మూత్రపిండాలు తమకు నిర్థేశించిన పనిని సక్రమంగా నిర్వహించకపోయినా.. లేదా అసలు నిర్వహించకపోయినా దానిని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ప్రతీ మనిషికి తమ శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. వాటిలో ఒకటి లేదా రెండూ సొంతంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించినట్టే. అయితే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కారకాలలో మధుమేహం, అధిక రక్తపోటు, తీవ్రమైన మూత్రపిండాల గాయాలు ఏర్పడటం ఉన్నాయి. ఈ కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయని తెలుసుకునేందుకు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవి అలసట, వికారం, వాంతులు, వాపు, తరచుగా బాత్రూమ్‌కు వెళుడం, తల నుంచి ఎక్కువ చమట రావడం వంటి మార్పులు ఉంటాయి. చికిత్సలో బాధితుల పరిస్థితిని బట్టి ఔషధాల మొదలుకుని డయాలసిస్ సహా కిడ్నీ మార్పిడి వరకు ఉంటుంది.
మూత్రపిండాల వైఫల్యం అంటే ఏమిటి? What is kidney failure?
ప్రతీ మనిషి శరీరంలో ఉండే రెండు కిడ్నీలలో ఒకటి లేదా రెండూ వాటంతట అవే స్వతహాగా పనిచేయకపోవడమే మూత్రపిండ వైఫల్యం. ఇది కొన్నిసార్లు తాత్కాలికంగా ఏర్పడవచ్చు అయితే తాత్కాలికంగా వైఫల్యం చెందన కిడ్నీలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. అయితే అసలు సమస్య దీర్ఘకాలికంగా కిడ్నీలు పనిచేయకపోవడంతోనే ఏర్పడుతుంది. చాలా మందిలో దీర్ఘకాలిక కిడ్నీల ఫెయిల్యూర్ జరగడం కారణంగా లక్షణాలేమీ బయటకు కనిపించకుండా ఉన్నప్పటికీ లోపల మూత్రపిండాల పరిస్థితి మాత్రం నెమ్మదిగా అధ్వాన్నంగా మారుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కిడ్నీ వ్యాధి అత్యంత తీవ్రమైన దశ. ఈ పరిస్థితుల్లోనూ చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.
మూత్రపిండాలు ఏమి చేస్తాయి? What do the kidneys do?
మూత్రపిండాలు పిడికిలి పరిమాణంలో ఉండే బీన్ ఆకారపు అవయవాలు. అవి శరీరం లోపలి పక్కటెముక క్రింద, వెనుక వైపుకు అనుకుని ఉంటాయి. మానవ శరీరంలో అందరికీ రెండు కిడ్నీలు ఉంటాయి. ఆ రెండూ పని చేస్తాయి, కానీ ఒక్క కిడ్నీ సరిగ్గా పని చేస్తున్నా మనిషి బాగానే జీవించగలరు. ఇప్పటికీ చాలామంది ఒక్క కిడ్నీతోనే జన్మిస్తుంటారు. ఆ కిడ్నీయే చక్కా పనిచేస్తూ వారిని హాయిగా జీవించేలా చేస్తుంది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఏదో విషయంగా వారు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే కానీ వారికి ఒక్కటే కిడ్నీ ఉందన్న విషయం కూడా తెలియదు.
ఈ నేపథ్యంలో కిడ్నీలతో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందకంటే అవి అనేక విధులు నిర్వహించాలి. అతి ముఖ్యమైన పనులలో ఒకటి శరీరం విషపదార్థాలు (టాక్సీన్) పదార్థాలను తొలగించాలి. మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. శరీరం నుండి వ్యర్థ ఉత్పత్తులను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పని చేయనప్పుడు, వ్యర్థ పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది జరిగితే, అనారోగ్యంతో బాధపడతారు. అయితే చికిత్స చేయించుకున్నవారు వారి జీవన నాణ్యతను మార్చుకుని సంపూర్ణ జీవితాన్ని బతకగలిగితే.. చికిత్స చేయించుకోలేని వారు మాత్రం ప్రాణాపాయ పరిస్థిల్లోకి జారుకుంటారు. సరైన చికిత్సతో చాలా మంది కిడ్నీ వైఫల్యాన్ని నియంత్రించవచ్చు.
మూత్రపిండాల వైఫల్యం ఎవరిని ప్రభావితం చేస్తుంది? Who does kidney failure affect?
మూత్రపిండాల వైఫల్యం ఎవరిలోనైనా సంభవించవచ్చు. అయితే, ఈ పరిస్థితులు ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అవి:
- మధుమేహం.
- అధిక రక్తపోటు.
- గుండె జబ్బులు.
- కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర.
- అసాధారణ మూత్రపిండ నిర్మాణం.
- నలుపు, హిస్పానిక్, అమెరికన్ స్థానికులు, అలాస్కా స్థానికత కలిగినవారు.
- 60 ఏళ్లకి పైబడినవారు
- స్వతహాగా మెడికల్ షాపుల్లో లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ కిల్లర్స్ ను సుదీర్ఘకాలంగా తీసుకునేవారు.
మూత్రపిండాల వైఫల్యం ఎంత సాధారణం? How common is kidney failure?
కిడ్నీ వైఫల్యం ప్రతి సంవత్సరం అమెరికాలో 7,50,000 మందిని ప్రభావితం చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని అంచనా.
కిడ్నీ వైఫల్యం ప్రారంభమైనప్పుడు ఏమి జరుగుతుంది? What happens when kidney failure starts?
మీ అంచనా గ్లోమెరులర్ వడపోత రేటు (eGFR) ప్రకారం మూత్రపిండ వ్యాధి దశలు ఉన్నాయి.
ఇజీఎఫ్ఆర్ (eGFR) అనేది మీ మూత్రపిండాలు పదార్థాలను ఎంత బాగా ఫిల్టర్ చేసే గణన. సాధారణ eGFR సుమారు 100. అత్యల్ప eGFR 0, అంటే మూత్రపిండాల పనితీరు మిగిలి ఉండదు.
ఏదైనా మూత్రపిండ వ్యాధి దశలు:
- ఒకటవ దశ: జీఎఫ్ఆర్ (GFR) 90 కంటే ఎక్కువగా.. కానీ 100 కంటే తక్కువగా ఉంటే.. మూత్రపిండాలు స్వల్పంగా దెబ్బతిన్నాయిని అర్థం. అయితే ఇవి ఇప్పటికీ సాధారణంగా పనిచేస్తాయి.
- రెండవ దశ: జీఎఫ్ఆర్ (GFR) 60 కంటే ఎక్కువగా ఉండి 89 కంటే తక్కువగా ఉంటే కిడ్నీలు.. ఒకటవ దశలో ఉన్నదానికంటే ఎక్కువగా దెబ్బతిన్నాయని అర్థం. అయినా అవి ఇప్పటికీ బాగా పనిచేస్తాయి.
- మూడవ దశ: జీఎఫ్ఆర్ (GFR) 30 కంటే ఎక్కువగా లేదా 59 కంటే తక్కువగా ఉంటే.. మూత్రపిండాల పనితీరును స్వల్పంగా కోల్పోయిన పరిస్థితికి చేరుకున్నట్లే.
- నాల్గవ దశ: జీఎఫ్ఆర్ (GFR) 15 కంటే ఎక్కువగా లేదా 29 కంటే తక్కువగా ఉంటే.. మూత్రపిండాల పనితీరును తీవ్రంగా కోల్పోయాయని అర్థం.
- ఐదవ దశ: జీఎఫ్ఆర్ (GFR) 15 కంటే తక్కువగా ఉందంటే.. మీ మూత్రపిండాలు పూర్తి వైఫల్యానికి సమీపంలో ఉన్నాయని అర్థం.
కిడ్నీ వైఫల్యం మొదటి హెచ్చరిక సంకేతాలు ఏమిటి? What are the first warning signs of kidney failure?
కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలలో చాలా మంది లక్షణాలను అనుభవిస్తారు. అయితే కొందరిలో మాత్రం ఇది అలక్షణంగానే ప్రారంభమవుతుంది. అయినప్పటికీ, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడి) బాధిుతుడ్ని బాగానే ఉన్నాడని భ్రమింపజేసినప్పటికీ ఏప్పటికైనా హాని కలిగించవచ్చు. సీకేడి మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు వ్యక్తుల మధ్య మారుతూ ఉంటాయి. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే, ఈ క్రింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంకేతాలను గమనించవచ్చు:
- విపరీతమైన అలసట (అలసట).
- వికారం, వాంతులు.
- ఏకాగ్రతలో గందరగోళం లేదా ఇబ్బంది.
- వాపు (ఎడెమా), ముఖ్యంగా మీ చేతులు, చీలమండలు లేదా ముఖం చుట్టూ.
- తరచుగా మూత్ర విసర్జన చేయడం.
- తిమ్మిరి (కండరాల నొప్పులు).
- పొడి లేదా దురద చర్మం.
- ఆకలి లేకపోవడం లేదా ఆహారం రుచి లోహంగా తలపించడం
‘కిడ్నీ ఫెయిల్యూర్’ అత్యంత సాధారణ కారణాలు? What are the most common causes of kidney failure?
- మధుమేహం, అధిక రక్తపోటు (హై-బిపి) రెండూ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి, వాటి వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలు.
- అదుపులో ఉంచని మధుమేహం.. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అధికం చేస్తుంది. దీంతో హైపర్ గ్లైసీమియాకు దారి తీస్తుంది. అంతేకాదు నిత్యం అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నట్లయితే అది మూత్రపిండాలతో పాటుగా శరీరంలోని ఇతర అవయవాలను కూడా దెబ్బతింటుంది.
- అధిక రక్తపోటు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణం. అధిక రక్తపోటు అంటే శరీర రక్తనాళాల ద్వారా రక్తం బలవంతంగా ప్రయాణం చేయడం. దీనిని నిర్లక్ష్యం చేయడం కారణంగా, చికిత్స చేయంచని పక్షంలో కాలక్రమేణా దాని అదనపు భారం మూత్రపిండాల కణజాలంపై పడుతుంది. దీంతో కిడ్నీలు క్రమంగా దెబ్బతింటాయి.
మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే ఇతర క్రానిక్ కిడ్నీ వ్యాధుల (పీకేడి) కారణాలు:
- పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి (పీకేడి): పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అనేది వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు సంక్రమించే పరిస్థితి. తల్లిదండ్రులలో ఏ ఒక్కరికి ఈ వ్యాధి ఉన్నా అది వారి నుంచి వారసత్వంగా బిడ్డలకు సంక్రమించే అనువంశిక పరిస్థితి. అయితే పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అంటే మూత్రపిండాల లోపల ద్రవంతో నిండిన సంచులు (తిత్తులు) పెరగడానికి కారణమవుతుంది.
- గ్లోమెరులర్ వ్యాధులు: గ్లోమెరులర్ వ్యాధులు మూత్రపిండాలు వ్యర్థాలను బాగా ఫిల్టర్ చేయడాన్ని ప్రభావితం చేస్తాయి.
- లూపస్: లూపస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి, ఇది అవయవ నష్టాలకు కారణం అవుతుంది. కీళ్ల నొప్పులు, జ్వరం, చర్మంపై దద్దుర్లు కలిగిస్తుంది.
కిడ్నీ వైఫల్యం ఒక్కోసారి అనూహ్య కారణాల వల్ల కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది. తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్ మూత్రపిండాలకు కలిగిన తీవ్రమైన గాయం కారణంగా కూడా అకస్మాత్తుగా పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం గంటలు లేదా రోజుల్లో అభివృద్ధి చెందుతుంది. ఇది తరచుగా తాత్కాలికంగా ఉంటుంది.
తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యానికి సాధారణ కారణాలు:
- ఆటో ఇమ్యూన్ కిడ్నీ వ్యాధులు.
- కొన్ని మందులు.
- తీవ్రమైన నిర్జలీకరణం.
- మూత్ర నాళాల అడ్డంకి.
- గుండె జబ్బులు లేదా కాలేయ వ్యాధి వంటి చికిత్స చేయని దైహిక వ్యాధులు.
కిడ్నీ ఫెయిల్యూర్ అంటువ్యాధా? Is kidney failure contagious?
కిడ్నీ ఫెయిల్యూర్ అంటువ్యాధా.? అన్న అనుమానాలు చాలామందిలో ఇప్పటికీ ఉన్నాయి. అయితే, మూత్రపిండాల వైఫల్యం అంటువ్యాధి కాదు. అంతేకాదు క్రినిక్ కిడ్నీ వ్యాధులు కూడా ఒకరి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందవు.
మూత్రపిండాల వైఫల్యం ఎలా నిర్ధారణ అవుతుంది? How is kidney failure diagnosed?
మూత్రపిండాల వైఫల్యం చెందాయని అంచనా వేయడానికి వైద్యులు అందుబాటులో ఉన్న అనేక రకాల నిర్థారణ పరీక్షలను ఉపయోగించవచ్చు. మూత్రపిండాల వైఫల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు అనుమానించినా.. బాధితులు తెలిపే లక్షణాలు వాటి వైఫల్యానికి దారితీసేలా ఉన్నాయనిపించినా వైద్యులు ఈ సాధారణ పరీక్షలు నిర్వహిస్తారు. అవి:
- రక్త పరీక్షలు: మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను ఎంతవరకు తొలగిస్తాయో రక్త పరీక్షలు చూపుతాయి. చేతిలోని సిర నుండి కొద్ది మొత్తంలో రక్తాన్ని తీయడానికి సన్నని సూదిని ఉపయోగిస్తాడు. సాంకేతిక నిపుణులు రక్త నమూనాను ల్యాబ్‌లో విశ్లేషిస్తారు.
- మూత్ర పరీక్షలు: మూత్రంలో ప్రోటీన్ లేదా రక్తం వంటి నిర్దిష్ట పదార్థాలను ఉన్నాయా.? అని కొలిచేందుకు మూత్రపరీక్షను నిర్వహిస్తారు. ఇందుకోసం మీ అసుపత్రి లేదా డయాజ్నాటిక్ కేంద్రం వారు ప్రత్యేక సీసాను అందించి అందులో మూత్ర విసర్జన చేయమని కోరుతారు. సాంకేతిక నిపుణులు మూత్ర నమూనాను ల్యాబ్‌లో విశ్లేషిస్తారు.
- ఇమేజింగ్ పరీక్షలు: ఇమేజింగ్ పరీక్షలు మూత్రపిండాలు, పరిసర ప్రాంతాలలో అసాధారణతలు లేదా అడ్డంకులను ఏమైనా ఉన్నాయా అని గుర్తించడానికి నిర్వహిస్తారు. దీని ద్వారా సంబంధిత సాంకేతిక నిపుణులు సాధారణ ఇమేజింగ్ పరీక్షలైన కిడ్నీ అల్ట్రాసౌండ్, సిటీ యూరోగ్రామ్, ఎంఆర్ఐలను నిర్వహించి పరిశీలిస్తారు.
కిడ్నీ ఫెయిల్యూర్ చికిత్సా విధానాలు? How is kidney failure treated?
కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే చాలా మందిలో దిగులు, అందోళన తీవ్రస్థాయిలో పెరుగుతాయి. కానీ వైద్యరంగంలో వచ్చిన మార్పులు మూత్రపిండాల వైఫల్యాలకు చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఎంత ముందస్తుగా సమస్య గుర్తిస్తే అంత తొందరగా వ్యాధిని నయం చేయడానికి వైద్యులకు వీలవుతుంది. ఇక చికిత్స ముఖ్యంగా సమస్య, కారణం, పరిధిపై ఆధారపడి ఉంటుంది.
దీర్ఘకాలికాలింగా మూత్రపిండాల చికిత్స పరిస్థితి కిడ్నీలపై వ్యాధి పురోగతిని నెమ్మదింపజేస్తుంది. మూత్రపిండాలు క్రమంగా పనిచేయడం మానేస్తే, వైద్యులు ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి, వీలైనంత కాలం మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి కొన్ని విభిన్న పద్ధతులను ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులు ఇవే:
- రెగ్యులర్ రక్త పరీక్షలు.
- రక్తపోటు తనిఖీలు.
- ఔషధం.
మూత్రపిండ వైఫల్యం ఉన్నట్లు నిర్థారణ అయితే మిమల్ని ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు వైద్య చికిత్స అవసరం. అందుకు రెండు ప్రధాన చికిత్సలు ఉన్నాయి.
డయాలసిస్: Dialysis
శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో డయాలసిస్ సహాయపడుతుంది. డయాలసిస్‌లో రెండు రకాలు ఉన్నాయి:
- హీమోడయాలసిస్: హీమోడయాలసిస్‌లో, ఒక యంత్రం రక్తాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుంది. చాలా మందికి వారానికి మూడు నుండి నాలుగు రోజులు ఆసుపత్రి లేదా డయాలసిస్ క్లినిక్‌లో హిమోడయాలసిస్ చేయవల్సి వస్తుంది.
