క్యాన్సర్ కణాలను సెకండరీ స్టేజికి చేరకుండా చేసే కొల్లాజన్: అధ్యయనం - Crucial Role of Collagen in Maintaining Dormancy of Cancer Cells in Telugu

0
Role of Collagen

క్యాన్సర్ కణాలు ప్రైమరీ ట్యూమర్‌ను దాటి ఏ విధంగా ప్రయాణిస్తాయి.? సంవత్సరాల తరబడి నిద్రాణస్థితిలో ఉండి, ఆపై అకస్మాత్తుగా ఎలా మేల్కొని విజృంబిస్తాయి.? అంతవరకు సజావుగా ఉన్న అరోగ్యం ఒక్కసారిగా ఎలా క్యాన్సర్ కణాలను లొంగిపోతుంది. క్యాన్సర్ పునరావృతమై ఎలా విస్తృతంగా పెరుగుతాయి? ఈ ప్రశ్నలు సాధారణ మనుషులలో ఉత్పన్నం కావడం కష్టం. కానీ క్యాన్సర్ బారిన పడిన రోగులకు కాసింత అవగాహన ఉంటే మాత్రం ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే క్యాన్సర్ ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 19.3 మిలియన్ల కొత్త కేసులు ఒక్క 2020 సంవత్సరంలోనే నమోదు కాగా, ఏకంగా కోటి మరణాలు అదే ఏడాదిలో సంభవించాయి. అంతర్జాతీయ క్యాన్సర్ రీసర్చ్ ఏజెన్సీ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ గణంకాలు ఉన్నాయి.

ప్రపంచ జనాభాలో వయస్సు పెరిగి వృద్ధాప్యం బారినపడిన వారు, ధూమపానం, ఊబకాయం, శారీరక వ్యాయామం చేయలేనివారిలో ఈ ప్రమాద కారకాల ప్రాబల్యం పెరుగడం.. దీంతో క్యాన్సర్ భారం మరింత పెరుగుతుంది. ఈ ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడానికి వినూత్నమైన, సమర్థవంతమైన చికిత్సల అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో రోగుల్లో వచ్చే వినూత్న అలోచనలను నోప్పులు హరిస్తుంటాయి. దీంతో వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ పై వచ్చే అలోచనలను వైద్యులతో పంచుకోవడం దాదాపు అసాధ్యమే. అయితే క్యాన్సర్ రోగులను చికిత్సను అందించే అంకాలజీ విభాగానికి చెందిన వైద్యులలో ఇలాంటి అలోచనలు కొత్త అధ్యయనాలకు పునాది వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే మౌంట్ సినాయ్‌లోని పరిశోధకులకు ఉత్భవించిన ఇలాంటి ఒక ప్రశ్నకు సమాధానాన్ని వారు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ పునఃస్థితిని అంచనా వేయడానికి, నిరోధించడానికి కొత్త సాధనాలను అందించగలదని కూడా వారు విశ్వసిస్తున్నారు.

ఒక నిర్దిష్ట రకమైన కొల్లాజెన్ ప్రోటీన్‌ను కణతి కణాల వాతావరణంలోకి స్రవించడం ద్వారా క్యాన్సర్ కణాలు నిద్రాణంగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. కొల్లాజెన్ స్థాయిలు తగ్గినప్పుడు, కణాలు ప్రాణాంతకంగా మారుతాయని పరిశోధనలో తేలిందని పేర్కోన్నారు. క్యాన్సర్ కణాల వాతావరణానికి కొల్లాజెన్‌ని జోడించడం వల్ల అవి నిద్రాణ స్థితిలో ఉంటాయని.. నేచర్ క్యాన్సర్‌ మ్యాగజీన్ లో వారు నివేదించారు. అయితే ఈ కొల్లాజన్ అనేది ఏంటీ.? దానికి అంత సామర్థ్యం ఏంటీ అన్న వివరాల్లోకి వెళ్తే.. కొల్లాజన్ అనేది ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ఈసీఎం (ECM) ముఖ్యమైన భాగం, ఇది కణజాలాలకు నిర్మాణాత్మక మద్దతును అందించడంతో పాటు వివిధ సెల్యులార్ ప్రక్రియలను నియంత్రిస్తుంది.

Collagen in Dormancy of Cancer Cells

ఇటీవలి అధ్యయనాలు క్యాన్సర్ కణాలను నిద్రాణంగా ఉంచడంలో లేదా అవి చురుకుగా మారలేని నిద్రాణస్థితిలో ఉంచడంలో కొల్లాజెన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయని తేలింది. ఈ సమయంలో, క్యాన్సర్ కణాలు సంవత్సరాలు లేదా దశాబ్దాలపాటు నిశ్చల స్థితిలో ఉంటాయి, ఇవి సాంప్రదాయ క్యాన్సర్ చికిత్సలకు నిరోధకతను కలిగిస్తాయి. అయినప్పటికీ, కొల్లాజన్ స్థాయిలు నిద్రాణస్థితిని నియంత్రించే ఖచ్చితమైన విధానాలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. కాగా, ఒక పరికల్పన ఏమిటంటే, ఈసీఎంలో కొల్లాజన్ అధిక స్థాయిలు క్యాన్సర్ కణాలను విస్తరించకుండా నిరోధించే భౌతిక అవరోధాన్ని సృష్టించగలవని తేలింది. దీనికి తోడు కొల్లాజెన్ టీజీఎఫ్-β(TGF-β) మార్గంతో సహా కణాలలోని వివిధ సిగ్నలింగ్ మార్గాలతో సంకర్షణ చెందుతుంది, ఇది క్యాన్సర్ కణాలలో నిద్రాణస్థితిని ప్రేరేపిస్తుందని పేర్కోనబడింది.

క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు, హాని కలిగించవు లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవని అధ్యయనంలో వెల్లడైంది. అయితే, ఈ కణాలు చురుగ్గా మారితే మాత్రం చాలా వేగంగా పెరగడంతో పాటు అనియంత్రణ విభజన చెందుతాయి. దీని ఫలితంగా కణితులు ఏర్పడి శరీరమంతా క్యాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడుతుంది. డ్యూక్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, టైప్ XVIII కొల్లాజెన్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం కొల్లాజెన్‌ను స్రవించడం ద్వారా క్యాన్సర్ కణాలు నిద్రాణంగా ఉండగలవని కనుగొన్నారు. ఈ రకమైన కొల్లాజెన్ క్యాన్సర్ కణాల చుట్టూ రక్షిత అవరోధాన్ని ఏర్పరుస్తుంది, వాటి పర్యావరణంతో సంకర్షణ చెందకుండా, ప్రాణాంతకంగా మారకుండా నిరోధిస్తుంది.

కొల్లాజెన్ స్థాయిలు పడిపోయినప్పుడు, క్యాన్సర్ కణాలు చురుకుగా మారి క్యాన్సర్ కణతులు శరీరవ్యాప్తంగా ఏర్పడి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ కణాల వాతావరణంలో టైప్ XVIII కొల్లాజెన్‌ను తగినంత స్థాయిలో నిర్వహించడం వాటిని నిద్రాణంగా ఉంచడంలో కీలకమైనదని ఈ పరిశోధన సూచిస్తుంది. రొమ్ము, తల, మెడ క్యాన్సర్లపై ఎలుకలపై జరిపిన అధ్యయనాల్లో వాటిలో నిద్రాణమైన క్యాన్సర్ కణాలను ట్రాక్ చేయడానికి మౌంట్ సినాయ్ బృందం అధిక-రిజల్యూషన్ ఇమేజింగ్‌ను ఉపయోగించింది. నిద్రాణమైన, సుదూర కణితి కణాలు మేల్కొనడం ప్రారంభించినప్పుడు కణాలలో, ఎక్స్‌ట్రాసెల్యులర్ మాతృకలో మార్పులను గమనించడానికి వారికి ఈ సాంకేతికత సహాయపడింది. నిద్రాణమైన కణాలు టైప్ 3 కొల్లాజెన్‌ను స్రవిస్తున్నాయని, ప్రోటీన్ స్థాయిలు క్షీణించడం ప్రారంభించినప్పుడు మేల్కొంటాయని వారు కనుగొన్నారు.

Role of collagen in cancer progression

ఈ పరిశోధనలో ప్రత్యేకంగా ప్రాధమిక కణితులను విడిచిపెట్టిన కణాల చుట్టూ ఉన్న వాతావరణంలోని టైప్ 3 కొల్లాజెన్ స్థాయిలను పెంచారు. దీంతో ఇది కణాలు నిద్రాణంగా మారేలా చేసిందని పరిశోధకులు పేర్కోన్నారు. నిద్రాణమైన క్యాన్సర్ కణాలు మెటాస్టాటిక్‌గా మారకుండా నిరోధించడానికి ఇటీవలి సంవత్సరాలలో ప్రతిపాదించబడిన అనేక వ్యూహాలలో ఇది ఒకటి. అధ్యయనంలో భాగంగా, మౌంట్ సినాయ్ పరిశోధకులు రోగి నమూనాలలో కొల్లాజెన్‌ను కొలవడం ద్వారా, క్యాన్సర్ మెటాస్టాసిస్, పునరావృతతను అంచనా వేయవచ్చని చూపించారు. నిద్రాణమైన క్యాన్సర్ కణాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకునే ఔషధాల అభివృద్ధికి తమ పరిశోధనలు స్ఫూర్తినిస్తాయని వారు సూచించారు. అయితే కొన్ని సందర్భాల్లో, క్యాన్సర్ కణాలు వాటి మనుగడ, పెరుగుదలను ప్రోత్సహించడానికి ఈసీఎంని మార్చడం ద్వారా కొల్లాజెన్‌ను తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, కొన్ని క్యాన్సర్ కణాలు వాటి విస్తరణ, మెటాస్టాసిస్‌కు మద్దతిచ్చే సూక్ష్మ వాతావరణాన్ని సృష్టించడానికి వాటి స్వంత కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయగలవు.

కొల్లాజన్ ను క్యాన్సర్ కణాలకు జోడించడం

మౌంట్ సినాయ్ బృందం పరిశోధనలతో పాటు డ్యూక్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం క్యాన్సర్ చికిత్సలో కొత్త అవకాశాలు కల్పించింది. క్యాన్సర్ కణాల వాతావరణానికి టైప్ XVIII కొల్లాజెన్‌ను జోడించడం వల్ల వాటిని నిద్రాణంగా ఉండేలా చేస్తుంది. ఈ విధానాన్ని కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి వాటి ప్రభావాన్ని మెరుగుపరచడానికి, క్యాన్సర్ పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి ఇప్పటికే ఉన్న చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చు.

శరీరంలో కొల్లాజెన్ స్థాయిలను పెంచడం ఎలా.. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి, అవి:

Collagen Vitamin C
  • ఆహారం: ఎముక రసం, చేపలు, జెలటిన్ వంటి కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. వీటికి తోడు సిట్రస్ పండ్లు, బెర్రీలు, ఆకుకూరలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కొల్లాజెన్ సంశ్లేషణకు మద్దతు ఇస్తాయి.
  • సప్లిమెంట్స్: కొల్లాజెన్ సప్లిమెంట్స్, పౌడర్లు, క్యాప్సూల్స్, టాబ్లెట్ల రూపంలో లభిస్తాయి, శరీరంలో కొల్లాజెన్ స్థాయిలను పెంచడానికి వీటిని కూడా తీసుకోవచ్చు. కాగా, ఈ సప్లిమెంట్లను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
  • జన్యు చికిత్స: క్యాన్సర్ కణాలలో రకం XVIII కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి జన్యు చికిత్స సామర్థ్యాన్ని కూడా శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. కణాలలోకి కొల్లాజెన్ ఉత్పత్తికి బాధ్యత వహించే జన్యువును చొప్పించడం ద్వారా, క్యాన్సర్ కణాలను నిద్రాణంగా ఉంచడానికి, వ్యాధి పురోగతిని నిరోధించాలని పరిశోధకులు భావిస్తున్నారు.

కొల్లాజెన్ బూస్టింగ్ స్మూతీ రెసిపీ :

ఆహారంలో కొల్లాజెన్‌ను చేర్చడానికి రుచికరమైన స్మూతీ రెసిపీని ఇది. ఈ వంటకం కొల్లాజెన్ ఉత్పత్తి, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంది:

కొల్లాజెన్-బూస్టింగ్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు:

  • 1 కప్పు ఫ్రిడ్జిలో నిల్వ చేసిన పలు రకాల బెర్రీలు (విటమిన్ సి సమృద్ధిగా)
  • 1 స్కూప్ కొల్లాజెన్ పౌడర్ (ప్రాధాన్యంగా పేరున్న బ్రాండ్ నుండి)
  • 1 కప్పు బచ్చలికూర లేదా కాలే (విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా)
  • 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి)
  • 1 టేబుల్ స్పూన్ బాదం వెన్న (ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా)
  • 1 కప్పు తియ్యని బాదం పాలు లేదా కొబ్బరి పాలు
Collagen Boosting Smoothies

సూచనలు:

  • పైన పేర్కోనబడిన పదార్థాలు అన్నింటినీ బ్లెండర్లో కలపండి.
  • మృదువుగా మారే వరకు బ్లెండ్ చేయండీ. స్మూతీ చాలా చిక్కగా ఉంటే, స్మూతీలా చేసుకునేందుకు మరికోన్ని బాదం పాలు లేదా కొబ్బరి పాలు జోడించండి.
  • స్మూతీని గ్లాసులో పోసి వెంటనే ఆస్వాదించండి. ఈ కొల్లాజెన్-బూస్టింగ్ స్మూతీని ప్రతీరోజు అల్పాహారంగా తీసుకోవచ్చు.

క్యాన్సర్ కణాలను నిద్రాణంగా ఉంచడంలో టైప్ XVIII కొల్లాజెన్ పాత్ర కీలకం. ఇందుకోసం కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్‌లను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇది క్యాన్సర్‌తో సహా వివిధ వ్యాధుల ఆగమనం లేదా పురోగతిని నిరోధించడంలో సహాయపడుతుంది. కాగా, ఏ ఒక్క ఆహారం లేదా సప్లిమెంట్ క్యాన్సర్‌ను నయం చేయలేవు లేదా నిరోధించలేవని గమనించడం ముఖ్యం. అయితే కొల్లాజెన్ స్థాయిలు, క్యాన్సర్ నిద్రాణస్థితి మధ్యనున్న సంబంధం సంక్లిష్టం, బహుముఖమైనది. ఇందులోని యంత్రాంగాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. ఏదేమైనా, కొల్లాజెన్, ఈసీఎంలను లక్ష్యంగా చేసుకోవడం కొత్త క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడానికి మంచి వ్యూహంగా ఉంటుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.