బ్రెయిన్ పవర్ ను పెంచే పది యోగాసనాలు.. మీ కోసం

0
Yoga For Brain Power

అరోగ్యవంతమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి అని వైద్యులే కాదు పెద్దలు కూడా చెబుతుంటారు. తద్వారా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని కూడా సూచిస్తుంటారు. అయితే వ్యాయాపాలు చేయకున్నా కేవలం యోగా ద్వారా రుషులు, మహర్షులు వందల ఏళ్లు.. పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించారు. శ్వాసపై నియంత్రణ సాధించిన నిరంతర ధ్యానంలో మునిగే మహర్షులు.. వేల సంవత్సరాలు బతికారని కూడా ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ విషయాన్ని పక్కనబెడితే.. సంపూర్ణ ఆరోగ్య కోసం యోగా అత్యంత ప్రభావవంతమైన విధానాలలో ఒకటి అన్నది కాదనలేని వాస్తవం. ఇప్పటికీ ఈ యోగాను సాధనంగా మార్చుకుని శతాధిక వృద్దులు నూటఇరవై ఏళ్లుగా హాయిగా జీవిస్తున్నారు. అంతటి విశిష్టత కలిగినది యోగ. ఇది మహారుషుల నుంచి మానవులకు అందిన అద్భుత సాధనం. ఇది శారీరక శ్రేయస్సును ప్రభావితం చేయడంలో సహాయపడటమే కాకుండా, అంతర్గతంగానూ మిమ్మల్ని ఉత్తేజం చేస్తోంది. అంతేకాదు దేహంలో అంతర్లీనమైన రుగ్మతలను కూడా నయం చేయడంలోనూ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

శరీరంలోని ఒక్కో అవయవానికి ఒక్కో విధమైన యోగాసనం ఉంది అంటే అతిశయోక్తి కాదు. శరీరంలో ఏ అవయవం పనితీరు ఏ మాత్రం మందగించినా.. పూర్వం గురుకులాల్లోని గురువులుగా ఉన్న మహర్షులు, దానిని గుర్తించి ఆ శిష్యులకు యోగాతోనే వాటిని నయం చేసేవారు. ఎంతటి ఆశ్చర్యకరం. అయితే మారుతున్న కాలంతో పాటు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పనిఒత్తడి నేటి తరానికి శాపంగా మారింది. భరించలేనంత ఒత్తిడితో వారు బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని ధృడసంకల్పంతో నిర్ణీత సమయంలో అప్పగించిన పనిని ముగించాలంటే.. అందుకు చక్కని యోగాసనాలను ఉన్నాయి. యోగాసనాలను ఏదో చేసామా.? ముగించామా.? ఇవాళ కాదులే రేపు చేద్దాం అనుకోకుండా మీ దైనందిక జీవితంలో అసనాల కోసం కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే చాలు. ప్రయోజనకరమైన ఫలితాలు మీ సోంతమవుతాయి. అయితే యోగాసనాలను ప్రారంభించిన తరువాత మధ్యలో దీనిని వదిలేస్తే, దీని నుంచి ఆశించిన ఎటువంటి ప్రయోజనాలను మీకు అందవు. అనుకోని అవతరంతో ఒక్కరోజు యోగా.. మరుసటి రోజు యోగాను చేయాలి. అప్పుడే యోగా ద్వారా అశించిన ప్రయోజనాలు మీకు చేకూరుతాయి.

Yoga Poses for Brain Power

మనిషి బ్రెయిన్ పవర్ ను బలోపేతం చేసేందుకు కూడా యోగా ఎంతగానో దోహదపడుతోంది. దేహదారుఢ్యమే కాదు.. మానసిక దారుడ్యాన్ని కూడా కల్పించే యోగాసనాలు ఉన్నాయి. మెదడును బలోపేతం చేసి.. శక్తివంతంగా.. ప్రభావవంతంగా మార్చేగలిగే యోగాసనాలు గురించి తెలుసుకుందామా…

1. పద్మాసనం

Padmasana
Src

పద్మాసనం ఇది చాలామందికి తెలిసిన యోగాసనం. మనస్సును ప్రభావితం చేయడమే కాకుండా.. శరీరంలో కూడా సానుకూల మార్పులను తీసుకురావడానికి అద్భుతమైన ఆసనం. ధ్యాన స్థితిలో కూర్చోవడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడటానికి, మనశ్శాంతిని కలగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు మొత్తంగా మెదడును బలోపేతం చేయడంలో సహకరిస్తుంది. ఈ యోగాసనం శరీరంలోని వివిధ చక్రాలను ప్రభావితం చేస్తుందని, మొత్తం శరీరం అవగాహనను పెంచడంలో సహాయపడుతుందని కూడా నమ్ముతారు.

