వర్షాకాలంలో కండ్లకలక వ్యాప్తితో జాగ్రత్తా.. నివారణ చర్యలు ఇలా.. - Conjunctivitis: Essential Precautions and Prevention Strategies

0
Conjunctivitis Symptoms

కండ్లకలక.. వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధుల్లో ఇది ఒకటి. దీనిని పింక్ ఐ, రెడ్ ఐ అని కూడా పిలుస్తారు. ఇది కరోనా కంటే ఎక్కువగా విజృంభిస్తుంది. నివారణ చర్యలతో మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయవచ్చు. కరోనా మహమ్మారి తరహాలోనే ఇది కూడా అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్ కావడంతోనే ప్రజలు నాలుగు నుంచి వారం రోజుల పాటు దీని వల్ల బాధపడతారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా విజృంబిస్తున్న కండకలక.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభన కొనసాగిస్తుంది.

కండ్లకలక అంటే ఏమిటీ.? కారణాలు ఏంటీ? What is Conjunctivitis? Causes?

కండ్లకలక అంటే కాన్జూక్టివిటిస్ లేదా పింక్ ఐ ఒక సాధారణ కంటి ఇన్పెక్షన్. అలా అని దీనిని తేలిగ్గా భావించవద్దు. దీని వల్ల కంటి వాపుకు కారణం అవుతుంది. కంటి తెల్లని భాగాన్ని, కనురెప్పల లోపలి ఉపరితలాన్ని కప్పి ఉంచే సన్నని, స్పష్టమైన కణజాలం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది సోకిందంటే కళ్లు వాపుకు గురై, దురద, చికాకు, స్పష్టమైన దృష్టికి ఆటంకం కలిగిస్తాయి.

సాధారణంగా ఏ ఇన్పెక్షన్ అయినా సోకిందంటే అందుకు కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా అయ్యివుండాలి. కానీ కండ్లకలక మాత్రం వైరస్, బ్యాక్టీరియా, అలెర్జీ వల్ల కూడా సంభవిస్తుంది. అంతేకాదు దీంతో పాటు వివిధ కారణాల కారణంగానూ ఇది సంభవించవచ్చు. వైరల్ కండ్లకలక అత్యంత సాధారణ రూపం, అంతేకాదు ఇది వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి. దీంతో పాటు బ్యాక్టీరియల్ కండ్లకలక కూడా వివిధ బ్యాక్టీరియా దాడుల వల్ల సంభవించవచ్చు, ఇది కూడా విస్తృతంగా వ్యాప్తి చెందో అంటువ్యాధే. అయితే అలెర్జీ కాన్జూక్టివిటిస్ మాత్రం పుప్పొడి లేదా పెంపుడు చుండ్రు, వెంట్రుకల పోరలు కంటిలో పడటం వల్ల కలిగే అలెర్జీ కారకాల ద్వారా ప్రేరేపించబడుతుంది.

కండ్లకలక లక్షణాలు ఏలా ఉంటాయి.?: Symptoms of Conjunctivitis:

Symptoms of Conjunctivitis

కండ్లకలక లక్షణాలు రకాన్ని బట్టి మారుతుంటాయి. వైరల్ పింక్ ఐ సోకినప్పుడు లక్షణాలు వేరుగా, బ్యాక్టీరియల్ పింక్ ఐ వ్యాప్తిచెందినప్పుడు లక్షణాలు వేరుగా, అలెర్జీ కారణంగా వచ్చిన కండ్లకలకు మరో రకమైన లక్షణాలు కనిపించవచ్చు, కానీ అన్నింటిలోనూ కొన్ని సాధారణ సంకేతాలు మాత్రం ఉంటాయి. అవి:

  • కంటిలోని తెల్లటి భాగం ఎరుపుగా మారడం
  • కన్నీటి ఉత్పత్తి పెరగి కారుతూ ఉండడం
  • కళ్లు, కంటి రెప్పలపై దురద లేదా మంట
  • భయంకరమైన అనుభూతి
  • కాంతికి సున్నితత్వంగా మారే కళ్లు
  • కనురెప్పలు వాపు

