ఔషధ గుణాలున్నా.. శ్వాసకోస వ్యాధులను కలిగించే మొక్క.! - Pros and Cons of Using Conocarpus Plant: A Comprehensive Review in Telugu

0
Conocarpus Plant Review

హైదరాబాద్ మహానగరానికి గ్రీన్ సిటీ అవార్డును అందుకునేలా చేయడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పోందేలా చేసింది విదేశీ గడ్డకు చెందిన మొక్క కోనోకార్పస్. అస్ట్రేలియాకు చెందిన ఈ ఎక్సాటికా మొక్క.. ప్రస్తుతం హైదరాబాద్ నగర రోడ్లకు ఇరువైపులా లేదా మధ్యలో దర్శనమిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొక్కను నగరానికి పచ్చ తోరణంలా దర్శనమిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయితే ఈ మొక్కలను తొలగించాలన్న డిమాండ్ కూడా వీరి నుంచి వెల్లువెత్తుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ మొక్కలతో నగరానికి కొత్త శోభ సంతరించుకునేలా.. పండు వేసవిలోనూ పచ్చగా కనిపించేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ మొక్కతో కొన్ని ప్రతికూలతలు, ఆరోగ్య దుష్ప్రభావాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలతో అటు ప్రభుత్వానికి, ఇటు ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులకు కొత్త తలనోప్పి వచ్చిపడింది. ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణ వేత్తలకు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడిచేందుకు కూడా ఈ మొక్క కారణమైది. కాగా, పర్యవరణవేత్తలు డిమాండ్ అంతకంతకూ పెరగడంతో ప్రభుత్వం దీనికి ఫుల్ ష్టాప్ పెట్టింది.

ఈ కోనోకార్పస్ అనే మొక్క ప్రజలతో పాటు పలు పశుపక్ష్యాధుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలను చూపుతుందని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేశారు. ఈ మొక్కలు ఎక్సాటికా మొక్కలు, అనగా నీరు అధికంగా ఉండే ప్రాంతంలో.. లేదా ఎక్కువ నీటిని తీసుకునే మొక్కలని అర్థం. వీటిని నగరంలో ఎక్కడపడితే అక్కడ నాటి.. పచ్చదనం కొసం ప్రయత్నం చేస్తే ప్రజలు, అటు నీరు లభ్యంకాక, ఇటు అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో భూగర్భజలాలు కూడా అంతరించడానికి కూడా ఇది కారణం అవుతొందని వారు అందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు.. దీని వేర్లు నీటిని వెతుక్కుంటూ భూమి పోరల్లోకి దూసుకుపోవడంతో భూగర్భంలో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరాతో పాటు కేబులింగ్ వ్యవస్థ కూడా అవాంతరాలను సృష్టిస్తుందని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మొక్కల పుష్పాల్లోని గింజలు ప్రజలను పలు శ్వాసకోశ వ్యాధులకు గురిచేస్తాయని కూడా వాదిస్తున్నారు.

అయితే పర్యావరణ వేత్తల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కలపై నిషేధం విధించింది. అయితే ఇప్పటికే నాటిన మొక్కలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోని ప్రభుత్వం.. ఇకపై మాత్రం కోనోకార్పస్ మొక్కలను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ ఎక్కడ నాటరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం నాటిన మొక్కలను తొలగించాలన్ని డిమాండ్ కూడా ఊపందుకుంది. నాటిన మొక్కలపై నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతున్న పర్యావరణ వేత్తలు.. ప్రజల అరోగ్యాలతో చెలగాటం అడటం సహేతుకం కాదని విమర్శిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే అధికంగా ఉన్న ఈ మొక్కలపై నిషేదాజ్ఞలు జారీ చేయడంతో తమ పని పూర్తయ్యిందన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. ప్రజలను రోగాల పాలు చేసే మొక్కలను నగరవ్యాప్తంగా నాటించిన సర్కార్.. నిషేధాజ్ఞలతో తమ పని పూర్తయ్యిందని చేతులెత్తేస్తే.. నాటిన మొక్కల సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

Conocarpus in Telangana
Src

ప్రభుత్వానికి పర్యావరణ వేత్తలకు మధ్య ఈ వివాదం కాసింత సద్దుమణిగిన క్రమంలో కొందరు ప్రకృతి ఆశ్రమాలకు చెందిన వైద్యులు జరిపిన అధ్యయనాలు వెలుగులోకి రావడంతో మరోమారు కోనోకార్పస్ మొక్క చర్చనీయాంశంగా మారింది. రామచంద్రాపురం ప్రకృతి ఆశ్రమం ప్రకృతి వైద్యులు గున్నా రాజేందర్ రెడ్డి కోనోకార్పస్ మొక్కపై విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొక్కల ఆకులతో దోమలతో వ్యాపించే అంటురోగాలు దూరం అవుతాయని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో కోనోకార్పస్ మొక్క వల్ల అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాడం కూడా వివాదాస్పదంగా మారింది. మరీ ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే అంటువ్యాదులతో పాటు వ్యాధులను కూడా నివారించడంలో ఈ మొక్క సహాయపడుతుందని అన్నారు.

ఈ మొక్క ఆకులు దోమలను తరమడంలో బహుబాగా పనిచేస్తాయని ఆయన చెప్పుకోచ్చారు. గతంలో దోమల నివారణకు వేప, తులసి ఆకులను వినియోగించిన తరువాత కూడా దోమలు ఇళ్లలోకి చోచ్చుకోచ్చి కుట్టేవని, కానీ కోనోకార్పస్ మొక్క ఆకులను తీసుకువచ్చి ఇంట్లో పోగబెడితే ఒక్క దోమ కూడా లేకుండా ఉపశమనం లభించిందని ఆయన చెప్పారు. దీంతో ఈ కోనోకార్పస్ మొక్క ఆకులు దోమల నివారిణిగా ఉపయోగపడుతుందని, ఆల్ ఔట్, టార్టాయిస్, ఒడమస్, దోమల నివారణ అగర్ బత్తీలు వాడి.. వాటి నుంచి వెలువడే రసాయనాలను పీల్చుకుని ఆరోగ్యాల మీదకు తెచ్చుకోవడం.. ప్రతీ నెలా వాటికోసం వందల రూపాయలను వెచ్చించడం కన్నా ఈ మొక్క ఆకులు తెచ్చుకుని పోగబెట్టుకోవడంతో దోమల నివారణకు ఉత్తమ మార్గమని ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

పర్యావరణ వేత్తలు కోనోకార్పస్ మొక్క అత్యంత హానికరమైనదని, ఇది భూగర్భ జలాలను కూడా ప్రభావితం చేయగలదని, ప్రజలకు శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణం కావచ్చునని అందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో గున్నా రాజేందర్ రెడ్డి వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాదు రాజేందర్ రెడ్డి ఈ మొక్క ప్రతీ ఒక్క ఇంటి యజమాని దీనిని తమ ఇంటి ఎదుట నాటాలని ఆయన పిలుపునివ్వడం పర్యావరణ వేత్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ మొక్క ఆకులతో పోగబెట్టడం కారణంగా దోమల నివారణే కాదు దోమల కారణంగా ప్రజలే వ్యాధులు, దోమలతో సంక్రమించే అంటువ్యాధులు కూడా రాకుండా చేస్తుందని రాజేందర్ రెడ్డి చెబుతున్నారు.

