Img Src : Canva

గర్భిణీ మహిళలు ఏమి తినాలి? ఏమి తినకూడదు?

గర్భధారణ కీలక దశలో ఆహారం, పోషణపై శ్రద్ధ అవసరం. సరైన ఆహారాలు పిండం పెరుగుదలకు తోడ్పడినట్లే.. హానికరమైన పదార్థాలు ప్రమాదాలను కలిగిస్తాయి. ఏమి తినాలో, ఏమి తినకూడదో అర్థం చేసుకోవడం ద్వారా సురక్షిత గర్భధారణ ప్రయాణాన్ని నిర్ధారించవచ్చు.

Img Src : Canva

గర్భధారణ సమయంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇవి పిండం అభివృద్ధికి తోడ్పడడంతో పాటు తల్లి ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తహీనత, అలసట, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

Img Src : Canva

సమతుల్య ఆహారం ప్రాముఖ్యత

పాలకూర, కేల్ వంటి ఆకుకూరలలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పుట్టుకతో వచ్చే లోపాలను నివారించి, రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పెరుగుతున్న శిశువులో బలమైన ఎముకల అభివృద్ధికి తోడ్పడటానికి చాలా ముఖ్యమైనవి.

Img Src : Canva

కీలక పోషకాల కోసం ఆకుకూరలు

పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు.. గర్భిణీలకు కాల్షియం మరియు ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి శిశువు ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడతాయి. శిశువుతో పాటు తల్లి ఎముకల బలాన్ని కాపాడుతూ కాల్షియం సంబంధిత సమస్యలను నివారిస్తాయి.

Img Src : Canva

కాల్షియం కోసం పాల ఉత్పత్తులు

నారింజ, అరటిపండ్లు, బెర్రీల వంటి తాజా పండ్లు అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సహా ఫైబర్‌ను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపర్చి, జీర్ణక్రియకు సహాయపడతాయి. గర్భధారణ దశలు అన్నింటిలో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడతాయి.

Img Src : Canva

విటమిన్లు, ఫైబర్ కోసం పండ్లు

ఓట్స్, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ వంటి సంపూర్ణ ధాన్యాలు నిరంతర శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపర్చి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా గర్భధారణ మధుమేహం మరియు అధిక బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Img Src : Canva

శక్తి కోసం సంపూర్ణ ధాన్యాలు

కొవ్వు తక్కువగా ఉండే మాంసం, గుడ్లు, బీన్స్ మరియు కాయధాన్యాలు అద్భుతమైన ప్రోటీన్ వనరులు. ఇవి కణజాల పెరుగుదలకు, పిండం అభివృద్ధికి, తల్లి కండరాల బలాన్ని కాపాడుకోవడానికి మరియు శిశువు అవయవాల నిర్మాణానికి తోడ్పడటానికి అవసరం.

Img Src : Canva

కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు

గర్భాధారణ సమయంలో శరీర అర్ద్రీకరణ చాలా అవసరం. కేవలం నీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాల వంటి ద్రవాలు తాగడం వల్ల ఉమ్మనీటి స్థాయిలను కాపాడుకోవచ్చు, డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు. ఇవి గర్భధారణ సమయంలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Img Src : Canva

శరీరం అర్ద్రీకరణ చాలా అవసరం

బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసెలు వంటి గింజలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ గర్భాధారణకు చాలా ముఖ్యం. ఇవి పిండంలో మెదడు అభివృద్ధికి, అలాగే గర్భధారణ సమయంలో తల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలను అందిస్తాయి.

Img Src : Canva

ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ముఖ్యం

పచ్చి మాంసం, సరిగా ఉడకని గుడ్లు మరియు సముద్రపు ఆహారం తీసుకోరాదు. వీటిలో సాల్మొనెల్లా మరియు లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉండవచ్చు. ఇవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచి తల్లి, శిశువులకు తీవ్రమైన సమస్యలను కలిగించవచ్చు.

Img Src : Canva

సరిగా ఉడకని ఆహారాలకు దూరం

కాఫీ, టీ, శీతల పానీయాల నుండి వచ్చే అధిక కెఫీన్ గర్భస్రావం మరియు తక్కువ బరువుతో శిశువు జన్మించే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు వైద్యల సలహా మేరకు సురక్షితమైన స్థాయిలకు కెఫీన్ తీసుకోవడాన్ని పరిమితం చేసుకోవాలి.

Img Src : Canva

కెఫీన్ తీసుకోవడాన్ని పరిమితం చేసుకోండి

గర్భధారణ సమయంలో మద్యం సేవించడం వల్ల ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడవచ్చు. ఇది పిండం అభివృద్ధిలో జాప్యం, పుట్టుకతో వచ్చే లోపాలు మరియు గ్రహణశక్తి లోపాలకు దారితీస్తుంది. కాబట్టి పిండం భద్రత కోసం దీనికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా అవసరం.

Img Src : Canva

మద్యానికి దూరంగా ఉండండి

పాశ్చరైజ్ చేయని పాలు, జున్నులో లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు మరియు గర్భస్రావం లేదా నెలలు నిండక ముందే ప్రసవం వంటి గర్భధారణ సమస్యలకు కారణం కావచ్చు.

Img Src : Canva

పాశ్చరైజ్ చేయని ఉత్పత్తులకు దూరం

అధిక చక్కెర, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వులతో కూడిన అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఇవి ఊబకాయం, అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహానికి దారితీస్తాయి. ఇవి తల్లి మరియు పిండం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Img Src : Canva

ప్రాసెస్ మరియు జంక్ ఫుడ్స్‌ నివారణ

షార్క్, స్వోర్డ్ ఫిష్ మరియు కింగ్ మాకెరెల్ వంటి చేపలలో పాదరసం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది శిశువు యొక్క అభివృద్ధి చెందుతున్న నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. కాబట్టి సాల్మన్, టూనా వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.

Img Src : Canva

పాదరసం ఉండే చేపలను పరిమితం చేయండి

కొన్ని హెర్బల్ టీలు మరియు సప్లిమెంట్లు గర్భధారణ సమయంలో సురక్షితం కాకపోవచ్చు. ఎందుకంటే అవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపించవచ్చు లేదా మందులతో ప్రతిచర్య జరపవచ్చు. కాబట్టి వాటిని తీసుకునే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి.

Img Src : Canva

హెర్బల్ టీ, సప్లిమెంట్ల విషయంలో జాగ్రత్త

ఆరోగ్యకరమైన గర్భం చాలా వరకు ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హానికరమైన పదార్థాలను నివారించి, అధిక పోషక ఆహారాలను ఎంచుకోవడం పిండం సరైన అభివృద్ధికి, తల్లి శ్రేయస్సుకు భరోసా ఇస్తుంది. వైద్యుల సూచనలు, వ్యక్తిగత ఆహార మార్గదర్శకత్వాలను ఫాలో కావడం ఉత్తమం.

Img Src : Canva

చివరిగా..!