దావానలం తరహాలో కండ్లకలక వ్యాప్తి: Conjunctivitis spread like a WildFire:

కండ్లకలక అత్యంత విస్తృతంగా వ్యాపించే అంటువ్యాధి. అయితే ఇది గాలీ, నీరు ద్వారానే కాకుండా సోకిన వ్యక్తి కంటి స్రావాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కలయిక ద్వారా కూడా వ్యాపిస్తుంది. సంక్రమణకు కారణమైన వైరస్ లేదా బ్యాక్టీరియాతో కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా కూడా ఇది సంక్రమించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా మహమ్మారి మాదిరిగా ఇది కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇది నాలుగు నుండి వారం రోజుల వరకు సోకిన వ్యక్తులను ఇబ్బంది పెడుతుంది. కరోనా తరహాలో ప్రాణాంతక వ్యాధి కాకపోవడంతో ప్రజలు కొద్దిపాటి అందోళనకు గురైనా సత్వర చికిత్సా చర్యలతో ఇది తగ్గిపోతుంది.

కండ్లకలక ఎన్ని రకాలో తెలుసా?: Types of Pink Eye:

Types of Pink Eye

ముందదుగా ప్రస్తావన చేసినట్లుగానే కండ్లకలకలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి, ఒకటి వైరల్, రెండవది బ్యాక్టీరియా, మూడవది అలెర్జీ కారకాలతో సంభవించేది. ఈ కంటి ఇన్పెక్షన్ తో వైద్యుల వద్దకు వెళ్తే వారు సమర్థవంతమైన చికిత్స అందించేందుకు ముందుగా అది ఏ రకం కండ్లకలక అన్నది నిర్ణయించుకున్న తరువాతే చికిత్స విధానాన్ని ప్రారంభిస్తారు. సాధారణంగా మూడు రకాల్లో కామన్ లక్షణాలు ఉన్నంత మాత్రాన.. అన్నింటికీ ఒకేళా చికిత్స విధానం ఉండదు. ఎందుకంటే రకాన్ని బట్టి చికిత్సా విధానాల్లో మార్పులుంటాయి.

  • వైరల్ కండ్లకలక: Viral Pink Eye:

సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ల మాదిరిగానే వైరల్ కండ్లకలక వివిధ వైరస్ల వల్ల వస్తుంది. ఇది చాలా అంటువ్యాధి మరియు పాఠశాలలు, కార్యాలయాలు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో సులభంగా వ్యాపిస్తుంది.

  • బాక్టీరియల్ పింక్ ఐ: Bacterial Pink Eye:

బాక్టీరియల్ కంజక్టివిటిస్ వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది చాలా అంటువ్యాధి మరియు వైరల్ కండ్లకలకతో పోలిస్తే మరింత తీవ్రమైన లక్షణాలకు దారితీస్తుంది.

  • అలెర్జీ పింక్ ఐ: Allergic Pink Eye:

పుప్పొడి, దుమ్ము లేదా పెంపుడు జంతువుల చర్మం వంటి అలెర్జీ కారకాలకు కళ్ళు ప్రతిస్పందించినప్పుడు అలెర్జీ కాన్జూక్టివిటిస్ సంభవిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు కానీ కాలానుగుణ మార్పులు లేదా నిర్దిష్ట అలెర్జీ కారకాలకు గురికావడం ద్వారా ప్రేరేపించబడవచ్చు.

కండ్లకలక రాకుండా నివారణ చర్యలు: Preventive Measure to Pink Eye:

Preventive Measure to Pink Eye

కండ్లకలం నుంచి మీరు, మీ కుటుంబసభ్యులతో పాటు మీ పరిచయస్థులు, సన్నిహితులు, బంధువులను, ఇతరులను రక్షించుకోవడానికి నివారిణ చర్యలు తీసుకోవడం చాలాముఖ్యం. కొన్ని నివారణ చర్యలు ఇలా..:

  • సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం.
  • ముఖ్యంగా కడుక్కోని చేతులతో మీ కళ్లను తాకడం లేదా రుద్దడం మానుకోండి.
  • తువ్వాళ్లు, కంటి చుక్కలు లేదా మేకప్ వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి.
  • సాధారణంగా తాకిన ఉపరితలాలను క్రమం తప్పకుండా క్రిమిసంహారక చేయండి.
  • వ్యాధి సోకితే, ఇతరులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి
  • కండ్లకలక పూర్తిగా తగ్గే వరకు పాఠశాల లేదా పని లేదా ఆఫీసులకు వెళ్లరాదు.

రకంపై ఆధారపడి కండ్లకలక చికిత్స విధానం: Treatment of Pink Eye:

వైరల్ కండ్లకలక:

వైరల్ కండ్లకలక వచ్చిందంటే అది ఎంత విస్తృతంగా వ్యాపిస్తుందో అంతే త్వరగా అది దానంతట అదే తన లక్షణాలను తగ్గించుకుంటుంది. వైరల్ కండ్లకలకతో బాధపడేవారు ఒక శుభ్రమైన చేతి రుమాలును గుండ్రంగా చుట్టి దానిని పెనంపై కానీ లేదా నోటితో వెచ్చని గాలిని ఊది కంటిపై పెడితే ఉపశమనం లభిస్తుంది. కృత్రిమ కన్నీళ్లతో లక్షణాలను తగ్గించవచ్చు.

బాక్టీరియల్ పింక్ ఐ:

బ్యాక్టీరియల్ కండ్లకలక వచ్చిన వారు తమ కళ్లను చల్లని నీటితో ముంచి కళ్ల తెరచి ఉంచి తీయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దీనికి తోడు కంటి నిపుణులను సంప్రదించడం ద్వారా లేదా ఓవర్ ది కంటర్ యాంటీబయాటిక్ కంటి చుక్కలు లేదా లేపనాలను కంటిలో వేయాలి. లేపనాలు వాడే క్రమంలో వైద్యుల సలహా తప్పనిసరి.

అలెర్జీ కండ్లకలక:

అలెర్జీ కండ్లకలకు పుప్పోడి, లేదా పెంపుడు జంతువుల చుండ్రు, లేదా వెంట్రుకల పోర కారణం కావచ్చు. ఇలా వచ్చే కండ్లకలక రెండు లేదా మూడు రోజులు ఉంటుంది. అయితే ఈ రకం కండ్లకలకను నివారించడానికి యాంటిహిస్టామైన్ కంటి చుక్కలను ఉపయోగం సహాయపడుతుంది.

Seeking Medical Attention

కంటి వైద్యనిపుణులను ఎప్పుడు సంప్రదించాలి: Seeking Medical Attention:

కండ్లకలకతో తీవ్రమైన కంటి నొప్పిని అనుభవిస్తే వెంటనే కంటి వైద్యనిపుణులను సంప్రదించాలి. హోమ్ రెమడీస్ వాడినప్పటికీ లక్షణాలు తీవ్రతరం అవుతున్నా లేక దృష్టి మార్పులు సంభవిస్తున్నా కంటి వైద్యులను సంప్రదించి చికిత్సను పోందాలి. కాగా వైద్య నిపుణుడు పింక్ కంటి రకాన్ని ఖచ్చితంగా నిర్ధారించిన తరువాతే చికిత్స సిఫారసు చేస్తారు. కండ్లకలక అనేది వైరస్లు, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలతో వచ్చే సాధారణ కంటి ఇన్ఫెక్షనే అయినా దాని లక్షణాలు, వ్యాప్తి చెందే మార్గాలు మాత్రం కలవరపెడతాయి. అందుకనే దీనిని నివారణ చర్యలను అర్థం చేసుకోవడం దాని వ్యాప్తిని సమర్థవంతంగా నిర్వహించడమే సముచితం.