Img Src : iStockphoto

వర్షాకాలంలో చర్మసౌందర్యం: తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో కురిసే వర్షాలలో తడవటం కారణంగా చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. ఇక గాలిలో అధిక తేమ కూడా చర్మ సమస్యలకు సంభావ్య కారణమన్న విషయం తెలిసిందే. దీంతో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.

Img Src : iStockphoto

వర్షాకాలంలో చర్మ సమస్యల నివారణాచర్యలు:

అధిక తేమ కారణంగా అదనపు నూనె, మురికిని తొలగించడానికి ముఖాన్ని రోజుకు రెండుసార్లు సున్నితమైన క్లెన్సర్‌తో కడగాలి. అందుకు వేడి నీటి బదులుగా గోరు వెచ్చని నీటిని వినియోగించడం వల్ల సహజ నూనెలను తొలగించదు.

Img Src : iStockphoto

రోజూ రెండుసార్లు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి

మృత చర్మ కణాలను తొలగించడానికి, అడ్డుపడే రంధ్రాలను నివారించడానికి వారానికి ఒకసారి సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. దీంతో మృతకణాలు తొలగి చర్మం మళ్లీ కొత్త కణాలతో ప్రకాశవంతంగా మారుతుంది.

Img Src : iStockphoto

వారానికోసారి ఎక్స్‌ఫోలియేట్ చేసి, శుభ్రం చేయాలి:

తేమతో కూడిన వాతావరణంలో కూడా, స్కిన్ హైడ్రేషన్‌ను నిర్వహించడానికి తేలికపాటి, నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. దీంతో పాటు ప్రతిరోజూ కనీసం SPF 30తో విస్తృత-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను వర్తింపజేయాలి.

Img Src : iStockphoto

మాయిశ్చరైజ్, సన్‌స్క్రీన్ తప్పనిసరి:

వర్షం, తేమ కారణంగా స్మడ్జింగ్‌ను నివారించడానికి వాటర్‌ప్రూఫ్, మినిమల్ మేకప్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక మురికి, బ్యాక్టీరియా చేతి నుంచి బదిలీకాకుండా నిరోధించడానికి ముఖాన్ని తాకడం తగ్గించాలి.

Img Src : iStockphoto

వాటర్‌ప్రూఫ్ మేకప్, ముఖం తాకకూడదు:

ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు దాహం తీర్చుకుంటూ హైడ్రేట్‌గా ఉండాలి. దీంతో చర్మాన్ని లోపల కూడా నీరు పుష్కలంగా ఉంటుంది.

Img Src : iStockphoto

సమతుల్య ఆహారంతో హైడ్రేటెడ్‌గా ఉండండి:

వర్షంలో తడిసి ఇంటికి చేరకున్న వెంటనే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఎక్కడ తేమ, చెమట పేరుకుపోకుండా అవకాశం ఉన్న ప్రాంతాల్లో యాంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి.

Img Src : iStockphoto

తేమ, చెమట పట్టకుండా పౌడర్ వేసుకోవాలి:

బ్రీతబుల్ ఫాబ్రిక్‌తో చేసిన మాస్క్‌లను ధరించండి, మాస్క్ ఉపయోగించిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. హెవీ క్రీమ్‌లను నివారించండి, నీటి ఆధారిత లేదా జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌లను ఎంచుకోండి.

Img Src : iStockphoto

ఫేస్ మాస్క్‌లు జాగ్రత్తగా:

ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ పాదాలను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ముఖానికి క్రిములు చేరకుండా ఉండటానికి మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి.

Img Src : iStockphoto

చేతులు, పాదాల సంరక్షణ:

రుతుపవన కాలంలో అందులోనూ వర్షం కురుస్తున్న రోజుల్లో చర్మం చికాకు కలిగిస్తుంది. దాని నివారణకు వీలైనంత త్వరగా తడి బట్టలు మార్చండి. మొటిమలు ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించండి.

Img Src : iStockphoto

చర్మం పోడిగా ఉండేలా చర్యలు:

వర్షాకాలంలో సొంతంగా ఈతకొలను ఉంటే ఫర్వాలేదు కానీ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లలో క్లోరిన్ చర్మానిక చికాకు కలిగిస్తుంది. కోల్పోయిన శరీర తేమను తిరిగి నింపడానికి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించండి

Img Src : iStockphoto

ఈతకొలనులు నివారించండి:

ప్రతీ వ్యక్తి చర్మం ప్రత్యేకమని తెలుసుకోండి. నిర్ధిష్ట చర్మ రకం, అవసరాలకు అనుగూణంగా ఈ జాగత్రలు తీసుకోవాలి. అయినా చర్మ సమస్యలను ఉత్పన్నమయితే వ్యక్తిగతీకరించిన సలహా కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

Img Src : iStockphoto

చర్మవ్యాధి నిపుణులను సంప్రదించండి: