కరోనరీ కాల్షియం స్కాన్ ఎవరికి అవసరమో తెలుసా.? - CT Heart Scan - Everything You Need to Know in Telugu

0

సిటీ హార్ట్ స్కాన్, కరోనరీ కాల్షియం స్కాన్ అని కూడా పిలువబడే ఈ స్కానింగ్ ద్వారా హృదయ ధమనుల (ఆర్టరీస్)లో కాల్షియం నిక్షేపాల ఉనికిని గుర్తిస్తారు. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT)ని ఉపయోగించి కాల్షియం నిల్వలను తెలుసుకునేందుకు చేసే వైద్య పరీక్ష ప్రక్రియే సిటీ హార్ట్ స్కాన్. ఈ పరీక్షలో అభించే స్కోర్‌ రోగి ధమనుల్లో కాల్షియం నిక్షేపాల ఉనికిని సూచిస్తుంది. ఈ స్కోర్ తక్కువగా ఉంటే ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే అధికంగా ఉంటే ధమనుల్లో కాల్షియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించినట్లే. కరోనరీ ధమనుల్లో రక్త సరఫరా ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి అధికంగా ఉంటే కాల్షియం నిక్షేపాలు దారితీస్తాయి.. ఇవి క్రమంగా పెరుగుతుంటాయి. కాల్షియం నిల్వల సంఖ్య మరింత పెరిగితే గుండెకు రక్త సరఫరాలో అవరోధం ఏర్పడుతుంది. దీనిని కరోనరీ అర్టరీ వ్యాధికి కారణం కావచ్చు. కాల్షియం నిల్వలు క్రమంగా పెరుగుతూ పోయి గుండెపోటుకు కూడా దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేయడానికి సిటీ హార్ట్ స్కాన్ ద్వారా గుండె పరిస్థితిని ముందుగానే వైద్యుడు అంచనా వేయడానికి ఇది దోహదపడుతుంది. దీంతో రానున్న సమస్యలను నివారించడానికి తగిన చర్యలను వైద్యులు సూచించడానికి ఈ సిటీ హార్ట్ స్కాన్ నివేదిక ఉపయోగపడుతుంది.

CT హార్ట్ స్కాన్‌లు ఎందుకు చేస్తారు? Why are CT Heart Scans performed?

సిటీ హార్ట్ స్కాన్‌ పరీక్ష ద్వారా వ్యక్తి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా.? లేదా.? అన్న విషయాలను గుర్తించడానికి వైద్యులు సిఫార్సు చేస్తారు. గుండె ధమనుల్లో కాల్షియం ఏ పరిమాణంలో ఉందన్న విషయాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షకు వైద్యుడు సిఫార్సు చేస్తారు. ఈ ధమనుల్లో ఫ్లేక్ ఏర్పడుతుంది. ఫ్లేక్ అంటే అనారోగ్యకరమైన చెడు కొవ్వు. ఇది కాల్షియం, కోలెస్ట్రాల్ తో శరీరంలో తయారువుతుంది. ఇది రక్తంతో పాటు గుండె ధమనుల్లోకి చేరడంతో ధమనుల్లో రక్త సరఫరాకు అవంతరాలను ఏర్పరుస్తుంది. ఇవి క్రమంగా పెరగడంలో రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది. దీంతో గుండె పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాలలో కాల్షియం పగిలి రక్తం గడ్డకట్టేలా కూడా చేస్తుంది. ఇది చివరికి గుండెపోటుకు దారితీయవచ్చు. గుండె జబ్బుల ఆగమనాన్ని నిర్ధారించడానికి ఉపయోగించబడినప్పటికీ, ఇది కాల్షియం నిక్షేపాలను అంచనా వేయడం ద్వారా కొరోనరీ ఆర్టరీ వ్యాధుల అభివృద్ధికి సంబంధించిన ఏవైనా అంతర్లీన సంకేతాలను కూడా గుర్తిస్తుంది. రెండు మూడు రోజులుగా మీకు తీవ్రమైన ఛాతి నోప్పి ఉందని వైద్యుడిని సంప్రదిస్తే.. ఆయన అది గుండె సంబంధమైన నొప్పి అని నిర్థారించిన క్రమంలో సిటీ స్కాన్ పరీక్షను సిఫార్సు చేస్తారు.

