి చూపారు. “మేము వృద్ధులలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లను ఎక్కువగా చికిత్స చేస్తాము” అని ఆమె చెప్పారు. అయితే ఇన్ఫెక్షన్లకు గురైన వారిని వాటి నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తాయని చెప్పారు.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సాధారణంగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తాయి, ఇవి మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మండే అనుభూతి, తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం లేదా గజ్జ లేదా పొత్తికడుపులో తిమ్మిరి ద్వారా గుర్తించబడతాయి, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. కాగా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు మరింత తీవ్రమై మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపారు. సెంటర్ ఫర్ డిసీసెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మూత్రశాయ ఇన్ఫెక్షన్లను జ్వరం, చలి, వెన్నునొప్పి, వికారం లేదా వాంతులు లేదా ప్రాణాంతక రక్త ఇన్ఫెక్షన్‌లు వంటి లక్షణాలు ఉంటాయన్నారు. “ఈ.కొలితో రక్త ప్రసరణ ఇన్ఫెక్షన్లు అగ్రరాజ్యంలో సంవత్సరానికి 36 వేల నుండి 40 వేలమందిని చంపుతాయని అన్నారు. మాంసం ద్వార వచ్చే ఈ.కొలి వల్ల వ్యాపించే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఈ అధ్యయనం పెద్ద సహకారం అందించినట్లేనని,” ప్రైస్ అన్నారు.

మూత్ర నాళంలోకి ఈ.కొలి బ్యాక్టీరియా ఎలా చోచ్చుకెళ్తుంది.?

E coli Cases of UTIs

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి వచ్చిన డేటా చాలా పచ్చి మాంసం ఉత్పత్తులు ఈ.కొలితో కలుషితమైందని సూచిస్తున్నాయి. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో శాస్త్రవేత్తలు పరీక్షించిన 2,460 మాంసం ఉత్పత్తులలో 81.7 శాతం ఈ.కొలిని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ. కొలి బ్యాక్టీరియా ప్రజలు, ఆహార జంతువులలో జీవించగలదు. కాగా, జంతువులను వధించినప్పుడు, వాటి లోపల నివసించే బ్యాక్టీరియా మాంసం ఉత్పత్తులను కలుషితం చేస్తుందని, ఈ మాంసాన్ని మనుషులు తీసుకుంటే ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.

జీర్ణశయాంతర ప్రేగు నుండి మూత్ర నాళానికి ప్రయాణించే సందర్భంలో ఈ.కొల్లి ఇన్ఫెక్షన్లను ప్రేరేపించే అవకాశముంది. అయితే ఇవి మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ముందు కొంతకాలం గట్‌లో జీవించి, ఆ తరువాత నెమ్మదిగా ప్రభావాన్ని చూపుతాయని అందుచేత వాటిని “అవకాశవాద వ్యాధికారకాలు” అనే అంటారని ప్రైస్ తెలిపారు. దీంతో ఈ.కొలి ఉన్న మాంసం తిన్న తరువాత ఇన్ఫెక్షన్ కు గురికావడానికి మధ్య చాలా వ్యవధి ఉంటుందని కూడా చెప్పారు. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధికారక సూక్ష్మజీవులు మన మైక్రోబయోమ్‌లో భాగమవుతాయని నిపుణులు చాలా కాలంగా అనుమానిస్తున్నారు.

ఈ.కొలిపై జరిగిన అధ్యయనం “చాలా మంచిదని, ఈ బ్యాక్టీరియా మనుషుల కడుపులోని యాసిడ్, జీర్ణ ప్రక్రియను తట్టుకుని జీవిస్తాయని తేలిందని’’ వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ వైద్యకేంద్రంలో అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విలియం షాఫ్నర్ చెప్పారు. “ఇక్కడే శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం ఏదో జరుగుతుంది, దీంతో ఈ.కొలి మూత్రాశయంలోకి చేరుకోవడానికి కారణమవుతుంది, దీని వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్ లేదా రక్తస్త్రావం, లేదా సెప్సిస్‌కు కారణమవుతుంది” అని అధ్యయనంలో పాల్గొనని షాఫ్ఫ్నర్ చెప్పారు.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిరోధణ సాధమా?

