ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే.. వాటిని బయటకు వెళ్లేలా చేసేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. మరీ ముఖ్యంగా అవి వంటింట్లోకి వెళ్లడం ఒక అసంతృకర పరిణామం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్ని ప్రయత్నాలు చేసి వాటి రాకను అడ్డుకున్నా అవి తిరిగి వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వాసనను పసిగట్టి ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలతో పాటు నిల్వ చేసిన ధాన్యాన్ని కూడా కన్నాలు పెట్టి పాడుచేస్తాయి. అయితే ఈ ఎలుకలు కేవలం సంభావ్య ఆరోగ్య సమస్యలను తీసుకురావడం మాత్రమే కాదు.. ఏకంగా ఇంటి నిర్మాణానికి కూడా హాని కలిగించే అవకాశాలు వున్నాయి. ఇక ఈ ఎలుకలనే ఆహారంగా చేసుకునే పాములు, పిల్లులు కూడా ఇంట్లోకి చోచ్చుకువచ్చే ప్రమాదం ఉంది.
ఎలుకలు యధేశ్చగా వంటింట్లో తిరుగుతున్నాయంటే ఇంట్లోని వారికి అలవాటుగా మారవచ్చు. కానీ ఇంటికి వచ్చిన అతిధులు వాటిని చూసి హడలిపోతారు. అవి కలుషితం చేసిన ఆహారం తింటే ప్రమాదకరం వ్యాధుల బారినపడాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. ఎలుకలను వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, విషపూరిత పదార్థాలను కాకుండా ప్రత్యామ్నాయాలను పరిగణించడం చాలా ముఖ్యం. ఎలుకలను ఇంటి నుండి బయటకు పంపేందుకు ఉన్న సహజ మార్గాలను ఓసారి పరిశీలిద్దాం. దీంతోపాటు ఎలుకలను సహజ పద్దతుల తరువాత ఇంట్లోకి రాకుండా చేయడానికి, అలాగే ఎలుకల అలవాట్లు, అవి మన ఇళ్లకు ఎందుకు ఆకర్షితులవుతున్నాయో, ఈ జీవుల కొన్ని ప్రత్యేక లక్షణాలను అన్వేషించడానికి కొన్ని సురక్షితమైన , సమర్థవంతమైన పరిష్కారాలను పరిశీలిద్దాం.
ఎలుకల అలవాట్లు: The Habits of Mice:
ఎలుకలు చిన్న క్షీరదాలు (మామల్స్), అవి వాటి అద్భుతమైన అనుకూలతకు ప్రసిద్ధి చెందాయి. మానవ నివాసాలతో సహా అనేక రకాల వాతావరణాలలో జీవించే గల జీవులివి. ఈ నిశాచర జీవులు ఆహార పదార్థాల సువాసనను గ్రహించి.. వాటి సేకరణలో నిరంతరం అన్వేషణ సాగిస్తూ శ్రమిస్తుంటాయి. ఎలుకలు కూడా నైపుణ్యం కలిగిన జీవులు.. ఇవి సునాయాసంగా గోడలు, కిటికీలు ఇతర నిటారు ప్రాంతాలను ఎక్కగల అధిరోహకులివి. అలాగే కిందకు దిగడం.. పలు సందర్భాలలో గోడలపై నుంచి కిందకు దూకేసే జంపర్లు కూడా. ఇళ్లలోని అన్ని మూలలకు చేరుకోవడానికి వాటిలోని ఈ లక్షణాలే కారణం.