Health Hazard of Conocarpus
Src

ప్రభుత్వం, పకృతి పరిశోధకులతో పాటు పర్యావరణ వేత్తల మధ్య సాగుతున్న వాదనలు ఎలా ఉన్నా అసలు ఈ మొక్క మన దేశానిదేనా.. అయితే తెలుగులో దీని పేరేంటీ.? అన్న వివరాల్లోకి వెళ్లే.. కోనోకార్పస్ మొక్క విదేశాలకు చెందినది. ఇది మన దేశానికి చెందినది కానప్పటికీ.. నీటిని అందిస్తే చాటు నిత్యం పచ్చదనాని అద్దుకుని ఉండే ఈ మొక్కను హరితహారంలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చింది. హరితవర్ణంలో ఉండే ఈ మొక్కతో నగరంలో పచ్చదనాన్ని పర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. అందుకోసం ఈ మొక్కను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇది సముద్రాల వల్ల భూమి కొతకు గురికాకుండా ఉండేదందుకు సహాయపడే మొక్క. ఇది ఎక్కువగా నీరు ఉండే మడ అడవుల్లో పెరుగుతుంది. కోనోకార్పస్ కాంబ్రేటేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్కను సాధారణంగా బటన్‌వుడ్ అని పిలుస్తారు, అవి ప్రపంచంలోని ట్రాపికల్ (ఉష్ణమండల), సబ్ ట్రాఫికల్ ( ఉపఉష్ణమండల) ప్రాంతాలకు చెందినవి. కోనోకార్పస్‌లో మొక్కల్లోనూ కోనోకార్పస్ ఎరెక్టస్, కోనోకార్పస్ లాన్సిఫోలియస్ అనే రెండు జాతులు ఉన్నాయి. ఈ మొక్కలతో ఉపయోగాలున్నా, వాటిని మించిన స్థాయిలో ప్రతికూలతలు ఉన్నాయి. ఈ మొక్కల ఉపయోగాలు, ప్రతికూల ప్రభావాలేంటో ఒకసారి పరిశీలిద్దామా.

కోనోకార్పస్ మొక్క వల్ల కలిగే ఉపయోగాలు

డెకరేటివ్ ప్రయోజనాలు

కోనోకార్పస్ మొక్కలకు కావాల్సినంత నీరు అందింతే.. పండు వేసవిలోనూ పచ్చనివర్ణంతో అహ్లాదంగా కనివిందు చేస్తాయి. దీంతో అలంకార ప్రయోజనాల కోసం వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వాటి ఆకర్షణీయమైన ఆకులు తెలుపు లేదా పసుపు వర్ణంలో ఉండే చిన్న పువ్వులను ఉత్పత్తి చేసే ఈ మొక్కలు వాటి వర్ణాలతోనూ ఆకర్షనీయంగా కనిపిస్తాయి. ఈ మొక్కలు తోటలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలలో దర్శనమిస్తాయి. దృశ్యాలలో హెడ్జెస్, సరిహద్దులు, నమూనా మొక్కలుగా సృష్టించడానికి ఉపయోగించవచ్చు.

నేల స్థిరీకరణ

కోనోకార్పస్ మొక్కలు ఎక్సాటిక్ (నీరు అధికంగా ఉండే ప్రాంత) మొక్కలుగా చాలా ప్రసిద్దిచెందినవి. ఇవి ఎక్కువగా సముద్రపు అలల తాకిడికి భూమి కోసుకుపోకుండా రక్షణగా నిలుస్తాయి. సముద్ర తీర ప్రాంతాలలో నేల స్థిరీకరించడానికి, కోతను నిరోధిస్తాయి. దీంతో తీర ప్రాంతంలో వీటిని ఎక్కువగా నాటుతారు. ఈ మొక్కలు విస్తృతమైన వేర్ల వ్యవస్థలను కలిగి ఉంటాయి. వీటి వేర్లు భూమి లోతులోకి చోచ్చుకుని పోయి మొక్కను ధృడంగా ఉండేలా చేస్తాయి. దీంతో ఇవి మట్టిని లంగరు వేయడానికి, అలలు, ఆటుపోట్ల ద్వారా కొట్టుకుపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

Ban on Conocarpus
Src

ఉప్పు సహన మొక్కలు

కోనోకార్పస్ మొక్కలు భూమిలోని లవణ ఖనిజాన్ని బాగా తట్టుకుని నిలబడగలవు. భూగర్బ నీటిలో ఉప్పు ఉన్నా, లేక ఫ్లోరోసిస్ వంటి హానికారక పదార్థాలు ఉన్నా ఇవి తట్టుకుని నిలబడగలవు. అధిక లవణీయత స్థాయిలు ఉన్న ప్రాంతాల్లో కోనోకార్పస్ మొక్కలు పెరుగుతాయి. పర్యావరణ అసమల్యత కారణంగా ఇతర మొక్కలు జీవించలేని నీటి సాంధ్రత అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు.. తీర ప్రాంతాలలోనూ ఇవి ఏపుగా పెరిగి ధృడంగా నిలుస్తాయి. దీంతో వీటిని అధికంగా తీర ప్రాంతంలోని మడ అడవుల ప్రాంతంలో నాటడానికి అనువైనదవిగా భావించి నాటుతుంటారు.

