యాంటిబయాటిక్స్ చీకటికోణం: తెలుసుకోవాల్సిన 8 దుష్ప్రభావాలు.. - Unveiling the 8 Harmful Side Effects of Antibiotics on the Human Body in Telugu

0
Harmful side effects of antibiotics on human body

ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ వినియోగం క్రమంగా పెరుగుతూపోతొంది. ఏ ఒక్కరికి చిన్నపాటి అస్వస్థ కలిగినా.. యాంటీబయాటిక్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రపంచ ప్రజలపై యాంటిబయాటిక్ దుష్ప్రభావాలు తప్పక పడివుంటాయని యాంటిబయాటిక్ వినియోగ పరిధిని పరిశీలించడంతో తెలుస్తోంది. ఏప్రిల్ 2018 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 40 బిలియన్ డాలర్ల అమ్మకాలతో అత్యంత సాధారణంగా సూచించబడిన యాంటీబయాటిక్స్ డ్రగ్ క్లాస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఈ యాంటీబయాటిక్స్ 2000 నుంచి 2015 మధ్య
వినియోగం దాదాపు 40 శాతం పెరిగింది. దీంతో అందోళన పెరిగింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మరణాలకు యాంటీబయాటిక్ వినియోగం కారణమవుతుందని పలువురు ఆర్థికవేత్తలు తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. యాంటీబయాటిక్స్ వినియోగం చాలా పెరుగుతుందని తెలుసు. వీటి ద్వారా ఫార్మా కంపెనీలు, మెడికల్స్ షాపులు చాలా డబ్బులు సంపాదిస్తున్నాయి. ఇక రోగం తాత్కాలికంగా తగ్గడంతో వారు సహాయం చేస్తున్నారని బాధితులు బావిస్తున్నారు. కానీ ఇందులో నిజం లేదు.. ఎందుకంటే వారు మీకు నిజంగా సహాయం చేస్తే యాంటిబయాటిక్స్ వినియోగానికి సిఫార్సు చేయరు. మరో రకంగా చెప్పాలంటే వీటిని సిఫార్సు చేస్తూ వారు మిమల్ని బాధల్లోకి నెడుతున్నట్లే.

ఒక్కసారి యాంటీబయాటిక్ తీసుకున్న తరువాత మరోమారు అదే వ్యాధి సోకితే అంతకుమించిన డోస్ వాడాలి. ఇలా యాంటిబయాటిక్ వినియోగంతో శరీరంలో దాని నిరోధకత పెరుగుతూనే ఉంటుంది. ఈ మందులు ప్రపంచ ప్రజలను మరిన్ని ఆరోగ్య సమస్యలకు చేరువ చేస్తున్నాయి. ఇలీవల ప్రచురితమైన ఓ కథనంలో యాంటిబయాటిక్స్ నిరోధకత చెందిన డెడ్లీ ‘నైట్‌మేర్ బాక్టీరియా’ 221 మంది అమెరీకన్లకు 2017లో సోకిందని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇది కేవలం ఒక్క ఘటన మాత్రమేనని, యాంటీబయాటిక్స్‌ వినియోగాన్ని తగ్గించని తరుణంలో ఇలాంటి భయానక దుష్ప్రభావాలు అనేకం చవిచూడాల్సి వస్తుందని పేర్కోంది. ఈ క్రమంలో అసలు యాంటీబయాటిక్స్ స్వల్ప, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఏంటో కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

Antibiotic toxicity

యాంటీబయాటిక్ అంటే ఏమిటి?

యాంటీబయాటిక్ అంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం. యాంటీబయాటిక్స్ మొదట తెరపైకి వచ్చినప్పుడు, అవి ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను ఎంచుకోవడానికి సూక్ష్మజీవుల నుండి సహజంగా ఉత్పన్నమైన పదార్థాలను కలిగి ఉండేవి. ఇందుకు 1926లో కనుగొనబడిన పెన్సిలిన్ ఒక ఖచ్చితమైన ఉదాహరణ. శిలీంధ్రాల (ఫంగీ) ద్వారా ఉత్పత్తి చేయబడిన యాంటీబయాటిక్ కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కానీ ప్రసుత్తం మార్కెట్లో లభిస్తున్న చాలా యాంటీబయాటిక్స్ సింథటిక్ లేదా మనుషులు చేసినవి.

మనం నిత్య జీవనంలో అధికంగా వినియోగించే టాప్ 10 యాంటీబయాటిక్స్ ఏంటీ.? వాటి ఉపయోగాలు గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారా? సాధారణంగా ఉపయోగించే కొన్ని సాధారణ యాంటీబయాటిక్స్:

  • అమోక్సిసిలిన్
  • డాక్సీసైక్లిన్
  • సెఫాలెక్సిన్
  • సిప్రోఫ్లోక్సాసిన్
  • క్లిండామైసిన్
  • మెట్రోనిడాజోల్
  • అజిత్రోమైసిన్
  • సల్ఫామెథోక్సాజోల్/ట్రిమెథోప్రిమ్
  • అమోక్సిసిలిన్/క్లావులనేట్
  • లెవోఫ్లోక్సాసిన్

యాంటీబయాటిక్స్ అత్యంత సాధారణ ఉపయోగాలలో కొన్ని మొటిమలు, బ్రోన్కైటిస్, కండ్లకలక (పింక్ ఐ), చెవి ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, చర్మ వ్యాధులు, స్ట్రెప్ థ్రోట్, ట్రావెలర్స్ డయేరియా, ఎగువ శ్వాసకోశ వ్యాధులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు. కాగా వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ ప్రభావం శూన్యమని గమనించాలి. అందుకే వాటిని వైరల్ ఇన్పెషన్లకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. కాగా, ప్రజలు యాంటీబయాటిక్స్‌ను వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు తప్పుగా ఎంచుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. వాటిలో సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుఎంజా. కొంతమంది గొంతు ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్ కూడా తీసుకుంటారు, అయితే ఇది స్ట్రెప్ వంటి బ్యాక్టీరియా గొంతు ఇన్ఫెక్షన్ అయితే తప్ప దానిని ఎప్పటికీ సిఫారసు చేయకూడదు. సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఎత్తి చూపినట్లుగా “చాలావరకు గొంతు నొప్పి యాంటీబయాటిక్స్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి.”

దుష్ప్రభావాల కారణంగా రోగులు యాంటీబయాటిక్స్‌ను ముందుగానే ఆపడం ఒక సాధారణంగా జరిగే విషయం. చాలా మంది వైద్యులు ముందుగానే వీటిని ఆపడం వల్ల బ్యాక్టీరియా బలపేతం కావడం.. దానిని చికిత్స చేసేందుకు మరింత ఎక్కువ డోసేజ్ వాడాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, “కొన్ని ఇన్‌ఫెక్షన్‌లకు తక్కువ కాలం తీసుకునే కోర్సులే ఎక్కువ కాలం తీసుకునే యాంటీబయాటిక్‌ కోర్సులు కన్నా అధిక ప్రభావవంతంగా ఉంటాయని ఆధారాలున్నాయి. చిన్న చికిత్సలు అర్థవంతంగా ఉండటంతో పాటు సక్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో పాటు చౌకగానూ పూర్తవుతాయి. అవి బ్యాక్టీరియాను యాంటీబయాటిక్స్‌కు బహిర్గతం కాకుండా చేయడంతో పాటు వ్యాధికారక నిరోధకతను అభివృద్ధి చేసే వేగాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు కలిగిన సందర్భంలో యాంటీబయాటిక్స్ తీసుకున్నా లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌లుగా పరిగణించబడిన నేపథ్యంలో వాటిని తీసుకున్నా, కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందా..

8 యాంటీబయాటిక్స్ సంభావ్య దుష్ప్రభావాలు:

Antibiotic side effects

యాంటీబయాటిక్స్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? శరీరంపై యాంటీబయాటిక్స్ అనేక సాధ్యమయ్యే అవాంఛనీయ దుష్ప్రభావాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాం:

1. యాంటీబయాటిక్స్‌ నిరోధక శరీర అంటువ్యాధులు

యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన బ్యాక్టీరియా కారణంగా ప్రతి సంవత్సరం 23,000 మంది ప్రజలు ఒక్క అమెరికలోనే మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లో, అమెరికా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న యాంటిబయాటిక్ నిరోధక “పీడకల బ్యాక్టీరియా”పై ప్రజలను హెచ్చరిస్తోంది. యాంటీబయాటిక్ వాడకం విషయానికి వస్తే అతిపెద్ద సాధారణ ఆందోళనలలో ఒకటి, ప్రతీ సారి వీటిని వాడటం వల్ల ఇప్పుడు యాంటీబయాటిక్‌ నిరోధకత కలిగిన ఇన్‌ఫెక్షన్లు కూడా చూస్తున్నాము. దీనికి కారణం యాంటీబయాటిక్స్ దుర్వినియోగం, మితిమీరిన వినియోగమే ప్రధాన కారణం. ఆహారంలోనూ యాంటీబయాటిక్స్ ఉపయోగించడం, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్‌లో సంప్రదాయ మాంసం, పాడి ఉత్పత్తులలో యాంటీబయాటిక్స్ ప్రబలంగా ఉన్నాయి.

సీడీసీ ఎత్తి చూపినట్లుగా, “యాంటీబయాటిక్ నిరోధకత ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలలో ఒకటి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌తో సులభంగా చికిత్స చేయగల అనారోగ్యాలు ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌లుగా మారడానికి కారణమవుతాయి. ఇవి పిల్లలు, పెద్దలకు దీర్ఘకాలికంగా భాదించే అవకాశాలు లేకపోలేదు. యాంటీబయాటిక్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా కుటుంబ సభ్యులకు, సహచరులకు, సహోద్యోగులకు వ్యాపిస్తుంది. యాంటీబయాటిక్స్ ఏ సమయంలో ఉపయోగించినా అవి దుష్ప్రభాలకు కారణం అవుతాయని, క్రమంగా నిరోధకతకు దారితీస్తాయని అట్లాంటాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లో ఆఫీస్ ఆఫ్ యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్. కేథరీన్ ఫ్లెమింగ్-డుత్రా పేర్కొన్నాడు.

2. ఇన్ఫెక్షన్లు నయం కావడానికి ఎక్కువ సమయం:

Long term antibiotic complications

ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌తో సులభంగా చికిత్స పొందిన ప్రజలు ఇప్పుడు ఇన్‌ఫెక్షన్ల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, అందుకు వీటిని అధికంగా వినియోగించడమే కారణం. యూటిఐలు, న్యుమోనియా వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు చికిత్స చేయడం చాలా కష్టంగా మారుతున్నాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగించే యాంటీబయాటిక్‌ల రకం ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని యాభై శాతం మంది రోగులకు పనికిరానిదిగా పరిగణించబడుతుంది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ అఫైర్స్ ప్రకారం, “యాంటీబయాటిక్స్ ప్రవేశపెట్టిన ఒక శతాబ్దం లోపే అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బాక్టీరియా-పోరాట మందులు మానవులు, జంతువులలో మితిమీరిన వినియోగం ఫలితంగా తక్కువ ప్రభావవంతంగా మారుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ యాంటీబయాటిక్స్ మరింతగా విఫలమవుతున్నాయి.

3. అలర్జీలు, ఆస్తమా

Allergy Asthma

ఇటీవల జరిపిన ఓ అద్యయనంలో యాంటీబయాటిక్ వినియోగాని, అలెర్జీల అభివృద్ధికి మధ్య సంబంధం ఉన్నట్లు కనుగోనబడింది. 2001 నుంచి 2013 మధ్య జన్మించిన 7,92,000 కంటే ఎక్కువ మంది పిల్లల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి చేసిన ఒక పెద్ద అధ్యయన వివరాలను ఏప్రిల్ 2, 2018న ప్రచురించబడింది. దీని ప్రకారం ప్రకారం.. చిన్నారులు పుట్టినప్పుటి నుంచి ఆరు నెలల వయస్సు వచ్చిన తరువాతి వరకు వారు తీసుకున్న యాంటీబయాటిక్స్ (లేదా యాంటాసిడ్లు) తీసుకున్న శిశువులకు అలెర్జీలను అభివృద్ది చేయడానికి మధ్య సంబంధం తో పాటు ఆస్తమా కూడా వృద్ది చెందినట్టు కనుగొన్నారు.

అధ్యయన ప్రధాన రచయిత, డాక్టర్ ఎడ్వర్డ్ మిత్రే ప్రకారం, యాంటీబయాటిక్స్‌కు వినియోగం కారణంగా పిల్లలు తమ భవిష్యత్తులో ఆస్తమాకు గురయ్యే ప్రమాదావకాశాలు రెట్టింపు అయ్యిందన్నారు. దీంతో పాటు దుమ్ము, చుండ్రు, పుప్పొడి (అలెర్జిక్ రినైటిస్)కు అలెర్జీలకు గురయ్యే ప్రమాదం 50 శాతం పెరుగుతుందని, అంతేకాకుండా కంటి అలెర్జీలు (అలెర్జీ కంజక్టివిటిస్), అనాఫిలాక్సిస్ వంటి వ్యాధులకు కూడా గురయ్యే అవకాశాలు పెరుగుతాయని అందోళన వ్యక్తం చేశారు.

4. అతిసారం

Antibiotic resistance Diarrhea

అతిసారం అంటే శరీరంలోంచి నీరు బయటకు వెళ్లిపోవడం. అయితే మూత్రం, చమట రూపంలో కాకుండా వాంతులు, విరోచనాలుగా బయటకు వెళ్లడం ఒక రకంగా అసహ్యకరం, ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇది యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే అత్యంత సాధారణమైన దుష్ప్రభావం. ఇది ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. యాంటీబయాటిక్ తీసుకోవడం మానేసిన తర్వాత కూడా విరేచనాలు కొన్ని వారాల పాటు కొనసాగవచ్చు. యాంటీబయాటిక్స్ పిల్లలు, పెద్దలు ఇద్దరిలోనూ సాధారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలలో ఇది ఒకటి.

5. అలసట

Superinfections antibiotics

యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు అలసట అత్యంత సర్వసాధారణంగా పరిగణలోకి తీసుకోవాల్సిన దుష్ప్రభావాలలో ఒకటి. కాబట్టి జబ్బుపడినంత మాత్రాన.. మీ శరీరాన్ని దానిని ధీటుగా ఎదుర్కోనే అవకాశం ఇవ్వకుండా, వెంటనే యాంటి బయాటిక్స్ వాడితే.. వ్యాధుల కారణంగా అలసిపోయిన మిమల్ని ఇవి మరింత అలసిపోయినట్లు చేస్తాయని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఎందుకంటే అలసట అన్నది దశాబ్దాలుగా మనకు తెలిసిన యాంటీబయాటిక్స్ దుష్ప్రభావం. కొన్నిసార్లు, యాంటీబయాటిక్స్ తీసుకునే వ్యక్తులు అలసిపోయినట్లుగా ఉంటారు.. లేక అలసట కారణంగా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులను అనుభవిస్తారు.

6. వాపు, నలుపు వర్ణంలోకి నాలుక

Allergic reactions

పెన్సిలిన్-రకం యాంటీబయాటిక్ తరహాలో రూపోందిన అమోక్సిసిలిన్ తరహా యాంటీబయాటిక్ దుష్ప్రభావాలు ఏమిటి? అంటే.. చాలానే ఉన్నాయని చెప్పాలి. వాపు, నాలుక నలుపు బారడం వంటివని చెప్పాలి. అమోక్సిసిలిన్ సాధారణ దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి:

  • వికారం
  • వాంతులు అవుతున్నాయి
  • అతిసారం
  • కడుపు నొప్పి
  • యోని దురద లేదా ఉత్సర్గ
  • తలనొప్పి
  • దద్దుర్లు
  • వాపు, నాలుక నలుపుబారడం. ఈ విచిత్రమైన వర్ణనతో నాలుక రుచించకుండా ఉంటుంది. దీంతో పాటు అమోక్సిసిలిన్ ఇతర తీవ్రమైన దుష్ప్రభావాలు:
  • ప్రేగులలో క్లోస్ట్రిడియం ఎస్పిపి బాక్టీరియా అధికంగా పెరగడం వల్ల పెద్దప్రేగు శోథ
  • కామెర్లు
  • మూర్ఛలు
  • దద్దుర్లు

7. రుతుక్రమంలో అసమానతలు

Irregular Periods

మహిళల్లో యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు వారి రుతుక్రంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. మహిళల్లో అసమానతలతో కూడిన రుతుచక్రమం కలిగించేలా చేస్తాయి. ఇది యాంటీబయాటిక్ పెన్సిలిన్ కారణంగా మహిళల రుతుచక్రంపై ప్రభావం చూపబడిందన్న 1947లోని అధ్యయనాలకు కొనసాగింపుగా మారింది. ఈ అంశాలపై మరోమారు చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. కొంతమంది మహిళలు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు వారి రుతుచక్రంలో ఎలాంటి అంతరాయాన్ని అనుభవించరు. కాగా కొందరిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం కాలేయమే. ఎందుకంటే.. యాంటీబయాటిక్స్, హార్మోన్లు రెండూ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడాలి. దీంతో యాంటీబయాటిక్స్ తీసుకోవడం మహిళలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. యాంటీబయాటిక్స్ ద్వారా హార్మోన్ల సమతుల్యత తొలగించబడినప్పుడు, మహిళల రుతుచక్రంలో అసమానతలు సంభవించవచ్చు. అనారోగ్యం శారీరక , మానసిక ఒత్తిడి కూడా దీనికి కారణం కావచ్చునన్న వాదనలు ఉన్నాయి.

8. భ్రమ, మానసిక ప్రతిచర్యలు, స్నాయువు చీలికలు

Mental health issues antibiotic resistance

ఫ్లూరోక్వినోలోన్స్ అనే యాంటీబయాటిక్స్ ఇటీవల ముఖ్యాంశంగా మారింది. అందుకు కారణం దాని దుష్ప్రభావమే. ఈ యాంటీబయాటిక్ మైటోకాండ్రియాను దెబ్బతీస్తాయని, కోలుకోలేని నరాల నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. పరిశోధకులు దాని దుష్ప్రభావాలను గుర్తించడానికి అధ్యయనాలు కొనసాగిస్తున్నారు. ఫ్లూరోక్వినోలోన్స్ దుష్ప్రభావాలలో నిరాశ, మెదడు మొద్దుబారడం, భ్రమ, మానసిక ప్రతిచర్యలకు సంబంధించనవి కావడం గమనార్హం. ఈ దుష్ప్రభావాలపై పదేళ్ల క్రితమే ఎప్.డీఏ ఫ్లూరోక్వినోలోన్ యాంటీబయాటిక్స్ తయారీదారులను సూచనలు చేసింది. ఈ యాంటీబయాటిక్ సంభావ్య దుష్ప్రభావాల కారణంగా స్నాయువు, స్నాయువు చీలికకు అధిక ప్రమాదం ఉందని తెలిపేలా ఈ మందులపై ‘‘బ్లాక్ బాక్స్’’ ముద్రించి ఇటు వైద్యులు, అటు రోగులను హెచ్చరించడానికి దోహదపడుతుందని సూచించింది.

యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు ఎంతకాలం ఉంటాయి?

Allergic reactions to antibiotics

యాంటీబయాటిక్ ప్రభావం కేవలం వాటిని వాడిన సమయంలోనే కాకుండా వాడిన తరువాత కూడా కొద్ది కాలం పాటు ఉంటాయన్నది తెలిసిందే. అయితే వీటి తీవ్ర దుష్ప్రభావాలు ఎంత కాలం కొనసాగుతున్నాయన్నది స్పష్టంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే అవి తీసుకునే యాంటీబయాటిక్ ను బట్టి ఉంటాయి. అంతేకాదు తీసుకున్న వ్యక్తి శరీరం ఎంత త్వరగా వ్యాధి పూర్వక స్థితికి చేరుకుంటుందన్న దానిని బట్టి కూడా ఉంటుంది. దీంతో పాటు వ్యక్తి నిర్దిష్ట దుష్ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. అయితే యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు చాలా వారాల పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు, యాంటీబయాటిక్ వాడకం వల్ల అతిసారం తేలికపాటి కేసులతో, యాంటీబయాటిక్ తీసుకోవడం పూర్తి చేసిన తర్వాత రెండు వారాల వరకు అతిసారం కొనసాగవచ్చు. మరింత తీవ్రమైన సందర్భాల్లో, యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు చాలా వారాల పాటు కొనసాగవచ్చు. ఇక ఈ దుష్ప్రభావాలకు అదనంగా మరో రెండు అందోళన చెందాల్సిన అస్వస్థలు కూడా ఉన్నాయి. అవి:

డ్రగ్ ప్రేరిత కాలేయ గాయం (డిలి)

Antibiotic induced liver injury

2008లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, “యాంటీబయాటిక్స్ అనేవి డ్రగ్ పేరిత కాలేయ గాయం (డిలి) ఏర్పడేందుకు కారణమయ్యే అతిపెద్ద ఏజెంట్ల సమూహం.” అని పేర్కోంది. దీంతో పాటు 2017లో జరిపిన మరో అధ్యయనం కూడా ఇదే తరహా ఫలితాన్ని వెల్లడించింది. “అమోక్సిసిలిన్-క్లావులనేట్ వంటి విస్తృతంగా ఉపయోగించే కొన్ని యాంటీబయాటిక్‌ల కారణంగా కాలేయ గాయం ఏర్పడుతుందని చూపబడింది. అయితే వీటి ప్రభావం ఆలస్యంగా ప్రారంభమవుతాయని చూపబడ్డాయి. సెఫాజోలిన్ ఒక సింగిల్ డోస్ తీసుకున్నా.. దాని ప్రభావం 1-3 వారాల్లో బహిర్గతమై కాలేయ గాయానికి దారితీస్తుందని కనుగొనబడింది. ఇతర విపరీతమైనది నైట్రోఫ్యూరాంటోయిన్-ప్రేరిత కాలేయ గాయం, ఇది కొన్ని సంవత్సరాల చికిత్స తర్వాత సంభవించవచ్చు. తీవ్రమైన కాలేయ వైఫల్యం (ALF) లేదా ఆటో ఇమ్యూన్ లాంటి ప్రతిచర్యకు దారితీస్తుంది. యాంటీబయాటిక్స్ వినియోగంతో లీవర్ గాయమైన వారిలో చాలా మంది రోగులు కొలుకుంటున్నారు. అయినప్పటికీ, కామెర్లుతో బాధపడుతున్న రోగుల్లో 10 శాతం మంది లీవర్ ఫెయిల్యూర్ లేదా కాలేయ మార్పడి అవసరమై మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అరుదైన సందర్భాల్లో, హెపాటాక్సిసిటీ కారణంగా రోగుల్లో దీర్ఘకాలిక గాయం ఏర్పడవచ్చు లేదా వానిషింగ్ బైల్ డక్ట్ సిండ్రోమ్‌కు దారితీసే ప్రమాదము పొంచివుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

Impact on gut microbiome

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ ప్రకారం, “రెండు నుంచి ఐదు యాంటిబయాటిక్ ప్రిస్క్రిప్షన్లు తీసుకున్న వారిలో క్యాన్సర్లు పెరిగాయని, ఎలాంటి యాంటిబయాలిక్స్ తీసుకోని వారితో పోల్చితే ఇవి 27శాతం పెరిగాయని తెలిపింది. ఇక అరు లేదా అంతకుమించి యాంటిబయాటిక్స్ వాడిన వారిలో కాన్సర్ల పెరుగుదల ఏకంగా 37శాతంగా నమోదైంది. ప్రస్తుత అధ్యయన ఫలితాలు యాంటీబయాటిక్ వాడకం, ముఖ్యంగా మళ్లీ మళ్లీ ఒకే యాంటిబయాటిక్ వాడకం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తున్నాయి”. 2021లో నిర్వహించిన అధ్యయనంలో అత్యంత తీవ్రమైన విషయాన్ని వెల్లువరించింది. “యాంటీబయాటిక్స్ వినియోగానికి పెద్దప్రేగు క్యాన్సర్ కు మధ్య స్పష్టమైన లింక్ ఉందని ఈ అధ్యయన సారాంశం. యాంటిబయాటిక్స్ తీసుకోవడంతో వల్ల రానున్న ఐదు నుంచి పదేళ్ల కాలంలో ఈ ప్రమాదం సంభవించవచ్చునని పేర్కొంది. దాదాపుగా 40,000 క్యాన్సర్ కేసులను అధ్యయనం చేసిన ఈ విషయం నిర్ధారించబడింది. పేగు మైక్రోబయోమ్‌పై యాంటీబయాటిక్స్ ప్రభావం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.”

యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయాలు

Antibiotics Alternatives

యాంటీబయాటిక్స్ వినియోగంతో అవాంఛిత దుష్ప్రభావాలు లేకుండా సహజ నివారణలు కూడా ఉన్నాయి. ఇవి వాటికి దగ్గరగా లేదా వాటిని మించి శక్తివంతమైనవి. ఇక ఈ అద్భుత సహజ నివారణలు కారణంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకపోవడం గమనార్హం. యాంటీబయాటిక్-రెసిస్టెన్స్ సూపర్‌బగ్‌లను ఆపబోతున్నట్లయితే, సమర్థవంతమైన ఇంకా సురక్షితమైన ఫలితాన్ని పొందేందుకు సహజ యాంటీబయాటిక్ ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. యాంటీబయాటిక్స్ మాదిరిగా కాకుండా, ఈ సహజ నివారణలు సూపర్ బగ్‌లను సృష్టించలేవు. ప్రారంభకుల కోసం పచ్చి వెల్లుల్లి, వెల్లుల్లి నూనె, వెల్లుల్లి సప్లిమెంట్లు ఉన్నాయి. వెల్లుల్లికి శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ప్రొటోజోల్ సామర్థ్యాలు ఉన్నాయని తెలిసింది. చెవి ఇన్ఫెక్షన్ కోసం వెల్లుల్లి నూనె పాముఖ్యత చెందిన సహజ నివారణలలో ఒకటి.

ఒరేగానో (వాము ఆకు) నూనె యాంటీబయాటిక్స్‌కు మరొక అద్భుతమైన సహజ ప్రత్యామ్నాయం. వాము (ఒరిగానమ్ వల్గేర్) అనేది ఒక ఔషధ మొక్క, ఇది లేని వంటిల్లు తెలుగు రాష్ట్రాలలో లేదంటే అతిశయోక్తి కాదు. వంటల్లో దీనిని ఉపయోగం తెలియనిది కాదు, అయితే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సుదీర్ఘ చరిత్రను కూడా ఇది కలిగివుందన్న విషయం చాలా మంది నేటితరం వారికి తెలియదు. ఒరేగానో నూనెలో కార్వాక్రోల్, థైమోల్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలలో తేలింది.

యాంటీబయాటిక్స్‌కు మరొక అద్భుతమైన ప్రత్యామ్నాయం కొల్లాయిడ్ వెండి. 2017లో నిర్వహించిన ఇన్ విట్రో పరిశోధనలో.. కొల్లాయిడల్ సిల్వర్ ను సహజ సంశ్లేషణ చేయడంతో అందులో నానోపార్టికల్స్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ చర్యను ఎలా ఆకట్టుకునేలా ప్రదర్శిస్తాయో చూపబడింది. సైనస్ ఇన్ఫెక్షన్ లేదా జలుబుకు ప్రత్యామ్నాయ చికిత్సగా కొల్లాయిడ్ వెండిని తరచుగా సిఫార్సు చేస్తారు. కాగా, సాధారణంగా జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తరచుగా యాంటీబయాటిక్స్ దుర్వినియోగం జరుగుతుంది. ఈ రెండు ఆరోగ్య పరిస్థితులకు వైరస్ కారణం అయినా.. యాంటిబయాటిక్స్ దుర్వినియోగం మాత్రం జరుగుతుంది. వెల్లుల్లి, ఒరేగానోతో పాటు తినగలిగే యాంటీ బాక్టీరియల్ ఆహారాలు కూడా ఉన్నాయి. మనుకా తేనె, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, పసుపు ఉన్నాయి.

తుది సమీక్ష

Antibiotics on Human Body
  • యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం సూపర్ బగ్స్ అని పిలువబడే ప్రమాదకరమైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాను సృష్టిస్తోంది.
  • యాంటీబయాటిక్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్లకు కాదు.
  • యాంటీబయాటిక్స్ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. యాంటీబయాటిక్ వాడకం, అలర్జీలు, ఆస్తమా అభివృద్ధికి మధ్యనున్న సంబంధం వెల్లడైంది.
  • యాంటీబయాటిక్స్ తీసుకునే చాలామందికి వాటి దుష్ప్రభావాలు తెలియదు. యాంటీబయాటిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై తప్పనిసరిగా చైతన్యం ఉండాలి.
  • ఒరేగానో ఆయిల్, వెల్లుల్లి, కొల్లాయిడల్ సిల్వర్ వంటి సహజ నివారణ ప్రత్యామ్నాయాలు శక్తివంతమైన యాంటీబయాటిక్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయని తేలింది.