ఎలుకలు అనేక కారణాలతో మన ఇళ్లకు ఆకర్షితులవుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఆశ్రయం, ఆహారం, వెచ్చదనం. శీతాకాలం, వర్షాకాలంలో వెచ్చదనం కోరుకుంటూ మానవ అవాసాల్లోకి వచ్చే ఈ జీవులు.. మనుషులు దాచుకున్న ఆహారాన్ని ఆ తరువాత సేకరిస్తుంటాయి. మొదట ఇవి లభించిన ఆహారాన్ని తినడం ప్రారంభించి.. ఆ తరువాత దాచుకున్న ఆహారానికి కన్నాలు వేసి మరీ ఆహారాన్ని సేకరించుకుంటాయి. తొలుత వంటగదుల్లో ఆహారాన్ని నిల్వ చేస్తాము. లేదా తినేప్పుడు కొంచెం అహారం కిందపడినా మరుసటి రోజు శుభ్రపరుస్తాం. కానీ ఈ ఆహారమే అవి అన్వేషణ సాగించడం గమనించదగిన విషయం. చివరగా, మన ఇళ్ళు ఎలుకలు దాక్కోడానికి అనేక ప్రదేశాలను కూడా కలిగిఉంటాయి.
ఎలుకలలో కొన్ని ప్రత్యేక లక్షణాలను ఉన్నాయి. మనుషుల అవాసాల్లోకి చొరబడడంలో వాటి లక్షణాలే వాటిని ప్రవీణ్యులను మార్చాయి. వాటికున్న సౌకర్యవంతమైన అస్థిపంజరం వాటిని సునాయాసంగా చిన్న ఖాళీలు, రంధ్రాల ద్వారా ఇళ్లలోకి దూరడానికి అనుమతిస్తాయి. అంతేకాకుండా, వీటి జాడ వుందని తెలియగానే తక్షణ పరిష్కారచర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో అవి విస్తృతంగా తమ సంతానాన్ని పెంచుకుంటాయి. అందుకు కారణం వాటి పునరుత్పత్తి రేటు కూడా ఆకట్టుకునేలా ఉండటం.
ఎలుకలను దరి చేరనీయని విషరహిత (నాన్-టాక్సిక్) సొల్యూషన్స్: Non-toxic Solutions to Keep Mice Away:
పెప్పరమెంట్ ఆయిల్ Peppermint Oil
పిప్పరమెంటు నూనె ఇంట్లోకి వచ్చే ఎలుకలను రాకుండా అడ్డుకునే శక్తి కలిగినది. దాని బలమైన వాసన ఎలుకలను ఇంట్లోకి రానీయకుండా తిప్పికొడుతుంది. ఈ సహజ రెమెడీ ఉపయోగించడానికి, కాటన్ బాల్‌లో కొన్ని చుక్కల పిప్పరమెంటు నూనెను వేసి, వంటగది సహా ఎలుకలు సంచరిస్తున్న ప్రాంతాల్లోని బేస్‌బోర్డ్‌లపై తుడవండి. ఇది ఎలుకలను ఈ ప్రదేశాలలోకి ప్రవేశించకుండా నిరోధించేలా అవరోధాన్ని సృష్టిస్తుంది. ఈ పద్ధతి ప్రభావాన్ని మెరుగుపర్చడానికి, క్యాబినెట్‌లు, అల్మారాలు లేదా ఆహారాన్ని నిల్వ చేసే ఇతర ప్రాంతాల మూలల్లో అదనపు పిప్పరమెంటు నూనెలో అద్దిన కాటన్ బాల్స్‌ను ఉంచండి. ఇలా ప్రతీ పక్షం రోజులకో పర్యాయం కాటన్ బాల్స్‌కు పిపరమెంట్ నూనెను జోడించడం లేదా కొత్త కాటన్ బాల్స్ ను ఏర్పాటుచేయడం వల్ల ఎలుకలు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. ఇలా పిప్పరమెంటు నూనెను ఉపయోగించడం ఎలుకలను దూరంగా ఉంచడానికి సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం. అంతేకాకుండా ఇంటిని తాజాగా, శుభ్రంగా సువాసనభరితంగా మారుస్తుంది.
