శీతాకాలం వచ్చిందంటే చాలు పలు వ్యాధులు ముసురుతుంటాయి. ఈ క్రమంలో వచ్చే ఏ వ్యాధినైనా సీజనల్ వ్యాధిలాగానే పరిగణించి తేలిగ్గా తీసుకోవద్దు. ఇక శీతాకాలంలో గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా అధికం. మనం తీసుకున్న ఆహారం కూడా ఒక పట్టాన జీర్ణం కాదు. దీనికి తోడు ఎముకలు కొరికే చలి గుండెను పిండేస్తుంది. చలికాలంలో గుండె రక్తనాళాలు పగిలిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో హృదయ సంబంధ రుగ్మతలు ఉన్న వ్యక్తులు మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
గుండెపోటు తీవ్రత: శీతకాలం గుండెపోటు సంబంధ రుగ్మతలు వచ్చే ముప్పు సాధారణ పరిస్థుల కన్నా 50 శాతం అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు కనీసంగా అరగంట నుంచి గంట వరకు క్రమం తప్పకుండా నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఉదయం పూట చల్లగాలిలో కాకుండా ఎనమిది గంటల తరువాత వాకింగ్ చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం అందించిన వారవుతారని సూచించారు.
గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ
చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం చిక్కగా మారుతుంది. తద్వారా శ్వాసనాళాలు కుచించుకు పోయి.. గుండెలోని రక్తనాళాలు కూడా ముడుచుకుపోతాయి. రక్తపోటులో మార్పులు చోటుచేసుకుంటాయి, రక్తం చిక్కగా కావడం, రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల.. రక్త సరఫరా కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. రక్తంలో కెటాకెలోమిన్స్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. గెండే వేగం పెరుగుతుంది. దీంతో ఇప్పటికే గుండె రక్తనాళాల్లో ఫలకాలు ఉంటే ఆ ఫలకాలపై రక్తం గడ్డ కట్టి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది.
40 ఏళ్లలోపు యువతలోనూ ఈ ముప్పు ఉంది. అయితే అందుకు కారణం ధూమపానం. గుండెపోటు బాధితుల్లో 40 ఏళ్లలోపు వ్యక్తుల ఈ ప్రమాదానికి గురికావడానికి కారణం పొగాకు వినియోగమేనని ఓ అధ్యయనం వెల్లడించింది. చలిని జయంచే వయస్సులో ఉన్న యువత.. దానిని తట్టుకోవడానికి అతిగా ధూమపానం చేయడం, మద్యం తీసుకోవడం ఈ ముప్పుబారిన పడుతున్నారని అధ్యయనం పేర్కొంది. హృదయ స్పందన రేటు, లయను నియంత్రించే నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కారణంగా, గుండె స్పందనలు లయబద్దం తప్పడంతో వేగం పెరిగి కొట్టుకుంటుంది. దీనినే ‘అరిథ్మియా’ అంటారు.
చాలామందికి తెలియకుండానే నిద్రలోనే చనిపోతున్నారు. చలికాలంలో ఆకస్మిక మరణాలు యువకులతో పోలిస్తే వృద్ధులలో ఎక్కువగా సంభవిస్తాయి. గుండెపోటు మరణాలు మహిళల్లో కంటే పురుషులలోనే ఎక్కువగా చూస్తున్నాం. కొందరిలో పొగమంచు, వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో ఇన్ఫెక్షన్ తీవ్రమవుతుంది. వీరికి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువ.
- గుండెపోటును నివారించడానికి ధూమపానం మానేయండి.
- ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.
- చలికాలంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ మొత్తంలో తరచుగా తినండి.
- రక్తంలో చక్కెర స్థాయిలు కూడా మారుతూ ఉంటాయి.
- ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్న వారు.. మోతాదు హెచ్చుతగ్గుల గురించి వైద్యుడిని సంప్రదించాలి.
వ్యాయామం దాటవేయవద్దు
చలికాలంలో రాత్రిపూట ప్రయాణం చేయకూడదు. రాత్రి 7 గంటల తర్వాత చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్ లు తీసుకోకపోవడమే మంచిది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. దీర్ఘకాలిక అలర్జీలు, ఆస్తమా, సైనసైటిస్ ఎక్కువగా ఉంటాయి. చలితో బాధపడేవారికి దూరంగా ఉండటం మంచిది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఈ కాలంలో కండరాలు, ఎముకలు, కీళ్లు దృఢంగా ఉంటాయి. ఇది కండరాలు, కీళ్ల నొప్పులను పెంచుతుంది. చలికాలంలో రక్తనాళాలు కూడా కుంచించుకుపోతాయి. ఫలితంగా గుండె, మెదడులో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. విపరీతమైన చలి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా ప్రబలంగా ఉంటాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మహిళల్లో ఎక్కువగా వేధిస్తుంటాయి. మరీ చల్లని పరిస్థితులు ఉత్పన్నమయితే మనశరీరం కూడా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండేందుకు జీవక్రియల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆకలి పెరుగుతుంది. ఒకవైపు చలి కారణంగా వ్యాయామం తగ్గించి.. మరోవైపు ఆకలిని అధిగమించడానికి అతిగా తినడం వల్ల బరువు పెరగుతుంటారు. అయితే ఉదయం చల్లని వాతావరణం కంటే ఇతర అనుకూలమైన సమయాల్లో వ్యాయామం చేయడం సముచితం.
వీరు అప్రమత్తంగా ఉండాలి
- అప్పటికే ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతున్నారు
- మధుమేహం మరియు అధిక రక్తపోటు బాధితులు
- రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్న వ్యక్తులు
- ధూమపానం చేసేవారు
- శారీరక వ్యాయామానికి దూరంగా ఉన్నారు
- నిల్వ ఉంచిన ఆహారపదార్థాలు, ఫ్రై ఎక్కువగా తినేవారు
- స్థూలకాయులు
- అధిక ఒత్తిడికి గురుయ్యేవారు
- నిద్రలేమితో బాధపడేవారు
- గుండె జబ్బు కుటుంబ చరిత్ర
లక్షణాలను ఎలా గుర్తించాలి?
- ఛాతీ మధ్యలో, పై భాగంలో నొప్పి
- దవడ లాగడం
- నొప్పి ఛాతీ నుండి ఎడమ, కుడి చేతులు మరియు గొంతు వరకు వ్యాపిస్తుంది
- చెమటలు పడుతున్నాయి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- ఛాతీలో భారం
- చలికాలంలో ఈ లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ, అత్యవసరంగా వైద్యుడిని సంప్రదించాలి.