నెలకు ఈ నాలుగు నట్స్: చెడు కోలెస్ట్రాల్ కు చెక్

0
Brazil Nuts Keeps Bad Cholesterol Away

నాలుగే నాలుగు నట్స్ తీసుకుంటే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తుందంటే.. మీరేమంటారు.? ఇది నమ్మశక్యంగా లేదని అంటున్నారా.? మీరే కాదు ఎవరైనా ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. అయితే కొందరు మాత్రం ఏంటా నాలుగు నట్స్ అని అంటారు. అయితే అవి నాలుగు అంటే నాలుగు రకాలకు చెందినవి కాదు.. కేవలం ఒకే ఒక్క రకానికి చెందిన నాలుగు నట్స్.. తీసుకుంటే అవి నెల రోజుల పాటు మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడుతుంది. ఇప్పుడు అసలు నమ్మశక్యంగా లేదు.. అని అంటారు. కానీ ఇది ముమ్మాటికీ వాస్తవం అని తాజాగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అలోపతి మందులు తీసుకున్నా ఇంతటి వేగంగా పనితీరును కనబర్చని తరుణంలో కేవలం నాలుగు నట్స్ మాత్రమే ఈ పనిని చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ అవే నట్స్ అని అడుగుతున్నారా.. అవే బ్రెజిల్ నట్స్. బ్రెజిల్ నట్స్ ను ఒక్కసారి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో దోహదపడ్డాయని అధ్యయనంలో వెల్లడైంది.

అధ్యయనంలో భాగంగా 10 మంది పురుషులు మహిళలకు బ్రెజిల్ గింజలను అందించి పరిశోధన జరిపారు. వారిలో కొందరికి ఒకటి, మరికొందరికి నాలుగు, మిగిలినవారికి 8 చోప్పున బ్రెజిల్ నట్స్ ను ఉన్న భోజనాన్ని ఒక్కసారి మాత్రమే అందించారు. అయితే ఈ ఒక్క సర్వింగ్ తో వాటిని సేవించిన వారిపై ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రభావాలు, ప్రయోజనాలు కలుగుతున్నాయో పరిశీలించారు. అయితే ఈ ఒక్క సర్వింగ్‌ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అలోపతి మెడిసిన్ కన్నా వేగంగా పనిచేస్తుందని తేల్చారు. ఈ సర్వింగ్ తీసుకున్న వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయని కనుగొన్నారు. రక్తంలో “చెడు” కొలెస్ట్రాల్ స్థాయిలు అని పిలవబడే ఎల్డీఎల్, బ్రెజిల్ నట్స్ తీసుకున్న తొమ్మిది గంటల తర్వాత గణనీయంగా తగ్గింది. ఇక అందులోనూ ఏకంగా ఒక రోజులో దాదాపు 20 పాయింట్ల మేర తగ్గాయి. ఇంతటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం పరిశోధకులను ఆశ్చర్యాలకు గురిచేసింది. ఇలాంటి ప్రభావం కలిగి ఉండటానికి స్టాటిన్స్ కూడా నాలుగు రోజులు పడుతుంది.

అయితే ఈ బ్రెజిల్ నట్స్ ఆహారం తీసుకున్నవారిని ఆ తరువాత ఐదు రోజులకు మళ్లీ పరిశీలించగా.. వారి కొలెస్ట్రాల్ స్థాయిలు అప్పటికీ తగ్గాయని తెల్చారు. ఆ తరువాత మరోమారు 30 రోజుల తర్వాత పరిశీలన చేయడంతో వారి కోలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని తెలుసుకున్నారు. అయితే నెల రోజుల తరువాత కూడా బ్రెజిల్ నట్స్ తీసుకున్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో.. మనిషి ఆరోగ్యంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను బ్రెజిల్ నట్స్ తగ్గిస్తాయని గమనించారు. అంతేకాదు.. ఈ నట్స్ నెలకు కేవలం నాలుగు మాత్రమే తీసుకోవాలని కూడా పరిశోధకులు అభిప్రాయానికి వచ్చారు. నెలకు ఒక్క బ్రెజిల్ నట్ తీసుకున్నవారిలో కొద్దిగా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించిన పరిశోధకులు.. ఎనమిది నట్స్ తీసుకున్నవారితో పోల్చితే కూడా పెద్దగా తేడా లేదని గమనించారు. దీంతో నెలకు నాలుగు నట్స్ తీసుకోవడం సముచితంగా తేల్చారు. ఇలా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా కరిగిపోతూ.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయని అభిప్రాయానికి వచ్చారు.

ఇక ఈ పరిశోధనా ఫలితాలను బట్టి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి నాలుగు గింజలు, 8 గింజల కంటే వేగంగా, ఉత్తమంగా పని చేస్తాయని తేల్చారు. ఎల్డీఎల్-సి, హెచ్డీఎల్-సి స్థాయిలను 30 రోజుల వరకు మెరుగుపరచడానికి కేవలం నాలుగు గింజలు తినడం సరిపోతుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి, అయితే ఈ ప్రభావం నెల రోజుకు కన్నా ఎక్కువ కాలం కూడా ఉండవచ్చునని, అయితే ఈ నట్స్ తీసుకున్నవారిని నెల రోజుల తరువాత మళ్లీ పరీక్షించలేదని పరిశోధకులు తెలిపారు.

సాధారణంగా ఇంతటి అద్భుతమైన ఫలితాలను వెల్లడించేందుకు, మెడికల్ లిటరేచర్‌లో ఫలితాలను మళ్లీ పునరావృతంమయ్యే వరకు వేచి చూస్తారు. ఇలాంటి నివేదికలు ప్రత్యేకించి కేవలం 10 మంది వ్యక్తులపై మాత్రమే అధ్యయనం చేసినప్పుడు, ముఖ్యంగా పరిశోధనలో కనుగొన్న విషయాలు నమ్మలేనంతగా, నమ్మశక్యం కానంతగా ఉన్నప్పుడు ఫలితాలు పునరావృతం అయ్యేంతవరకు వేచిఉండాల్సిందే. దీంతో ఈ సిఫార్సులు మళ్లీ మళ్లీ నిరూపితం కావాల్సిందే. అయితే అత్యంత చౌకగా, సులభంగా, హానికరం కాని విధంగా, ఆరోగ్యయుతంగా ఉన్నప్పుడు ఈ బ్రెజిల్ నట్స్ ను వీటి ఫలితాలను అస్వాదించినవారు ఎవరికైనా సిఫార్సు చేయవచ్చు. నెలకు నాలుగు బ్రెజిల్ గింజలు తినడంతో పరిశోధనలో వెల్లడైన ఫలితాలు మళ్లీ నిరూపితం అయ్యేవరకు వేచిఉండడం కన్నా.. నెలకు నాలుగు బ్రెజిల్ నట్స్ ను తీసుకోవడం ఉత్తమం.

ఇక అతి ఎక్కడైనా ప్రమాదకరమేనని ఇప్పటికే పలు విషయాల్లో నిరూపితం అయ్యింది. అలాగే బ్రెజిల్ నట్స్ విషయంలోనూ ఇది నిరూపితం అయ్యింది. ఈ నట్స్ ను కూడా అతిగా తీసుకోవడం వల్ల శరీరం బరువెక్కే ప్రమాదం పొంచివుంది. ఇక వీటి నుంచి విడుదలయ్యే రసాయనాలు.. కాలేయం మూత్రపిండాలపై ప్రభావాన్ని చూపకుండా సులభంగా జీర్ణమయ్యే విధంగా కేవలం నెలలో నాలుగు బ్రెజిల్ నట్స్ ను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నెలకు కేవలం నాలుగు బ్రెజిల్ నట్స్ ఒక్కసారి మాత్రమే ఒక్కపూట తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. బ్రెజిల్ గింజలలో అధికంగా ఉండే సెలీనియం అనే పదార్థం అంత త్వరగా జీర్ణం కాకపోవచ్చు. కాబట్టి ప్రతిరోజూ నాలుగు బ్రెజిల్ నట్స్ తింటే అందులోని సెలీనియం శరీరం జీర్ణ పరిమితికి మించి ఉండటంతో అది హాని తలపెట్టే ముప్పు పొంచిఉంది. కావున ఎలాంటి అందోళన చెందకుండా నెలకు ఒకసారి నాలుగు తీసుకుంటే వాటి నుంచి ఆశించే ప్రయోజనాలను మనము అందుకోవచ్చు.