తరచుగా ఒళ్లు నోప్పులా.. కారణాలు తెలుసా? మాత్రలే మార్గమా?

0
Regular body aches reason

ఐశ్వర్యం కన్నా ఆరోగ్యమే మిన్న. ఎంతటి సంపద ఉన్నా అరోగ్యంగా లేరంటే అనుభవించలేరు. అయితే ఆరోగ్యంగా ఉన్నారంటే ఐశ్వర్యాన్ని సంపాదించినట్టే. అయితే అనారోగ్యం సమస్యలను చికిత్సలతో, వైద్యులు రాసి ఇచ్చే మాత్రలతో అడ్డుకట్ట వేస్తామని భావించినా.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇక మారుతున్న కాలంతో పాటు ప్రజలు కూడా మారుతూ.. నెట్టింట్లో తమ సమస్యను అడిగి అందుకు తగు మాత్రలను పొందుతున్నారు. ఇంకొందరు గతంలో తమకు ఇలాంటి సమస్యే వచ్చిన సందర్భంలో వైద్యులు ఇచ్చిన మాత్రలనే మళ్లీ వాడేస్తుంటారు. ఏదీ ఏమైనా సొంతవైద్యం మంచిది కాదన్న విషయం తెలుసుకోవాలి. ఇక నెట్టింట్లో సమస్యకు తగు మాత్రను పోందడం కన్నా వైద్యులను సంప్రదించడమే మంచింది.

అయితే సాధారణంగా తలనొప్పి, జలుబు, జ్వరం, ఒళ్లు నోప్పులు ఇలాంటివి దాడి చేసినప్పుబు వైద్యులను సంప్రదించేవారి సంఖ్య చాలా తక్కువ. శిశువులు, చిన్నారులను మినహాయిస్తే దాదాపుగా పెద్దలెవ్వరూ ఆసుపత్రులకు వెళ్లరు. సొంతవైద్యానికే ఓటు వేస్తారు. అయితే ఒళ్లు నోప్పులు అంత ప్రమాదకరమైన పరిణామం ఏం కాకపోయినా.. నోప్పి వల్ల కలిగే బాధ తీవ్రంగా ఉంటే మాత్రం తట్టుకోలేరు. కొంతమంది నిత్యం ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. ఇవి ఎందుకు వస్తాయో చాలా మందికి తెలియదు. వాటి కారణాలను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించరు. ముందుగా నోప్పిని పారద్రోలాలన్నదే ప్రధానం. దీంతో ఏదో ఒక పెయిన్ కిల్లర్ మాత్రను మింగేస్తారు. ఎందుకంటే ఈ నొప్పులు వారిని ఏ పనీ చేయనీయవు. అయితే తరచుగా మరీ ముఖ్యంగా మహిళల్లో ఒళ్లు నోప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారంటే..

నిద్రలేమి

ప్రతీ రోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే నిద్రలో మాత్రమే శరీరం శక్తి వనరులను పునరుత్పత్తి చేస్తుంది. నిద్రలోనే మనిషి రీఫ్రెష్ అవుతాడు. అది దేవుడు జీవుడికి కల్పించిన వరం. కానీ ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నారు. నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇక రాత్రివేళ నిద్రకు స్వస్తి పలికి పగటి నిద్రకు ఉపక్రమిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కంటికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం తన శక్తి వనరులను తిరిగి పునరుద్దరణ చేసుకోలేక పోవడంతో ఒళ్లు నొప్పులు సంభవిస్తాయి.

డీహైడ్రేషన్

శరీరంలో నీరు తగ్గడం వల్ల కూడా శరీరం నోప్పులకు గురవుతుంది. మరీ ముఖ్యంగా గొంతు నొప్పి వస్తుంది. శరీరానికి కనీసం మూడు లీటర్ల నీటిని పగటిపూట తాగాల్సిఉంటుంది. రాత్రిపూట మాత్రం అవసరమైనంత మేరకు తాగితే సరిపోతుంది. అయితే శరీరానికి అవసరమైన కనీసం మూడు లీటర్ల నీటిని తాగకపోవడం.. దీనికి తోడు నీరు కోల్పోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో ఒళ్లంతా అలసట, నొప్పి వస్తుంది.

ఇనుము లోపము

రక్తంలో ఇనుము చాలా ముఖ్యమైన అంశం. అయితే రక్తంలో ఐరన్ తగిన మోతాదులో ఉన్నప్పుడు సమస్యలు ఉండవు. కానీ ఐరన్ తక్కువ మోతాదులో నమోదైనప్పుడు మాత్రం శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగా అందవు. దీంతో అలసటతో పాటు శరీర నొప్పులు కూడా వస్తాయి.

ఆర్థరైటిస్

కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ లేదా కీళ్ల వాపు సమస్యల వల్ల వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి తగ్గితే బాడీ పెయిన్స్ తగ్గుతాయి.

Regular body aches reason

జలుబు, ఫ్లూ

రుతువులు మారిన కాలంలో మరీ ముఖ్యంగా చలి, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి. దీంతో జలుబు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడం సాధారణం. అయితే ఈ సమయంలో అధికంగా దాడి చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు సోకితే మాత్రం విపరీతమైన ఒళ్లునొప్పులకు కారణమవుతాయి.

మానసిక ఒత్తిడి

ఒత్తిడి మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరం అలసిపోతుంది. ఇది మిమ్మల్ని మరింత బలహీనపరుస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఫలితంగా, శరీరం అనేక వ్యాధులకు ఆవాసంగా మారుతుంది. ఇవన్నీ వెన్నునొప్పికి కారణమవుతాయి.

విటమిన్ డి లోపం

మన శరీరం సక్రమంగా పనిచేయడానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది ఎముకలు మరియు దంతాలు బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే, మనం తరచుగా నొప్పికి గురవుతాము.

ఒళ్లు నోప్పులు వచ్చిన వెంటనే వాటికి కారణాలు ఏమిటో తెలుసుకోవడంతో పాటు సమస్యను సంబంధిత వైద్యులకు వివరిస్తే.. వారు తగు చికిత్స అందిస్తారు. దీంతో తరచు కలిగే ఒళ్లు నోప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకానీ సొంత వైద్యాన్ని నమ్ముకుని సైడ్ ఎఫెక్ట్స్ కు గురికావద్దని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.