గొంతు నోప్పితో ఏమీ మింగలేకపోతున్నారా.? కారణాలు తెలుసా.?

0
Painful Swallowing

గొంతు నొప్పి లేదా గొంతు వాపుతో బాధపడుతున్నారా.? అయితే మీ బాధ మాకు అర్థమైంది. గొంతునోప్పి లేదా వాపుతో మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నా మీ బాధ వర్ణనాతీతం. ఆహారమే కాదు నీళ్లు.. చివరకు ఉమ్మిని మింగడం కూడా చాలా కష్టమన్న విషయం తెలుసు. సాధారణంగా అన్ని వయస్కుల వారు ఈ బాధను అనుభవించవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం పొందేలోపు మింగడం కష్టం మారడంతో ఈ లక్షణంతో బాధపడేవారు ఆహారాన్నే కాదు ద్రవాలను కూడా తీసుకోవాలని అనుకోరు. ఈ లక్షణం అనేక కారణాలను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి సాధారణ ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ వల్ల కలిగే ప్రతిచర్య లక్షణం. నొప్పి తీవ్రంగా ఉంటే లేదా అది తినడం, త్రాగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచలను పాటించండి.

బాధాకరమైన మింగడానికి కారణాలు

గొంతు వాపు, లేదా నోప్పి కారణంగా ఆయా వ్యక్తులలో బాధాకరమైన మింగడం అన్న సమస్య తలెత్తుతుంది. అందుకు అత్యంత సాధారణ కారణాలివే:

  • జలుబు
  • ఫ్లూ
  • దీర్ఘకాలిక దగ్గు
  • గొంతు ఇన్ఫెక్షన్, స్ట్రెప్ గొంతు
  • యాసిడ్ రిఫ్లక్స్ (గ్యాస్ట్రిక్ సమస్య)
  • టాన్సిల్స్లిటిస్

గొంతు వాపుకు, బాధాకరమైన మింగడానికి ఇతర కారణాలు:

  • మెడలోని శోషరస కణుపుల వాపు
  • గొంతులో గాయం
  • చెవి ఇన్ఫెక్షన్
  • పెద్ద మాత్రలు మింగడం
  • చిప్స్ లేదా క్రాకర్స్ లేదా బెల్లంతో చేసిన ఆహారాన్ని సరిగ్గా మింగకపోవడం
  • వీటితో పాటు అరుదైన సందర్భాల్లో, అన్నవాహిక క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్‌లు కూడా కారణం కావచ్చు

గొంతు నోప్పి/వాపుతో ఎదురయ్యే సమస్యలు ఏమిటి?

గొంతు నోప్పి/వాపుతో బాధాకరమైన మింగడానికి కారణమయ్యే పరిస్థితులు ఎదురుకావడం చేత పలు సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అవి:

  • ఛాతీ అంటువ్యాధులు
  • బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు తీవ్రతరం అవుతున్నాయి
  • రుచి కోల్పోవడం, ఇది తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉండవచ్చు
  • మెడలో ఉబ్బిన శోషరస కణుపులు, ఇది మీ తలని తిప్పడం లేదా మీ తలను వెనుకకు వంచడం కష్టతరం చేస్తుంది

ఇన్ఫెక్షన్ సోకడం వల్ల గొంతు నోప్పి/వాపు సంభవిస్తే ఏర్పడే లక్షణాలు

మీరు ఒకవేళ గొంతు నోప్పి/వాపుకు గురై ఉండే అందుకు ఇన్ఫెక్షన్ కారణమై ఉండుంటే మింగడంలో నోప్పిని అనుభవించడంతోపాటు క్రింది లక్షణాలను కూడా అనుభవించవచ్చు:

  • జ్వరము
  • చలి
  • తలనొప్పి
  • పొడి దగ్గు
  • చెమటలు పట్టడం
  • ఎరుపు, ఎర్రబడిన టాన్సిల్స్

గొంతు నోప్పి/వాపు సమస్యకు వైద్యుడిని సంప్రదించాలా.?

Sore Throat

గొంతు నోప్పి/వాపుతో బాధాపడుతన్న చిన్నారులు, శిశువులు ఎలాంటి ధ్రవ, ఘన ఆహారం మింగటంలో ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే వారు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అవి:

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • మ్రింగుట సమస్యలు
  • అసాధారణమైన లేదా గణనీయమైన మొత్తంలో డ్రూలింగ్
  • కనిపించే విధంగా ఉబ్బిన గొంతు

ఇక ఈ సమస్యతో బాధపడుతున్న పెద్దవారు ఈ క్రింది లక్షణాలను ఎదుర్కోంటే తక్షణం అసుపత్రికి వెళ్లడం సముచితం. అవి:

  • నోరు తెరవడం కష్టం
  • మింగడం సమస్యలు
  • గొంతు నొప్పి మరింత తీవ్రమైతే..
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

అంతేకాదు గొంతు నోప్పి / వాపు సమస్యతో పాటు కింది వాటిలో దేనిని ఎదుర్కోన్నా వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

  • దగ్గినప్పుడు రక్తం
  • ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే లక్షణాలు
  • రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే బొంగురు గొంతు
  • కీళ్ల నొప్పి
  • మీ మెడలో ఒక ముద్ద
  • దద్దుర్లు వచ్చినా.. ఏవైనా ఇతర లక్షణాలను ఎదుర్కొన్నా వైద్యుడిని సంప్రదించండి:

గొంతు నొప్పి / వాపుకు కారణాన్ని నిర్ధారించడమెలా.?

గొంతు నొప్పి / వాపు సమస్యతో వైద్యుడిని సంప్రదించినప్పుడు.. ప్రతీ చిన్న లక్షణం మొదలుకుని అన్నింటినీ వైద్యుడికి తెలియజేయాలి. ఏవైనా లక్షణాలు కొత్తగా ఉన్నాయా లేదా మీ అరోగ్యంపై అధ్వాన్నంగా ప్రభావాన్ని చూపుతున్నాయా అన్న వివరాలు కూడా చెప్పాలి. వాటిన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాతే వైద్యుడు మీ నొప్పికి కారణాన్ని గుర్తించగలుగుతాడు.

ఒకవేళ వైద్యుడికి మీరు లక్షణాలన్నింటినీ సరిగ్గా చెప్పలేకపోయినా.. లేక ఆయన సరైన కారణాన్ని గుర్తించలేకపోయినా.. రోగనిర్ధారణను గుర్తించడానికి, వైద్యుడు ఈ క్రింది పరీక్షలలో కొన్నింటిని నిర్వహించాల్సి రావచ్చు.

  • రక్తపరీక్ష: పూర్తి రక్త గణన పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఈ రక్త పరీక్ష మీ శరీరంలోని మొత్తంగా ఎన్ని రకాల రక్త కణాలు, ఏయే పరిమాణంలో ఉన్నాయో తెలుసుకునేలా ఈ పరీక్ష దోహదపడుతుంది. అంతేకాదు ఈ పరీక్షతో.. మీలోని రోగ నిరోధక శక్తి.. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతుందో లేదో తెలుసుకోవడానికి ఫలితాలు మీ వైద్యుడికి సహాయపడతాయి.
  • ఎమ్మార్ఐ (MRI) సిటీ స్కాన్ (CT scan) మీ గొంతు వివరణాత్మక చిత్రాలను రూపోందిస్తాయి. దీంతో మీ వైద్యుడు మీ గొంతు నోప్పి లేదా వాపుకు అసలైన కారణాలను గుర్తించేందుకు సహాయాపడుతుంది. గొంతులోని అసాధారణతలు ఏమైనా ఉన్నాయా.. మరీ ముఖ్యంగా గొంతులో కణితుల ఉనికిని గుర్తించడానికి, ఈ ఇమేజింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి.
  • గొంతు వెనకలా నుంచి శ్లేషం సేకరించి దానిని కల్చర్ పరీక్ష చేస్తారు. ఈ మధ్యకాలంలో అనేకమంది కరోనా రోగులకు చేసినట్లుగా ముక్కులోంచి కాకుండా గొంతులోంచి ఈ శ్లేషం సేకరించి శుభ్రపరుస్తారు. ఈ కల్చర్ టెస్టులో గొంతులో ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే అన్ని రకాల పరాన్నజీవులు, స్మూక్షజీవుల జాబితాను వెల్లడిస్తుంది.
  • కఫం కల్చర్ టెస్ట్ అనేది కఫం నమూనాను సేకరించి అందులో దాగి ఉన్న వైరస్, బ్యాక్టీరియా జీవుల ఉనికిని పరీక్షించి మీ గొంతు నోప్పికి, వాపుకి కారణం ఏమై ఉండవచ్చు అన్ని కనుగొనే సరళమైన, నొప్పిలేని పరీక్ష. ఇది కూడా మీ గొంతులోని ఇన్ఫెక్షన్ కు కారణం ఏంటన్న విషయాన్ని కనుగొని నిర్థారించడంలో మీ వైద్యుడికి సహాయపడుతుంది.

