మెరుగైన మానసిక అరోగ్యానికి చక్కని ఐదు మార్గదర్శకాలు - Mental Health Guidance in Telugu: Mental health tips and advice in telugu

0
Mental Health Guidance

అధునాతన ప్రపంచంలో మానసిక ఉల్లాసం అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. చిన్నారుల నుంచి అన్ని వయస్సుల వారు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. తరగతి గది నుంచే విద్యలో పోటీతత్వం పెరిగి.. చిన్నారులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇక చదవిన చదువులకు సరైన మార్కులు రాక కోందరు.. తగిన ఉద్యోగాలు రాక మరికొందరు.. మానసికంగా నలిగిపోతున్నారు. యువత, ఉద్యోగాలలో పని ఒత్తిడితో పాటు టీమ్ లీడర్ పెట్టే ఇబ్బందులు అంత ఇంతా కావు.

ఈలోపు యాజమాన్యాలు పింక్ స్లిప్ టెన్షన్ సాప్ట్ వేర్ ఉద్యోగుల్లో మరింత ఒత్తిడికి కారణం అవుతుంది. మరికొందరి యువతలో రోజంతా శ్రమించినా చాలీచాలని జీతాలతో ఎలా జీవించేదన్న టెన్షన్.. ఇలా అన్ని వయస్కుల వారికి తమ పరిధిలోని ఒత్తిడి. వృద్దాప్యంలో తమ పిల్లలు పట్టించుకోవడం లేదన్న టెన్షన్ కొందరిదైతే.. ఆస్తులు కోసం కన్నబిడ్డలే బాధిస్తున్నారని మరోకొందరిలో టెన్షన్. ఈ సమాజంలో టెన్షన్, ఒత్తిడి అన్న పదం వినని, కనని సగటు జీవి లేడంటే విచిత్రమేమీ కాదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే యావత్ ప్రపంచంలో 2019 వరకు ఉన్న పరిస్థితులు వేరు.. అప్పటినుంచి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఈ మధ్యకాలంలో చవిచూస్తున్న పరిస్థితులు వేరు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. కుప్పలతెప్పలుగా శవాల గుట్టులు పేరుకుపోయి తమ అయినవారిని కడసారి చూపుకూడా చూసుకునే వీలులేకుండా మానసికంగా తీవ్రంగా కృంగదీసింది. అన్ని వర్గాల ప్రజలు మహమ్మారిని ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులు, పాఠశాలకు వెళ్లలేని యువకులు, ఒకరికొకరు విడిపోయిన కుటుంబ సభ్యులు, కరోనా ఇన్‌ఫెక్షన్ లేదా నష్టంతో ప్రభావితమైన వారి నుండి. లాక్‌డౌన్‌ల సమయంలో తినడానికి కూడా ఏమీ లభించిక ఆకలి మరణాలను ఎదుర్కొన కుటుంబాలు కూడా అనేక విధాల మానసిక సమస్యలను ఎదుర్కోంది.

Mental Health

ఈ హృదకవిదారక సమయంలో పలు వర్గాల ప్రజలు ఎదుర్కోన్న భయం, ఆత్రృత, ఆందోళన, నిస్సహాయ అనుభూతిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా భూఉపరితలపై ఎక్కడ ఉన్నా.. ముందు మానసికంగా ధృడంగా ఉండాలి. గడిచిన చేదు జ్ఞాపకాలను అధిగమించి.. రేపటి వైపు ఆశగా అడుగులు వేయాలన్నది కాదనలేని సత్యం. అందుకు మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును చూసుకునే శక్తి ఉండాలి. మానసిక ప్రశాంతత కావాలి. మనస్సును ఎలాంటి అందోళనకు గురికానీయకూడదు. మనస్సు నిత్యం అహ్తాదకర వాతావరణంలో ఉండాలి. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా.. ఎదుర్కోని ధీటుగా నిలవాలి. భావోద్వేగాలకు, అందోళనకు గురికాకుండా చాలా మంది ధృడంగా ఉన్నారు.

కోవిడ్ మహమ్మారితో విషాధ స్మృతులను మాత్రమే కాదు, కోవిడ్ అనంతర పరిణామాలను కూడా చాలా మంది మానసికంగా బలహీనంగా మార్చేస్తున్నాయి. ఈ పరిణామాలే కాకుండా, ఒత్తిడిని కలిగించే ఏదేని సంఘటనను ఎదుర్కోవడంలో సహాయపడటానికి మనస్సు స్ట్రాంగ్ గా ఉంచేలా ఐదు ప్రమాణిక సూత్రాలను ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. అంతకుముందు అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటీ.? మానసిక ఆరోగ్యం అంటే నిర్ధిష్టమైన నిర్వచనం అంటూ ఏదీ లేకపోయినప్పటికీ అన్ని పరిస్థితుల్లోనూ మనస్సును అరోగ్యంగా, అహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమే. పనిలో ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ చేయడం అన్నది మన పూర్వీకులు మనకు అందించిన పెద్ద వరం.

డిఫ్రెషన్ సంకేతాలు ఇలా..:

Mental illness

మానసికంగా కుంగిపోతున్నామనడానికి సంకేతాలు ఏమైనా ఉన్నాయా.? నిజంగా డిఫ్రెషన్ కు గురవుతున్నామంటే ఎలాంటి లక్షణాలతో వారిని గుర్తించవచ్చు.? ఆ సంకేతాలు ఇవే:

  • అలసిపోయినట్టు అనిపించడం
  • తొందరగా ఏదీ చేయాలని అనిపించకపోవడం
  • నిద్ర సరిగ్గా పట్టకపోవడం
  • ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం
  • దేనిపైనా ఆసక్తిని కనబర్చకపోవడం

అందోళన, ఒత్తిడి, నిరాశల నుంచి బయటపడవచ్చా.?

Mental health advice

అందోళన, ఒత్తిడి, నిరాశ, డిప్రెషన్ లకు గురవుతున్నామని తెలియగానే వెంటనే మనకు మనంగా తేరుకోవడంతో బయటపడవచ్చు. మనల్ని మనం ఎంతో ధృఢమైన మనోబలం కలిగిన వాళ్లుగా భావించి నిర్ణయాలు తీసుకోగలగాలి. గడిచిపోయిన సంఘటనలు, లేక నెగిటివ్ అలోచనలకు స్వస్తి పలికి.. రేపటి వైపు వేసే అడుగుల ఆశాలపై దృష్టి నిలపాలి. ఇలా చేయడంతో పాటు మీరు నమ్మగలిగిన వ్యక్తితో ఏకాంతంగా కూర్చోని లేదా ఫోన్ ద్వారా అయినా అనుభూతి పోందుతున్న విషయాలను పంచుకోవాలి. అలాగే మంచి ఆహారపు అలవాట్లతో పాటు ఉదయాన్నే నిద్రలేని వ్యాయామం చేసే అలవాట్లను ప్రతిరోజు అలవర్చుకోవాలి. ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన పనులు లేదా మీ ప్రియమైనవారికి ఇష్టమైన పనులు చేయడంలో నిమగ్నం కావాలి. డిప్రెషన్ గమత్తుగా మత్తుకు అలవాటు పడేలా చేస్తుంది. డ్రగ్స్, దూమపానం, మద్యపానం జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది.

1. విశ్వసించే వారితో మనస్సు విప్పి మాట్లాడటం:

Improve Mental ability

డిప్రెషన్ తొలినాళ్లలో వ్యక్తుల్లో నెగిటివ్ అలోచనలు వస్తుంటాయి. ఇలాంటి అలోచనలు వచ్చిన క్రమంలో ఆయా వ్యక్తులు దానిలోనే నిమగ్నం కావడం కన్నా.. తమ భావాలను, భాధలను వారు విశ్వసించే వారితో మాట్లాడటం లేదా చర్చించడం చాలా ముఖ్యం. ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా సహోద్యోగి, చిన్ననాటి మిత్రుడు, ఇలా నమ్మదగిన వ్యక్తి ఎవరైనా సరే వారితో మీరు మీ అందోళనను షేర్ చేసుకోవడం ఉత్తమం. ఇలా మీరు అనుభవిస్తున్న ప్రతీ విషయాన్ని, పోందుతున్న బాధను పంచుకోవడం కారణంగా మీకు కాసింత మానసిక ఊరట లభిస్తుంది. ఇది మీరు దానిని అధిగమించే అలోచనను కూడా అందిస్తుంది. ఒక వేళ మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటే తక్షణం మీరు విశ్వసించే వ్యక్తికి వీడియో కాల్, ఫోన్ కాల్ లేదా చాట్ ద్వారా అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు.

