స్ప్లెనోమెగలీ అంటే శరీరంలోని ప్లీహము విస్తరించడం వల్ల ఏర్పడే పరిస్థితి. దీనిని సాధారణంగా విస్తారిత ప్లీహము లేదా ప్లీహము విస్తరణ అని కూడా అంటారు. ప్లీహము శోషరస వ్యవస్థలో ఒక భాగం. ఇది తెల్ల రక్తకణాలను నిల్వ చేయడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది, ప్రతిరోధకాలను రూపొందించడంలో సహాయపడుతుంది. ప్లీహము పోట్ట వెనుక డయాఫ్రాగమ్ క్రింద దాగి ఉన్న చిన్నదైన అవయవం. మరింత క్లారిటీగా చెప్పాలంటే శరీరంలోని ఎడమ పక్కటెముక క్రింద, ఉదరం ఎగువ ఎడమ భాగంలో ఉంటుంది. ఈ అవయవం రక్త కణాలను రీసైక్లింగ్ చేయడంతో పాటు శుద్ది చేస్తుంది. రక్తాన్ని నిత్యం పిల్టర్ చేయడమే దీని పని. పాత, దెబ్బతిన్న లేదా అసాధారణ ఎర్ర రక్త కణాలు ప్లీహము లోపల ఇరుకైన సొరంగాల మధ్య చిక్కుకుపోగా.. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు సులభంగా ప్లీహము గుండా వెళ్తాయి. అంతేకాకుండా ఈ ప్లీహము రక్తప్రవాహంలో ప్రసరణను కొనసాగించడంలోనూ సాయపడుతుంది.
శరీర రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా ప్లీహము రక్తం నుండి బ్యాక్టీరియా లేదా వైరస్ వండి స్మూక్ష్మక్రీములను కూడా ఫిల్టర్ చేస్తుంది. వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు రక్తప్రవాహంలోకి చొరబడినప్పుడు, ప్లీహముతో పాటు శోషరస కణుపులు లింఫోసైట్‌లను ఉత్పత్తి చేస్తాయి, ఇది ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి ప్రతిరోధకాలను తయారు చేయగల ఒక రకమైన తెల్ల రక్త కణం. మీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగా కాకుండా, ప్లీహము జీవితాంతం పరిమాణంలో మార్పులు చేసుకుంటూనే ఉంటుది. సాధారణంగా అనారోగ్యం లేదా గాయానికి గురైన సమయంలో ప్లీహము ప్రతిస్పందనగా విస్తరిస్తోంది. మోనోన్యూక్లియోసిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా సిఫిలిస్ వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా ప్లీహాం విస్తరణకు గురి అవుతుంది.
సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తులలో ప్లీహము పరిమాణం వ్యక్తి నుండి వ్యక్తికి గణనీయంగా మారవచ్చు. ఇక దీంతో పాటు లింగం, ఎత్తులపై కూడా అధారపడి దాని పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి. ప్లీహము వ్యక్తుల పిడికిలి పరిమాణంలో ఉంటుంది. అయితే సగటున ఒక వయోజన వ్యక్తి ప్లీహము 5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల మందం, 6 ఔన్సుల బరువు ఉంటుంది. ఇక ఇదే మహిళల్లో అయితే పురుషుల కంటే చిన్న ప్లీహాలను కలిగి ఉంటారు. ఇక వారి ఎత్తును బట్టి ప్లీహం కూడా పెద్దగా ఉంటుంది. పొడవాటి వ్యక్తులు పెద్ద ప్లీహాలను కలిగి ఉంటారు. రేడియాలజీ జర్నల్‌లోని ఒక అధ్యయనంలో, పురుషులు సాధారణంగా మహిళల కంటే ఎక్కువ ఎర్ర కణ ద్రవ్యరాశిని కలిగి ఉంటారని పరిశోధకులు సూచించారు.