కాగా, పిప్పరమెంటు నూనె మానవులకు సురక్షితమైనదే అయినప్పటికీ, ఇంట్లో పిల్లులను పెంచుకునేవారు మాత్రం ఈ నూనెతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ నూనె పిల్లులు తాగినా లేక పెద్ద మొత్తంలో చర్మానికి రుద్దుకున్నా విషపూరితం కావచ్చు. పిల్లుల్లోని ప్రత్యేకమైన కాలేయ జీవక్రియ కారణంగా అవి పిప్పరమెంటు నూనెతో సహా ఇతర ముఖ్యమైన నూనెలల్లోని సమ్మేళనాలకు సున్నితంగా ఉంటాయి. ఈ నూనెలోని సమ్మెళనాలను జీర్ణం చేసుకుని, శరీరం నుంచి బయటకు విసర్జించే అవసరమైన కొన్ని ఎంజైమ్‌లు లేని కారణంగా ఈ నూనె పిల్లులలో విషపూరితంగా మారే ప్రమాదముంది. ఈ నూనె పదార్ధాలు పిలుల కాలేయ, జీర్ణక్రియలో పేరుకుపోయి సంభావ్య అరోగ్య సమస్యలు దారితీస్తాయి.
పిప్పరమెంటు నూనె తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలతో సహా వాటి జీర్ణశయాంతర కలత ఏర్పడుతుంది. ఇక, పిల్లి చర్మంపై సాంద్రీకృత పిప్పరమెంటు నూనె పడినా, లేక రుద్దుకున్నా, అది చికాకు, మంట, కాలిన గాయాలకు కూడా కారణమవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో, పిప్పరమెంటు నూనెతో ఎక్స్ పోజర్ అయితే బద్ధకం, కండరాల వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛలు వంటి తీవ్రమైన లక్షణాలకు పిల్లులు గురికావచ్చు.
పిప్పరమెంటు నూనె ఎలుకల నిరోధకంగా వాడే పక్షంలో, పిల్లిని సంభావ్య హాని నుండి రక్షించడానికి జాగ్రత్తలు:
- పిప్పరమెంటు నూనెలో ముంచిన కాటన్ బాల్స్‌ను పిల్లికి దూరంగా ఉంచండి, ప్రాధాన్యంగా అవి యాక్సెస్ చేయలేని ప్రదేశాలలో.
- విషపూరితం ప్రమాదాన్ని తగ్గించడానికి గాఢమైన రూపానికి బదులుగా పలుచన చేసిన పిప్పరమెంటు నూనెను ఉపయోగించండి.
- పిప్పరమెంటు నూనెను వాడిన తర్వాత మీ పెంపుడు పిల్లిలో సంబంధిత లక్షణాలేమైనా గమనిస్తే, వెంటనే పశువైద్యుడిని సంప్రదించండి.
పిప్పరమెంటు నూనె ఎలుకలను దూరంగా ఉంచడానికి ప్రభావవంతమైన నాన్-టాక్సిక్ పరిష్కారం అయినప్పటికీ, మీ పెంపుడు పిల్లుల భద్రతను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. అవసరమైన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే.. ఎలుక సమస్యను పరిష్కరించాలి.
నాఫ్తలీన్ బాల్స్ (కర్పూరం) Camphor found in Mothballs
కర్పూరం, నాఫ్తలీన్ బాల్స్ లో కనిపించే పదార్థం, ఎలుకలకు మరొక సహజ వికర్షకం. కర్పూరం వాసన పిప్పరమెంటు నూనె కంటే తక్కువ ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఇంటిలోని నిర్దిష్ట ప్రాంతాల్లోకి ఎలుకలు ప్రవేశించకుండా నిరోధించడానికి వీటిని ఉపయోగించవచ్చు. కర్పూరాన్ని ఉపయోగించడానికి, పాత సాక్సులు తీసుకుని దానిని నాఫ్తలీన్ బాల్స్ తో నింపి.. వాటిని అటకపై, సెల్లార్ లో లేదా షెడ్‌లో, వెంట్‌లు, కిటికీలు లేదా ఇతర ప్రవేశద్వారాల వద్ద ఉంచండి. చిన్నారులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడానికి సాక్స్‌లను అందకుండా వేలాడదీయడం మంచిది. కాగా, నాఫ్తలీన్ బాల్స్ బలమైన వాసన కలిగి ఉన్న కారణంగా వాటిని నివాస ప్రదేశంలో లేదా వంటగదిలో వాడకపోవడం సముచితం. ఈ పద్దతిని మీరు తక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉపయోగించడం ఉత్తమం.
కిట్టి లిట్టర్ Kitty Litter
ఎలుకలను ఇంట్లోకి రానీయకుండా నిరోధించడంలో పిల్లుల బహిర్భూమి కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇది బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఉపయోగించాలి. పిల్లుల బహిర్భూమి (లిట్టర్) వాసనను ఎలుకలు పసిగట్టుతాయి. దీంతో సమీపంలో తమ జాతి వైరి ఉందని, తమను భక్షిస్తుందని అవి ఆ ప్రదేశంలోకి రాకుండా వెళ్లిపోతాయి. పిల్లి బహిర్భూమి ఎలుకలకు ఆయా ప్రదేశంలోకి వెళ్లరాదన్న సంకేతాలు ఇస్తుంది. దీంతో ఎలుకలు ఇంటిలోనికి చేరుకోవడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించుకోవడానికి, ఉపయోగించిన కిట్టీ లిట్టర్‌తో పాత సాక్స్ లో నింపి, ఇంటి వెలుపల తలుపులు లేదా కిటికీల బయట ఉంచండి. పెంపుడు పిల్లి లేనిపక్షంలో అలాఉన్న స్నేహితులను, పోరుగువారిని అడిగి ఈ కిట్టీ లిట్టర్ ప్రయోజనాన్ని పోందండి. ఇది కూడా క్రమం తప్పకుండా భర్తీ చేస్తూఉండాలి
తక్షణ మెత్తని బంగాళాదుంపలు Instant Mashed Potatoes
విస్తృత పునరుత్పత్తి కలిగిన ఎలుకలలో సంతాన నియంత్రణ చేయడానికి అప్పటికప్పుడు మెత్తగా మాష్ చేసిన బంగాళాదుంపలు ఉపయోగపడతాయి. ఇది నిజానికి అసాధారణ పద్దతే, కానీ సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ పద్దతిని ఉపయోగించడానికి ఎలుకలు తమ యాక్టివిటీని నిర్వహించే ప్రదేశాలలో తక్షణ మెత్తని బంగాళాదుంప చిఫ్స్ మాదిరిగా కట్ చేసి చిన్న కంటైనర్‌లో ఉంచండి. ఎలుకలు వాటిని తినగానే, వాటి కడుపులోకి చేరిన వెంటనే అవి విస్తరించి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి, చివరికి ఎలుకలు అక్కడి నుండి వెళ్లిపోయేలా చేస్తాయి. అయితే ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఈ పద్ధతిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే అవి కూడా బంగాళాదుంపల మెత్తని మాష్ చిప్స్ కు ఆకర్షితులై తినే అస్కారముంది. అదే జరిగితే వాటి పోట్ట కూడా ఉబ్బరంగా మారుతుంది. ఇంట్లోని పెంపుడు జంతువులకు అందుబాటులో లేని ప్రదేశాలలో బంగాళాదుంప రేకులను ఉంచడం మంచిది.
సహజ పద్దతులు- హెచ్చరికలు: Cautionary Notes for Non-toxic Solutions:
- పిప్పరమింట్ ఆయిల్: ఈ నూనె సాధారణంగా పెంపుడు జంతువులకు సురక్షితమైనది, అయితే పెద్ద మొత్తంలో ఎక్స్ పోజర్ విషపూరితం కావచ్చు. పెప్పర్‌మెంట్ నూనెలో ముంచిన కాటన్ బాల్స్ సువాసనను ఆసక్తిగా గమనించడం లేదా వాటిని నమలడానికి ఉత్సకత చూపుతాయి, కాబట్టి వాటిని పెంపుడు జంతువులకు అందని ప్రదేశాలలో ఏర్పాటు చూసుకోండి.
- కర్పూరం: నాఫ్తలీన్ బాల్స్ లో ఉండే కర్పూరం తీసుకుంటే మానుషులతో పాటు జంతువులకు కూడా విషపూరితమే. కర్పూరం ఉన్న నాఫ్తలీన్ బాల్స్ ఉపయోగిస్తున్నప్పుడు, వాటిని పెంపుడు జంతువులు, పిల్లలు అందని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని నిర్ధారించుకోండి. ప్రత్యామ్నాయంగా, పెంపుడు జంతువులు, కుటుంబ సభ్యుల భద్రత గురించి ఆందోళన చెందుతుంటే వేరే పద్ధతిని ఉపయోగించడం సముచితం.
- కిట్టి లిట్టర్: కిట్టి లిట్టర్ ఇతర పెంపుడు జంతువులు, ముఖ్యంగా పెంపుడు శునకాలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికి హానికరం. కుక్కలు లిట్టర్ వాసనకు ఆకర్షితులవుతాయి, దానిని తినేందుకు ప్రయత్నిస్తాయి, అలా జరిగితే వాటిలో జీర్ణశయాంతర సమస్యలు లేదా అడ్డంకులకు దారితీస్తుంది. ఈ పద్ధతిని వాడేప్పుడు, ఉపయోగించిన కిట్టీ లిట్టర్‌తో నిండిన సాక్స్ ను ఇతర పెంపుడు జంతువులకు అందుబాటులో లేని ప్రదేశంలో ఉంచాలి.
- అప్పుడే మాష్ చేసిన బంగాళాదుంపలు: అప్పటికప్పుడు మాష్ చేసిన బంగాళాదుంపలను ఎలుకలు నియంత్రణ పద్ధతిగా ఉపయోగించడం వల్ల పెంపుడు జంతువులు ఆ రేకులు తింటే వాటికి ప్రమాదం కలుగుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి, పెంపుడు జంతువులు తిరగని ప్రదేశాలలో వాటిని ఉంచండి.
ఎలుకలు లేని ఇంటి కోసం నివారణ చర్యలు: Preventive Measures for a Mouse-free Home:
ఈ సహజ విషరహిత పద్దతులతో పాటు, మీ ఇంటిని ఎలుకలకు తక్కువ ఆకర్షణీయంగా చేయడానికి నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. అవి:
- ఎయిర్ టైట్ కంటైనర్లలో ఆహారం నిల్వ చేయడం: అన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా పెట్టెలు లేదా బ్యాగ్‌లలో ఉన్నవి, మూసివున్న కంటైనర్‌లలో నిల్వ చేయాలి. ఆహార అన్వేషణలో వాసన పసిగట్టి వెళ్లే ఎలుకలకు ఆహారపదార్థాల వాసన రాక అవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇది సహాయపడుతుంది.
- రెగ్యులర్ క్లీనింగ్: ఎలుకలను ఆకర్షించే ఏవైనా ముక్కలు లేదా ఆహార వ్యర్థాలను తొలగించడానికి ఇంటిని రోజుకు రెండు లేక మూడు పర్యాయాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. వంటగది, ఆహారాన్ని నిల్వ చేసే ప్రాంతాలలోనైనా ఇలా చేయండి.
- సీలింగ్ ఎంట్రీ పాయింట్లు: ఎలుకలు ప్రవేశించడానికి ఉపయోగించే ఏవైనా పగుళ్లు, గోడల మధ్య ఖాళీలు లేదా రంధ్రాల కోసం తనిఖీ చేసి వాటిని మూసివేయండి.
నాన్-టాక్సిక్ సొల్యూషన్స్, నివారణ చర్యల కలయికను ఉపయోగించడం ద్వారా, కుటుంబం, పెంపుడు జంతువుల భద్రతకు భరోసానిస్తూ ఎలుకలను ఇంటికి దూరంగా ఉంచవచ్చు.