2. శారీరకంగా ఆరోగ్యాంగా ఉండటం:

Overcome depression

మానసికంగా ధృడంగా ఉండాలంటే మీరు ముందు శారీరకంగా ఫిట్ గా ఉండాలన్న నిబంధనను మర్చిపోరాదు. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే వీరికి మానసిక అందోళన వల్లే త్వరగా నిద్రలేవడం కూడా కష్టమే. అయినా డిప్రెషన్ ను అధిగమించాలంటే.. తమ జీవనశైలిలో మార్పులను చేసుకోవడం మాత్రం తప్పదు. అలా చేస్తేనే కొద్దిపాటి లక్షణాలను అధిగమించి పూర్తి ఫిట్ గా మారేందుకు మారిన జీవనశైలి తొడ్పాటు అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడి తొలి కిరణాలు తగిలుతుండగా శారీరిక వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కేవలం 30 నుంచి 40 నిమిషాలు చాలు.., ఇది డిప్రెషన్ కు కారణమైన రసాయనాలను కట్టడి చేస్తుంది. ఇక దీంతో పాటు సమయానికి బోజనం చేయడం లేదా సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం.

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మానసిక ఆరోగ్యానికి, మనస్సును అహ్లాదంగా ఉంచడానికి సహాయపడుతుంది. మనిషి తన బలహీనతనే బలంగా మార్చుకునేలా చేయడంలో ఇది దోహదపడుతుంది. ఇక రన్నింగ్ చేయడం ద్వారా శరీరంలో ఎండోర్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపర్చడంలో ఉపయోగపడే హార్మోన్. అందోళన, ఒత్తడి, నిరాశలను జయించి.. మానసికంగా ధృడంగా ఉంచడంలో ఈ హార్మోన్ దోహదపడుతుంది. అలానే నడక, యోగా, డ్యాన్స్, సైక్లింగ్ లేదా గార్డెనింగ్‌లో అయినా ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాలు చురుకుగా ఉండండి. సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.

3. మనస్సు ఆనందించే కార్యకలాపాలను చేయడం:

Tips for strong mental ability

అందోళన, ఒత్తిడి, నిరాశ వంటి అలోచనలు ఎక్కువగా ఒంటరిగా ఉండే వ్యక్తులలో ఉత్పన్నమవుతుంటాయి. దీనిని అధిగమించకోడానికి వారు తమ ఖాళీ సమయాన్ని తమకు ఇష్టమైన పనిలో సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. ఆంగ్లంలో చెప్పినట్టు ఖాళీగా కూర్చోవడమే విపరీత అలోచనలకు మూలం అన్నట్లు.. దానిని అధిగమించడానికి తమకు, లేదా తమకిష్టమైన వారి పనులను చేయడంలో సహాయం చేస్తూ సమయాన్ని బిజీగా గడిపేస్తే చాలు.. ఇలాంటి అలోచనలు రాకుండా నివారించవచ్చు.

అంతేకాదు ప్రియమైనవారి కోసం వంట చేయడం, మీ పెంపుడు జంతువుతో ఆడుకోవడం, పార్క్‌లో నడవడం, పుస్తకం చదవడం లేదా సినిమా లేదా టీవీ సిరీస్ చూడటం వంటి అర్థవంతమైన, ఆనందదాయకంగా అనిపించే కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. అంతేకాదు మీకు చిన్ననాటి స్నేహితులు, లేదా స్నేహితులు, పరిచయస్తులు లేదా బంధువులు ఇతరులతో ఫోన్ లో సంభాషించడం చేస్తే.. ఈ అలోచనలు అధిగమిస్తారు. సంతోషాన్ని కలిగించే కార్యకలాపాలతో రెగ్యులర్ రొటీన్ పనులను కలిపి చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

4. మత్తు, దూపపానాలకు దూరం ఉండటం:

Advices for mental ability

మానసికంగా కృంగదీతను అనుభవిస్తున్నా.. లేక డిప్రెషన్ కు గురవుతున్నా.. దానిని అధిగమించడానికి లేదా తట్టుకోవడానికి మీరు మత్తు చేరువయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. మానసికంగా బాగోలేదు అంటూనే మీరు మత్తుకు చేరువవుతుంటారు. అయితే నిజానికి మానసిక రుగ్మతలను అధిగమించాలంటే మీరు ధృఢచిత్తంగా ఉండాలే కానీ ఎలాంటి మద్యం, పోగాకు పదార్థాలను వినియోగించరాదు. అవి శారీరిక అరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. బాధలో మీరు ఏం తీసుకుంటున్నారో.. తెలియని స్థితికి చేరుకుంటారు. మరికొందరు మాదకద్రవ్యాలకు కూడా అలవాటు పడతారు. ఇది మరీ విపరీతమైన విపత్కర పరిస్థితులకు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. డ్రగ్స్, దూమ, మద్య పానీయాలు హానికరమైన పదార్థాలు కావడం కారణంగా అవి మిమ్మల్ని తాత్కాలికంగా బాధ నుంచి విముక్తి కల్పించేలా చేస్తాయని.. లేదా అలాంటి అనుభూతిని పొందడంలో సహాయపడతాయని అనిపిస్తాయి. అంతేకానీ అవి దీర్ఘకాలంలో మరింత దిగజార్చి వాటికి బానిసలుగా చేస్తాయి. ఈ పదార్ధాలు కూడా ప్రమాదకరమైనవి. మీకు, మీ చుట్టుపక్కల వారికి వ్యాధులు లేదా గాయాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

5. వాస్తవిక ప్రపంచంపై దృష్టి పెట్టాలి:

Strong mental ability

మానసికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులకు గురవుతున్నా.. లేక నెగిటివ్ అలోచనలు పదే పదే వస్తున్నా.. ఆ పరిస్థితులను అధిగమించాలంటే.. మీరు వాస్తవిక ప్రపంచంపై దృష్టి పెట్టాలి. అందుకు కేవలం రెండు నిమిషాల సమయాన్ని కేటాయించాలి. ఇలాంటి అలోచనలు కలుగుతున్న సమయంలో మీరు ఎక్కడ ఉన్నారో మీకు మీరుగా తెలుసుకోవాలి. అందుకు మిమ్మల్ని మీరే మళ్లీ కనెక్ట్ చేసుకోవడం ద్వారా నిరంతరం తిరుగుతున్న ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. ముందుగా వెన్ను నిటారుగా ఉంచుతూ నెమ్మదిగా మూడు లోతైన శ్వాసలను తీసుకోండి. మీ పాదాలను నేలపై ఉంచినట్లు భావించి మిమ్మల్ని మీరు ఈ క్రింది విధంగా ప్రశ్నించుకోండి:

  • చూడగలిగే ఐదు విషయాలు ఏమిటి? వాటిని చూసి లెక్కించుకోవాలి.
  • వినగలిగే నాలుగు విషయాలు ఏమిటి? వాటిని విని లెక్కించుకోవాలి.
  • గాలిని పీల్చి.. ఏమి వాసన వస్తుందో తెలుసుకోండి? గాలిని పీల్చి ఏయే వాసనలు వస్తున్నాయో తెలుసుకోవాలి.
  • మోకాళ్లను తాకి లేదా చేరువలోని ఏదైనా వస్తువును తాకి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు పోందిన అనుభూతిని వివరించుకోవాలి.
  • మీ చేతి వేళ్ల కింద ఆ వస్తువు ఎలాంటి అనుభూతి పోందుతుంది.? ఇలా గమనించడం వల్ల ఒత్తిడి పరిస్థితులను అధిగమించడానికి దోహదపడతాయి.

తొలిస్థాయి దాటి వెళ్లిన బాధితులకు చికిత్సలు:

Mental Health Tips

మానసిక ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా.. మానసిక రుగ్మతలను తొలి స్థాయిలోనే అడ్డుకుని.. జీవనశైలిలో మార్పులను తీసుకువస్తే వారు ఎలాంటి చికిత్సలు అవసరం లేకుండానే కొద్ది రోజుల వ్యవధిలోనే రుగ్మతను అధిగమిస్తారు. అయితే తొలినాళ్లలో ఎవరూ దీనిని గుర్తించకపోవడం.. లేదా వారిని పట్టించుకునే వారు కరువవ్వడం కారణంగా ఆ స్థాయిని దాటితే మాత్రం వారికి పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మానసిక రుగ్మతలను అధిగమించాలన్న భావన గట్టిగా ఉన్నవారికైతే మెడికేషన్స్ ద్వారా తగ్గించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అలా కాకుండా.. ఆ దశను కూడా దాటిన వారికి మరో రెండు మార్గాల ద్వారా చికిత్స చేస్తారు. వాటిలో ఒకటి సైకో థెరపీ కాగా, రెండవది ఈసిటీ.

మాత్రల ద్వారా చికిత్స విధానం:

Mental health and well being

ఈ విధానంలో బాధితులకు యాంటి-డిప్రెసెంట్ మాత్రలను ఇచ్చి చికిత్స చేస్తారు వైద్యుల. అయితే చాలామందిలో ఈ మాత్రల విషయంలో ఒక బలమైన అపోహ ఉంది. అది యాంటీ- డిప్రెసెంట్స్ అంటే మత్తు మందులని.. అవి జీవితకాలం వాడాలన్నదే అపోహ. దీనిపై వైద్యులు యాంటీ-డిప్రెసెంట్స్ అంటే మత్తు మందు కాదని.. ఇక జీవిత కాలం వాడాల్సిన పనికూడా లేదని తేల్చిచెబుతున్నారు. ఇవి కేవలం ఆరు నెలల కాలపరిమితితో మాత్రమే వైద్యులు సూచిస్తారని, ఆతరువాత వాటిని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తారు.

సైకో థెరపి: దీనినే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని కూడా అంటారు. ఇదో రకమైన సైకలాజికల్ కౌన్సిలింగ్. ఈ చికిత్సా విధానంలో రోగులకు కౌన్సిలింగ్ చేసి వారిని మారుస్తారు. ఈ స్థాయిలో రోగులు వ్యాపారంలోనో, లేక పోటీ పరీక్షలలోనో తప్పడాన్ని జీర్ణించుకోలేకపోతారు. దాంతో వారు గతంలో జరిగిన అన్ని ఇలాంటి వ్యతిరేక ఘటనలు నెమరు వేసుకుని ఇక బాధపడుతుంటారు. ఒకానోక పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు విపరీతాలకు కూడా దారితీయవచ్చు. దీంతో వారి జీవితమే వృధా అని భావిస్తారు. ఇలాంటి వ్యక్తులను కౌన్సింగ్ ఇస్తూనే మెడికేషన్ ద్వారా చికిత్స చేయడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు.

ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసిటీ): కొంతమందిలో తీవ్రమైన మానసిక రుగ్మత ఏర్పడుతుంది. వీళ్లు మాటిమాటికి ఆత్మహత్య ప్రయత్నాలకు పూనుకుంటారు. అయితే వారికి సైకో థెరపీ కానీ లేదా మెడికేషన్ కానీ ఇవ్వడానికి వీలుండదు. మెడికేషన్ చికిత్సలో కనీసం రెండువారాల సమయం పడుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్ కు గురైన వ్యక్తి ఎలాంటి కౌన్సిలింగ్ చేసినా వినిపించుకోడు. ఇలాంటి వారికి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ చికిత్స చేస్తారు. ఈ చికిత్స ద్వారా బాధితులు తొందరగా బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి.