శీతాకాలంలో మీ గుండె పథిలంగా పరిరక్షించుకొండిలా..!

0
Winter heart attacks

శీతాకాలం వచ్చిందంటే చాలు హృద్రోగుల్లో టెన్షన్ పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధిగ్రస్థులకు చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఈ చలికాలంలో సంభవించే మరణా్లలో అత్యంత సాధారణంగా గుండెపోటు మరణాలు సంభవిస్తాయంటే నమ్మగలరా.? కానీ ఇది ముమ్మాటికీ నిజమని వైద్యపరిశోధలకు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ మరణాలలో యుక్తవయస్సు వారు అనగా 20 ఏళ్ల యువత నుంచి 50 ఏళ్ల వయస్సువారు కూడా ఉండటం గమనార్హం. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే అనేక ముఖ్యమైన ప్రమాద కారకాలు ఉన్నప్పటికీ, అలాగే లక్షణాలపై ఆలస్యమైన శ్రద్ధ, కాలానుగుణ మార్పులు కూడా మీ హృదయాన్ని దెబ్బతీస్తాయి.

శీతాకాలం తరచుగా చాలా మంది ఇష్టపడే సీజన్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, చాలా మంది గుండెపోటు కారణంగా అసుపత్రుల్లోనూ చేరుతుంటారు. అందుకు శీతల వాతావరణం కూడా ఒక కారణం కావచ్చు. అంతేకాదు హృద్రోగ సమస్యలు మాత్రమే కాదు, శ్వాసకోశ వ్యాధులు, వైరస్‌ల ఆక్రమణలు కూడా చలికాలంలో ఆందోళన కలిగిస్తాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అకస్మాత్తుగా తగ్గడంతో.. ఆకస్మిక గుండెపోటులు, అనారోగ్యాలకు కారణంగా మారుతోంది. అత్యవసర సంరక్షణల మధ్య చలికాలం అత్యంత జాగ్రత్తగా ఉండవల్సిన అవశ్యకత ఏర్పడింది.

చలికాలంలో గుండెపోటు మరణాలు ఎందుకు సాధారణం?

చలికాలంలో గుండెపోటు మరణాలు ఎందుకు సాధారణంగా మారుతున్నాయన్న అంశంపై ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ఖచ్చితమైన కారణాలను విశ్లేషించలేకపోయారు. కాగా, చాలామంది వైద్యనిపుణులు గుండెపోటు కారణాలు పెరగడానికి ఒక కారణం మనిషి శరీర ధర్మమేనని పేర్కోంటున్నారు. ఉష్ణోగ్రతల తగ్గుదల గుండెపై ఇలా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అనేక అధ్యయనాలు చలికాలంలో, స్ట్రోకులు, గుండె ఆగిపోవడం, హృదయ సంబంధ సమస్యలు, అరిథ్మియా రుగ్మతలు, సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని సూచిస్తున్నాయి.

చలికాలంలో మనిషి నాడీ వ్యవస్థ సాధారణం కన్నా రెట్టింపు స్థాయిలో వేగాన్ని అందుకుంటుంది. శీతల వాతావరణంలో ఈ వ్యవస్థ క్రియాశీలత పెరుగడంతో.. దాని ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళలు సంకుచితంగా మారుతాయి. దీనినే ‘వాసోకాన్స్ట్రిక్షన్’ అని పిలుస్తారు. దీని ప్రభావం పడినప్పుడు, రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. తద్వారా శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేయడంలో గుండె కష్టపడి పని చేస్తుంది. ఇంకా, శీతాకాలంలో, ఉష్ణోగ్రతలు శరీర వేడిని నిర్వహించడంలో ఇబ్బందిని కలిగిస్తాయి, అల్పోష్ణస్థితికి కారణమవుతాయి, ఇది గుండెలోని రక్త నాళాలకు అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. దీంతో గుండె సంబంధ వ్యాధులు తలెత్తే ప్రమాదముంది.

ప్రమాదాలు గుండె రోగులను ఎలా ప్రభావితం చేస్తాయి?

శీతాకాలపు చలిని ఎదుర్కోవడం దాదాపు అన్ని వయస్కుల వారికి కష్టమే. అందుకనే సాధారణంగా ఉదయం ఆరుగంటలక లేచేవారు కూడా ఈ చలికాలంలో ఏడు దాటిన ముసుగుతన్ని పడుకుంటారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలకు అనుగూణంగా శరీరం వేడిని నియంత్రించడానికి మనిషి హృదయం రెట్టింపు స్థాయిలో కష్టపడి పని చేస్తుంది. ఇలా గుండె పనిచేయడం.. దాని పనితీరుపైనే ప్రభావం చూపుతుంది. అయితే ఇలా రెట్టింపుస్థాయిలో కష్టపడి పనిచేయడం సాధారణ వ్యక్తుల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏర్పడకపోయినా.. గుండె రుగ్మతలు ఎదుర్కోంటున్న వ్యక్తులలో లేదా గుండెపోటు చరిత్ర ఉన్న వ్యక్తులలో మాత్రం ఇది ప్రమాద హేతువుగా మారవచ్చు. ఇక దీనికితోడు చలికాలంలో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అవసరాలు కూడా పెరుగుతాయి. అయితే గుండె రెట్టింపు స్థాయి పనితనంలో రక్తనాళాలలో సంకోచం ఇప్పటికే ఏర్పడిన నేపథ్యంలో.. ఆక్సిజన్ ను తగిన మొత్తంలో గుండెకు చేరవేయడంలో విఫలమై.. అది కాస్తా గుండెపోటుకు కారణంగా మారుతుంది.

గుండెపోటుకు కారణమయ్యూ ఇతర అంశాలు.?

గుండెపోటు దారితీసే ప్రమాద కారకాల పరోక్ష పెరుగుదల శీతాకాలం ప్రారంభంతో అధి్ంగా ఉండవచ్చు. చల్లటి ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు బయటకు రావడం, శారీరకంగా చురుకుగా ఉండటం కష్టంగా ఉంటుంది. ఇక నిత్యం వ్యాయామం చేసేవాళ్లు కూడా ఈ కాలంలో చలి భయంతో కాస్తా వెనుకంజ వేస్తారు. చలిపులి పంజా ధాటికి వృద్దులైతే వ్యాయామాన్ని కూడా నిలిపివేస్తారు, వ్యాయామం చేయడానికి వెళ్తే.. చల్ల గాలి తమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండెపై కూడా సహేతుకం కాదని వ్యాయామాన్ని నిలిపేస్తారు. ఆహార వినియోగం, అలవాట్లు కూడా మారవచ్చు. కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ధమనులపై ప్రభావం చూపుతుంది. ఇక మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ శారీరిక, మానసిక ఒత్తిడికి గురికావద్దు. ముందస్తు ఆందోళనలు కూడా ప్రమాద కారకంగా మారవచ్చు.

ఇక, పెరుగుతున్న పొగమంచు, కాలుష్య స్థాయిలతో, గాలిలోని పార్టిక్యులేట్ మేటర్ (PM) స్థాయిలు కూడా మంటను తీవ్రతరం చేస్తాయి, గుండె సమస్యలను కలిగిస్తాయి. కాలుష్య స్థాయిలు కార్డియోవాస్కులర్ మరణాలలో 69% పెరుగుదల, మరణాల రేటు పెరుగుదలతో సంబంధం కలిగి ఉన్నాయని సంవత్సరాల తరబడి వృత్తాంత ఆధారాలు హైలైట్ చేశాయి. ఈ కారకాలన్నీ, జన్యుపరమైన ప్రమాదాలు, ఆరోగ్యం పట్ల తక్కువ శ్రద్ధతో పాటు, శీతాకాలంలో గుండెపోటు ప్రమాదాలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి.

గుండెపోటు ప్రమాదాన్ని తప్పించుకుని సురక్షితంగా ఉండడం ఎలా.?:

గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోంటున్న ఏ వయస్సువారైనా శీతాకాలంలో గుండెపోట్ల ప్రమాదం నుంచి అనిశ్చిత సంరక్షణ అవసరం. చలివాతావరణంలో గుండెపోటు పరోక్ష ప్రమాద కారాకాలు ప్రేరేపిత స్థాయిలో ఉంటాయి. దీనికి తోడు కాలుష్య స్థాయిలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున, సరైన విధానాన్ని అనుసరించడం, ఆరోగ్యాన్ని సరైన మార్గంలో నడవడం వల్ల గుండె జబ్బులను దూరంగా ఉండటం మంచిది. మీ గుండె పనితీరును చక్కగా ఉంచుకోవడానికి ఇక్కడ నిపుణులు ఆమోదించిన మార్గాలు ఉన్నాయి:

  • చలిని తట్టుకునేలా ఉన్ని దుస్తులను ధరించడం: వాతావరణంలో మార్పు కారణంగా చలికాలంలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు త్వరగా జబ్బు పడే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రమాదంలో ఉన్నట్లయితే, మీరు మంచి దుస్తులు ధరించారని వాతావరణానికి సరిపోయే లేయర్‌లలో మిమ్మల్ని మీరు కప్పుకున్నారని నిర్ధారించుకోండి. కాలుష్య స్థాయిలతో వచ్చే కాలానుగుణ ఇబ్బందులను పరిష్కరించడానికి ఇది మంచి మార్గం.
  • శారీరకంగా చురుకుగా ఉండండి: చలి ఉష్ణోగ్రతలు బయటకు వెళ్లడానికి భయపడుతున్న తరుణంలో, వ్యాయామం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనండి. రెగ్యులర్ శారీరక శ్రమ, వ్యాయామం మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీరిక వేడిని నియంత్రించడంలో మరియు ఫిట్‌గా ఉండటానికి సహాయపడతాయి. ఇంటి వ్యాయామాలు, హృదయానికి అనుకూలమైన ఏరోబిక్ కదలికలు, యోగా, ధ్యానం కూడా అద్భుతాలు చేస్తాయి.
  • కొమొర్బిడిటీల ప్రమాదాన్ని తగ్గించండి: గుండె జబ్బులు, ఆకస్మిక గుండెపోటు ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే రక్తపోటు, మధుమేహం సహా ఇతర వాస్కులార్ సమస్యలన్నింటినీ నియంత్రణలో ఉంచడం అవసరం. శరీరంలో మధుమేహం, రక్తపోటు స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా పరీక్షలు చేసుకుని వాటిని నియంత్రించుకోవాలి, లేని పక్షంలో అవే గుండెపోటుకు, లేదా గుండె సంబంధిత వ్యాధులకు కారకంగా మారవచ్చు.
  • మీ ఆహారపు అలవాట్లపై చెక్ ఉంచండి: చలికాలం ఆకలిని పెంచుతుంది.. అయితే అదే సమయంలో అజీర్ణ సమస్యకు కూడా ఈ కాలం కారకమన్న విషయాన్ని మర్చపోరాదు. నూనే, నెయ్యిలలో వేయించిన పధార్థాలు, తీపి ఆహారాలను తీసుకునే ముందుకు కాసింత ఆలోచించండి. తీపి తినాలన్న భవనతో పాటు ఎక్కువ వేపుడు పదార్థాలను తీసుకునేలా చేస్తుంది. అయితే ఈ పదార్థాలలో కొలెస్ట్రాల్, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకునే బదులు నియంత్రణగా ఉండటం మంచింది. ఏదేని అహారపు పదార్థాలను పరిమితులలో తీసుకోంటూ.. సాధ్యమైనప్పుడల్లా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం చూడండి. మద్యం, పొగాకు వినియోగాన్ని పరిమితం కన్నా వదిలేయడం సముచితం.
  • గుండె ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆకస్మిక గుండెపోటులు రాకుండా నిరోధించడానికి, ప్రతి వ్యక్తి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. స్క్రీనింగ్‌ పరీక్షలకు వెళ్లడం వల్ల కుటుంబాలను ప్రమాదాల్లోంచి తప్పించిన వారువుతారు. ప్రమాద కారకాలను అంచనా వేయడం, తదనుగుణంగా చర్య తీసుకోవడం చాలా అవసరం.

తక్షణ వైద్యసహాయం అందేలా చేయడం: గుండెపోటుకు సంబంధించిన వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందేలా చేయడం అత్యంత అవసరం. గుండెపోటుకు గురైన వ్యక్తికి తొలి రెండు గంటల్లో జరిగే నష్టం అత్యధికం. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయాన్ని అందించడం అవసరం. గుండెపోటు నేపథ్యంలో హెచ్చరిక సంకేతాలు, లక్షణాలను గుర్తించండి, వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించాలి. ఎటువంటి లక్షణాలను అలక్ష్యం చేయవద్దు. ఏదైనా చికాకు, ఛాతీలో భారం, చెమట, భుజం నొప్పి, దవడ నొప్పి, తల తిరగడం లేదా వికారం వంటి వాటిని తేలికగా తీసుకోకూడదు.

  • యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ ప్రకారం, ఊబకాయం, దూమపానం, అధిక రక్తపోటు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువ. అమెరికా సిడిసి ప్రకారం, అధిక రక్తపోటు గుండెను దెబ్బతీయడమే కాకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అయితే స్ట్రోక్ ప్రమాదం నుంచి బయటపడటానికి అందరూ 20:30:40 సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
  • ప్రతిరోజూ 20 నిమిషాలు సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రోటీన్ తీసుకోవడం, ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. దీన్ని ఆచరించడం ద్వారా చలికాలంలో వచ్చే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకాంతిలో నిలబడటం ద్వారా మనిషి రోగనిరోధక వ్యవస్థ ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్‌తో పోరాడటానికి ప్రతిరోధకాలను తయారు చేస్తుంది. సూర్యరశ్మి వల్ల శరీరం ఈ యాంటీబాడీలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ సూర్యరశ్మి మన వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పనితీరును పెంచుతుంది. కాబట్టి రోజూ 20 నిమిషాల పాటు ఉదయాన్నే ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా లభించే సెరోటోనిన్ అనే హార్మోన్ కార్బోహైడ్రేట్లను విడుదల చేస్తుంది. చలికాలంలో తక్కువ సూర్యకాంతి వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఆకలి హార్మోన్ గ్రెలిన్‌ను తగ్గిస్తుంది. ఆహారంలో 30 నుంచి 35 శాతం కేలరీలు ప్రొటీన్ల నుంచి వస్తే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి. చలికాలంలో ప్రతిరోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని 27 శాతం తగ్గిస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, సైకాలజీ, న్యూరోసైన్స్ ప్రకారం, రోజుకు 30 నుండి 40 నిమిషాలు వ్యాయామం చేసే వ్యక్తులు నిరాశకు గురయ్యే ప్రమాదం 28 శాతం తక్కువగా ఉంటుంది.
  • మేయో క్లినిక్ ప్రకారం, శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల ద్వారా రక్తాన్ని బలవంతం చేయడానికి ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది తద్వారా రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోకులు రక్తం గడ్డకట్టడం వల్ల సంభవిస్తాయి. ఈ గడ్డ మెదడుకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ నుండి రక్షించడానికి రోగనిరోధక వ్యవస్థ యొక్క రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ఫలకాలు పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.