గర్భనిరోధక మాత్రలను తీసుకుంటున్నారా.? వాటి సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా.!

0
Contraceptive pills

జనన నియంత్రణకు అందుబాటులో ఉన్న గర్భనిరోధక మాత్రలను తీసుకుంటూ నేటి యుక్తవయస్సు మహిళలు.. పిల్లలను కనడాన్ని మాత్రం కొంతకాలం వాయిదా వేస్తున్నారు. ఇది సముచితమా.? కాదా.? అన్న విషయాలు వారిష్టం. కానీ కమ్మనైన అమ్మతనాన్ని కాదనుకునే వారు మాత్రం ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. అయితే పెళ్లైన వెంటనే పిల్లలు, వారి బాధ్యతలతో తలమునకలై సంసార చట్రాన్ని లాక్కు రావడమేనా జీవితం అంటూ అధునాతన భావాలుగల మహిళలు అలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయితే కొన్నేళ్ల పాటు మాత్రమే పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. అందుకు వారికి అనేక కారణాలు ఉన్నాయి. భర్తపై కూడా నూటికి నూరుపాళ్ల నమ్మకం రావడం కూడా కారణం కావచ్చు.

అయితే పిల్లలను అప్పుడే వద్దని భావిస్తున్న ఈ మహిళలు డాక్టర్ల సూచనలు, సలహాలను తీసుకోకుండానే వారి సొంత నిర్ణయం మేరకు మార్కెట్లో లభ్యమయ్యే గర్భనిరోధక మాత్రలను తీసుకుని గర్భదాల్చడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కాగా, ఈ గర్భనిరోధక మాత్రలలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి భవిష్యత్తులో తమకు పిల్లలు కావాలనే సమయానికి ఎలాంటి దుష్ఫ్రభావాన్ని చూపుతాయన్న వివరాలను కూడా పట్టించుకోకుండా.. కనీసం అవగాహన కూడా లేకుండా ఈ మాత్రనే విరివిగా వాడేస్తున్నారు. అయితే ఈ గర్భనిరోధక మాత్రలలో సింథటిక్ ఈస్ట్రోజెన్, ఇథినైల్ ఎస్ట్రాడియోల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఇథినైల్ ఎస్ట్రాడియోల్ ప్రతి నెలా గర్భాశయంలో గుడ్డు పెరగకుండా ఆపుతుంది. గర్భనిరోధక మాత్రలు స్త్రీలకు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం తగ్గిస్తాయి.

కొత్తగా పెళ్లయిన మహిళలు మొదలు.. తొలి కాన్సు తరువాత రెండో బిడ్డ కోసం మరికొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలపైనే ఆధారపడుతున్నారు. కానీ అలా వాడితే మంచి లేదా చెడు జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని వాడడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాగే హార్మోన్ల అసమతుల్యత కూడా వస్తుందని చెబుతున్నారు. 1960వ దశకంలో గర్భనిరోధక మాత్రను ప్రవేశపెట్టినప్పుడు మహిళలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గర్భం దాల్చకపోవడం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని వారు భావిస్తున్నారు. అయితే వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూసి రాంరా భయపడుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మంది మహిళలు గర్భస్రావాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 75 శాతం మంది మహిళలు వైద్యులను సంప్రదించకుండానే మందులు వాడుతున్నారని తేలింది.

గర్భనిరోధక మాత్రలు, వికారం లేదా వాంతులు, తలనొప్పి యొక్క దుష్ప్రభావాలు. డిప్రెషన్ కూడా సర్వసాధారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొంతమంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా పీరియడ్స్ ఎక్కువ వ్యవధి వంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 25-45 ఏళ్లలోపు మహిళలు ఈ మాత్రలు ఉపయోగించకూడదు. కౌమారదశలో ఉన్నవారు పదేపదే ఉపయోగించడం వారి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. హార్మోన్ల స్థాయి తక్కువగా ఉన్న యువతులు కూడా ఈ మాత్రలు తీసుకోవడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. ఈ మాత్రలు కొంతమంది స్త్రీలలో బరువు పెరగడానికి కూడా కారణమని తేలింది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

  • ఊబకాయం సమస్యతో బాధపడుతున్న మహిళలు ఈ మాత్రలు వాడరాదు.
  • మధుమేహం లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
  • పొగతాగే అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలు అస్సలు తీసుకోరాదు.
  • ఈ మాత్రలను 10 ఏళ్లకు పైగా తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ముప్పు 60 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాలు హెచ్చరించాయి.
  • గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ నాళాలపై ప్రభావం చూపుతాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
  • కుటుంబంలో రక్తం గడ్డకట్టిన చరిత్ర ఉన్నవారు ఈ మాత్రలు వేసుకోకూడదు.
  • అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండడం సముచితం.
  • శరీరానికి సరైన మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అందేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఈ మాత్రలు వేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.