సిగరెట్ కంటే హుక్కా సేవనం ప్రయోజనకరమా.? ప్రమాదకరమా.?

0
Hookah Smoking Risks

దేశీయ యువతను ప్రస్తుతం హుక్కా కేంద్రాలు తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో యువత వీటిని విలాసక్షేత్రాలుగా మార్చేస్తున్నాయి. దీంతో ప్రాచీనమైన సంప్రదాయం మళ్లీ ఆలస్యంగా ప్రాచుర్యం పొందుతుంది. అయితే ధూమపానానికి ఈ కేంద్రాల్లో హుక్కాను పీల్చేందుకు వ్యత్యాసం ఉంది అన్న వాదనలు వినిపిస్తున్నా.. ఇది కూడా ఆరోగ్యానికి హానికరమేనన్న విషయం తెలుసుకోవాలి. స్నేహితులతో కలసి ఓ సారి సరదాగా హుక్కా పీల్చుకునేందుకు ఈ కేంద్రాలకు వెళ్లే ముందు.. అవి హుక్కా కేంద్రాలు మాత్రమే కాదు అనారోగ్య కేంద్రాలు అని కూడా తెలుసుకోవడం ఉత్తమం. దీంతో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గ్రహించండి.

హుక్కా అంటే ఏమిటి?

గోజా అని కూడా పిలువబడే హుక్కా, ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది, తమ వద్దనున్న అందమైన అమ్మాయిల చేత నృత్య అభినయాలను ప్రదర్శించే యజమానులు తమ వద్దకు వచ్చే వ్యవసపరులైన సంపన్నులు, నవాబులు, జమిందార్లుకు బోరు కలిగించకుండా ఇక్కడ రోజంతా కట్టిపడేసేందుకు హుక్కాలతో పాటు మద్యాన్ని కూడా అందిస్తూ ఏర్పాటు చేసే ప్రాంతాలుగా.. ఒక రకంగా వ్యవసపర సంపన్నుల విలాసక్షేత్రాలుగా హుక్కా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వారు నృత్య ప్రదర్శనలను తిలకిస్తూనే మరోవైపు హుక్కాను అస్వాదించేవారు. అయితే కాలక్రమేనా కాలగర్భంలో కలిసిన ఈ సంప్రదాయాన్ని.. విలాసాలకు పెద్దపీట వేసే నేటి యువత పునికిపుచ్చుకుంది. ఇవాళ పురాతన సంప్రదాయం యువత కాఫీ షాప్‌లు లేదా హుక్కా బార్‌ల వద్ద విశ్రాంతి తీసుకోవడానికి ఒక అధునాతన అభిరుచిగా మారింది. అయితే, ఈ సంప్రదాయం చాలా పురాతనమైనదే కాదు.. అనేక ఆసియా సంస్కృతులలో ఇది ఒక భాగంగానూ కొనసాగింది. అయితే ఈ హుక్కా కేంద్రాలు ఆరోగ్య సమస్యలను ఉత్పన్నం చేసే కేంద్రాలని మనం తెలుసుకోవాలి.

హుక్కా తయారీ విధానం ఎలా.?

హుక్కాలు కొద్దిగా విభిన్నంగానే తయారు చేయబడతాయి. హుక్కాలో అధికభాగం స్మోక్ చాంబర్‌కు అనుసంధానించబడిన నీటి పైపును కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా ప్రాసెస్ చేయబడిన పొగాకు హుక్కాలో ఉపయోగించబడుతుంది, తద్వారా పొగ నీటి ద్వారా సులభంగా ప్రవహిస్తుంది. హుక్కాలో పోగాకు ఉండదని.. ఇది కేవలం ఫ్రూటీ ఫ్లేవర్ల కోసం తీసుకుంటారని చాలా మంది యువకులు హుక్కా తీసుకుంటారు. వాస్తవానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే పోగాకు లేకుండా హుక్కాలు ఉండవు. చాలా ఆధునిక హుక్కా ఫల సువాసనతో వచ్చినప్పటికీ, పొగాకు ఉపయోగించకుండా ఇవి చేయబడవన్న విషయం తెలుసుకోవాలి. ఇక పొగాకు ఏ ఇతర రూపాలలో ఉన్నా.. దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది.. వాటిని సేవించడం వల్ల ఆరోగ్యాన్ని ప్రమాదాల బారిన పడేస్తున్నామని తెలుసుకోవాలి.

హుక్కా సేవించడం వల్లే కలిగే దుష్ప్రభావాలు:

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, హుక్కాలో సువాసన కోసం వేసే ఫల సువాసనలలో వివిధ రకాల విషపూరిత పదార్థాలను వేసి రూపోందిస్తారని, ఇవి గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇతర అనారోగ్యాలకు దారితీసే ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. హుక్కా ధూమపానాన్ని ఆస్వాదించేందుకు మీరు హుక్కా కేంద్రాల్లో అడుగుపెడితే.. అది ప్రమాదకర అనారోగ్యాలకు ద్వారం అని మీరు తెలుసుకోవల్సిన అవసరం ఉంది. హుక్కా ఏవిధంగా మీకు హాని కలిస్తుందన్న వివరాలు ఇవి:

  • సిగరెట్లతో పోల్చితే, హుక్కా సెషన్ వినియోగదారుని ఎక్కువ. ఒక వ్యక్తి సిగరెట్ ను ఐదు నుంచి ఏడు నిమిషాలు కేటాయిస్తే.. హుక్కా సేవించడానికి ఏకంగా 45 నిమిషాలు కేటాయించాల్సిందే. ఇక ఈ సమయమంతా పొగకు గురికావాల్సిందే.
  • రెగ్యులర్ సిగరెట్ల కన్నా ఎక్కువ సేపు హుక్కా బార్లలో పోగను తీసుకుంటారు. ధూమపానం చేసేవారు సాధారణంగా 8 నుండి 12 ఫఫ్స్ తీసుకుంటారు. కాగా ఒక్కో పఫ్ లో ఏకంగా 40 నుంచి 75 మి.లీ పోగను తీసుకోగా, అది మొత్తం సిగరెట్ కాల్చడం వల్ల ఏకంగా 0.5 నుంచి 0.6 లీటర్ల పోగను వారు పీల్చుకుంటారు. ఇందుకోసం వారు ఒక్క సిగరెట్ కాల్చేందుకు 5 నుండి 7 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఇక హుక్కా బార్లలో స్మోకింగ్ సెషన్ 20 నుండి 80 నిమిషాల వరకు ఉంటాయి. ఈ సెషన్లో పాల్గోనేవారు ఆ
    సమయంలో ఏకంగా 50-200 పఫ్ లు తీసుకుంటారు. ఒక్కోక్క పఫ్ లో 0.15 నుండి 1 లీటర్ల పొగను వీరు ఆస్వాదిస్తుంటారు.
  • హుక్కాకు ఫిల్టర్ లేదు మరియు దాని నీరు పొగాకులోని హానికరమైన భాగాలను ప్రక్షాళన చేయదు.
  • హుక్కా యొక్క పైపులు మరియు గిన్నెలు ఆరోగ్య ప్రమాదాలకు మరొక మూలం. ఇవి తరచుగా ఎక్కువ కాలం పాటు శుభ్రపరచబడవు, ఇది వినియోగదారులలో అంటువ్యాధుల కోసం వాటిని సంతానోత్పత్తి చేస్తుంది.

యువతకు హుక్కాలు సురక్షితమేనా.?

హుక్కా బార్లకు అత్యధికంగా అకర్షితులయ్యేది యువకులే. ఈ యువతకు ఈ హుక్కా ఏ విధంగానూ సురక్షితం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే హుక్కా ఎవరికీ సురక్షితం కాదు. ప్రాణాంతక విషపదార్ధాలు కలిగిన హుక్కా ఎవరికి మంచిదని చెప్పగలం. సిగరెట్ తాగడం వల్ల చేకూరే అనారోగ్య ప్రమాదాలను మించి హుక్కా తాగడం వల్ల చేకూరే ప్రమాదాలు అధికమని చెప్పకతప్పదు. సిగరెట్ తాగిన వారి కన్నా త్వరగా హుక్కా తాగినవారు అనారోగ్యం బారిన పడతారు. ఈ రెండింటిలోనూ రమారమి ఒకే రకమైన ప్రమాదాలు పోంచిఉన్నా సిగరెట్ కన్నా ఎక్కువ సమయం పోగకు గురవ్వడం కారణంగా వీరు త్వరగా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువ.

సిగరెట్ తారు, కార్బన్ మోనాక్సైడ్, భారీ లోహాలు వంటి అనేక ప్రమాదకరమైన పదార్ధాలను ఉపయోగించి చేస్తారు. దీనిని పీల్చి పోగను నోట్లోకి తీసుకుని ఊపిరితిత్తుల్లోకి పంపడం ద్వారా విష పదార్థాలు కూడా పోగతో పాటు వెళ్లి.. క్యాన్సర్ కారకాలుగా మారి.. గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. అదనంగా అదనంగా, ఇది గుండె జబ్బులు, ఊపిరితిత్తులు లేదా నోటి క్యాన్సర్ లకు కూడా కారణం కావచ్చు. అలాగే పాసివ్ స్మోకింగ్ కారణంగా పీల్చివదిలిన పొగ మీ చుట్టూ ఉన్న చిన్నారులతో పాటు మీ పిల్లలలో ఇతర తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఇక హుక్కా కేంద్రాలు ధూమపానం చేయని వ్యక్తిని కూడా నికోటిన్ వ్యసపరుడిగా మార్చేందుకు కారణమవుతుంది.