చెక్క ఉత్పత్తి

ప్రకృతిలోని పలు చెట్టు, మొక్కల తరహాలోనే కోనోకార్పస్ మొక్కలు కూడా కలప ఉత్పత్తికి అనువైనదిగా పేరుంది. కలప ఉత్పత్తి చేయడానికి కోనోకార్పస్ మొక్కలను ఉపయోగిస్తారు. ఈ మొక్కల కలప కూడా చాలా కఠినమైనదని, మన్నికైనదని తేలడంతో మన దేశంలో టేకును వినియోగించినట్లుగానే విదేశాలలో కోనోకార్పస్ మొక్కలను అధికంగా కలప ఉత్పత్తుల తయారీ కోసం వినియోగిస్తుంటారు. కోనోకార్పస్ కలప ధృడంగా ఉన్న కారణంగా భలే డిమాండ్ ఉంది. వీటితో కుర్చీలు, సోఫాలు, ద్వారాలు, కిటికీలు, డైనింగ్ టేబుల్ వంటి గృహోపకరణాలు (ఫర్నిచర్) తయారీకి వినియోగిస్తారు. అంతేకాదు నీటిని కూడా ఇవి బాగా తట్టుకుని నిలబడటంతో వీటిని పడవ నిర్మాణాలు, పడవ నిర్మాణ సామగ్రిని తయారిలోనూ ఉపయోగిస్తారు.

ఔషధ ప్రయోజనాల

కోనోకార్పస్ మొక్కలు వాటి ఔషధ గుణాల కోసం పలు దేశాల సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కల ఆకులు, బెరడు జ్వరం, విరేచనాలు, ఇతర వ్యాధుల చికిత్సలో నయం చేయడానికి ఉపయోగిస్తారు.

పశువుల మేత

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కోనోకార్పస్ మొక్కలను పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కల ఆకులు, కొమ్మలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, పశువులకు మేతగా ఉంటాయి.

తేనె ఉత్పత్తి

కోనోకార్పస్ మొక్కలు తేనెను తయారు చేయడానికి తేనెటీగలు ఉపయోగించే తేనెను ఉత్పత్తి చేస్తాయి. కోనోకార్పస్ మొక్కల నుండి ఉత్పత్తి చేయబడిన తేనె లేత రంగులో ఉంటుంది. కాగా, ఈ తేనె తేలికపాటి రంగు, రుచిని కలిగి ఉంటుంది.

Impact of Conocarpus
Src

కోనోకార్పస్ మొక్కల ప్రతికూలతలు

స్థానిక జాతివృక్ష్యాలపై దాడి

కోనోకార్పస్ మొక్కలు తీరప్రాంతాన్ని ఆక్రమణకు గురిచేస్తాయి. ఈ మొక్కలు త్వరగా వ్యాప్తి చెందుతాయి, వాటి విస్తీర్ణాన్ని విస్తరించుకుని ఇతర వృక్ష్యజాతులపై అధిపత్యాన్ని కొనసాగిస్తాయి. స్థానిక జాతులను అధిగమించడానికి వీటికి కొంత సమయం సరిపోతుతంది, వీటి కారణంగా ఇతర మొక్కల అవాసం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఇది జీవవైవిధ్యం క్షీణతకు దారితీస్తుంది.

నీటి వినియోగం

కోనోకార్పస్ మొక్కలు ఏక్సటికా మొక్కలు కావడం కారణంగా వీటి నిర్వహణకు అధిక నీరు అవసరం. వీటి అధిక నీటి అవసరాల నిమిత్తం సముద్రంలోని మడ అడవుల్లో అయితేనే ఇవి సురక్షితం. అలా కాకుండా ఇతర ప్రాంతంలో వీటిని నాటితే అక్కడి భూగర్భజలాలను కూడా ఇవి ప్రభావితం చేయగలిగే సత్తా ఈ మొక్కలు కలిగి ఉంటాయి. అవి పెద్ద మొత్తంలో నీటిని తీసుకోగలవు దీంతో వీటి చుట్టుపక్కల ఉన్న మొక్కల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చడంతో పాటు పరిమిత నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వీటి వేర్లు భూమిలోకి చోచ్చుకుని వెళ్లి మరీ నీటిని తీసుకోవడం ద్వారా సమస్యాత్మక మొక్కలనే చెప్పాలి.