బేరియం స్వాలో పరీక్ష

బేరియం స్వాలో టెస్ట్: ఈ పరీక్షలో మీరు తీసుకున్న ఆహారాం అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళ్తుందా లేదా.? ఎక్కడైనా ఎలాంటి అవాంతరాలు ఏర్పాడుతున్నాయా అని తెలుసుకోవడం ఈ పరీక్ష ఉద్దేశం. ఈ పరీక్షలో రోగి నోట్లో బేరియం అనే హానికలిగించని పదార్థాన్ని వేసి దానిని మింగేలా చేస్తారు. ఇక ఆ ధ్రవం అన్నవాహిక గుండా వెళ్తున్న క్రమాన్ని ఎక్స్ రే-కిరణాల శ్రేణి ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో బేరియం.. అన్నవాహికను తాత్కాలికంగా పూయడంతో అది కాస్తా ఎక్స్- రేలో చూపిస్తుంది. ఇలా మీ వైద్యుడు మీ అన్నవాహిక నుంచి ఆహారం ప్రయాణ మార్గాన్ని గుర్తించడానికి దోహదపడుతుంది.

గొంతు నొప్పి / వాపు / బాధాకరమైన మింగడానికి చికిత్స

Throat infection

గొంతు నొప్పి / గొంతు వాపు / బాధాకరమైన మింగడానికి చికిత్స నొప్పి కారణాన్ని బట్టి మారవచ్చు. గొంతు, టాన్సిల్స్ లేదా అన్నవాహిక ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి మీ డాక్టర్ బహుశా యాంటీబయాటిక్స్ ను సూచిస్తారు. మీరు నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు మౌత్ వాష్ ఇవ్వవచ్చు. ఇది మాత్రను మింగేటప్పుడు నొప్పిని నిరోధించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన నొప్పి ఉంటే డాక్టర్లు గొంతు స్ప్రేను సూచిస్తారు. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అన్నవాహిక, గొంతు లేదా టాన్సిల్స్‌లో మంటను తగ్గించడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులను కూడా సూచించవచ్చు.

పునరావృతమయ్యే టాన్సిల్స్లిటిస్ కారణంగా మీరు తరచుగా బాధాకరమైన మింగడాన్ని అనుభవిస్తే లేదా మీ టాన్సిలిటిస్ మందులకు స్పందించకపోతే, మీ డాక్టర్ మీ టాన్సిల్స్‌ను తొలగించడానికి శస్త్రచికిత్సను సిఫార్సు చేయవచ్చు. ఈ శస్త్రచికిత్సను టాన్సిలెక్టమీ అంటారు. ఇది ఔట్ పేషెంట్ ప్రక్రియలో భాగంగానే నిర్వహిస్తారు. కాటరాక్ట్ పరీక్ష మాదిరిగా ఇది జరిగిన రోజునే పేషంట్ ఇంటికి వెళ్లవచ్చు. అయితే టాన్సిలెక్టమీ ప్రమాదాల గురించి మీరు ముందుగానే వైద్యుడితో చర్చించవచ్చు.

గృహ చిట్కాలు

ఓవర్-ది-కౌంటర్ (OTC) యాంటాసిడ్లు యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా అన్నవాహికలో వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. దీర్ఘకాలికంగా యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)తో బాధపడుతున్నవారైతే, లక్షణాల నుండి ఉపశమనం అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మందులను వైద్యులు సూచిస్తారు. ఓవర్ ది కౌంటర్ యాంటాసిడ్‌లను తీసుకోవడం కొన్నిసార్లు GERD లక్షణాల చికిత్సకు సరిపోదు.

మీరు ఇంట్లో ప్రయత్నించగల ఇతర చికిత్సలు క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం ద్వారా పేషంట్ హైడ్రేటెడ్‌గా ఉంటారు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
  • 8 ఔన్సుల నీటిలో 1 టీస్పూన్ ఉప్పు కలపి దానిని నోట్లోకి తీసుకుని పుక్కిలించండి. ఇది వాపు, నొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.
  • గొంతులో వాపు నొప్పి నుండి ఉపశమనానికి తేనెతో కలిపిన వెచ్చని నీరు లేదా టీ వంటి వెచ్చని ద్రవాలను సిప్ చేయండి.
  • మీ గొంతుకు చికాకు కలిగించే పదార్థాలను నివారించండి. వీటిలో అలెర్జీ కారకాలు, రసాయనాలు, సిగరెట్ పొగ లాంటివి దూరంగా ఉంచండి.

తేమతో కూడిన గాలిని పీల్చుకోండి

హ్యూమిడిఫైయర్ అనే నీటిని తేమగా మార్చే యంత్రం గాల్లో తేమను నింపడంతో దోహదపడుతుంది. ఈ హ్యూమిడిఫైయర్ మీ గదిలో ఏర్పాటుచేసుకుని.. తేమతో కూడిన గాలిని పీల్చడం వల్ల గొంతు మంట తగ్గుతుంది, గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి స్నానం చేయడం కూడా ఇదే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

హెర్బల్ టీ, లాజెంజెస్ లను ప్రయత్నించండి.

గొంతు నొప్పిని తగ్గించడానికి శాస్త్రీయంగా నిరూపించబడనప్పటికీ, మూలికా లాజెంజెస్, టీలు గొంతు నొప్పిని తగ్గించి ఉపశమనం కల్పిస్తాయి. ఉదాహరణలలో సేజ్, లికోరైస్ రూట్, హనీసకేల్ ఫ్లవర్ ఉన్నాయి.

మీరు గొంతు నోప్పి/ వాపు కారణంగా బాధాకరమైన మింగడాన్ని అనుభవిస్తున్నవారు ఉపశమనం పోందేందుకు ఓవర్ ది కౌంటర్ (OTC) మందులను వినియోగించండి. ఇక దీంతో పాటు గృహ చిట్కాలను కూడా వినియోగించి మీ గొంతులోని ఇన్ఫెక్షన్ లేదా తాత్కాలిక అనారోగ్యం ఉన్నా.. వాటి నుంచి ఉపశమనం పోందవచ్చు, మీరు ఇంట్లో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే, మీ నొప్పి మరింత తీవ్రమైతే లేదా మూడు రోజుల్లో మీ నొప్పి తగ్గకపోతే మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.

ఇక ఓటిసి మందుల ద్వారా ఏవైనా ఇతర లక్షణాలు ఎదుర్కొంటుంటే.. వైద్యుడిని సంప్రదించి వివరించాలి.

అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీ చేతులను క్రమం తప్పకుండా కడుక్కోండి. ఇతర వ్యక్తులతో తినే పాత్రలు లేదా త్రాగే గ్లాసులను పంచుకోకండి. హైడ్రేటెడ్‌గా ఉండటం పుష్కలంగా విశ్రాంతి తీసుకోవడం త్వరగా కొలుకునేందుకు చాలా ముఖ్యం.