ఎవరు కాల్షియం స్కోర్ స్క్రీనింగ్ పొందాలి? Who should get a calcium-score screening?

కరోనరీ కాల్షియం స్కాన్ సాధారణంగా 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చేయించుకోవాలని సిఫార్సు చేయబడింది. దీనికి తోడు అధికంగా నీచు పదార్థాలు (మాంసాహారము), కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకునేవారు, జంక్ ఫుడ్ తినేవారు, ధూమపానం చేయువారు, మద్యపానం చేయువారు, ఏదేని రూపంలో పోగాకును తీసుకునేవారరైతే 35 ఏళ్లవారైనా ఈ పరీక్ష చేయించుకుని కాల్షియం స్కోర్ స్క్రీనింగ్ పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరితో పాటు పలు ఇతర కారకాలు ఉన్నావారు ఈ పరీక్షలు చేయించుకోవాలి:

  • గుండె జబ్బుల కుటుంబ చరిత్ర
  • ధూమపానం చేయువారు, పొగాకు సేవించేవారు
  • మధ్యపానం చేయువారు
  • అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారు
  • నిశ్చల జీవనశైలి, పరిమిత శారీరక కార్యకలాపాలు చేయువారు
  • ఊబకాయం, అదనపు శరీర కొవ్వుగలవారు

ఎవరు కాల్షియం స్కాన్ పొందకూడదు? Who should not get a calcium scan?

అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ మార్గదర్శకాల ప్రకారం, గుండె స్కాన్ చేయించుకోడానికి ఈ కింది వ్యక్తులు సిఫార్సు చేయబడరు. వారు:

  • చిన్న వయస్సులో గుండెపోటుకు సంబంధించిన కుటుంబ చరిత్ర లేనివారు
  • ధమనుల్లో గుర్తించదగిన కాల్షియం చాలా తక్కువ పరిమానంలో ఉన్నవారు.
  • 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులు, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలు.
  • గుండె ప్రమాదం గురించి తెలిసిన వారిలో ఈ ప్రక్రియ అదనపు సమాచారాన్ని అందించకపోవచ్చు. ధూమపానం, మధ్యపానం చేసేవారితో పాటు మధుమేహం బాధితులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.
  • లక్షణాలు లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి నిర్ధారణైనవారికి, ఈ ప్రక్రియ వ్యాధి పురోగతి లేదా ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడదు.
  • ఇప్పటికే అసాధారణ కరోనరీ కాల్షియం హార్ట్ స్కాన్ ద్వారా వ్యాధి నిర్థారణైనవారు.
  • కరోనరీ ఆర్టరీ వ్యాధులకు చికిత్స పొందిన రోగులకు కాల్షియం స్కాన్ చేయాల్సిసిన అవసరం లేదు.

CT హార్ట్ స్కాన్ ఎలా నిర్వహించబడుతుంది? How is a CT Heart Scan performed?

CT హార్ట్ స్కాన్ కోసం ప్రక్రియ క్రింది విధంగా ఉంది:

  • రోగులు టేబుల్‌పై తమ వెనుకభాగంలో పడుకుని, వారి తల, పాదాలను టేబుల్ వెలుపల ఉంచాలి.
  • గుండె విద్యుత్ తరంగాలను రికార్డ్ చేయడానికి రోగి ఛాతీపై ఎలక్ట్రోడ్లు ఉంచబడతాయి.
  • ఈ ఎలక్ట్రోడ్‌లు గుండె విద్యుత్ లయను ప్రదర్శించే యంత్రానికి జోడించబడతాయి. కొంతమంది రోగులకు, గుండె వేగాన్ని తగ్గించడానికి మందులు అందించబడతాయి.
  • రోగి స్కానర్ లోపల ఉన్న తర్వాత, యంత్రం ఎక్స్-రే కిరణాలు విడుదల చేయబడతాయి, రోగి శరీరం చుట్టూ తిప్పబడతాయి.
  • యంత్రం ప్రత్యేక చిత్రాలను ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది.. వీటిని స్లైస్‌లుగా పిలుస్తారు. ఈ చిత్రాలు రోగి గుండె 3D నమూనాలలో చిత్రీకరిస్తాయి.
  • ఈ స్కాన్ వ్యవధి దాదాపు 10 నిమిషాలు. నిర్దిష్ట కాలాల్లో, రోగులు తమ శ్వాసను కొద్దిసేపు పట్టుకోవాలని కూడా అభ్యర్థించారు.

CT హార్ట్ స్కాన్‌లకు సంబంధించిన ప్రిపరేషన్ ఏమిటి? What is the preparation involved for CT Heart Scans?

CT హార్ట్ స్కాన్ చేయించుకునే రోగులు.. ఈ ప్రక్రియకు ముందు వైద్యుడు సూచించి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవి:

1. ఆహారం, మందులు

  • రోగులు స్కాన్ చేయడానికి ముందు 8 గంటల పాటు ఉపవాసం ఉండాలని సలహా ఇస్తారు.
  • కెఫీన్ ఉన్న పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోరాదు. రోగి హృదయ స్పందన రేటును ఇవి ప్రభావితం చేస్తాయనే ఇవి నిషేధించబడ్డాయి.
  • పరీక్షకు ముందు ఎనిమిది గంటల పాటు ధూమపానం, మధ్యపానానికి దూరంగా ఉండాలి.
  • స్కాన్ చేసే ముందు ఏ రకమైన ఆహారాన్ని నివారించాలో అర్థం చేసుకోవడానికి వైద్యలు రోగి పాస్ట్ హిస్టరీని కూడా పరిశీలిస్తారు.

2. దుస్తులు, వ్యక్తిగత వస్తువులు

  • సిటీ హార్ట్ స్కాన్ పరీక్ష ప్రక్రియకు ముందు, రోగులు తమ దుస్తులను కాకుండా.. అసుపత్రివారు అందించే వదులుగా ఉండే గౌను ధరించాల్సి ఉంటుంది
  • రోగి ధరించిన ఆభరణాలు లేదా మెటల్ వస్తువులను తీసివేయవలసి ఉంటుంది.
  • పరీక్ష నిర్వహించబడిన తర్వాత, రోగులు కార్లు నడపడం సహా తమ దైనందిక కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

సిటీ హార్ట్ స్కాన్‌ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? What are the risks associated with a CT Heart Scan?

సిటీ హార్ట్ స్కాన్‌తో కేవలం ఒక్క తాత్కాలికమైన మరోకటి పరిమిత స్థాయిలోని ప్రమాదాలు ఉన్నాయి. అవి:

  1. కాంట్రాస్ట్ డై – అయోడిన్‌ను కలిగి ఉన్న డైని సిటీ హార్ట్ స్కాన్‌ల కోసం ఉపయోగిస్తారు. ఇది రోగి మూత్రపిండాల ద్వారా బయటకు తీయబడుతుంది. రోగి ఏదైనా మూత్రపిండ రుగ్మతలతో బాధపడుతుంటే, వారు ఉపయోగించిన రంగులకు అలెర్జీ ప్రతిచర్యలను అభివృద్ధి చేయవచ్చు. ఈ రంగులు మూత్రపిండాలకు తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నప్పటికీ, రోగులు తేలికపాటి దురద, దద్దుర్లు అనుభవించవచ్చు.
  2. రేడియేషన్ – సిటీ హార్ట్ స్కాన్‌ చేయడం ద్వారా ఎక్స్-రే కిరణాలు ప్రభావం ఉంటుంది కాబట్టి, రోగులపై రేడియేషన్‌ ప్రభావం పడుతుంది. కాగా, చాలా సిటీ స్కాన్‌ ప్రక్రియలో సురక్షితమైన రేడియేషన్ స్థాయిలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. అయినప్పటికీ, ఎక్స్-రే కిరణాల ద్వారా తీవ్రతరమయ్యే ఏవైనా అంతర్లీన పరిస్థితులను ముందుగా అంచనా వేయడం కుదరదు.

