ఆహారపదార్థాలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టడం చాలా డేంజర్.. - Exploring the Risks and Options of Cooking with Aluminum Foil in Telugu

0
Aluminium foil Risks

ఆహారాలు మరీ ముఖ్యంగా వండివార్చిన ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి లేదా పార్సిల్ చేయడానికి లేదా అందులో చుట్టి వేడి చేయడానికి, లేదా వాటిలో అహారాలు పెట్టి ప్రిడ్జిలో నిల్వ చేయడాని సిల్వర్ ఫాయిల్ పేపర్ ను ప్రపంచవ్యాప్తంగా అనేక కిచన్లలో వినియోగిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దీనిని సిల్వర్ పాయిల్ పేపర్ అని అంటారని, కానీ ఇది తయారైంది మాత్రం అల్యూమినియంతోనన్న విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదంటే విడ్డూరమే కాదు. కేవలం సిల్వర్ వర్ణంలో ఉంటూ దానిలా మెరుస్తున్న కారణంగానే దీనిని సిల్వర్ ఫాయిల్ పేపర్ అని అంటారే తప్ప.. నిజానికి ఇది అల్యూమినియం ఫాయిల్ పేపర్.

అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా వంటశాలలలో ఇది లేకుండా ఉండవంటే అతిశయోక్తి కూడా కాదు. మిగిలిపోయిన ఆహార వస్తువులను చుట్టడం నుండి లైనింగ్, బేకింగ్ షీట్‌ల వరకు ప్రతిదానికీ దీనినే ఉపయోగిస్తారు. అయితే, వంటలలో అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగించడం వల్ల ఆహారంలో అల్యూమినియం చేరుతుందని.. ఇది పరిమిత స్థాయిని మించగానే విషపూరిత స్థాయికి దారితీస్తుందని, ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. అల్యూమినియం ఫాయిల్‌తో వంట చేయడం వల్ల కలిగే ప్రమాదాలు, వేడి వేడి ఆహారాలను సిల్వర్ ఫాయిల్‌లో వేసి ఫ్యాక్ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం. అదే విధంగా ఈ సిల్వర్ ఫాయిల్‌కు ప్రత్యామ్నాయాలు ఏంటో కూడా పరిశీలిద్దాం.

వంటలో అల్యూమినియం లీచింగ్

అల్యూమినియం ఫాయిల్‌ వాడకంతో కలిగిన ప్రాథమిక ఆందోళన ఏమిటంటే, ఫాయిల్ లో వేసిన వండిన వేడి ఆహారంలో అల్యూమినియం సారం శోషించబడుతుంది. అల్యూమినియం రేకు, వంటసామాను, పాత్రలతో వండిన ఆహారాలలో అల్యూమినియం సాంద్రతలు పెరిగినట్లు అధ్యయనాలు కనుగొన్నాయి, అలాగే అల్యూమినియం కంటైనర్‌లలో నిల్వ చేసిన పదార్థాలలోనూ అల్యూమినియం సారం చేరినట్లు గుర్తించబడింది.

గ్రిల్ చేసిన, బేక్ చేసిన చేప

Harmful effects of Aluminium foil

అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టబడిన గ్రిల్ చేసిన చేప లేదా బేక్ చేసిన చేపల్లోకి కూడా అల్యూమినియం సారం శోషించబడిందని ఓక అధ్యయనంలో వెల్లడైంది. చేపల ఫిల్లెట్‌లను ఓ అల్యూమినియం ఫాయిల్ లో పెట్టి బేక్ చేసిన చేప ఫిల్లెట్లను పరిశోధించగా.. వాటిల్లోని అల్యూమినియం సాంద్రతలు 2 నుండి 68 కారకం వరకు పెరిగాయని కనుగొన్నారు.
బేక్ చేసిన చేపల ఫిల్లెట్‌లు కంటే అధికంగా గ్రిల్ చేసిన చేపల ఫిల్లెట్లలో అల్యూమినియం పేరుకుపోయిందని, ఇవి ఎక్కువ వేడిని బహిర్గతం చేయడం వల్ల కావచ్చునని అధ్యయనం చేసిన పరిశోధకులు భావిస్తున్నారు. నిమ్మరసం వంటి ఆమ్ల పదార్థాలు కూడా చేపల్లోకి చేరిన అల్యూమినియం మొత్తాన్ని పెంచాయని వారు నివేదికలో పేర్కోన్నారు.