అలర్జీలు

కోనోకార్పస్ మొక్కల నుంచి విడుదలయ్యే గాలి కూడా కొందరిలో అనారోగ్యాలకు కారణం అవుతుంటాయి. వీటి నుండి వీచిన గాలిని పీల్చడం ద్వారా కొందరిలో అలర్జీ కలుగుతుంది. ఈ మొక్కలు ఉత్పత్తి చేసే పూలలోని ఫోలెన్ గ్రెయిన్స్ (పుప్పొడి) అలెర్జీలకు కారణం అవుతాయి, అంతేకాదు మరికొందరిలో శ్వాసకోశ సమస్యలను ప్రేరేపిస్తుంది. ఇక ఈ చెట్టుకు కాచే పూలలోని పోలెన్ గ్రెయిన్స్ కూడా శ్వాసకోస సమస్యలతో పాటు కొందరిలో అస్తమాకు కూడా కారణమవుతాయి.

నివాస విధ్వంసం

కోనోకార్పస్ మొక్కలను నాటడం వల్ల సహజ ఆవాసాలు నాశనం అవుతాయి. ప్రకృతిలోని జీవ వైవిద్యాన్ని ఇవి భంగపర్చే ప్రమాదం ఉంది. ఈ మొక్కలపై పక్షలు వాలడం కానీ, అవాసాలు ఏర్పర్చుకోవడం కానీ జరగదు. దీంతో ఈ మొక్కలు పక్షలు గూడ్లు ఏర్పర్చుకునేందుకు వీలు కానివని తేలింది. ఇక వన్యప్రాణులు, ఇతర వృక్ష జాతులపై కూడా కోనోకార్పస్ మొక్కలు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.

Uses of Conocarpus plant
Src

అగ్ని ప్రమాదం

పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కోనోకార్పస్ మొక్కలు అగ్ని ప్రమాదంగా ఉంటాయి. ఈ మొక్కల ఆకులు, కొమ్మలు అగ్నికి చాలా సున్నితంగా మారుతాయి. వీటి ఆకులు, కొమ్మలో ఉండే నూనె పదార్థం మంటలను ఆకర్షించే గుణం ఉన్న కారణంగా ఇవి అగ్ని ప్రమాద సమయంలో మంటలు వ్యాప్తి చెందేందుకు దోహదపడతాయే తప్ప.. మంటను తగ్గించేందుకు మాత్రం కాదు.

నిర్వహణ అవసరాలు

కోనోకార్పస్ మొక్కలు వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి, ఉత్తమంగా కనిపించడానికి క్రమం తప్పకుండా నిర్వహణ అవసరం. ఇది కత్తిరింపు, ఫలదీకరణం, నీరు త్రాగుట వంటివి కలిగి ఉంటుంది.

కోనోకార్పస్ మొక్కల అనేక అవసరాలను తీర్చుతాయి. ముఖ్యంగా వాటితో డెకరేటివ్ అవసరాలు, నేల స్థిరీకరణ, ఉప్పు సహనం, కలప ఉత్పత్తి, ఔషధ అవసరాలు, పశుగ్రాసం సహా పలు ఉపయోగాలు కలుగుతాయి. అయినా ఇవి ఆక్రమణ జాతులన్న విషయాన్ని మర్చిపోరాదు. ఇక వీటికి లోని ప్రతికూల అంశాలైన అధిక నీటి వినియోగం, అలెర్జీలకు కారణం కావడం, నివాస విధ్వంసం, అగ్ని ప్రమాదం, సాధారణ నిర్వహణ అవసరం వంటివి వీటి నిర్వహణను కష్టసాధ్యంగా మార్చేస్తాయి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో కోనోకార్పస్ మొక్కలను నాటాలో లేదో నిర్ణయించేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.