సిటీ హర్ట్ స్కాన్ నుంచి ఏమి ఆశించాలి? What to expect from CT Heart Scan?

సిటీ హార్ట్ స్కాన్‌కు సిఫార్సు చేయబడిన రోగులను అంతకుముందే శస్త్రచికిత్స హార్ట్ సర్జన్ పూర్తిగా పర్యవేక్షిస్తారు. అయితే పరీక్ష సమయంలో ఒత్తిడితో కూడిన పరిస్థితికి దారితీసే ఏవైనా ఆశ్చర్యాలను నివారించడంతో పాటు రోగుల నుంచి ఏమి ఆశించాలో తెలుసుకోవడం కూడా వారికి చాలా ముఖ్యం.

CT హార్ట్ స్కాన్ లేదా కరోనరీ కాల్షియం స్కోర్ విధానం

CT హార్ట్ స్కాన్ ప్రక్రియ ముందు Before the CT Scan procedure

టెక్నీషియన్ స్పష్టమైన చిత్రాలను తీయడానికి రోగులకు హృదయ స్పందన రేటును తగ్గించే బీటా-బ్లాకర్ ఇవ్వబడుతుంది. బీటా-బ్లాకర్‌ని అందించిన తర్వాత, ఒక ఇంట్రావీనస్ లైన్ (IV) సిరలోకి చొప్పించబడుతుంది, IV ద్వారా రేడియోధార్మిక రంగు చొప్పించబడుతుంది. డైని చొప్పించినప్పుడు రోగులు వారి నోటిలో లోహపు రుచిని అనుభవించవచ్చు. రోగులు సిటీ స్కాన్ టేబుల్ పై పడుకోవలసి ఉంటుంది, వారి శ్వాసను తక్కువ సమయం పాటు పట్టుకోవలసి ఉంటుంది.

CT హార్ట్ స్కాన్ ప్రక్రియ సమయంలో During the CT Scan procedure

హార్ట్ సిటీ స్కాన్ సాధారణ ప్రక్రియ కేవలం 10-20 నిమిషాల సమయం పడుతుంది. పరీక్ష జరుగుతున్న సమయంలో, సిటీ స్కాన్ టేబుల్ పై పడుకున్న రోగిని ఆ మెషీన్‌లోకి తరలించి, రోగిని దాదాపుగా పది నిమిషాల పాటు మెషీన్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో రోగి గుండెను సిటీ స్కాన్ యంత్రంలో మధ్య భాగంలో ఉన్న పరికరాలు గుండెను 3డి స్కాన్ చేసి గుండెకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమయంలో రోగితో టెక్నీషియన్ సిటీ హార్ట్ స్కాన్ యంత్రంలో అమర్చిన ఇంటర్ కామ్ ద్వారా వారికి పలు సూచనలు అందిస్తారు. చిత్రాలను సేకరించే సలు సమయాల్లో ఊపిరిని పీల్చడం, మరికోన్ని సందర్భాలలో కొద్దిసేపు ఊపిరిని బిగపటడ్డం వంటి సూచనలు అందిస్తారు.

