Img Src : iStockphoto
మనిషికి సమతుల్య పోషక ఆహారమే ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు గురిచేసి, దీర్ఘకాలిక వ్యాధి పరిస్థితులకు కారణం అవుతుంది. పోషకాహారం క్యాన్సర్ ను సైతం నియంత్రిస్తుంది.
Img Src : iStockphoto
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడు జరుగుతున్న ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్ మరణం కావడం దిగ్బ్రాంతికర విషయం. క్యాన్సర్ చికిత్సలో ఉన్నా, శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నా వాటి అవాంఛిత దుష్ప్రభావాలను ధీటుగా ఎదుర్కోవాలన్నా ఆహారంతోనే సాధ్యం.
Img Src : iStockphoto
క్యాన్సర్ చికిత్స జరుగుతున్న క్రమంలోనూ అలసట, వాంతులు, వికారం, రుచిలేమి, ఆకలిలో మార్పులు, నోరు పొడిబారడం, బాధాకరమైన మింగడం, విరేచనాలు, మలబద్ధకం, నోటిపూత, రక్తహీనత, మూడ్ స్వింగ్, బలహీనమైన దృష్టి దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
Img Src : iStockphoto
ఆరోగ్యకరమైన, పౌష్టిక ఆహారంతో ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలను పునర్నిర్మిణానం, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడం, శరీరానికి శక్తిని అందించడానికి తప్పనిసరిగా తీసుకోవలసిన ఔషధం రూపం. అందుకు అనామ్లజనకాలు, ఇతర పోషకాలు అవసరం.
Img Src : iStockphoto
ఇవి శరీరం సహజ రోగనిరోధక శక్తిని పెంచి పోస్ట్-క్యాన్సర్ చికిత్సలో అనూహ్యంగా సాయం చేస్తాయి. అవి ముఖ్యంగా పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఆ పండ్లను జ్యూస్‌ల రూపంలో ఆహారంలో చేర్చడం ఒక్కటే చక్కని మార్గం. దీంతో సులభంగా జీర్ణం అవుతుంది.
Img Src : iStockphoto
క్యాన్సర్ దుష్ప్రభావాలను అరికట్టి, కోలుకునేలా చేయడంతో మార్గాన్ని సులభతరం చేసే యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫ్రూట్ జ్యూస్‌లు ఇవే. ఇవి హీలింగ్ పోషణను అందించి, శరీరం నుండి వ్యర్థాలు, విషాన్ని తొలగించడంలోనూ సహాయపడతాయి.
Img Src : iStockphoto
Img Src : iStockphoto
దానిమ్మలోని ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకాలు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోని, వాపును తగ్గిస్తాయి. ఈ రసంలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ వంటి విటమిన్లు ఉన్నాయి. క్యాన్సర్ నివారణ, రికవరీకి దోహదపడతాయి.
నారింజ, ద్రాక్షపండు, నిమ్మ వంటి సిట్రస్ రసాలు విటమిన్ సి అద్భుతమూలాలు. ఇది రోగనిరోధక శక్తితో పాటు కణజాల మరమ్మత్తు కోసం కొల్లాజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది. వీటిలో ఫైటోకెమికల్స్, లిమోనాయిడ్స్, క్యాన్సర్ కణాలను తగ్గించడంలో పనిచేస్తాయి.
Img Src : iStockphoto
పైనాపిల్ జ్యూస్‌లో అధిక విటమిన్ సి, బ్రోమెలైన్ ఎంజైమ్, మాంగనీస్ క్యాన్సర్ రోగులకు అద్భుతమైన ఎంపిక. ఇవి క్యాన్సర్ రికవరీలో గాయాలను నయంచేసి, కణజాల మరమ్మత్తును ప్రోత్సహిస్తుంది. ఇందులోని బ్రోమెలైన్ రేడియేషన్-ప్రేరిత వాపును తగ్గిస్తుంది.
Img Src : iStockphoto
పుచ్చకాయలో సమృద్దిగా ఉండే లైకోపీన్, క్యాన్సర్ నివారణ, పునరుద్ధరణలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేసి, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్లు A, B6, Cలతో పాటు పొటాషియం కూడా ఉంది.
Img Src : iStockphoto
యాపిల్స్‌లో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ పెక్టిన్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, గట్ పనితీరును ప్రోత్సహిస్తుంది. వీటిలోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్, వివిధ ఫైటోకెమికల్స్ యాంటీకాన్సర్ ప్రభావాలను కలిగినవే.
Img Src : iStockphoto
అరటిపండ్లు సమృద్దిగా ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పుష్కలమైన విటమిన్ B6 రోగనిరోధక వ్యవస్థ నిర్వహణ చేపడుతుంది. తక్షణ శక్తిని అందించడంతో పాటు క్యాన్సర్ అలసటను అనుకూలంగా మారుస్తాయి.
Img Src : iStockphoto
Thanks for reading!
Img Src : iStockphoto