క్యాన్సర్.. దీని గురించి కాసింత ఎక్కువగా అలోచిస్తేనే మనుషులు అందోళనుకు గురవుతుంటారు. మరీ దీని బారిన పడినవారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. వారు అనుభవించే మానసిక వేధన చెప్పనలవి కాదు. వ్యాధిబారిన పడిటం కంటే.. వ్యాధి గురించిన ఆలోచనలు, అపోహలు వారి మదిని చిన్నాభిన్నం చేస్తాయి. దాని భయమే మనుషులను మానసికంగా, శారీరికంగా కుంగదీస్తుంది. ఇక ఈ క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల, కాలేయం, గొంతు, బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్ ఇలా చాలా రకాలు. వామ్మో.. ఇన్ని క్యాన్సర్లు ఉన్నాయా.? అసలు క్యాన్సర్ అంటే ఏమీటి.. ఎందుకు వస్తుంది. శరీరంలోని ఏయే భాగాల్లో ఇది వస్తుంది అన్న వివరాలను తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. నియంత్రణ లేకపోవడం వల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా పెరుగుతాయి. అంతేకాదు ఇవి విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలనే క్యాన్సర్లుగా పిలుస్తారు. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనాఉత్పన్నం కావచ్చు.
క్యాన్సర్లు ఎన్ని రకాలు..?
అనియంత్రణ వల్ల పెరిగే కణాల సమూహాలను క్యాన్సర్లుగా పరిగణిస్తామని తెలుసు. వీటిని ట్యూమర్లుగా పిలుస్తారు. ఈ ట్యూమర్లలో కొన్ని సాధరణమైనవి.. కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. శరీరంలో అసాధారణంగా పెరిగే కణితులు లేదా ట్యూమర్లు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి మాలిగ్నెంట్ ట్యూమర్, రెండోది బినైన్ ట్యూమర్. మాలిగ్నెంట్ రకం ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి దేహంలోని వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఇవి తొందరగా పెరుగుతాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి కూడా. ఇక బినైన్ ట్యూమర్లు నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఏర్పడతాయి. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించే వీలుంది. అయితే ఈ క్యాన్సర్లు నాలుగు రకాలు, అవి కార్సినోమా, సార్కోమా, లుకీమియా, లింఫోమా. కాగా, క్యాన్సర్ల అన్నింటింలో అత్యంత ప్రాణాంతకమైనవి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టెట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు నిపుణులు చెబుతుంటారు. వీటితో అత్యంత అరుదుగా, అతి ప్రమాదకరమైన క్యాన్సర్ గురించే మనం తెలుసుకోబోతున్నాం.
అంతకన్నా ముందుకు ఎవరైనా తమలో వ్యాధి సోకిందేమోనన్న అనుమానం రేకెత్తగానే వెంటనే క్యాన్సర్ స్ర్కీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఎందుకంటే ఏ క్యాన్సర్లనైనా ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే వాటికి చికిత్స అందించి వారిని సంపూర్ణ అరోగస్తులుగా మారుస్తారు వైద్యులు. ఇక మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నది బ్లడ్ క్యాన్సర్ గురించి. దీనినే ఆంగ్లంలో లుకేమియా అంటారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ లుకేమియా.. 10 లక్షల మందిలో 35 మందిలో మాత్రమే కనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించే క్యాన్సర్లలాంటిది కాదు. ఈ క్యాన్సర్ కు పెద్దలు, పిల్లలు, ఆగ, మగ అన్న తేడా ఏమీ లేదు. ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంది. అయితే ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మగవాళ్లకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ బ్లడ్ క్యాన్సర్ ఎలా వస్తుంది..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని చికిత్సా విధానం ఎలా ఉంటుంది. అసలు ఈ క్యాన్సర్ తమలో ఉందని వ్యాధిగ్రస్తులు గుర్తించడం ఎలా.? వ్యాధి సంకేతాలు ఏమీటి? లుకేమియా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు ఏమిటీ.? మన జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటీ..? అనే విషయాలను తెలుసుకుందాం.
బ్లడ్ క్యాన్సర్ అంటే రక్తకణాలపై ప్రభావం చూపే క్యాన్సర్. ముఖ్యంగా వైట్ బ్లడ్ సెల్స్, బోన్ మ్యారోలో ఉండే రక్త కణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ లోనూ క్రోనిక్, అక్యూట్ అనే రెండు రకాలున్నాయి. ఈ రెండింటికీ చికిత్స విధానం వేర్వేరుగా ఉంటుంది. శోషరస వ్యవస్థ (లింఫటిక్ సిస్టం)లో ఏర్పడే ఒక రకమైన బ్లడ్ కాన్సర్లను లింఫోమా అంటారు. కాగా, సాధారణ రక్తకణాలు అదుపు తప్పి అనియంత్రణగా పెరుగుతూ ఉంటే దాన్ని ల్యుకేమియా అంటారు. మల్టిపుల్ మైలోమా అన్న బ్లడ్ కాన్సర్ కూడా బోన్ మారో నే కేంద్రంగా చేసుకుని సంభవిస్తుంది.
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా..?
అయితే ఇతర క్యాన్సర్ల మాదిరిగా ఈ బ్లడ్ క్యాన్సర్ సంక్రమించిన రోగులలో చాలా వరకు లక్షణాలేవీ పైకి కనిపించవు. వ్యాధి ముదరి చివరి దశకు చేరుకున్న తర్వాతనే దీనిని గుర్తించే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. అయితే వ్యాధి లక్షణాలు ఇలా..
- బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో ఆకలి ఉండదు.
- నిత్యం అలసటగా, నీరసంగా కనిపిస్తుంటారు.
- జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది.
- ఏదో ఒక రకం ఇన్‌ఫెక్షన్ కనిపిస్తూనే ఉంటుంది.
- చిన్న గాయం అయినా దాని నుంచి అధిక రక్తస్రావం అవుతుంది.
- రాత్రుళ్లలో ఎక్కువగా చెమట పోస్తుంది.
- శరీరం బరువు తగ్గిపోతారు.
- బోన్స్, జాయింట్లలో భరించలేనంత నొప్పులు వస్తుంటాయి.
- ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం స్రవిస్తుంది.
- మహిళల్లో అయితే పీరియడ్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది.
పెద్ద వాళ్లలో బ్లడ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం.. ధూమపానం (స్మోకింగ్). అదేనండీ సిగరెట్లు కాల్చడం. అంతేకాదు రేడియేషన్ కు అధికంగా గురయ్యేవాళ్లు కూడా దీని బారిన పడే ప్రమాదముంది. ముఖ్యంగా కెమికల్ కంపెనీల్లో పనిచేసే వారితో పాటు ఎక్స్-రే, స్కానింగ్, తదితర చోట్ల పనిచేసేవారికి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ.
చికిత్స విధానం:
బ్లడ్ కాన్సర్‌ని ప్రమాదకరమైనదే అయినా దానిని చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీ, సహా ఇతర చికిత్సా విధానాల ద్వారా లుకేమియా బారిన పడిన రోగుల జీవిత కాలాన్ని పెంచవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కీమోథెరపీ కుదరని రోగులకు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది.
వీటిని నియంత్రణ చేపట్టాలి:
- ఊబకాయం వల్ల కొన్నిరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం.
- మితమైన ఆహారం తీసుకోవాలి.
- సిగరెట్, మద్యం మానుకోవడం చాలా అవసరం.
- మాంసపదార్థాలకు దూరంగా పెట్టాలి.
- కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
- స్వీట్లు సహా తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెరతో చేసిన పదార్థాలు తినకుండా జాగ్రత్తపడాలి.
- కూల్‌డ్రింక్స్, ఆర్టిఫీషియల్ డ్రింక్స్, మిఠాయిలు, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మానేయాలి.
వీటిని అలవాటు చేసుకోవాలి:
- గ్రీన్ టీ ని తీసుకోవాలి. ఇందులోని పోలిఫినాల్ అనే పదార్థం క్యాన్సర్ సెల్ పెరుగుదలను క్రమంలో ఉంచుతుంది.
- డిటాక్సిఫైయింగ్ గుణాలు పుష్కలంగా ఉండే పసుపు క్యాన్సర్ నివారణలో బాగా పనిచేస్తుంది.
- పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాలతోపాటు కుర్కుమిన్.. క్యాన్సర్ నివారించడంలో దోహదపడుతోంది.
- వెల్లుల్లిలోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి.
- టమాటాలు అధికంగా తీసుకోవాలి. వీటిల్లోని లైకోపిన్ క్యాన్సర్ నివారణకు కృషిచేస్తాయి.
- ఆకు కూరల్లోని పోషక విలువలు డీఎన్‌ఏ డ్యామేజ్ కాకుండా చేసి ట్యూమర్లను క్రమ పద్ధతిలో ఉంచుతాయి.