గ్రౌండ్ మీట్

Aluminium foil cooking dangers

అల్యూమినియం ఫాయిల్‌లో వండడానికి ముందు, ఆ తర్వాత గ్రౌండ్ మీట్‌లో అల్యూమినియం సాంద్రతలను పరీక్షించడానికి గాను ఓ అధ్యయనాన్ని 2012లో నిర్వహించారు. ఈ అద్యయనంలో వెనిగర్, టొమాటో రసం లేదా సిట్రిక్ యాసిడ్ వంటి ఆమ్ల ద్రావణాలు అత్యధిక స్థాయిలో అల్యూమినియం సారం సాంధ్రతలు కలిగి ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఇవన్నీ లీచింగ్ కు గురయ్యాయని తేలింది. ఇక ఈ మేర పరీక్షించిన నమూనాలలో కొన్నింటిలో అల్యూమినియం స్థాయిలు అత్యంత అధికంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్పు చేసిన స్తాయిలను మించి ఉండటం అందోళన కలిగించే అంశం.

కూరగాయలు

Health risks of Aluminium foil

అల్యూమినియం బాణిలో ఉడికించిన కూరగాయాలు, పప్పు, ఆకుకూరల్లోకి కూడా అల్యూమినియం సారం చేరుకుందని ఒక అధ్యయనం కనుగొంది. కాగా కూరగాయ రకం, ఉష్ణోగ్రత, వంట సమయం, ఉప్పు ఉనికిని బట్టి అల్యూమినియం సారం ఆయా కూరగాయాల్లోకి స్థాయిల మారుతూ ఉంటుంది. టొమాటోల్లో సిట్రిక్ ఆమ్లం ఉన్న కారణంగా చాలా అల్యూమినియం సారం దానిలో పేరుకుపోయిందని అధ్యయనంలో వెల్లడైంది.

అల్యూమినియం ఎక్స్పోజర్ ఆరోగ్య చిక్కులు

Aluminium foil

మానవ శరీరానికి అల్యూమినియం ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఇక ఇది శరీరంలో చేరడం కారణంగా అరోగ్యకర సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ అరోగ్య సమస్యలు తేలికపాటివైతే పర్వాలేదు. కానీ శరీరంలోకి చేరిన అల్యూమినియం పరిమాణాన్ని బట్టి.. తీవ్రమైన అరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఒక్కో సందర్భంలో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి స్వల్ప పరిమాణంలో అల్యూమినియం చేరినా.. తీవ్ర సమస్యలు దారితీస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే శరీరానికి అల్యూమినియం అవసరం లేదు. అలాగే, పేరుకుపోయిన అల్యూమినియం మొత్తం విషపూరితంగా పరిగణించబడుతుంది. వండిన లేదా అల్యూమినియం-కలిగిన పదార్థాలలో నిల్వ చేయబడిన ఆహార వినియోగంతో సహా వివిధ వనరుల ద్వారా శరీరంలోకి ఈ ఖనిజం ప్రవేశించవచ్చు. అయితే అల్యూమినియం మెదడులో ప్రాధాన్యంగా పేరుకుపోయి, అల్జీమర్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత సమస్యలతో ముడిపడి ఉంటుంది.

ఇప్పటికే కొన్ని అధ్యయనాలు అధిక అల్యూమినియం ఎక్స్పోజర్, అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధికి మధ్య సహసంబంధాన్ని నిరూపించాయి. అల్యూమినియం శరీరంలోని సాధారణ ఖనిజ జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అల్యూమినియం ప్రేరిత ఆస్టియోమలాసియా అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం ఎముక మృదుత్వానికి దోహదం చేస్తుంది. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నారి పిల్లలు అల్యూమినియంను తీసుకున్నా.. లేక వారు తినే ఆహారాల్లో అల్యూమినియం సాంధ్రత ఉన్నా అది వారి మానసిక, శారీరిక అభివృద్ధికి సమస్యలను తెచ్చిపెడుతుంది. మొత్తంమీద, అల్యూమినియంకు గురికావడాన్ని తగ్గించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు

Alternatives to aluminium foil
  • పార్చ్‌మెంట్ పేపర్: బేకింగ్ షీట్‌లను లైనింగ్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్‌కు పార్చ్‌మెంట్ పేపర్ అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇది నాన్-టాక్సిక్ కావడంతో పాటు ఆహారంలో హానికరమైన పదార్ధాలను లీచ్ చేయదు. మరింత సురక్షితమైన ఎంపిక కోసం అన్‌బ్లీచ్డ్ పార్చ్‌మెంట్ పేపర్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
  • మూతతో కూడిన క్యాస్రోల్ లేదా డచ్ ఓవెన్: మూతలు ఉన్న ప్యాన్‌లను ఉపయోగించడం లేదా డచ్ ఓవెన్‌లో వంట చేయడం వల్ల ఓవెన్‌లో లేదా స్టవ్‌టాప్‌పై ఆహారాన్ని కవర్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ అవసరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • పార్చ్‌మెంట్-అల్యూమినియం ఫాయిల్ ట్రిక్: అల్యూమినియం ఫాయిల్‌తో ఆహారాన్ని కవర్ చేయడానికి అవసరమైనప్పుడు, ఆహారంపై నేరుగా పార్చ్‌మెంట్ పేపర్‌ను, దాని పైన రేకు పొరను ఉపయోగించండి. ఈ పద్ధతి అల్యూమినియం ఆహారంతో సంబంధంలోకి రాకుండా నిర్ధారిస్తుంది, లీచింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • స్టెయిన్‌లెస్ స్టీల్ గ్రిల్ ప్యాన్‌లు: కూరగాయలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టే బదులు వాటిని గ్రిల్ చేయడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ గ్రిల్ ప్యాన్‌లను ఉపయోగించండి. ఈ పద్ధతి వంట సమయంలో అల్యూమినియం ఆహారంతో చేరకుండా చేస్తుంది.
  • గ్లాస్ స్టోరేజీ కంటైనర్లు: మిగిలిపోయిన ఆహార పదార్ధాలను నిల్వ చేయడానికి, ఎలాంటి పదార్ధాలు ఆహారంలోకి వెళ్లకుండా గాజు కంటైనర్‌లను ఎంచుకోవడం శ్రేయస్కరం. గాజు కంటైనర్లు ఓవెన్ నుండి ఫ్రిజ్‌కు వెళ్లడం కారణంగా, అల్యూమినియం పాత్రల అవసరాన్ని తగ్గుతుంది. తద్వారా అహారపదార్థాల్లోకి అల్యూమినియం వెళ్లడాన్ని నివారించవచ్చు.
Chemical hazards of Aluminium foil

వేడి వేడి ఆహారా పదార్ధాలతో పాటు చల్లారిన ఆహారాలను అల్యూమినియం పాత్రలు, ఫాయిల్‌ పేపర్లలో వేయడం కారణంగా.. అల్యూమినియం సారం ఆహారాల్లోకి లీచ్ అవుతుంది. దీని వల్ల ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానవుల శరీరంలో అల్యూమినియం చేరడం కారణంగా నరాల సమస్యలు, మానసిక, శారీరిక అభివృద్ధి సమస్యలు, ఎముకలు మృదువుగా మారుతాయని పరిశోధనలో తేలింది. అల్యూమినియంకు గురికావడాన్ని తగ్గించడానికి, అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కనుగొనడం చాలా అవసరం. ఉదాహరణకు పార్చ్‌మెంట్ పేపర్, మూత క్యాస్రోల్స్, డచ్ ఓవెన్‌లు, స్టెయిన్‌లెస్ స్టీల్ గ్రిల్ ప్యాన్‌లు, గాజు నిల్వ కంటైనర్‌లు. వంట, ఆహార నిల్వలో అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని తగ్గించవచ్చు. తద్వారా అల్యూమినియం ఎక్స్‌పోజర్‌తో ముడిపడి ఉన్న సంభావ్య ఆరోగ్య ప్రమాదాల నుండి మనల్ని, మన ప్రియమైన వారిని రక్షించుకోవచ్చు.