వైద్య సాంకేతిక నిపుణుడు మీ ఛాతీకి కొన్ని ఎలక్ట్రోడ్లను జతచేస్తాడు, ఇవి ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్)కి అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈసీజీ హృదయ స్పందనల మధ్య ఎక్స్- రే చిత్రాల సమయాన్ని సమన్వయపరుస్తుంది – గుండె కండరాలు సడలించినప్పుడు జరిగే ప్రతిస్పందనలను కూడా టెక్నీషియన్ నమోదు చేస్తారు. సిటీ హార్ట్ స్కాన్ ప్రక్రియ నేపథ్యంలో ఈ పరీక్షను నిర్వహించే రోగులను, సీటీ స్కాన్ లోకి వెళ్లే కదిలే బల్లపై వెనుకవైపు పడుకోబెడతారు. ఈ హార్ట్ సిటీ స్కాన్ పరీక్ష గది చాలా చల్లగా ఉంటుంది.

CT హార్ట్ స్కాన్ ప్రక్రియ తర్వాత After the CT Scan procedure

హార్ట్ లోని అర్టరీస్ లో నిల్వ ఉన్న కాల్షియం పరిమాణస్థాయిని తెలిపే పరీక్షే సిటీ హార్ట్ స్కాన్ లేదా కరోనరి కాల్షియం స్కాన్. ఈ కరోనరీ కాల్షియం పరీక్ష పూర్తయిన తర్వాత, రోగులు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. యధావిధిగా వారు వారి సాధారణ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించబడతారు. కాగా, పరీక్షలో వినియోగించిన ఐయోడీన్ ను బయటకు పంపడానికి నీరు అధికంగా తీసుకోవాలని వారికి సాంకేతిక వైద్య సహాయకుడు సూచిస్తారు. అయితే కొన్ని గంటల వ్యవధిలో రోగికి హార్ట్ స్కాన్ ఫలితాలను అందజేస్తారు.

CT హార్ట్ స్కాన్ యొక్క ఫలితాలు ఏమిటి? What are the results of a CT Heart Scan?

అగాట్‌స్టన్ స్కోర్ మీ గుండె ధమనులలో కాల్షియం సాంద్రత మరియు డిపాజిట్‌ను నిర్ణయిస్తుంది. సిటీ హార్ట్ స్కాన్ ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • సున్నా స్కోర్ ధమనులలో కాల్షియం పూర్తిగా లేకపోవడాన్ని సూచిస్తుంది, దీంతో మీ గుండెకు వచ్చే ప్రమాదమేమీ లేదు.
  • 100 మరియు 300 మధ్య స్కోర్ నమోదు అయితే మీ గుండెలో మితమైన కాల్షియం ఫలకం నిక్షేపాల ఉనికిని సూచిస్తాయి.
  • 300 కంటే ఎక్కువ ఉన్న స్కోర్ ఉంటే అది హానికరంగా పరిగణించబడుతుంది, గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • ఫలితాలు అత్యల్పంగా నమోదు అయితే మీ జీవనశైలిని యధావిధంగా కోనసాగించడం మంచిది.
  • కాల్షియం స్కోర్ మితంగా ఉంటే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని మీ వైద్యుడు సలహా ఇవ్వవచ్చు.
  • అత్యధికంగా మీ స్కోర్ ఉన్నట్లయితే, మీ ఆరోగ్య పరిస్థితిని మరింతగా మెరుగ్గా అంచనా వేసేందుకు అదనపు పరీక్షలను వైద్యుడు సూచిస్తారు.

చివరగా..

CT హార్ట్ స్కాన్ ద్వారా లభించే ఫలితాలు గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలను ముందుగానే అంచనా వేసేందుకు ఉపయోగించబడతాయి. అయితే ఈ ఫలితాలతో పాటు ఇతర సంబంధిత సమాచారాన్ని కలిపి పరిశీలించే వైద్యులు గుండె పరిస్థితిని ఖచ్చితమైన రోగనిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, సిటీ హార్ట్ స్కాన్‌ద్వారా గుండె అంతర్లీన పరిస్థితుల స్పష్టమైన సమాచారం వైద్యులకు అందుతుంది. అందువల్ల 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు గుండె ఆరోగ్యంగా మరియు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.