పసుపులోని ఔషధ గుణాల గురించి అందరికీ తెలిసిందే. ఇది వంటింట్లోని మసాలా పదార్థమే అయినా.. దాని ఔషధగుణాల కారణంగా సహస్రాబ్ధాల క్రితం నుంచి సంప్రదాయ అయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు. ఇక ఇప్పటికే పసుపులోని ఔషధ గుణాల గురించి అటు పాశ్చాత్య దేశాల్లోనూ వైద్య పరిశోధకులు అధ్యయనాలు నిర్వహించి అవి నిజమేనని నిరార్థణ చేసుకున్నారు. పసుపు యాంటి-సెప్టిక్ గా మన పెద్దలు ఇప్పటికీ వాడుతున్నారు. చిన్నారులు కింద పడినా.. లేక కత్తిపీట తెగి వేలికి రక్త గాయమైనా ముందుగా వంటింట్లోకి వెళ్లి పసుపు తీసుకువచ్చి ప్రభావిత ప్రాంతంలో దానిని వేస్తాం. ఇలా రక్తాన్ని గడ్డ కట్టించడంతో పాటు గాయం కారణంగా ఎలాంటి సెప్టిక్ కాకుండా కూడా పసుపు సహాయపడుతుంది. అందుకు కారణం పసుపులోని క్రియాశీల పదార్ధం కర్కుమిన్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీకాన్సర్, యాంటీఆక్సిడెంట్ సహా అనేక ఇతర ప్రయోజనాలను కలిగివుంది. పాశ్చత్య దేశాల వైద్య నిపుణులు చేసిన అనేక అధిక-నాణ్యతతో కూడిన అధ్యయనాలు.. పసుపులోని ప్రధాన ప్రయోజనాలు శరీరం, మెదడుకు దోహదం చేస్తున్నాయని పేర్కోన్నాయి.
పసుపు, కర్కుమిన్ అంటే ఏమిటి? What are turmeric and curcumin?
పసుపు అనేది వంటలకు రంగును అందించే మసాల పదార్థం. అయితే భారతదేశంలో మాత్రం ఇది వేలాది సంవత్సరాలుగా మసాలాతో పాటు ఔషధంగా కూడా ఉపయోగంలో ఉంది. ఇటీవల, పసుపులో ఔషధ గుణాలు కలిగిన సమ్మేళనాలు ఉన్నాయన్న సంప్రదాయ వాదనలను సైన్స్ నమ్మడం ప్రారంభించింది. పసుపులోని కాంపౌండ్లను కర్కుమినాయిడ్స్ అంటారని.. కాగా వాటిలో ముఖ్యమైనది కర్కుమిన్ అని చెప్పింది. పసుపులో కర్కుమిన్ ప్రధాన క్రియాశీల పదార్ధం. ఇది అత్యంత బలమైన యాంటీఆక్సిడెంట్ మాత్రమే కాదు శక్తివంతమైన ప్రభావాలను కలిగిన యాంటీ ఇన్ఫ్లమేటరీ.
ఒక చెంచా పసుపులో:
- ఎనర్జీ: 29 కేలరీలు
- కొవ్వు: 0,31 గ్రాములు
- ప్రోటీన్: 0,91 గ్రాములు
- మాంగనీస్: 26 శాతం
- కార్బోహైడ్రేట్లు: 6.31 గ్రాములు
- చక్కెర: 0.3 గ్రాములు
- ఫైబర్: 2.1 గ్రాములు
- విటమిన్ సి: 3 శాతం
- పొటాషియం: 5 శాతం
- ఇనుము: 16 శాతం
నిరూపితమైన పసుపు పది ఆరోగ్య ప్రయోజనాలివే: The top 10 evidence-based health benefits of turmeric
1. పసుపులో ఔషధ గుణాలున్న బయోయాక్టివ్ కాంపౌండ్స్ Turmeric contains bioactive compounds
పసుపులో కర్కుమినాయిడ్స్ కాంపౌండ్లు ఉన్నాయని, వాటిలో కర్కుమిన్ అత్యంత బలమైన యాంటీఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. అయితే పసుపులో కుర్కుమిన్ కంటెంట్ అంత ఎక్కువగా ఉండదని కేవలం మూడు శాతం మేర మాత్రమే ఉందని తేలింది. ఈ మేర నిర్వహించిన చాలా అధ్యయనాలు పసుపులోని కర్కుమిన్ సారంపైనే చేసి, రోజుకు ఒక్క గ్రాము కంటే కాస్తా ఎక్కువ కర్కుమిన్ మోతాదు మాత్రమే ఉందని తేల్చింది. దీని కారణంగా వంటలలో పసుపును వినియోగించడం వల్ల ఆహారంలో కావాల్సిన కుర్కుమిన్ స్థాయిలను చేరుకోవడం చాలా కష్టం. ఫలితంగా కొంతమంది కుర్కుమిన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు.
అధ్యయనాల ద్వారా గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కర్కుమిన్ రక్తప్రవాహంలోకి సరిగా శోషించబడదు. కర్కుమిన్ పూర్తి ప్రభావాలను అనుభవించడానికి, దాని జీవ లభ్యత (శరీరం ఒక పదార్థాన్ని గ్రహించే రేటు) మెరుగుపరచాలి. ఇది పైపెరిన్ కలిగి ఉన్న నల్ల మిరియాలలో అధికంగా ఉంటుంది. దీంతో కర్కుమిన్ నల్ల మిరియాలతో తీసుకోవడం కారణంగా శరీరంలోకి శోషించబడుతుంది. సహజ పదార్ధమైన పైపెరిన్ సహాయంతో కర్కుమిన్.. శరీరంలోకి 2000 శాతం మేర శోషణించేలా చేస్తుంది. అందుకనే ఉత్తమమైన కర్కుమిన్ సప్లిమెంట్లలో పైపెరిన్ కూడా జోడించివుంటుంది. దీని కారణంగానే అవి మరింత ప్రభావవంతంగా మారుతుంది. వాస్తవానికి కుర్కుమిన్ కూడా కొవ్వులో కరిగే పదార్థమే. అంటే ఇది విచ్ఛిన్నమై కొవ్వు లేదా నూనెలో కరిగిపోతుంది. అందుకని కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకునేప్పుడు అధిక కొవ్వు పదార్థాలతో కూడిన భోజనం తీసుకోవడం మంచిది.
2. కర్కుమిన్ ఒక సహజ వాపు నిరోధక సమ్మేళనం Curcumin is a natural anti-inflammatory compound
శరీరంలో వాపు చాలా వ్యాధులకు.. మరీ ముఖ్యంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణం. ఇది విదేశీ నుంచి వచ్చే ఆక్రమణదారులతో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా శరీరంలోని నష్టాన్ని సరిచేయడంలో కీలక పాత్రను కలిగి ఉంటుంది. తీవ్రమైన, స్వల్పకాలిక వాపు ప్రయోజనకరమైనది అయినప్పటికీ, అది దీర్ఘకాలికంగా మారితే.. శరీరం స్వంత కణజాలంపై దాడి చేస్తే అది ఆందోళన కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు దీర్ఘకాలిక తక్కువ-స్థాయి మంట కొన్ని ఆరోగ్య పరిస్థితులు, వ్యాధులకు కారణం అవుతుందని భావిస్తున్నారు. వీటితొ పాటు:
- గుండె వ్యాధి
- క్యాన్సర్
- మెటబాలిక్ సిండ్రోమ్
- అల్జీమర్స్ వ్యాధి
- వివిధ క్షీణత పరిస్థితులు
అందుకే దీర్ఘకాలిక మంటతో పోరాడటానికి సహాయపడే ఏదైని పరిస్థితులను నివారించడంలో, చికిత్స చేయడంలో పసుపు గుణాత్మకమైనదని నమ్ముతున్నారు. ఇన్ఫ్లమేషన్ అంశం బహుళస్థాయి, సాధారణ సమాధానం లేనప్పటికీ, కర్కుమిన్‌కు సంబంధించిన కీలకమైన అంశం ఏమిటంటే ఇది మంటతో పోరాడగల బయోయాక్టివ్ పదార్థం. అయితే, ఈ బయోయాక్టివ్ పదార్థం ఔషధ ఫలితాలను ఉత్పత్తి చేయడానికి అత్యంత అధిక మోతాదు అవసరమైనప్పటికీ మనం కేవలం కూరల్లోనే వేసుకుని సరిపెట్టుకుంటున్నాం.
3. శరీరంలో యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచే పసుపు Turmeric increase the antioxidant capacity of the body
ఆక్సీకరణ నష్టం వృద్ధాప్యం సహా అనేక వ్యాధుల వెనుకనున్న యంత్రాంగాలలో ఒకటిగా నమ్ముతారు. ఇది జతకలవని ఎలక్ట్రాన్లు, ఫ్రీ రాడికల్స్ తో అధిక రియాక్టివ్ అణువులుగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు లేదా డీఎన్ఏ వంటి ముఖ్యమైన సేంద్రీయ పదార్ధాలతో ప్రతిస్పందిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను కట్టడి చేసి వాటి నుంచి శరీరానికి కలిగే నష్టాన్ని కట్టడి చేస్తాయి. అయితే ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ల తరహాలోనే కర్కుమిన్ కూడా ఒక శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్. ఇది కూడా ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తుంది. అయితే అందుకు దాని రసాయన నిర్మాణాన్ని వినియోగిస్తుంది. అదనంగా, జంతు సెల్యులార్ అధ్యయనాలు కర్కుమిన్ ఫ్రీ రాడికల్స్ చర్యను నిరోధించవచ్చని, ఇతర యాంటీఆక్సిడెంట్ల చర్యను ప్రేరేపించవచ్చని సూచిస్తుంది. ఈ ప్రయోజనాలను నిర్ధారించడానికి మానవులలో మరిన్ని క్లినికల్ అధ్యయనాలు అవసరం.
4. మెదడులోని న్యూరోట్రోఫిక్ కారకాన్ని పెంచే కర్కుమిన్ Curcumin can boost brain-derived neurotrophic factor
న్యూరాన్లను చిన్నతనం తర్వాత విభజించి గుణించలేవని నమ్మిన శాస్త్రవేత్తలు వాటిని బాగా అర్థం చేసుకోకముందు ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇప్పుడు న్యూరాన్ల గురించి బాగా తెలిసిన తరువాత వారి నిర్ణయాన్ని సవరించుకోవాల్సి వచ్చింది. న్యూరాన్లు కొత్త కనెక్షన్లను ఏర్పర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని, మెదడులోని కొన్ని ప్రాంతాలలో అవి గుణించబడి, వాటి సంఖ్యను పెంచుకుంటాయని కూడా నమ్ముతున్నారు. ఈ ప్రక్రియ ప్రధాన డ్రైవర్లలో ఒకటి మెదడు-ఉత్పన్నమైన న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బిడిఎన్‌ఎఫ్). ఇది న్యూరాన్ల జీవితాన్ని ప్రోత్సహించే బాధ్యత కలిగిన ప్రోటీన్‌ను తయారు చేయడంలో కీలకమైన జన్యువు. ఈ బిడిఎన్‌ఎఫ్ ప్రోటీన్ జ్ఞాపకశక్తి, చదవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మెదడులోని పలు ప్రాంతాల్లో కనిపించే ఈ పదార్థం తినడం, త్రాగడం, శరీర బరువు నియంత్రణలోనూ బాధ్యత వహిస్తుంది.
అనేక సాధారణ మెదడు రుగ్మతలు నిరాశ, అల్జీమర్స్ వ్యాధితో సహా బిడిఎన్‌ఎఫ్ ప్రోటీన్ తగ్గిన స్థాయిలతో ముడిపడి ఉన్నాయి. ఆసక్తికరంగా, కర్కుమిన్ బిడిఎన్‌ఎఫ్ మెదడు స్థాయిలను పెంచుతుందని జంతు అధ్యయనాలు కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా, మెదడు పనితీరులో వయస్సు-సంబంధిత తగ్గుదల, అనేక మెదడు వ్యాధులను ఆలస్యం చేయడం లేదా ప్రభావవంతంగా తిప్పికొట్టడం కూడా చేస్తుంది. అయినప్పటికీ, ఈ అధ్యయనాలు జంతువులలో ప్రదర్శించబడినందున, మానవులకు ఫలితాలు ఏమిటో చెప్పడం కష్టం. ఇది జ్ఞాపకశక్తి, శ్రద్ధను మెరుగుపరచడంలో కూడా సహాయపడవచ్చు, ఇది బిడిఎన్‌ఎఫ్ స్థాయిలపై దాని ప్రభావాలను బట్టి తార్కికంగా కనిపిస్తుంది. అయితే, దీన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.
5. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే కర్కుమిన్ Curcumin may lower your risk of heart disease
ప్రపంచంలోని మరణాలకు మొదటి కారణంగా గుండె జబ్బులు నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ మేరకు పరిశోధకులు అనేక దశాబ్దాలుగా హృదయ సంబంధిత వ్యాధులపై అధ్యయనం చేసి.. ఇలా ఎందుకు జరుగుతుందన్న కారణాలు, కారకాలపై చాలా తెలుసుకున్నారు. ఆశ్చర్యకరంగా, గుండె జబ్బులు చాలా క్లిష్టమైనవని.. వివిధ అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. గుండె జబ్బు ప్రక్రియను అనేక దశల్లో రివర్స్ చేయడంలో కర్కుమిన్ సహాయపడుతుంది. గుండె జబ్బుల విషయానికి వస్తే కర్కుమిన్ ప్రధాన ప్రయోజనం రక్తనాళాల లైనింగ్ అయిన ఎండోథెలియం పనితీరును మెరుగుపరచడం. ఎండోథెలియల్ పనిచేయకపోవడం గుండె జబ్బులకు ప్రధాన కారకం. అయితే రక్తపోటు నియంత్రిణ, రక్తం గడ్డకట్టడం, అనేక ఇతర కారకాలను ఎండోధేలియం పనిచేయకపోవడానికి కారణం.
కర్కుమిన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదనంగా, రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఇది వ్యాయామం వలె ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనం కనుగొంది. దీనికి తోడు, వాపు, మంట, ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బులు ఏర్పడటంలో పాత్ర పోషించవచ్చు. కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీకి గురైన 121 మంది వ్యక్తులపై కొనసాగించిన ఒక అధ్యయనంలో, పరిశోధకులు వారికి శస్త్రచికిత్సకు కొన్ని రోజుల ముందు, తర్వాత రోజుకు ప్లేసిబో లేదా 4 గ్రాముల కర్కుమిన్ని కేటాయించారు. కర్కుమిన్ సమూహం ఆసుపత్రిలో గుండెపోటును ఎదుర్కొనే ప్రమాదాన్ని 65శాతం మేర తగ్గించింది.
6. క్యాన్సర్ నివారణలో సహాయపడే పసువు Turmeric may help prevent cancer
క్యాన్సర్ అనేది ఒక వ్యాధి, ఇది అనియంత్రిత కణాల పెరుగుదల ద్వారా వర్గీకరించబడుతుంది. కర్కుమిన్ సప్లిమెంట్స్ ద్వారా ప్రభావితమయ్యే అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి.
కర్కుమిన్ క్యాన్సర్ చికిత్సలో ప్రయోజనకరమైన మూలికగా అధ్యయనం చేయబడింది. అంతేకాదు క్యాన్సర్ పెరుగుదల, అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది. వీటిపై కర్కుమిన్ ప్రభావం చూపగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. అవి:
- క్యాన్సర్ కణాల మరణానికి దోహదం చేస్తాయి
- ఆంజియోజెనిసిస్ను తగ్గించడం (కణితుల్లో కొత్త రక్తనాళాల పెరుగుదల)
- మెటాస్టాసిస్ను తగ్గించడం (క్యాన్సర్ వ్యాప్తి)
అధిక మోతాదు కర్కుమిన్ శరీరంలో శోషించబడటానికి అదే స్థాయిలో పైపెరిన్ వంటి శోషణ పెంచే సాధన పదార్థాలు కావాలి. ఈ రెండింటినీ కలపి తీసుకుంటే మానవులలో క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతాయి. అయితే ఈ అంశంపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సిఉంది. ఏది ఏమైనప్పటికీ, ఇది మొదటి స్థానంలో క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి జీర్ణవ్యవస్థ క్యాన్సర్లను అడ్డుకుంటుంది. 44 మంది పురుషులపై సాగిన 30-రోజుల అధ్యయనంలో పెద్దప్రేగులో గాయాలను క్యాన్సర్ గా మారకుండా కర్కుమిన్ నిరోధించిందని తేలింది. 44 మందిలో పెద్దప్రేగులో ఏర్పడిన గాయాలు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్నా.. రోజుకు 4 గ్రాముల కర్కుమిన్ ఆ గాయాల సంఖ్యను 40శాతం మేర తగ్గించింది.
7. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగపడే కర్కుమిన్: Curcumin useful in treating Alzheimer’s disease
అల్జీమర్స్ వ్యాధికి అత్యంత సాధారణ రూపం చిత్త వైకల్యం, ఈ కేసుల ఏర్పడటంలో చిత్తవైకల్యం 70 శాతం మేర దోహదపడుతుంది. దాని లక్షణాలలో కొన్నింటిని చికిత్స తొలగించినప్పటికీ, అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదన్నది కాదనలేని వాస్తవం. అందుకే ఇది సంక్రమించిన తొలిస్థాయిలోనే దానిని నిరోధించడం చాలా ముఖ్యం. ఇందుకు కర్కుమిన్ దోహదపడుతుంది. కర్కుమిన్ రక్త-మెదడు అవరోధం దాటినట్లు చూపబడినందున అల్జీమర్స్ వ్యాధి హోరిజోన్లో శుభవార్తనిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిలో వాపు, మంట, ఆక్సీకరణ ఒత్తడి నష్టం కలిగిస్తుందని తెలిసిందే.
కాగా, కర్కుమిన్ ఈ వాపు, ఆక్సీకరణ ఒత్తిడిపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి కీలకమైన ఘట్టం అమిలాయిడ్ ఫలకాల నిర్మాణం. ఈ ఫలకాలు ప్రోటీన్ చిక్కులతో ఏర్పడతాయి. కర్కుమిన్ అమిలాయిడ్ ఫలకాలను క్లియర్ చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. కర్కుమిన్ ప్రజలలో అల్జీమర్స్ వ్యాధి పురోగతిని నెమ్మదిస్తుందా లేదా తిప్పికొట్టగలదా అనేది ప్రస్తుతానికి తెలియదు. అయితే ఈ దిశగా మరింత అద్యయనం చేయాల్సిఉంది.
8. కర్కుమిన్ సప్లిమెంట్లకు బాగా స్పందించే ఆర్థరైటిస్ రోగులు Arthritis patients respond well to curcumin supplements
పాశ్చాత్య దేశాలలో కీళ్లనొప్పులు ఒక సాధారణ సమస్య. శీతల వాతావరణం కూడా అక్కడ అర్థరైటిస్ సమస్య అధికంగా ఉత్పన్నం కావడానికి ఒక కారణం కావచ్చు. ఎండతో లభించే విటమిన్ డి చాలా తక్కువగా లభ్యం కావడంతో ఈ సమస్య ఏర్పడవచ్చు. కాగా అర్థరైటిస్ లో అస్టియో, రూమటాయిడ్, గౌట్ సహా అనేక రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి, వీటిలో ఎక్కువ భాగం కీళ్లలో మంటను కలిగి ఉంటుంది. కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ కాబట్టి, ఇది ఆర్థరైటిస్‌తో సహాయపడుతుందని నిరూపితమైంది.
నిజానికి, అనేక అధ్యయనాలు కర్కుమిన్ లో ఒక అసోసియేషన్ ఉందని చూపుతున్నాయి. అది ఎలాంటి అసోసియేషన్ అంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కర్కుమిన్ ఎంతలా పనిచేస్తుందంటే ఏకంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ కంటే అధిక ప్రభావవంతంగా పనిచేసిందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇతర అధ్యయనాలు ఆర్థరైటిస్‌పై కర్కుమిన్ ప్రభావాలను పరిశీలించి, వివిధ లక్షణాలలో మెరుగుదలలను గుర్తించింది.
9. డిప్రెషన్ వ్యతిరేకంగా ప్రయోజనాలు కలిగిన కర్కుమిన్: Curcumin has benefits against depression
డిప్రెషన్ చికిత్సలో కొంత ప్రమాణకర స్థాయిని కుర్కుమిన్ చాటింది. పరిమిత నియంత్రణ స్థాయిలో, డిప్రెషన్‌తో బాధపడుతున్న 60 మంది వ్యక్తులను మూడు గ్రూపులుగా విభజించి వారిపై అధ్యయనం సాగించారు. ఈ మూడింటింలోని ఒక గ్రూపులోని బాధితులకు ప్రోజాక్, మరొక గ్రూపుకు 1 గ్రాము కర్కుమిన్, ఇంకో గ్రూపుకు ప్రోజాక్ తో పాటు కర్కుమిన్ రెండింటినీ కలపి ఇచ్చారు. ఆరు వారాల తర్వాత, కర్కుమిన్, ప్రోజాక్ లకు తీసుకున్న రెండు గ్రూపులలో ఒకదాని తరహాలోనే మరోగ్రూపులో కూడా మెరుగుదలలకు దారితీసింది. అయితే ప్రోజాక్, కర్కుమిన్ రెండింటినీ తీసుకున్న సమూహం ఉత్తమంగా పనిచేసింది. ఈ అధ్యయనం ప్రకారం, కర్కుమిన్ యాంటిడిప్రెసెంట్ గాలె ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది.
డిప్రెషన్ బిడిఎన్‌ఎఫ్ తగ్గిన స్థాయిలతో, కుంచించుకుపోతున్న హిప్పోకాంపస్తో కూడా ముడిపడి ఉంది. హిఫ్పోకాంపస్ అనేది నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం (జ్ఞాపకశక్తి)లో పాత్రను కలిగి ఉన్న మెదడు ప్రాంతం. కర్కుమిన్ బిడిఎన్‌ఎఫ్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో డిప్రెషన్ బాధితులలో వస్తున్న మార్పులలో కొన్నింటిని సమర్థవంతంగా తిప్పికొట్టుతుంది. కర్కుమిన్ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు సెరోటోనిన్, డోపమైన్లను పెంచుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి.
10. యాంటీ-ఏజింగ్, వృద్దాప్య దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే కర్కుమిన్: Curcumin may help delay aging and fight age-related chronic diseases
కర్కుమిన్ నిజంగా గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ నిరోధించడంలో సహాయపడగలిగితే, అది క్రమంగా దీర్ఘాయువు ప్రయోజనాలను కూడా కలిగి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. కర్కుమిన్ యాంటీ ఏజింగ్ సప్లిమెంట్ సంభావ్యతను కలిగి ఉండవచ్చని ఇది సూచిస్తుంది. ఆక్సీకరణం, వాపు, వృద్ధాప్యంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. అయితే కర్కుమిన్ లోని కర్కుమినాయిడ్స్ అనే ప్రోటీన్లు అక్టీకరణతో పాటు వావు, మంటలను నివారించే ప్రభావాలను కలిగి ఉందని నిరూపితమైంది. దీంతో ఇది వృద్దాప్యాన్ని ఆలస్యం చేసే యాంటీ-ఏజింగ్ గుణాలను కూడా కలిగి ఉందని వెల్లడైంది. కర్కుమిన్ లో కేవలం వ్యాధిని నివారించే విధంగా చేసే ప్రభావాలు మాత్రమే కాదు అంతకుమించిన ఔషదగుణాలు ఉన్నాయని చెప్పవచ్చు.