Img Src : iStockphoto

ట్రాఫిక్‌లో ఒత్తిడిని తగ్గించి.. రిలీఫ్ ఇచ్చే 5 శీఘ్ర యోగా టెక్నిక్స్

ఉదయపు ఆపీసులు, ఉద్యోగాలకు వెళ్లప్పుడు ట్రాఫిక్ రద్దీ.. ఎంతటి శాంతం, సౌమ్యంగా ఉండే వ్యక్తినైనా ఒత్తిడికి గురిచేస్తాయి. ఓవైపు రద్దీ, సమయం, కాలుష్యం ఒత్తిడిని పెంచేస్తాయి. ఆఫీసుకు చేరుకునేలోగా నిస్తేజంగా మారుస్తాయి. ఒత్తిడి తీవ్రమై కోపంగా మారుతుంది.

Img Src : iStockphoto

ట్రాఫిక్ రద్దీలో ఆపీసులకు చేరడం ఒత్తిడే:

ఈ కోపాన్ని మీరు ప్రదర్శించకుండా తప్పించుకోవాలంటే అందుకు అనువైన మార్గం యోగా. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినప్పుడు సాధన చేయగల సాధారణ యోగా ఆసనాలు కోల్పోయిన శక్తిని నిలుపుకోవచ్చు. అంతేకాదు వీటి ద్వారా క్షణంలో శాంతిని పొందవచ్చునని నిపుణులు పేర్కోంటున్నారు.

Img Src : iStockphoto

యోగా చిట్కాలతో ట్రాఫిక్ రద్దీ ఒత్తిడికి చెక్:

వెన్నెముక, తల నిటారుగా ఉంచి శ్వాస తీసుకుంటూ, కుడి చేతిని పైకి లేపి అరచేతిని తల పైన ఉంచండి. లోతుగా శ్వాస తీసుకుంటూ వృత్తాకార కదలికలో, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తల పైభాగాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. తల ప్రాంతంలో ఉద్రిక్తత సడలి, విశాంత్రి అనుభూతి పోందుతారు.

Img Src : iStockphoto

ఈ యోగాసనాల్లో ఒకటి కూర్చున్న తల మసాజ్:

వెన్నెముక, తల నిటారుగా ఉంచి కళ్లు మూసుకోవాలి. ఆ తరువాత వేగంగా 15 సార్లు కంటి రెప్పలు కొట్టాలి. ఆ తరువాత మరో 15 సార్లు నెమ్మదిగా కళ్ల రెప్పలు వేయాలి. కళ్లను వీలైనంత గట్టిగా మూసుకోవాలి, అలాగే వీలైనంత విస్తృతంగా తెరవాలి. వ్యాయామం చేసేపుడు దీర్ఘశ్వాస తప్పనిసరి.

Img Src : iStockphoto

ఈ యోగాసనాల్లో రెండవది బ్లింక్, స్క్వీజ్, ఐస్ ఓపెన్ వైడ్

ఈ బ్లింక్, స్క్వీజ్, ఐస్ ఓపెన్ వైడ్ యోగాతో కళ్ల చుట్టూ ఉన్న టెన్షన్ విడుదలైన అనుభూతి కలుగుతుంది. అందుకు ఈ చర్యను కొన్ని సార్లు పునరావృతం చేయాలి. ఈ యోగా చేస్తున్నప్పుడు సజావుగా శ్వాస తీసుకోవాలి.

Img Src : iStockphoto

ఈ యోగాతో కళ్ల చుట్టూ ఉన్న టెన్షన్ మాయం:

వెన్నెముక తల నిటారుగా ఉంచి, మూడు వేళ్ల కొనను చెంప ఎముకలపై వేసి కండరాలన్ని పట్టుకోండి. నోటిని రిలాక్స్‌గా ఉంచి, గట్టిగా నొక్కి, వృత్తాకార కదలికలో మసాజ్ చేసి, గట్టిగా క్రిందికి నొక్కడం ద్వారా, మీ వేళ్లను దవడ రేఖ వెంట గడ్డం వైపుకు తీసుకురండి.

Img Src : iStockphoto

ఒత్తిడిని విడుదల చేసే దవడ యోగా:

Img Src : iStockphoto

దవడ యోగాతో ముఖంలో ఒత్తిడి దూరం:

ఇలా ఈ యోగాసన చర్యను మరికొన్ని సార్లు పునరావృతం చేయండి. ఈ ఆసనం చేస్తున్న సమయంలో సజావుగా, లోతైన శ్వాస తీసుకోండి. ముఖంలో కనిపించే టెన్షన్ తగ్గి.. కాసింత ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది

వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచి, దీర్ఘ శ్వాస తీసుకుంటూ, గడ్డం పైకి లేపి, తలను వెనక్కి తీసుకెళ్లగానే... గొంతు సాగి, మెడ కండరాల్లో కుదింపు కలుగుతుంది. ఇది స్పష్టంగా అనుభవిస్తారు. ఈ భంగిమనలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి.

Img Src : iStockphoto

ఈ యోగాసనాల్లో నాలుగవది మెడ రోల్స్

కొన్ని సెకన్ల తరువాత ఊపిరి పీల్చుకుంటూ, పైకి చూస్తున్న గడ్డాన్ని ఛాతీ వైపుకు తీసుకురండి. మీ తలను క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొన్ని సార్లు నెమ్మదిగా తిప్పగానే మీకు మెడలో విశ్రాంతి పొందిన అనుభూతి కలుగుతుంది.

Img Src : iStockphoto

మెడ రోల్స్ యోగాతో మెడలో విశ్రాంతి:

వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచి, భుజాలను చెవులకు తాకించాలి. కొద్ది సేపు ఈ భంగిమలో ఉన్న తరువాత ఊపిరి పీల్చుకుంటూ, భుజాలను వదలండి. కొన్ని సార్లు ఎడమ, కుడి భుజాలతో ఈ చర్యను చేయాలి.

Img Src : iStockphoto

యోగాసనాల్లో ఐదవది ఇయర్ టు షోల్డర్ స్ట్రెచ్:

ఇలా చేయడం ద్వారా ఎగువ వీపులో కండరాలు పిండినట్లు అనుభూతి కలుగుతుంది. అంతేకాదు భుజాలు చెవులకు తాకడం వల్ల వెన్నెముక విస్తరించబడి, శక్తి పైకి కదులుతున్నట్లు అనుభూతి చెందండి. భుజాలు రిలీప్ అయిన అనుభూతి కలుగుతుంది.

Img Src : iStockphoto

ఇయర్ టు షోల్డర్ ద్వారా శక్తి కదలిక:

ఈ యోగాలో వెన్నెముక, మెడ, తలను నిటారుగా ఉంచి సరళ రేఖలో ఉంచండి. చేతులను ఛాతీ దగ్గరకు తీసుకురండి. మణికట్టు, భుజాలు, తలను విశ్రాంతి తీసుకోండి. డాన్స్ చేసినట్లుగా మణికట్టు, శరీరం, తలను కలిపి షేక్ చేయండి. దీంతో దృఢత్వం అనుభూతి చెందండి

Img Src : iStockphoto

యోగాసనాల్లో ఆరవది బాడీ షేక్:

వెన్నెముక, మెడ, తలను సరళ రేఖలో ఉంచి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని కుడి వైపుకు (వెన్నుముక్కకు వీలైనంత) తిప్పండి. ఐదు సెకన్ల తరువాత దీర్ఘశ్వాస తీసుకుంటూ యధాస్థానానికి చేరుకోవాలి. ఆ తరువాత ఎడమ వైపున ఈ చర్యను చేయాలి. దీంతో వెన్నులో రిలీఫ్ కలుగుతుంది.

Img Src : iStockphoto

యోగాసనాల్లో ఏడవది సింపుల్ సీటెడ్ ట్విస్ట్

ఇలాంటి చిన్న యోగాలతో శరీరం, మనస్సు అద్భుతాలు చేస్తాయని, కార్యాలయాల్లోనూ పనిలో ఉత్పాదకలోనూ నాణ్యత, అధిక ప్రోడక్టివిటీ సాధ్యమవుతుందని యోగా నిపుణులు సలహాలిస్తున్నారు. వీటిని ఓ సారి ఆచరించి చూస్తారుగా.!

Img Src : iStockphoto

ఈ క్షణాల్లో చేసే యోగాలతో చక్కటి రిలీఫ్: