సృష్టిలోని ప్రతి మహిళకు దేవుడిచ్చిన వరం రుతుస్రావం. పదిహేను ప్రాయానికి చేరువయ్యే ప్రతీ బాలిక ఈ సమస్యను అనుభవించాల్సిందే. ప్రస్తుతం కాలంలో దాదాపుగా 55 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు మహిళలు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే దీని వల్ల వారికి కొన్ని ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇంతకీ రుతుస్రావం అంటే ఏంటో తెలుసా.. పీరియడ్స్. దీనినే పలు ప్రాంతాల్లో ముట్టు, నెలసరి, అంటు ఇలా పలు పేర్లతో పిలుస్తుంటారు. ప్రతి నెల మహిళల్లో ఇది చాలా కామన్.
ఇక ఈ పీరియడ్స్ సమయంలో యువతులు, మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కొందరు అమ్మాయిలు రుతుస్రావం మొదట్లో తీవ్రమైన పొత్తికడుపు నొప్పిని అనుభవిస్తారు. ఇంకొందరు ఈ సమయంలో నిరసంగా ఉంటారు. మరీ బలహీనంగా ఉన్నవారిలో ఈ లక్షణం అధికంగా కనిపిస్తోంది. ఇక చాలా మంది మహిళల్లో పొత్తికడుపు నోప్పి కామన్. ఈ సమయంలో మహిళలు మూడ్ స్వింగ్స్ కు గురికావడం, వారు ప్రతీ చిన్నదానికి చిరాకుపడటం, చిన్నపనికైనా ఒత్తిడికి గురవుతుంటారు. ఇవి సర్వసాధారణం అంటూనే వాటితో బాధపడే మహిళలే అధికం.
కానీ వైద్యులను అనుసరించి వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకునే మహిళల సంఖ్య చాలా అరుదు. అసలు తమ సమస్యల గురించి ఓపెన్ గా డాక్టర్ వద్ద మాట్లాడగలిగే మహిళలే అరుదు. అయితే ఇప్పుడిప్పుడే కాసింత నూతన తరం మహిళలు తమ రుతుస్రావ సమస్యలపై ఓపెన్ గా వైద్యులకు వివరిస్తున్నారు. ఇక ఈ సమయంలో మహిళలు తమ ఇళ్లలోనూ ఓ మూల కూర్చునేందుకు తప్ప మరేపని చేయడానికి ఇష్టపడరు. ఇప్పటికీ దేశంలోని పలు మారుమూల పల్లెల్లో రుతుస్రావం వచ్చిన పిల్లలను అంటరానివారిగా పరిగణిస్తుంటారు.
ఇక రుతుస్రావ సమయంలో మహిళలు తమను తాము దూరంగా ఉంటారు. ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ఇక దైవిక కార్యక్రమాల జోలికి అసలు వెళ్లరు. అయితే ఒక్కసారి మహిళల్లో రుతుస్రావం నిర్ణత సమయాల కన్నా ముందుగానే వచ్చేస్తుంది. అందుకు కారణం వేడి చేసే ఆహార పదార్థాలను తినడం కూడా కావచ్చు. దీంతో వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా దూరమవుతారు. ఇక ఇష్టంగా జరుపుకోవాల్సిన కొన్న కార్యక్రమాల్లోనూ ఈ రుతుస్రావం వారిని దూరం చేస్తోంది. దీంతో వారు చాలా బాధపడుతుంటారు.
అయితే కొందరు మహిళలు మాత్రం ముఖ్యమైన సమయాల్లో పీరియడ్స్ ఆపుకునే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సివచ్చిన సమయాల్లో.. లేదా ఏదేని పండుగ పర్వదినం నేపథ్యంలోనో.. లేక సమీప బంధువుల వివాహాది కార్యక్రమాల కోసమో, లేక తమ పిల్లల, లేక సోదరుల సంతానం పుట్టినరోజు వేడుకల కోసమో కొందరు మహిళలు పీరియడ్స్ ఆపుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇందుకోసం వారిలో అత్యధికులు టాబ్లెట్స్ పైనే అధారపడుతుంటారు. కానీ ఈ ఔషధాలు అప్పటిమాటుకు వారికి ఉపశమనం కల్పిస్తాయే కానీ.. ఆ తరువాత వాటి దుష్ప్రభావాలు మాత్రం అనేకం ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి దుష్ప్రభావాలతో పోత్తికడుపులో తీవ్రమైన నొప్పి, రుతుస్రావం జరిగిన వెంటనే బలహీనపడడం, అలాగే హార్మోన్లలో హెచ్చుతగ్గులు లాంటివి వస్తుంటాయి.
ఇక పిరియడ్స్ ను అపేందుకు సహజమైన చిట్కాలను ఆశ్రయించడం మంచిది. అసలు రుతుస్రావాన్ని వాయిదా వేసేలా కొన్ని సహజమైన చిట్కాలు ఉన్నాయన్న విషయం.. చాలా మంది మహిళలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం వారు తమ సమస్యపై ఓపెన్ కాకపోవడమే. ఇక గైనకాలజిస్టు నిపుణులు కూడా ట్యాబలెట్స్ కంటే సహజమైన పద్దతులను ఆశ్రయించడమే మంచిదని సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- స్పైసీ ఫుడ్
పీరియడ్స్ వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలంటే పక్షం రోజుల ముందు మసాలాలు వేసిన ఆహారానికి (స్పైసీ ఫుడ్) దూరంగా ఉండాలి.
మసాలా ఘాటుతో కూడిన ఆహారం వల్ల శరీరంలో రక్త ప్రవాహం వేగం పెరిగి రుతుస్రావం త్వరగా సంభవించవచ్చు.
- నిమ్మరసం
నిమ్మకాయలు దేహాన్ని చల్లబర్చడంతో పాటు ఎంతో ఆరగ్యాన్ని అందిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి.. రుతుస్రావాన్ని వాయిదా వేయడంలోనూ దోహదపడతాయి. అధిక రక్త ప్రవాహాన్ని నియంత్రించి నెలసరిని వాయిదా వేయడంలో సహాయ పడుతుంది. ఇందుకోసం పక్షం రోజుల ముందు నుంచే రోజు 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇది అధిక బరువును కూడా తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- అజ్వైన్ ఆకులు
అజ్వైన్ ఆకుల్లో విటమిన్ బి12, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు రెండు తీసుకుని నీటిలో బాగా మరిగించి ప్రతిరోజు రెండు సార్లు తీసుకుంటే పీరియడ్స్ రావడం లేట్ అవుతుంది. అంతే కాకుండా ఈ ఆకుల్లో ఉండే విటమిన్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
- జెలటిన్
ఒక కప్పు నీటిలో ఒక ప్యాక్ జెలటిన్ మిశ్రమం కలపి సేవించడంతో తక్షణమే పీరియడ్స్ ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ పీరియడ్స్‌ని కొన్ని గంటల నుండి వారం వరకు ఆలస్యం చేసే చైనీస్ టెక్నిక్. ఈ ద్రావణాన్ని తాగడం వల్ల నెలసరి ఆలస్యమయ్యేలా చేస్తుంది.
- బొప్పాయి పండు
గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినడం మానుకోవాలని కోరడం గురించి మీరు వినే ఉంటారు, ఎందుకంటే బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రేరేపిస్తుంది, ఇది గర్భిణీ స్త్రీలలో గర్భస్రావానికి దారితీసే గర్భాశయ రక్త ప్రవాహంలో మార్పులకు దారితీస్తుంది. కానీ మీరు మీ కాలానికి సంబంధించిన బొప్పాయిలను ఆలస్యం చేయాలనుకుంటే, అవి సురక్షితంగా, సహజంగా అందుకు దోహదపడతాయి.