- పెరిటోనియల్ డయాలసిస్: పెరిటోనియల్ డయాలసిస్‌లో, డయాలసిస్ సొల్యూషన్‌తో కూడిన బ్యాగ్‌ను ఉదర లైనింగ్‌లోని కాథెటర్‌కి జతచేస్తారు. ద్రావణం బ్యాగ్ నుండి పొత్తికడుపు లైనింగ్‌లోకి ప్రవహిస్తుంది, వ్యర్థ ఉత్పత్తులను, అదనపు ద్రవాలను గ్రహించి, బ్యాగ్‌లోకి తిరిగి పోతుంది. కొన్నిసార్లు ప్రజలు ఇంట్లో పెరిటోనియల్ డయాలసిస్ చేయించుకోవచ్చు.
కిడ్నీ మార్పిడి Kidney transplant
దెబ్బతిన్న కిడ్నీ స్థానంలో మరో ఆరోగ్యకరమైన కిడ్నీతో మార్పిడి చేసే విధానాన్నే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు. శరీరంలోని దెబ్బతిన్న కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా స్వాధీనం చేసుకున్న వైద్యులు.. ఆరోగ్యకరమైన కిడ్నీతో మార్పడి చేస్తారు. దాతలు తమ మరణించిన అనంతర తమ ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని దానం చేయవచ్చు. లేదా రెండు కీడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తున్నవారు కూడా ఇవ్వవచ్చు. ఒక ఆరోగ్యకరమైన కిడ్నీతో బాధితులు అరోగ్యంగా జీవించవచ్చు. అయితే మన దేశంలో మాత్రం కేవలం రక్త సంబంధికులు మాత్రమే బాధితులకు కిడ్నీలను బతికుండగా దానం ఇవ్వవచ్చు.
కిడ్నీ ఫెయిల్యూర్ నుండి బాధితులు కోలుకోగలరా? Can a person recover from kidney failure?
సరైన చికిత్సతో మూత్రపిండాల వైఫల్యం నుండి బాధితులు కోలుకోవచ్చు. అయితే శస్త్రచికిత్స లేదా మందుల ప్రభావం ఎలా ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు నిర్థారించుకుని అందకు ప్రతీ నెల ఒకసారి లేదా వైద్యుడి సూచనల మేరకు జీవితాంతం అసుపత్రులను సందర్శించి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే డయాలసిస్ పై అధారపడినవారు మాత్రం వారానికి మూడు లేక రెండు సార్లు రక్తాన్ని శుధ్ది చేసుకోవాల్సి ఉంటుంది.
మూత్రపిండాల వైఫల్యంతో బాధితులు ఎంతకాలం జీవించగలరు? How long can you live with kidney failure?
- డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి లేకుండా, మూత్రపిండాల వైఫల్యం ప్రాణాంతకం. చికిత్స తీసుకోకుండా బాధితులు ప్రాణాలపైకి తెచ్చుకునే ప్రమాదం ఉంది. చికిత్సలు తీసుకోని నేపథ్యంలో బాధితులు కొన్ని రోజులు లేదా వారాలు జీవించవచ్చు.
- డయాలసిస్‌లో ఉన్నట్లయితే, సగటు ఆయుర్దాయం ఐదు నుండి 10 సంవత్సరాలు. కొంతమంది డయాలసిస్‌తో 30 సంవత్సరాల వరకు జీవించగలరు.
- మూత్రపిండ మార్పిడిని కలిగి ఉంటే, జీవించి ఉన్న దాత నుండి మూత్రపిండాన్ని స్వీకరించినట్లయితే సగటు ఆయుర్దాయం 12 నుండి 20 సంవత్సరాలు. మరణించిన దాత నుండి కిడ్నీని స్వీకరించినట్లయితే సగటు ఆయుర్దాయం ఎనిమిది నుండి 12 సంవత్సరాలు.
మూత్రపిండాల వైఫల్యం చికిత్సకు ఏ మందులు వాడతారు? What medications are used to treat kidney failure?
కిడ్నీ వ్యాధికి కారణాన్ని బట్టి, వైద్యులు ఇచ్చే మందులు ఇవే: వీటిలో ఒకటి లేదా అంతకు ఎక్కువ సూచించవచ్చు:
- యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE): ఇన్హిబిటర్ లేదా యాంజియోటెన్సిన్ II రిసెప్టర్ బ్లాకర్ (ARB) మందులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
- మూత్రవిసర్జన: ఇవి మీ శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించడంలో సహాయపడతాయి.
- స్టాటిన్స్: ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
- ఎరిత్రోపోయిటిన్-స్టిమ్యులేటింగ్ ఏజెంట్లు: రక్తహీనత ఉంటే ఇవి ఎర్ర రక్త కణాలను నిర్మించడంలో సహాయపడతాయి.
- విటమిన్ డి, కాల్సిట్రియోల్: ఇవి ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.
- ఫాస్ఫేట్ బైండర్లు: ఇవి రక్తంలో అదనపు ఫాస్పరస్‌ని తొలగించడంలో సహాయపడతాయి.
మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించడానికి 11 చిట్కాలు 11 Tips to prevent Kidney Failure
అధిక రక్తపోటు, మధుమేహం మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలు అయినందున, అనేక నివారణ చిట్కాలు ఈ రెండు పరిస్థితులను నియంత్రణకు సంబంధించినవే.
1. మీ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
మధుమేహం గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యానికి మీ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఒక కారణం.
2. మీ రక్తపోటు స్థాయిల నియంత్రణ
అధిక రక్తపోటు గుండె జబ్బులు అలాగే మూత్రపిండాల వైఫల్యం మీ ప్రమాదాన్ని పెంచుతుంది.
3. ఆరోగ్యకరమైన బరువు
ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన పరిస్థితులకు మీ ప్రమాదాన్ని పెంచుతుంది.
4. గుండె-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
గుండె-ఆరోగ్యకరమైన ఆహారం – చక్కెర, కొలెస్ట్రాల్‌లో తక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. ఫైబర్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండటం, బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
5. ఉప్పు తీసుకోవడం తగ్గించండి
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. దీనిని తగ్గించండీ
6. తగినంత నీరు తీసుకోవాలి
నిర్జలీకరణం మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది వాటిని దెబ్బతీస్తుంది. మీరు రోజుకు ఎంత నీరు త్రాగాలి అన్న అంశంపై మీ వైద్యుడి సూచనలను పాటించండి.
7. పరిమితంగా మద్యం
మద్యం (ఆల్కహాల్) రక్తపోటును పెంచుతుంది. ఇది కిడ్నీలకు మంచిది కాదు. ఇక ఇందులో ఉండే అదనపు క్యాలరీలు బరువు కూడా పెరిగేలా చేస్తాయి. ఈ రెండూ మూత్రపిండాల వైఫల్యానికి కారణం.
8. ధూమపానానికి దూరం
కిడ్నీ వైఫల్యాలకు చెప్పుకోదగిన ప్రధాన కారణాల్లో ధూమపానం ఒకటి. ఇది మూత్రపిండాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో లేదా లేనివారిలో మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది.
9. పరిమితంగా పెయిన్ కిల్లర్స్
ఈ మధ్యకాలంలో ఎవరికి ఎలాంటి నొప్పి వచ్చినా నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుని వేసుకుంటున్నారు. అలా నొప్పులు కలిగిన ప్రతీసారి ఈ మందులను అధిక మోతాదులో వినియోగించడం కూడా కిడ్నీల వైఫల్యానికి కారణం. ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, న్యాప్రోక్సెన్ వంటి నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గిస్తాయి, ఇది వాటికి హాని కలిగిస్తుంది.
10. ఒత్తిడి నియంత్రణ
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం వలన రక్తపోటును తగ్గిస్తుంది, ఇది మూత్రపిండాలకు మంచిది.
11. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
ఈత కొట్టడం, నడవడం, పరుగెత్తడం వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడానికి, మధుమేహం, అధిక రక్తపోటును నిర్వహించడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.
మూత్రపిండ వ్యాధి ఉందని అనుమానం ఉంటే, ముందుగా క్రియాటీన్ పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. దీని ద్వారా కిడ్నీ సమస్యలు ఉత్పన్నమైన తరుణంలో ముందస్తు రోగనిర్ధారణ వెల్లడవుతుంది. కిడ్నీలకు సంబంధించిన రోగ నిర్థారణ లేక సమస్యలు ఉన్నాయని ముందస్తుగానే తేలితే చికిత్స పొందడం వలన మూత్రపిండాల వైఫల్యం చెందకుండా చికిత్సలతో నయం చేసుకోవచ్చు.
మూత్రపిండ వ్యాధి ఉందని తెలిస్తే, మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించడానికి వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించాలి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని నయం చేయలేనిదే అయినప్పటికీ, సరైన చికిత్సతో దాని పురోగతిని మందగింప జేయవచ్చు.
కిడ్నీ ఫెయిల్యూర్ నివారణ మార్గాలు ఏమిటీ? How can I prevent kidney failure?
మూత్రపిండ వైఫల్యం, సికేడి (CKD) రివర్సిబుల్ కానప్పటికీ, మూత్రపిండాల పనితీరును సంరక్షించడంలో సహాయపడటానికి చర్యలు తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లు, దినచర్యలు మూత్రపిండాలు ఎంత త్వరగా పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయో నెమ్మదించవచ్చు.
సీకేడీ లేదా మూత్రపిండ వైఫల్యం ఉంటే, ఇది మంచిది:
- మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించండి.
- డయాబెటిస్ ఉన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచండి.
- రక్తపోటు స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచండి.
- పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.
- మాంసకృత్తులు, సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
- వైద్యులతో క్రమం తప్పకుండా షెడ్యూల్ చేయబడిన ప్రతి అపాయింట్‌మెంట్‌కు వెళ్లండి.
మూత్రపిండ వైఫల్యం ఉన్నవారు ఏమి ఆశించవచ్చు? What can I expect if I have kidney failure?
మూత్రపిండాలు వైఫల్య బాధితులు తమ జీవితం చరమంకానికి చేరుకుందని అస్సలు బాధపడవద్దు. మూత్రపిండాలు ఫెయిల్యూర్ అయితే వాటిని నయం చేయడం కష్టసాథ్యమేనన్నది నిజమే.. అయినా సకాలంలో రోగనిర్ధారణ, సరైన చికిత్సతో, తీవ్రమైన మార్పులేమీ లేకుండా సుదీర్ఘ జీవితాన్ని గడపవచ్చునన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? When should I see a healthcare provider?
కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాద కారకాలు ఉన్నాయని అనుమానాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వారు పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేస్తారు. ఆ పరీక్షలలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయా లేదా అన్న విషయంతో పాటు మరో ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నా బయటపడతాయి. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అన్న అనుమానాలకు తావిచ్చే కారకాలు ఇవే:
- అధిక రక్తపోటు,
- మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు
- కాళ్లు, చేతుల, మోకాళ్లు, మోచేతుల వాపు
- తలకు చమట పట్టడం
- వికారం లేదా వాంతులు
- మధుమేహం.
- మూత్రపిండాల వ్యాధి కుటుంబ చరిత్ర.
- మూత్రపిండాలకు గతంలో గాయం.
- క్రమం తప్పకుండా NSAIDలను తీసుకోవడం
చివరిగా..
వ్యర్థాలు, అదనపు ద్రవాలను వదిలించుకోవడం ద్వారా మూత్రపిండాలు శరీరంలో కీలకమైన పనిని చేస్తాయి. మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారు వాటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే తీవ్రమైన జీవన నాణ్యతలు అవసరం లేకుండా అందరి మాదిరిగానే దీర్ఘకాలం జీవించవచ్చు. అయితే ఫెయిల్యూర్ అయిన మూత్రపిండాలను గుర్తించడంలో ఆలస్యం చేసినా, చికిత్స చేయించకుండా వదిలేసినా అది ప్రాణాంతక సమస్యగా కూడా మారవచ్చు.
మూత్రపిండాలు వైఫల్యం చెందినా.. క్రమబద్దంగా డయాలసిస్ చేయించుకుంటూ లేదా కిడ్నీ మార్పిడితో సుదీర్ఘ జీవితాన్ని కొనసాగించవచ్చు. చికిత్స ప్రణాళికలో మందులు వాడడం, ప్రత్యేక ఆహారాన్ని అనుసరించడం కూడా రోగం ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. వైద్యుడితో అపాయింట్‌మెంట్‌లు అన్నింటికీ తప్పకుండా హాజరుకావాలి. చికిత్సలు, మందులు, జీవనశైలి మార్పు లేదా చికిత్స ప్రణాళికలో భాగంగా తలెత్తే ఇతర సమస్యలను వైద్యుడితో చర్చించాలి.