పద్మాసనం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త: ఈ యోగాను ఖాళీ కడుపుతో చేయకూడదు. ఉదయం నీళ్లు లేదా పానీయాలు లేదా ఏదేని ధ్రవ పదార్థాలు తీసుకున్న తర్వాత దీన్ని ప్రయత్నించండి.

2. భ్రమరీ ప్రాణాయామం

Bhramari Pranayama
Src

భ్రమరీ ప్రాణాయామం ఈ యోగాసనం మీ ఏకాగ్రతను మెరుగుపర్చడంతో పాటు మీ జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మీరు రోజంతా నిరంతరం గందరగోళంలో ఉంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనపక్షంలో ఈ యెగా ఉపశమనం కల్పిస్తుంది. తేనెటీగలా చేసే హమ్మింగ్ శబ్దం వాస్తవానికి ఒత్తిడి స్థాయిని తగ్గించి, ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.. తద్వారా మొత్తం మెదడు పనితీరును ఏకకాలంలో ఉపశమనం కల్పిస్తుంది. మీ మానసిక, శారీరక ఒత్తిడికి కారణమైన అన్ని ప్రతికూల సంఘటనలను ఈ యోగాసనం తుడిచిపడుతుంది. మెదడు శక్తివంతంగా తీర్చిదిద్దడంలో భ్రమరీ ప్రాణాయామం దోహదపడుతుంది. ఇది మెదడుకు దాని పనితీరుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భ్రమరీ ప్రాణాయామం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త: ఈ యోగాను ఖాళీ కడుపుతో చేయకూడదు. ఉదయం నీళ్లు లేదా పానీయాలు లేదా ఏదేని ధ్రవ పదార్థాలు తీసుకున్న తర్వాత దీన్ని ప్రయత్నించండి.

3. వజ్రాసనం

Vajrasana
Src

వజ్రాసనం దీనినే డైమండ్ పోజ్ అని కూడా పిలుస్తారు, ఈ ఆసనం మెదడు శక్తివంతంగా, ప్రభావవంతంగా చేయడంలో ఇతోధికంగా దోహదపడుతుంది. ఇది ప్రధానంగా మోకాలి వ్యాయామం అని భావిస్తారు. కానీ ఇది శ్వాసకు దోహద చేస్తూ శరీరంలో అంతర్గతంగా ఉన్న అవయవాలు తమ తమ పనులను చక్కగా చేయడంలోనూ దోహదపడుతుంది. మరీ ముఖ్యంగా జీర్ణక్రియను పెంపొందించడంతో పాటు ఊపిరితుత్తుల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ యోగా చేయడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏమిటంటే ఇది మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది. తద్వారా మెదడుపై ఎలాంటి ఒత్తడి లేకుండా కూడా చేయడంలో ఇది దోహదపడుతుంది.

వజ్రాసనం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

వజ్రాసనం విషయానికి వస్తే, మోకాలు, చీలమండలు, పొత్తికడుపులో నొప్పి ఉన్నవారు ఈ వజ్రాసనాన్ని చేయకుండా ఉండటం ఉత్తమమని సూచించబడింది.

4. పశ్చిమోత్తనాసనం

Paschimottanasana
Src

పశ్చిమోత్తనాసనం అనేది మనశ్శాంతిని పొందేందుకు చేసే ప్రభావవంతమైన ఆసనాలలో ఒకటి. ఈ యోగాసనం కష్టతరమైనదే. అయితే దీనిని తొలి ప్రయత్నాలలోనే చేయడం చాలా మందికి సరిగ్గా రాదన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రయత్నించగా చేకూరనది ఏముంటుంది. పలు ప్రయత్నాల తరువాత మాత్రం దీనిని సక్రమంగా చేయడం గమనించాల్సిన విషయం. అయితే మానసిక దారుఢ్యానికి దోహదపడే ఈ యోగాను చేసే ముందు మీరు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిశ్చల జీవనశైలిని కలిగి ఉన్న వ్యక్తులకు ఇది ప్రధానంగా అద్భుతమైన ఆసనం. వెన్నెముక యొక్క సాగతీత వాస్తవానికి ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దానితో పాటు వచ్చే ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. అంతే కాదు, ఇది శరీరంలో మొత్తం రక్త సరఫరా సక్రమంగా జరగిట్లు దోహదం చేస్తుంది. అటు శారీరికంగా, ఇటు మానసికంగా ఈ ఆసనం ప్రభావితం చేస్తుంది. మెదడు పనితీరును తరచుగా ప్రభావితం చేసే దీర్ఘకాలిక ఒత్తిడిని తొలగిస్తుంది.

పశ్చిమోత్తనాసనం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

పశ్చిమోత్తనాసనం చేసేముందు దీనిని ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. తీవ్రమైన వెన్నునొప్పి, లేక వెన్ను వెన్నెముక చుట్టూ గాయాలు ఉన్నవానే ఈ యోగాసనానికి దూరంగా ఉండటం దీంతో పాటు డయేరియాతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీనిని నివారించాలి. దీన్ని చేస్తున్నప్పుడు శరీరం అతిగా ఒత్తిడి చేయకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమైన చర్య. శరీరంపై ఒత్తిడి లేకుండా మీకు సౌకర్యవంతమైన వరకు మాత్రమే ఒంగడం మంచిది.

5. అర్ధ మత్స్యేంద్రాసనం

Ardha Matsyendrasana
Src

అర్ధ మత్స్యేంద్రాసనం ప్రధానంగా సగం వెన్నెముక మలి తిప్ప చేసే ఆసనం, ఇది వివిధ పద్దతుల్లో చేయవచ్చు. తెల్లవారుజామున ఈ ఆసనాన్ని అభ్యసించే వ్యక్తుల్లో మానసిక ఉల్లాసం కనిపిస్తుంది. అదెలా అంటే అర్థ మత్స్యేంద్రాసనం ద్వారా కాళ్లు, నడుము ఓ వైపుకు ఉండగా, కేవలం చేతులు, వెన్ను, మెడ సహా నడుము పైబాగము వ్యతిరేకవైపుకు తిరుగుతుంది. తద్వారా ఇది శరీరంలోని ప్రేగు కదలికను పెంచడంలో ప్రయోజనకారకంగా మారుతుంది. అంతేకాదు వెన్నుముక్క సహా వెనుక భాగంలో దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తాన్ని నిర్విషీకరణ చేయడంలో ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుందని, శరీరం అంతటా మొత్తం రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ శరీరంలో మొత్తం ఆక్సిజన్ లభ్యతను పెంచడానికి కూడా సహాయపడుతుంది. రెండింటి మిశ్రమ ప్రయోజనాలతో, మెదడు బలోపేతానికి, మానసిక ఉల్లాసానికి కూడా ఈ అర్థమత్స్యేంద్రాసనం సమర్థవంతంగా దోహదపడుతుంది.

అర్ధ మత్స్యేంద్రాసనం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

గర్భవతులతో పాటు బహిష్టు సమయంలో మహిళలు ఈ అర్థమత్స్యేంద్రాసనానికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇది పోత్తి కడుపుపై ఒత్తిడిని కలగజేసే ఆసనం కాబట్టి గర్భవతులు, బహిష్టు మహిళలు దీనికి దూరంగా ఉండాలి. వీరితో పాటు గుండె, మెదడు శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెన్నుముక్క సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆసనం జోలికి వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

6. నాడిశుద్ధి ప్రాణాయామం

Nadisuddhi Pranayama
Src

నాడిశుద్ధి ప్రాణాయామం మొత్తం నాసికా మార్గాన్ని పూర్తిగా శుద్ది చేసే ధ్యానం ఒక్క రూపం. అంతే కాదు, మొత్తం శ్వాసకోశంలో పేరుకుపోయిన మలినాలను వదిలించుకోవడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. మానసిక దృడంత్వం కోసం చెప్పే యోగాసనాలలో నాడిశుద్ధి ప్రాణాయామం అద్యముంగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో ఆక్సిజన్ సరఫరాను, స్థాయిలను మొత్తంగా పెంచడంలో ఈ ఆసనం దోహదపడుతుంది. శరీరం ఉశ్వాస, నిశ్వాసల ప్రకియను ఈ ఆనసం కాసింత అధిక సమయంతో చేయిస్తుంది. తద్వరా స్వచ్ఛమైన గాలిని పీల్చి, వదిలడం ద్వారా మనిషి శరీరాన్ని పూర్తి ఆరోగ్యవంతంగా చేయడంలో సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ముఖ్యంగా మెదడు కార్యకలాపాలను ఉత్తమంగా పెంచడం ఈ ఆసనం యుక్క ప్రత్యేకత.

నాడిశుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలి.?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

నాడిశుద్ధి ప్రాణాయామం ఆసనాన్ని చేసేటప్పుడు శ్వాసను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మీ శ్వాసకోశ వ్యవస్థను వక్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు నాడిశుద్ధి ప్రాణాయామ ఆసనం చేయడం ఆరోగ్యరిత్యా సముచితం కాదు.

7. హలాసన

Halasana
Src

హలాసనం అనేది మనిషిలో జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను ధృఢపర్చడానికి దోహదపడే ప్రభావవంతమైన యోగాసనం. ఈయోగాసనం ద్వారా మెదడు ఒత్తిడిని గురికాకుండా.. ధృడంగా మారేందుకు దోహదపడుతుంది. మెదడు పనితీరును పెంచడానికి నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది, అంతేకాదు శరీర జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరిక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించగలదని నిరూపితమైంది. తీవ్ర ఒత్తిడితో సతమతమయ్యే మెదడు కార్యకలాపాలను శాంతపరచడంలో చాలా ప్రభావవంతమైందిగా స్పష్టమైంది. బలహీనమైన థైరాయిడ్ గ్రంధి పనితీరుతో బాధపడుతున్న రోగులకు కూడా ఇది చాలా అద్భుత ఫలితాలను అందిస్తుంది.

హలాససం ఎలా చేయాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

తల, మెడకు సంబంధించిన ఏదైనా వ్యాధులు, లేక శస్త్రచికిత్సలు జరిగిన వారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. వీరితో పాటు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కూడా ఈ హలాసనం నుంచి దూరంగా ఉండటం సముచితం. వీరితో పాటు ప్లీహ విస్తీర్ణముతో బాధపడుతున్నవారు కూడా హలాసనానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

8. తడాసనం

Tadasana
Src

తడాసనాన్ని పర్వత ఆసనం అని కూడా పిలుస్తారు. తడాసన ద్వారా ఏకాగ్రత పెంపొందడంతో పాటు మెదడు శక్తిని పెంచడంలో తడాసన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు స్థిరంగా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, మీ దినచర్యలో ఈ యోగాసనాన్ని నిత్యం ఆచరించేందుకు చేర్చుకునేలా చూసుకోవడం ఉత్తమం. నిద్రలేమి తలనొప్పి వంటి పరిస్థితుల నుండి బయటపడటానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ తడాసనం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ ఆసనం ద్వారా మంచి సుఖవంతమైన గాఢ నిద్రను కలిగించడంలోనూ దోహదపడుతుంది. నిద్రలేమి సమస్యల నుండి బయటపడడంలో సహాయం చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

తడాసనా ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

తడసనానికి సంబంధించి ఎక్కువసేపు పాదాల మీద నిలబడకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడిని పడకుండా చూసుకోవాలని అంటున్నారు.. దీర్ఘకాలంలో మోకాళ్లపై ఒత్తిడి పడితే మోకాళ్ల నోప్పులు వచ్చే ప్రమాదముందని సూచిస్తున్నారు.

