చక్కని ఆరోగ్యాన్ని అందరూ ఇష్టపడతారు. చిన్నారులు చక్కగా ఆడుకోవాలన్నా.. యువత చక్కగా కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లిరావాలన్న, పెద్దలు పనులు చక్కబెట్టుకోవాలన్నా అరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అనారోగ్యం బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ.? ఈ క్రమంలో స్వచ్ఛత-పరిశుభ్రతను పాటించడం ఎంత ప్రాధాన్యతతో కూడిన అంశమో ఒకసారి పరిశీలన చేద్దాం. అనారోగ్యాల బారిన పడటానికి కారణం వ్యాధులు ప్రబలింపజేసే సూక్ష్మక్రీములు (వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్). ఇవి మన శరీరంలోకి వెళ్లి వాటి సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ మన రోగనిరోధక శక్తిని అధిగమించడం. ఎప్పుడైతే ఇలా రోగనిరోధక శక్తితో పోరాడి వ్యాధి కారక స్మూక్ష జీవులు పైచేయి సాధించేలా వృద్ది చెందుతాయే అప్పుడు వ్యాధుల అధిపత్యం కారణంగా మనుషులు సుస్తి పడతారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేకుండా భూమిపై నివసించే అన్ని జీవులు అనారోగ్యాల బారిన పడుతుంటాయి. కాగా, మనిషి తెలివైనవాడు కనుక.. వ్యాధుల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం ఆచరించాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం దాగి ఉంది. అనారోగ్యం బారిన పడటానికి అసలు కారణం సూక్ష్మక్రీముల ఎంట్రీ. వీటిని ఎంట్రీ సమయంలోనే కట్టడి చేయడం.. లోనికి వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఆ చర్యలే స్వచ్ఛత-పరిశుభ్రతలు. వీటిని పాటిస్తే చాలు అనారోగ్యాలకు దూరంగా ఉండటం సాధమే. వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి.. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవడానికి ఆచరించాల్సిన పలు 10 మార్గాలు ఉన్నాయి. వీటిని దినచర్యలో చేర్చుకోవడంతో నిరంతరం అరోగ్యంగా ఉండవచ్చు. అవి:
1. చేతి పరిశుభ్రత Hand Hygiene
మనం ఆచరించే పనులలో కొన్నింటిని ప్రారంభించేప్పుడు, మరికొన్నింటిని ముగించిన తరువాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కునే ప్రతీసారి వాటిని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఇది ఎల్లప్పుడూ అలవాటుగా మార్చుకోవాల్సిన ఈజీ చర్య. అయితే అనివార్యమైన ఈ వ్యక్తిగత పరిశుభ్రత సాధనను చిన్నారుతో పాటు చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. చిన్నారులు ఆకలైందని పాటించికపోయినా.. పెద్దలు సమయాభావం వల్ల నిర్లక్ష్యం చేసినా వ్యాధుల భారిన పడటం తప్పనిసరి. ఎవరైనా స్వచ్ఛత- పరిశుభ్రత గురించి మాట్లాడినప్పుడు.. మనసు దృష్టికి వచ్చే మొదటి విషయం చేతుల పరిశుభ్రతే. ఎప్పట్ని నుంచో మనుషుల దినచర్యలో భాగమైన ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్త ప్రజానికంతో మళ్లీ అలవాటుగా మార్చేలా చేసింది కరోనావైరస్ మహమ్మారి. బోజనం చేసే ముందు, మల,మూత్ర విజర్జన తరువాత చేతులు తప్పనిసరిగా సబ్బుతో కడుక్కోవాలి.
చేతుల పరిశుభ్రత అంశంలో గుర్తుంచుకోవలసిన కొన్ని పద్ధతులు:
- సూక్ష్మక్రిములు, వైరస్లు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించడం సులభం. అందుకే ఆహారం తీసుకునే ముందు తప్పకుండా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. చెత్తను పడేసినా లేదా పెంపుడు జంతువులను ముట్టుకున్నా లేదా అపరిశుభ్రత, దుమ్మూధూళితో నిండిన వస్తువులను తాకినా.. ఆయా వస్తువులతో శారీరక సంబంధంలోకి వచ్చినా.. తప్పనిసరిగా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
- చేతులు కడిగే విధానాన్ని కరోనా సమయంలో వైద్యులతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా చూపించాయి. సరిగ్గా అలాగే, ఎప్పటికీ కడుక్కోవాలి. చేతులకు సబ్బు రాసుకుని 30 సెకన్ల పాటు చేతులను అరచేతులు, చేతి వెనుక, వేళ్లు, వేళ్ల మధ్య, వేలుగోళ్లు మణికట్టు వరకు చక్కగా కడుక్కోవాలని నిర్ధారించుకోండి.
- ప్రత్యామ్నాయంగా, చేతులను సబ్బు నీటితో కడగడం అసౌకర్యంగా ఉన్నప్పుడు, కనీసం 60శాతం ఆల్కహాల్‌తో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించవచ్చు. ప్రతి మహిళా ఎప్పుడూ తన బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన వాటిలో శానిటైజర్ ఒకటి.
2. టాయిలెట్ పరిశుభ్రత Toilet Hygiene
ఇంటి టాయిలెట్లో అయినా లేదా పబ్లిక్ రెస్ట్రూమ్‌లను వినియోగించినా వాటిలో సరైన టాయిలెట్ పరిశుభ్రతను పాటిస్తున్నారా.? అన్నది గమనించాల్సిన విషయం. టాయిలెట్లలో పరిశుభ్రత పాటించని పక్షంలో అది ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. టాయిలెట్ పరిశుభ్రత అనేక అలవాట్లను కలిగి ఉంటుంది. అయితే, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం విషయానికి వస్తే, ఈ క్రింది వాటిని గుర్తుంచుకోవలసిన కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి:
- టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, సబ్బుతో మీ చేతులను సరిగ్గా కడుక్కొవాలి.
- ఫ్లష్ చేయడానికి ముందు, మూత మూసివేయడం మర్చిపోవద్దు.
- విశ్రాంతి గది నుండి బయలుదేరే ముందు, మీ చేతులను బాగా ఆరబెట్టండి.
- అన్నింటికంటే మించి, మీ ఫోన్‌ని లోపలికి తీసుకురావద్దు. ఇది చాలా అపరిశుభ్రమైన అలవాటు. అస్సలు మంచిది కాదు!!
3. నోటి పరిశుభ్రత Oral Hygiene
- నోటి శుభ్రత, దంత సంరక్షణ విషయానికి వస్తే, అలవాట్లపై చాలా అవగాహన కలిగి ఉండాలి. అన్ని రకాల దంత సమస్యల నివారణకు నోటి పరిశుభ్రత అత్యంత అవసరం.
- దంత చికిత్స ఎంతో ఖరీదైనది.. ఒకవేళ మీకు చౌకగా అందుబాటులోకి వచ్చినా దానిని ప్రారంభించవద్దు. ఎందుకంటే ఒకసారి ఒక సమస్యతో దంతవైద్యుని సంప్రదిస్తే.. అలాంటివే మరో రెండు తలెత్తుతాయి.
- డెంటల్ చెకప్‌లు చాలా ముఖ్యమైనవి. తప్పనిసరిగా వార్షిక చెకప్‌లను చేయించుకోవాలి. ముందస్తుగానే సమస్యలను గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. అయితే, చికిత్స కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమని గుర్తుపెట్టుకొండి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ వైపు నుండి తగిన చర్యలు తీసుకోవాలి.
దంతాల సంరక్షణలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు:
- రోజుకు రెండుసార్లు ఉదయం, పడుకునే ముందు ప్రతిసారీ 2 నిమిషాలు దంతాలను బ్రష్ చేయండి.
- దంతాల మధ్య చిక్కుకున్న ఆహారకణాలు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఫ్లాస్ చేయాలి. ఇది తదుపరి దంత సమస్యలను నివారించడానికి ఒక గొప్ప మార్గం. కాబట్టి, దానిని నిర్లక్ష్యం చేయకండి.
- నోటిలోని కొన్ని ప్రాంతాలకు టూత్ బ్రష్ చేరుకోలేదు. కాబట్టి బ్రష్ చేసిన తరువాత కూల్ మింట్ ఫ్లేవర్‌తో కూడిన యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌ను ఉపయోగించండి. ఇది చెడు శ్వాసను ఎదుర్కోవటానికి కూడా సహాయపడుతుంది.
- పుష్కలంగా నీరు త్రాగండి నోటి దుర్వాసనను నివారించడానికి షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ని కూడా నమలవచ్చు.
4. పరిశుభ్రమైన స్నానం Shower Hygiene
మనలో చాలా మందికి స్నానం చేసిన తరువాతే రోజు ప్రారంభమైనట్టు లెక్క. మన వాతావరణం అందుకు అనుకూలిస్తుంది. మరీ శీతల ప్రదేశాల్లో ఉండేవారు ప్రతిరోజు స్నానం ఆచరిస్తారా.? అంటే అది సాధ్యసాధ్యాలను పక్కనబెడితే అలవాటుగా చేసుకుని వేడినీళ్లు పోసుకునేవారు చాలామందే ఉన్నారు. దీనిని వ్యక్తిగత పరిశుభ్రతగా పరిగణించడం కన్నా ఒక అలవాటుగా చేసుకున్నవారు ప్రపంచవ్యాప్తంగా అనేకమందే ఉన్నారు. ఈ అలవాటును పెంపొందించుకున్న వారిని పక్కనబెడితే ఇప్పటికీ ప్రతీ రోజూ స్నానం చేయడానికి కొందరు వ్యక్తులు చాలా బద్ధకంగా భావిస్తారు. అబ్బా ఇవాళ కూడా స్నానం చేయాలా.? అంటూ నిట్టూరుస్తున్నవారు లేకపోలేదు.
- అయితే ప్రతీరోజు సబ్బుతో లేదా బాడీ వాష్‌తో క్రమం తప్పకుండా స్నానం చేయడానికి గల కొన్ని కారణాలు ఇవి:
- స్నానం చేయడం వల్ల ఉదయాన్నే నిద్రలేస్తారు.
- ఇది శరీర దుర్వాసన, చర్మం దురదను నివారించడానికి సహాయపడుతుంది.
- స్నానం చేయడం ద్వారా శారీరకంతో పాటు, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. స్వీయ సంరక్షణ సాధనకు సులభమైన మార్గాలలో ఇది ఒకటి.
- వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలంటు స్నానం చేయండి. అంటే జుట్టుకు షాంపూతో కడగాలి.
5. మహిళల పరిశుభ్రత Feminine Hygiene
సన్నిహిత పరిశుభ్రత అనేది చాలా అరుదుగా మాట్లాడే వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యత అయిన్నప్పటికీ తరచుగా నిర్లక్ష్యం చేయబడింది. మహిళలు స్నానం చేసినప్పటికీ అది అంటువ్యాధులు సోకకుండా వారి రహస్య భాగాలను శుభ్రం చేసుకోవడానికి సరిపోదు. దీంతో వారు కొన్ని అదనపు చర్యలు తీసుకుని పరిశుభ్రతను కాపాడుకోవాలి.
మహిళల మంచి పరిశుభ్రత పాటించడం ఇలా:
- చర్మం చాలా సున్నితంగా ఉన్న ప్రాంతంలో సాధారణ సబ్బులు, బాడీ వాష్ లతో కాకుండా పీహెచ్ (pH) స్థాయిలతో ఇంటిమేట్ వాష్‌ని తప్పనిసరిగా ఉపయోగించాలి.
- ప్రతిరోజూ గాలి అడేందుకు అనుకూలమైన కాటన్ అధారిత లో- దుస్తులను ధరించడాన్ని పరిగణించండి.
6. అనారోగ్య పరిశుభ్రత Sickness Hygiene
అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సాధారణం కన్నా అధిక పరిశుభ్రత అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ పరిశుభ్రతలో గమనించాల్సిన విషయాలు రెండు. ఒకటి అనారోగ్యం బారిన పడినవారు త్వరగా బాగుపడాలి. ఇక బాధితుల నుంచి అనారోగ్యాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం రెండవది. అయితే అది కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగులు, ఇరుగు పొరుగు వారితో పాటు ఎవరైనా కావచ్చు. ఇతర వ్యక్తులను రక్షించడానికి అనారోగ్య పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. కరోనా ప్రపంచానికి చాటిన కఠిన సత్యమిది.
అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆచరించాల్సిన కొన్ని పరిశుభ్రత పద్ధతులు:
- తుమ్మినప్పుడు, నోటిని మాస్క్‌తో కప్పుకోండి.
- ఉపయోగించిన టిష్యూలను సురక్షితంగా పారవేయండి.
- ఇంటి వద్ద లేదా కార్యాలయంలో మీరు తిరుగాడిన ప్రాంతాలను ఇతరులతో షేర్ చేసుకునే ప్రాంతాలను శానిటైజ్ చేయండి.
- ఆహారం, పాత్రలు లేదా ఇతర వస్తువులను ఎవరితోనూ పంచుకోవద్దు.
7. ముఖ, చర్మ పరిశుభ్రత Facial and Skin Hygiene
సూక్ష్మక్రీముల (వైరస్, బ్యాక్టీరియా) నుంచి వాటి ఇన్ఫెక్షన్ల నుండి అవయవాలను రక్షించే సహజ అవరోధంగా నిలిచేది చర్మం. అందుకే చర్మాన్ని సంరక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పరిశుభ్రత ఎంతో అవసరం.
చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని విషయాలు పరిగణించాలి:
- చర్మ సంరక్షణ అన్నది కూడా స్నానం తరహాలో దినచర్యలో భాగం చేసుకోండి. దీనికి పెద్దగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు.
- చేతులు కడుక్కోకుండా ముఖాన్ని తాకడం పూర్తిగా అస్సలు చేయరాదు.
- అందుబాటులో ఉండే ప్రతి ఉత్పత్తి అందరికీ సరిపోదని గుర్తుంచుకోండి. చర్మ ఉత్పత్తులు చర్మతత్వానికి సరిపోయేలా ఉన్నాయని చూసుకుని నిర్థారించుకున్న తరువాతే వాటిని వినియోగించండి. ఉత్పత్తులు అలెర్జీలకు కారణమైతూ వెంటనే వాటిని వినియోగించడం మానేసి డర్మటాజిస్టును సంప్రదించండి.
8. గోరు పరిశుభ్రత Nail Hygiene
చేతులు ఎంతగా శుభ్రం చేసుకున్నా గోళ్లను ఆసరగా చేసుకుని ఉండే సూక్ష్మక్రీములు.. అహారంతో పాటు కలసిపోయి మన శరీరంలోకి వెళ్లే ప్రమాదముంది. కంటికి కనబడని శత్రువు శరీరంలోకి వెళ్తే మాత్రం అనారోగ్యం బారిన పడేట్లు చేస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. అందుకని గోళ్ల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లను అందంగా పెంచుకునేవారు వాటికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లు కాకుండా జాగ్రత్తాగా చూసుకోవాలి. వేలిగోళ్లు, కాలిగోళ్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
గోళ్ల పరిశుభ్రతకు పాటించాల్సిన చిట్కాలు:
- పొట్టి గోళ్ల కంటే పొడవాటి గోళ్లకు బిల్డ్ అప్ ఎక్కువ. పోడుగు పెరుగుతున్న కొద్దీ వాటి గురించిన జాగ్రత్తలు కూడా అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వాటంన్నింటినీ సరైన పొడవును పాటించేలా చేసుకోవడం అవసరం. ఎక్కువ పొడవుగా కాకుండా, చాలా చిన్నగా కాకుండా ఉండే గోళ్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇక ఎక్కువ పొడవుగా ఉండే గోళ్లు డ్రాగన్ గోళ్లలా అనిపించడంతో పాటు మురికి కూడా త్వరగా పట్టేస్తాయి.
- చేతులను కడుక్కున్న ప్రతిసారీ, గోళ్లను కూడా శుభ్రం చేసుకోవాలి.
- చేతి గోళ్లు పెరిగాయనగానే కొందరికి వాటిని కోరకడం లేదా చేతులతో తీసేయడం అలవాటు. ఇలాంటి అలవాట్లను మానుకోండి, బదులుగా నెయిల్ ట్రిమ్మర్‌ని ఉపయోగించండి.
9. పడుకునేప్పుడు పరిశుభ్రత Sleep Hygiene
పడుకునేప్పుడు పరిశుభ్రత పద్ధతులు పాటించడం కూడా చాలా ముఖ్యం. ఇవి మన ఆచారాలు, అలవాట్లను సూచిస్తాయి, రాత్రి సమయాల్లో ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఇవి సహాయపడతాయి. పడుకునేప్పుడు చక్కని నిద్ర పరిశుభ్రత పద్ధతులు పాటించకపోవడం కారణంగా నిద్ర రుగ్మతలకు, నిద్రలేమికి కారణం కావచ్చు.
చక్కని నిద్రకు పాటించాల్సి పరిశుభ్రత పద్ధతులు:
- పడుకునే 60 నుండి 90 నిమిషాల ముందు టీవీ, ఫోన్ సహా వెలుతురు చిమ్మే స్క్రీన్‌లన్నింటినీ ఆఫ్ చేసి.. టెక్నాలజీ నుండి దూరం కావాలి. కాగా, పుస్తక పఠనం, జర్నలింగ్ మొదలైనవి వంటివి చేయండి)
- పడుకునే ముందు 4 నుండి 6 గంటల వరకు కాఫీ, టీ తాగడం మానుకోవాలి.
- రాత్రి భోజనం కోసం తేలికపాటి ఆహారం తీసుకోండి.
- స్థిరమైన నిద్రలోకి వెళ్లినా.. ఉదయాన్నే మేల్కొనే సమయాన్ని పాటించండి.
- ప్రతి రాత్రి 7 నుండి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
10. దుస్తుల పరిశుభ్రత Clothing Hygiene
- దుస్తులకు పరిశుభ్రతకు మధ్య చాలా దగ్గరి సంబంధం కలిగి ఉందన్నది కాదనలేని సత్యం. ఒకసారి ధరించే బట్టలు సూక్ష్మక్రిములను కలిగి ఉండవచ్చు. ఇది పూర్తిగా కడుక్కోకపోయినా లేదా ఉతకకుండా ధరించినా చర్మ ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.
ఫలితంగా, ధరించే బట్టలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వస్త్రాలే కాదు మనం శరీరంపై ధరించే ఏవైనా సరే క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన, ఇస్త్రీ చేసిన, సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులను పాటించండి.