సిగరెట్ సేవనం కన్నా హుక్కాలు సురక్షితమా.?

సిగరెట్లు తాగడం కన్నా హుక్కాలు సురక్షితమన్న అపోహ చాలా మంది యువకులలో ఉంది. కొందరు సిగరెట్ల బదులు హుక్కాబార్లకు వెళ్లి దీనిని సేవించడం పోగ సేవించడం కాదని కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. దీనికి ఆకర్షితులైన యువత ఈ వాదనను విని దీనిని ప్రాచుర్యం చేస్తున్నారు. మరి వారు బావిస్తున్న దానిలో నిజం ఉందా.. అంటే ఏ మాత్రం లేదు అని అరోగ్య నిపుణులు చెబుతున్నారు. హుక్కా కేంద్రాలకు యువతను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా హుక్కాకేంద్ర నిర్వాహులు, హుక్కా ఫల సుగంధాల సంస్థలు కలసి చేస్తున్న ప్రచారమే తప్ప ఇందులో ఏమాత్రం నిజంలేదన్న విషయం యువత గుర్తెరుగాలి. ఈ ప్రచారం ఒకింత యువతలో దూసుకెళ్లింది కూడా. కొత్తదనాన్ని అస్వాదించాలన్న యావ తప్ప.. అందులోని నిజానిజాలను అలోచించే స్థాయి తక్కువగా ఉండే యువత ఈ వాదనకు అకర్షితులు కావడం కారణం. సిగరెట్ల కంటే హుక్కా ఏవిధంగానూ సురక్షితమైనది కాదు. మరోవిధంగా చెప్పాలంటే అంతకన్నా అతి ప్రమాదకరం. ఎందుకంటే వీటని సేవించే సమయం చాలా అధికంగా ఉండటమే. సిగరెట్లకు ఫిల్టర్ ఉంటాయి. కానీ హుక్కాలకు ఎలాంటి ఫిల్టర్ లేకపోవడం దాని దుష్ప్రభావాలు ఏకంగా గుండె, ఉపరితిత్తులు, నోటిపై పడతుందన్న విషయం యువత తెలుసుకోవాలి. పొగాకును నివారించాలనుకుంటే హుక్కాల జోలికి కూడా వెళ్లడం మానుకోవాలి.

మూలికా మొలాసిస్ ఆధారిత హుక్కా

ఇదిలావుండగా కొన్ని హుక్కా లాంజ్‌లు పొగాకు రహిత హుక్కాను అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి, అయితే ఇవి పోగాకు బదులుగా మూలికా మొలాసిస్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాయి. ఇవి ప్రామాణిక హుక్కాల కంటే నిస్సందేహంగా సురక్షితమైనవనే ప్రచారం చేస్తున్నాయి. కాగా ఈ మూలికా మొలాసిస్ ప్రక్రియలో అవి ఎలాంటి రసాయనాలు వాడయి అన్ని వివరాలు గురించి ఆరా తీయండి.

హుక్కాలు సిగరెట్‌లకు సామాజికంగా ఆమోదయోగ్యమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయం అని చాలా మంది ప్రజలు భావించినప్పటికీ, వాస్తవానికి ఇది ఆరోగ్య ప్రయోజనాలు లేనిది, అనేక తీవ్రమైన ప్రమాదాలను కలిగి ఉంటుంది. హుక్కా తాగడం వల్ల అంటువ్యాధులకు మీరు లక్ష్యంగా చేయబడతారు. మీరు వెళ్లిన హుక్కా లాంజ్ కు అందుకుముందు వెళ్లిన ఓ రోగి కూర్చోవడం అతడు పీల్చివదిలిన పోగ లోకి మరొకరు వెళ్లి దానిని సేవించడం వల్ల అతడికి వున్న అంటువ్యాధులు మీకు సంక్రమించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇలాంటి లాంజ్ లో మీరు హుక్కా తీసుకంటున్న సమయంలో మీతో పాటు పక్కనున్న వారు పీల్చి వదిలిన సెకండ్‌హ్యాండ్ పొగను కూడా మీరు పీల్చుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోరాదు. ఎవరెన్ని విధాలుగా తప్పును ఒప్పుగా చెప్పినా.. హుక్కా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది కాబట్టి, వాటి నుండి పూర్తిగా దూరంగా ఉండటం సురక్షితం.