9. మయూరాసనం

Mayurasana
Src

ఇప్పటివరకు మానసిక ఉల్లాసానికి మెదడును బలోపేతం చేయగల యోగాసనాల్లో మనం చెప్పుకున్న ఎనమిది ఒకెత్తు. ఈ ఒక్క ఆసనం మరోఎత్తు. ఇది నైపుణ్యం సాధనకు దోహదపడే ఈ యోగా అత్యంత కష్టతరమైన యోగాసనం. అన్ని సమయాలలో విజయవంతంగా చేయగలగాలంటే అందుకు నిరంతర సాధన ముఖ్యం. ఈ ఆసనం సమయంతో పాటు రెండు అరి చేతులపై శరీరం బలాన్ని నిలుపుకునేలా ఏకాగ్రతకు కూడా సంబంధించినది. దీనిని ఎల్లవేళలా చేయడం అంత సులవైన పనికాదు. ఈ యోగాసనం చేయడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో దోహదపడుతుంది. అంతేకాదు జ్వరం సహా సంబంధిత సమస్యల సంకేతాలను కూడా వదిలించుకోవడంలో ఈ మయూరాసనం చాలా ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసించబడింది. మూత్రపిండాల్లో రాళ్ల ఉత్పన్నమైన పరిస్థితుల్లోనూ ఈ ఆసనం ద్వారా అవి బయటకు వస్తాయని.. అందుకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. మధుమేహాన్ని నివారించడంలో కూడా ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది. మెదడు శక్తి విషయానికి వస్తే, ఇది మొత్తం ఏకాగ్రతను మెరుగుపరచడంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. మానసికంగా మెదడును అన్ని విధాల సమన్వయపర్చి.. ఒత్తిడిని నివారించి ఏకాగ్రతను పెంపోందించడంలో ప్రభావవంతం చేస్తుంది.

మయూరాసనం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త: మయూరాసనం అంత తేలికైన ఆసనం కాదు. మొత్తం శరీర బరువును రెండు చేతులపైనే కేంద్రీకరించి.. ఆ రెండు చేతులపైనే శరీరం మొత్తాన్ని సమంగా బాలెన్స్ చేయాల్సిన ఉంటుంది. ఈ యోగాను ప్రయత్నించే ముందు రెండు అరచేతులపై మీ బలాన్ని నిలుపుకుని దేహాన్ని నిలబెట్టడం ముఖ్యం. అంతేకాని ఎలాంటి సాధన లేకుండా ఈ యోగాసనం చేయడం అసాధ్యం. దీనిని ఎలాంటి యోగాసనాల సాధనలేని వారు ప్రయత్నించరాదు. ఈ మయూరాసనం ప్రయత్నిస్తూ ఒత్తిడికి గురికావడం మంచిది కాదు.

10. పదంగుష్ఠాసనం

Padangusthasana
Src

మెదడు శక్తివంతంగా చేసే పది యోగాసనాల జాబితాలో చివరిదే కాని నిర్థిష్ట కార్యంలో ధృడత్వాన్ని అందించేంది పదంగుస్థాసనం. ఈ ఆసనం మెదడును బలోపేతం చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంపొందించడంలోనూ అద్భుతమైన ప్రభావం కలిగి ఉంది. ఇది ఒకరి మొత్తం శరీరాన్ని సడలించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒత్తిడి సంకేతాలను వదిలించుకోవడానికి పదంగుష్టాసనం సహాయపడుతుంది. స్నాయువును సాగదీయడం ద్వారా మొత్తం శరీరాన్ని సడలించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును అత్యంతగా ప్రభావితం చేస్తుంది. మెదడుపై ప్రభావం చూపే సమస్యలను వదిలించుకోవడంలో పదంగుష్టాసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మయూరాసనం ఎలా చెయ్యాలి?

ఈ ఆసనాన్ని ఎలా చేయాలన్నది ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ద్వారా సూచించడం జరిగింది.

ముందుజాగ్రత్త:

మెదడు జ్ఞాపకశక్తిని పెంచే యోగాసనాలో పదాంగుష్టాసనం ఒకటైనప్పటికీ దీనిని చేయడం సులభం కాదు. దీనిని సాధన ద్వారా సాధించాల్సిన ఆసనం. క్రమక్రమంగా చేయాల్సిందే తప్ప.. తొందరపడి ఆననం చేయాలన్న ఆత్రుతలో వెన్నుముక్కపై ప్రతికూల ప్రభావాలను కలిగించకండి. వెనుక కండరాలపై ఒత్తిడి పడితే అనవసర ప్రమాదాలకు అస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ఇక చీలమండలు బలహీనంగా ఉన్నవారు కూడా ఈ ఆసనానికి పూర్తి దూరంగా ఉండటం ఉత్తమం.