E coli Bacteria UTIs

మాంసం బాగా వండినట్లు నిర్ధారించుకోవడం, క్రాస్ కాలుష్యాన్ని నివారించడం, మాంసాన్ని నిర్వహించిన తర్వాత చేతులు, కట్టింగ్ బోర్డ్‌ను కడుక్కోవడం, పచ్చి మాంసానికి దూరంగా ఉంచడం ద్వారా ఈ.కొలి ఇన్‌ఫెక్షన్‌లను నిరోధించవచ్చని ఇంతకుముందు వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే. అంటువ్యాధుల నిపుణులు కూడా జంతువులలో యాంటీబయాటిక్స్ విచక్షణారహిత ఉపయోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు, ఇలాంటి బ్యాక్టీరియా జాతుల అభివృద్ధి చెందితే అవి సాంప్రదాయ చికిత్సలకు ప్రతిస్పందించని కూడా హెచ్చరించారు.

ఈ పరిశోధనలు ఆహార సరఫరాలో జంతువులకు, మానవులకు మధ్య ఉన్న సంబంధాలను వివరిస్తాయని, జంతువులలో అనవసరమైన యాంటీబయాటిక్ వాడకాన్ని నివారించడం వల్ల కలిగే అనర్థాలను నొక్కిచెప్పాయి, యాంటిబయాటిక్స్ అవసరం, విశిష్టతను ఈ అధ్యయనం నొక్కిచెప్పింది, తద్వారా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు దారి తీస్తుందని అరిజోనా విశ్వవిద్యాలయంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి చీఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఎలిజబెత్ కానిక్ అన్నారు. ఈ ధ్యయనం ద్వారా మాంసాహారం తినే మానవుల దేహాల్లోకి వెళ్లిన బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి వెళ్లి అక్కడ యాసిడ్ ప్రక్రియలను తట్టుకుని కొంత కాలం జీవించిన తరువాత అవి యూరినరీ ట్రాక్ లోకి వెళ్తుందని తేలిందని కానిక్ అన్నారు.

కొత్త ఫుడ్‌ బోర్న్ మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వ్యాధిని ఎలా సంక్రమిస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవడం, అధ్యయనం దృష్టి సారించడం, దీని నివారణకు మాంసాహార పశువులకు టీకాలు వేయడం వంటి కొత్త అంశాలకు కూడా ఈ అద్యయనం చర్చకు తావిచ్చింది. జంతువులలో ఈ.కొలి ప్రమాదకర జాతులను తాము గుర్తించామని ప్రైస్ తెలిపారు. ఇప్పుడు ఈ నిర్దిష్ట బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా టీకాలు వేయాలని సూచిస్తున్నామని కూడా చెప్పారు, అధ్యయన ఫలితంగా ప్రజారోగ్యానికి, జంతు పరిశ్రమకు విజయం లభించినట్టేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ.కొల్లి బ్యాక్టీరియాకు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఆరు జాతులకు వ్యతిరేకంగా జంతువులకు టీకాలు వేయడం వల్ల అవి ఆహార సరఫరాలోకి ప్రవేశించకుండా నియంత్రిస్తుందని అన్నారు. ఆహార జంతువుల నుండి ప్రమాదకరమైన బాక్టీరియాను తొలగించడంతోపాటు ఆహారభద్రత కోసం వ్యవసాయశాఖ మరింత డబ్బు వెచ్చించాలని సంబంధిత పౌరులు కాంగ్రెస్‌లోని చట్టసభ సభ్యులను పిలవవచ్చని ప్రైస్ చెప్పారు. ఈ అంటువ్యాధులను నివారించడానికి తమకు కొత్త మార్గాలు అవసరమని కూడా ఆయన అన్నారు. ఈ ప్రమాదకర బ్యాక్టీరియా ఆహార సరఫరాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి జంతుమాంస ఉత్పత్తులపై నియంత్రన, కొత్త మార్గాల ద్వారా బ్యాక్టీరియా నిరోధాన్ని నిర్వహించేలా ఈ అధ్యయనం బాధ్యత వహించిందని ప్రైస్ అన్నారు.