హైడ్రోసెల్ అంటే ఏమీటి: లక్షణాలు, కారణాలు, చికిత్సలు

0
Hydrocele

స్క్రోటమ్‌లో ఒక నిర్దిష్టకరమైన వాపును హైడ్రోసెల్ అంటారు. అయితే అసలు స్క్రోటమ్ అంటే ఏమిటీ. స్ర్కోటమ్ అనేది మగవారిలో వృషణాలను చుట్టూర ఉండే ఒక సన్నని పోర. వృషణం చుట్టూ ఉన్న ఈ స్క్రోటల్ సంచిలోకి ఏదేని ద్రవం పేరుకుపోయినప్పుడు హైడ్రోసెల్ ఏర్పడుతుంది. ఇది ‘హై-డ్రా-సీల్’ అని ఉచ్ఛరిస్తారు. మరీముఖ్యంగా ఇది నవజాత శిశువులలో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు ఒక సంవత్సరం వయస్సు వచ్చే సమయానికి ఇది సాధారణంగా అదృశ్యమవుతుంది. అయినప్పటికీ, వృషణంలో మంట లేదా గాయం కారణంగా ఇది పెద్ద బాలురు, యువతతో పాటు పురుషులకు కూడా ఏర్పడే అవకాశాలు ఉండవచ్చు. హైడ్రోసెల్ ఎలా ఏర్పడుతుంది.? ఈ ప్రత్యేక పరిస్థితి గురించి మరింత తెలుసుకుందాం.

హైడ్రోసెల్ లక్షణాలు:

సాధారణంగా, హైడ్రోసెల్ ఏకైక సంకేతం ఒకటి లేదా రెండు వృషణాలపై నొప్పిలేకుండా వాపు. వయోజన పురుషులలో, ఉబ్బిన స్క్రోటమ్ భారీ అనుభూతిని లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది సాధారణంగా నొప్పిలేకుండా ఉంటుంది, కానీ వాపు కారణంగా పలు సందర్భాలలో నొప్పి అనుభూతి కూడా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో, వాపు ప్రభావిత ప్రాంతం ఉదయం చిన్నదిగా కనిపిస్తుంది, రోజు పెరుగుతున్న కొద్దీ పెద్దదిగా మారుతుంది.

హైడ్రోసెల్ కారణాలు:

Hydrocele Causes

హైడ్రోసెల్ అనేది పుట్టినప్పుడు చాలా మంది చిన్నారులలో ఏర్పడే పరిస్థితి. ఇది శిశువులు పెద్దవారు అవుతున్న సమయంలో క్రమంగా తగ్గిపోతుంది. అయితే పలువురిలో మాత్రం వారు పెద్దయిన తరువాత తిరిగి ఈ సమస్య వారి జీవితంలో ఏర్పడుతుంది. ఇలా కొందరి జీవితంలో ఇది పునరావృతం కావడానికి పలు ఒక్కోక్కరిలో ఒక్కోరకంగా కారణలు ఉండవచ్చు. అవి:

  • నవజాత శిశువులలో: పుట్టకముందే హైడ్రోసెల్ అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా, వృషణాలు స్క్రోటమ్‌లోకి దిగి, దాని చుట్టూ కోశం ఏర్పడుతుంది. దీంతో ద్రవం వాటిని చుట్టుముట్టడంతో హైడ్రోసెల్ ఏర్పడడానికి కారణమవుతుంది. అయితే స్ర్కోటమ్ బ్యాగ్ క్లోజింగ్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది, ఇది ద్రవాన్ని గ్రహించడానికి అనుమతిస్తుంది. కానీ కొన్నిసార్లు, ఈ మూసివేత విధానంలో ఏదేని సమస్య ఉత్పన్నం అయినా లేదా ద్రవం శోషణ గ్రహించడంలో సమస్యలు తలెత్తినా.. స్ర్కోటమ్ బ్యాగ్ పరిమాణంలో మార్పు సంభవించ్చవచ్చు లేదా బ్యాగ్ కుచించుకుపోవచ్చు, దీంతో శోషణ పూర్తి కాకపోవచ్చు. ఈ కారణాలతో శిశువుల్లో సాధారణంగా హైడ్రోసెల్‌ దారితీస్తుంది. నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు హైడ్రోసెల్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • వృద్ధులలో: పెద్దవారు లేక వృద్దులలో స్క్రోటమ్‌లో గాయం లేదా వాపు కారణంగా హైడ్రోసెల్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ మీ వృషణాలలో వాపు లేదా వాటిని చిన్నగా కుచించుకుపోయేలా చేయవచ్చు, లేదా వాటిని చుట్టబడిన చిన్న ట్యూబ్‌ కూడా కారణం కావచ్చు. అటువంటి గాయాలు, మంట లేదా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు హైడ్రోసెల్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

హైడ్రోసెల్ చికిత్స:

మీ నవజాత శిశువుకు హైడ్రోసెల్ ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఒక సంవత్సరంలోనే తగ్గిపోతుంది. అయితే, ఏడాది దాటిన తరువాత కూడా హైడ్రోసెల్ అలాగే కొనసాగితే చర్యలు తీసుకోవాలి. శిశువుల వృషణాలు దూరంగా ఉండకపోతే, లేదా అది చాలా పెద్దదిగా ఉంటే, మీరు శస్త్రచికిత్స కోసం వైద్యుడిని సంప్రదించాలి. పెద్దలలో, హైడ్రోసెల్ ఆరు నెలల్లో నయం అవుతుందని నమ్ముతారు. ఒక హైడ్రోసెల్ చాలా అసౌకర్యాన్ని కలిగిస్తే మాత్రమే శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయాలి.

హైడ్రోసెల్ ని ఇలా చికిత్స చేయవచ్చు:

  • శస్త్రచికిత్స: హైడ్రోసెల్‌ను తొలగించే శస్త్రచికిత్స అనస్థీషియా కింద నిర్వహిస్తారు. చాలా సందర్భాలలో, శస్త్రచికిత్స తర్వాత కొన్ని గంటల్లో రోగి ఇంటికి వెళ్లడానికి అనుమతిస్తారు. ఈ శస్త్రచికిత్స సమయంలో, హైడ్రోసెల్ స్థానాన్ని బట్టి ఉదరం లేదా స్క్రోటమ్‌లో చిన్న కోతను వైద్యులు చేయాల్సిఉంటుంది. హైడ్రోసెల్ తొలగించబడిన తర్వాత, శస్త్రచికిత్స చేసిన ప్రాంతానికి పెద్ద డ్రెస్సింగ్ చేస్తారు. హైడ్రోసెల్ పరిమాణాన్ని బట్టి.. అది ఏర్పడిన స్థానాన్నిబట్టి, శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు రోగి మూత్రం కోసం డ్రెయిన్ ట్యూబ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఐస్ ప్యాక్‌ల వాడకం, తదుపరి పరీక్షలు శస్త్రచికిత్స తర్వాత కూడా వైద్యులు పలుమార్లు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే హైడ్రోసెల్ మళ్లీ సంభవించే అవకాశం ఉంది.
  • ప్రత్యేక సూదితో : శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం పెద్ద, పొడవైన సూదిని ఉపయోగించి హైడ్రోసెల్‌ను హరించడం. ద్రవాన్ని బయటకు తీయడానికి శాక్‌లోకి సూదిని ఇంజెక్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో, శాక్ మళ్లీ ధ్రవాన్ని నింపకోకుండా ఆపడానికి ఒక ఔషధం కూడా ఇస్తారు. ఈ ప్రక్రియ ప్రధానంగా శస్త్రచికిత్సలు చేయడం కారణంగా అధిక వైద్య ప్రమాదం ఉన్న వ్యక్తులపై (ముఖ్యంగా వృద్దులపై) నిర్వహించబడుతుంది.
Hydrocele Symptoms

వైద్యుడిని ఎప్పుడు చూడాలి:

స్క్రోటల్ వాపును ఎదుర్కొంటున్నావారు, వాపుతో పాటు నోప్పిని ఎదుర్కోవడం.. వాపుకు కారకాలుగా మారే ఇతర కారణాలను తోసిపుచ్చకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్నారి శిశువుల్లో ఈ సమస్య ఉత్పన్నమైనా అది ఒక సంవత్సరంలో అదృశ్యం కావాలి. కానీ, అది జరగకపోతే, లేదా అది పెద్దదైతే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు తనిఖీ చేసి కారణాలను తెలుసుకుంటారు. అలాగే, మీ బిడ్డ ఆకస్మికంగా, విపరీతమైన స్క్రోటల్ నొప్పి లేదా స్క్రోటమ్‌కు గాయం అయిన తర్వాత వాపును అనుభవిస్తే, తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.

హైడ్రోసెల్ నివారణ:

హైడ్రోసెల్స్ అనేది చాలా మంది శిశువుల్లో జన్మించిన వెంటనే ఉత్పన్నమయ్యే పరిస్థితి. అయితే ఇది దానంతట అదే సరిదిద్దుకునే పరిస్థితి. శిశువు ఎదుగుతున్న సమయంలో ఈ సమస్య దానంతట అదే సమసిపోతుంది. అయితే పెద్దవారిలో హైడ్రోసెల్ ఏర్పడటానికి పలు అంశాలు కారణం కావచ్చు. దానిని నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

  • వయోజనలలో హైడ్రోసెల్‌ ఏర్పడకుండా ఉత్తమ రక్షణ వృషణాలను, స్క్రోటమ్‌ను గాయాల నుండి బాగా రక్షించడం.
  • క్రీడాకారులు లేదా అథ్లెటిక్స్ అయితే, అథ్లెటిక్ కప్పును ఉపయోగించాలి.
  • చాలా బిగుతుగా ఉండే లోదుస్తులను కూడా ధరించకుండా ఉండాలి.
  • గుర్రపు స్వారీ చేస్తే జాగ్రత్తగా ఉండండి.

ముగింపు:

అయితే హైడ్రోసెల్ ఏర్పడిన వ్యక్తులు దాని గురించి అంతగా అందోళన చేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్య సాధారణంగా సంతానోత్పత్తిని ప్రభావితం చేయదు, ఇక ఇది ప్రమాదకరమైనది కూడా కాదు. అయితే దీర్ఘకాలంగా ఈ సమస్య కొనసాగుతున్న క్రమంలో మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ, వాపు కొనసాగితే, పరిస్థితి సరిగ్గా లేనట్లయితే, అది వృషణ క్యాన్సర్, లేదా కణితులు లేదా ఇంగువినల్ హెర్నియా వంటి ఇతర కారణాల వల్ల కావచ్చు. ఈ కారణాలను సొంతంగా విశ్లేషించుకోవడం కంటే వైద్య సలహా పొందడానికి వైద్యుడిని సందర్శించడం సముచితం.