ప్లీహము బాధ్యతలు ఏమిటీ.?:
- యాంటీబాడీ-కోటెడ్ బ్యాక్టీరియాను ఫిల్టర్ చేస్తుంది
- పాత ఎర్ర రక్త కణాలను తిరిగి ప్రాసెస్ చేయడం
- హిమోగ్లోబిన్‌లో ఇనుము రీసైక్లింగ్
- ఎర్ర రక్తకణాలు, ప్లేట్ లెట్లను నిల్వ చేయడం
- తెల్ల రక్తకణాలు (WBC) లింఫోసైట్‌లను ఉత్పత్తి చేయడం
రోగ సంక్రమణకు వ్యతిరేకంగా మీ శరీరం చేసే పోరాటంలో ప్లీహము చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది రెండు రకాల తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. B కణాలు, T కణాలు. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంతో పాటు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. సాధారణంగా పిడికిలి పరిమాణంలో ఉండే ప్లీహము.. విస్తరించినప్పుడు చాలా పెద్దదిగా మారుతుంది. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడే స్ప్లెనోమెగలీ అని లేదా ప్లీహ విస్తీర్ణమని అంటారు.
స్ప్లెనోమెగలీ (ప్లీహము విస్తరించిన) ప్రభావం:
ప్లీహము విస్తరించిన క్రమంలో అది చేసే పనులన్నింటిపై దాని ప్రభావం ఉంటుంది. విస్తరించిన ప్లీహము అసాధారణంగా పెరగడం కారణంగా సాధారణ ఎర్ర రక్తకణాలను ఫిల్టర్ చేయడం ప్రారంభిస్తుంది. ఇది మీ రక్తంలో మొత్తం సెల్యులార్ వాల్యూమ్‌ను తగ్గిస్తుంది, ప్లేట్‌లెట్ ఒడిసి పట్టేస్తుంది. చివరికి రక్త కణాలతో ప్లీహము మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు, ప్లీహము పరిమాణం దాని సంభావ్య రక్త సరఫరా కంటే ఎక్కువగా పెరుగిపోయి.. తన బాగాలను ధ్వంసం చేసుకునే పరిస్థితి సంభవిస్తుంది. సాధారణ శారీరక పరీక్ష సమయంలో ప్లీహము విస్తరించిన విషయం గుర్తించబడుతుంది, ఎందుకంటే ఇది ఎటువంటి లక్షణాలను కలిగించదు. అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి, వైద్యులు సాధారణంగా రక్త పరీక్షలు, ఇమేజింగ్‌ని సిఫార్సు చేస్తారు. అయితే ప్లీహము విస్తరణకు కారణమేంటన్న కోణం తెలుసుకుని ఆ ప్రధానంగా కారణానికి చికిత్స చేయడంపైనే వైద్యులు దృష్టి పెడుతారు. అత్యైక పరిస్థితుల్లో ప్లీహము శస్త్రచికిత్స చేసి తొలగించడం అనివార్యం.
- విస్తరించిన ప్లీహము కొందరిలో అలక్షణంగానే సంభవిస్తుంది.
- చాలా సన్నగా ఉన్నవారిలో, చర్మం ద్వారా మీ విస్తరించిన ప్లీహాన్ని అనుభూతి కలగడం సాధ్యమవుతుంది.
- విస్తారిత ప్లీహము సాధారణ లక్షణం: పొత్తికడుపు ఎగువ ఎడమ భాగంలో నొప్పి లేదా అసౌకర్యం అనుభూతి.
- కొద్దిగా ఆహారం తీసుకున్నా కడుపు నిండిన అనుభూతిని అనుభవించవచ్చు. ఇది సాధారణంగా ప్లీహము కడుపుపై నొక్కినంత వరకు విస్తరించినప్పుడు జరుగుతుంది.
- ప్లీహము ఇతర అవయవాలపై నొక్కడం ప్రారంభిస్తే, అది ప్లీహానికి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించవచ్చు.
- రక్తాన్ని సరిగ్గా శుద్ది చేయడంలో ప్లీహముపై విస్తారణ ప్రభావం కూడా పడటం
- ప్లీహము మరీ ఎక్కువగా విస్తరిస్తే.. అది రక్తం నుండి ఎర్ర రక్త కణాలను తొలగించడం ప్రారంభిస్తుంది. తగినంత ఎర్ర రక్త కణాలు లేని పక్షంలో రక్తహీనతకు దారి తీయవచ్చు.
- ప్లీహము దాని విస్తరణ ఫలితంగా తగినంత తెల్ల రక్త కణాలను సృష్టించలేకపోతే, మీరు తరచుగా ఇన్ఫెక్షన్లను గురవుతారు.
స్ప్లెనోమెగలీకి కారణం ఏమిటి?
ప్లీహము విస్తీరణకు శరీరానికి సంక్రమించే అనేక వ్యాధులు, అనారోగ్య పరిస్థితులు కారణమవుతాయి. మోనోన్యూక్లియోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు స్ప్లెనోమెగలీకి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. సిర్రోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి కాలేయ సమస్యలు కూడా విస్తారిత ప్లీహానికి కారణం కావచ్చు. స్ప్లెనోమెగలీకి మరో కారణం జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ పరిస్థితి శోషరస వ్యవస్థ వాపుకు కారణమవుతుంది. ప్లీహము శోషరస వ్యవస్థలో భాగమైనందున, ఈ వాపు ప్లీహము విస్తరిస్తుంది.
ప్లీహము విస్తరణకు ఇతర సంభావ్య కారణాలు:
- మలేరియా
- హాడ్కిన్స్ వ్యాధి
- లుకేమియా
- గుండె ఆగిపోవుట
- సిర్రోసిస్
- ప్లీహములోని కణితులు లేదా ప్లీహము వరకు వ్యాపించిన ఇతర అవయవాల ఒత్తిడి
- వైరల్, బ్యాక్టీరియా లేదా పరాన్నజీవి అంటువ్యాధులు
- లూపస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తాపజనక వ్యాధులు
- సికిల్ సెల్ వ్యాధి
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి:
ప్లీహము విస్తరించిన లక్షణాలను అనుభవిస్తే, మీ వైద్యునితో అపాయింట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ పొత్తికడుపు ఎగువ ఎడమ వైపున నొప్పిని అనుభవిస్తే, లేదా మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు నొప్పి తీవ్రమవుతుందని అనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.
స్ప్లెనోమెగలీ నుండి ఉపశమనం:
- విస్తరించిన ప్లీహానికి చికిత్స చేయడానికి, అందుకు కారణమైన అంతర్లీన సమస్యకు చికిత్స చేయాలి.
- స్లీహము విస్తారణకు ఇన్ఫెక్షన్ కారణమైతే, దానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను బట్టి మీ డాక్టర్ యాంటీబయాటిక్‌లను సూచించవచ్చు.
- విస్తరించిన ప్లీహానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల సంభవించినట్లయితే, యాంటీబయాటిక్స్ సహాయపడవచ్చు.
- మోనోన్యూక్లియోసిస్ మాదిరిగానే వైరస్ మీ ఇన్ఫెక్షన్‌కు కారణమైతే, యాంటీబయాటిక్స్ సహాయం చేయవు.
- విస్తరణ తీవ్రమైన సందర్భాల్లో ప్లీహానికి శస్త్రచికిత్స చేసి తీసివేయాలని వైద్యులు సూచించవచ్చు, దీనిని స్ప్లెనెక్టమీ అంటారు.
- అయితే ప్లీహాన్ని తొలగించిన తర్వాత సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం పూర్తిగా సాధ్యమే.
- కాగా, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగునున్న క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
- అంటువ్యాధులు దరిచేరకుండా అందుకు తగిన టీకాలు వేయడం ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
స్ప్లెనోమెగలీ అనుభవిస్తున్న వ్యక్తులు విస్తరించిన ప్లీహానికి నష్టం జరగకుండా నిరోధించడానికి మార్గాలను కనుగొనడం ముఖ్యం. ప్లీహము విస్తరించినప్పుడు, అది చీలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పగిలిన ప్లీహము తీవ్రమైన అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది, అది ప్రాణాంతకంగానూ మారే ప్రమాదముంది. ఫుట్ బాల్, హాకీ వంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడకుండా ఉండండి. కారులో ఉన్నప్పుడు సీటుబెల్ట్ ధరించాలని నిర్ధారించుకోండి. ఇది అవయవాలకు గాయం అయ్యే అవకాశాన్ని తగ్గించి.. మిమల్ని రక్షిస్తుంది. విస్తరించిన ప్లీహము అంతర్లీన కారణాన్ని చికిత్స చేయడం ద్వారా సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.