Img Src : iStockphoto
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కాకరకాయ-పాలకూర రసం సహాయపడుతుంది. కాకరకాయలోని పాలీపెప్టైడ్-పి అనే ఇన్సూలిన్ కాంపౌండ్ సహజంగా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. పాలకూరను జోడించడంతో అదనపు రుచి, ఆరోగ్యం.
Img Src : iStockphoto
మధుమేహం గత కొన్ని దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి వ్యాధులలో ఒకటిగా మారింది. ఈ వ్యాధి బారిన ఎక్కువ మంది ప్రజలు పడుతున్నారు. అందుకు కారణం వారి అహారపు అలవాట్లే. అయితే కొందరిలో మాత్రం ఇది వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది.
Img Src : iStockphoto
పెరిగిన ప్రపంచఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2014 సంవత్సరంలోనే, 422 మిలియన్ల మంది దీని బారిన పడ్డారు. గత మూడు దశాబ్దాలలో ఈ పరిస్థితి వేగం పుంజుకుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో ఊబకాయం, స్ట్రోక్ సహా తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీస్తుంది.
Img Src : iStockphoto
మధుమేహం (రక్తంలో షుగర్ లెవల్స్) పెరగడానికి కారణం ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలి కూడా కారణం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సమతుల్య ఆహారంతో డయాబెటిస్ స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. ఈ రెండు షుగర్ నియంత్రణలో ముఖ్యమైన అంశాలు.
Img Src : iStockphoto
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కార్బోహైడ్రేటెడ్స్ (పిండి పదార్థాలు), సంపూర్ణ ధాన్యపు పదార్థాలతో చేసిన ఆహారాలను మధుమేహ బాధితులు ఎంచుకోవడం మంచిది. తీపి పానీయాలు అసలు తీసుకోరాదు, అయితే తాజా రసాలు కొద్దిమేర తీసుకోవచ్చు.
Img Src : iStockphoto
మార్కెట్లో లభ్యమయ్యే పలు క్యాన్డ్ డ్రింకుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఫ్రక్టోజ్ కలిగిఉంటాయి. వీటన్నింటినీ మించుతూ.. షుగర్ లెవల్స్ ను నియంత్రించే ఒకే ఒక్క జ్యూస్.. కాకరకాయ రసం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది
Img Src : iStockphoto
Img Src : iStockphoto
కాకరకాయ రసం శరీరంలోని ఇన్సులిన్ యాక్టివ్ గా మార్చడంతో పాటు రక్తంలోని చక్కరను బాగా ఉపయోగిస్తుంది. చక్కరను కొవ్వుగానూ మార్చకుండా ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుందని న్యూట్రీషియన్ డాక్టర్ అంజుసూద్ తెలిపారు.
కాకరకాయ జ్యూస్ పై జరిపిన వివిధ అధ్యయనాల్లో అందులో కొన్ని చురుకైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అవి 'చారంటిన్' వంటి డయాబీటిక్ వ్యతిరేక లక్షణాలతో కూడి ఉన్నాయని తేలింది. ఇవి రక్తంలో గ్లూకోజ్-ప్రభావాన్ని తగ్గించడంలో దోహదపడతాయని తేలింది.
Img Src : iStockphoto
కాగా, కాకరకాయతో పాటు చక్కరపై అధ్బుత ప్రభావం చూపే సూపర్ ఫుడ్ పాలకూరను జోడించడంతో ఫైబర్ పుష్కలంగా అందుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న పాలకూరలోని తక్కువ-గ్లైకేమిక్ ఇండెక్స్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
Img Src : iStockphoto
ఈ పాలకూర-కాకర రసం తయారీకి కావాల్సిన పదార్థాలు: తొక్కతీసి ముక్కలు చేసిన కాకరకాయ-1, సన్నగా తరిగి ఉడికించిన పాల కూర కట్ట-1, నిమ్మరసం- 1/2 టీస్పూన్, నల్ల మిరియాలు- 1/2 టీస్పూన్, తరిగిన అల్లం- 1/2 స్పూన్
Img Src : iStockphoto
షుగర్ ను కంట్రోల్ చేసే కాకర-పాలకూర రసం తాగాలని ఉన్నా తయారీ అందరికీ రాదు, అందుకనే ఈ రెసిపీ విధానాన్ని అందిస్తున్నాం. ముందుగా కాకర ముక్కలు, ఉడికించిన పాలకూర, నిమ్మరసం, మిరియాలు, అల్లం ముక్కలను బ్లెండ్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేయండి.
Img Src : iStockphoto
రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచడానికి కాకరకాయ- పాలకూర రసం దోహదపడుతుంది. దీనిని తీసుకునే ముందు మీ వైద్యుడితో సంప్రదించండి. కాగా ఇది చేదుగా ఉందని భావించేవారు నిమ్మరసం, నల్ల మిరియాలను మరింత జోడించుకోవచ్చు!
Img Src : iStockphoto