Home న్యూట్రిషన్ యోగర్ట్ అంటే పెరుగేనా? దేనిలో అధిక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?

యోగర్ట్ అంటే పెరుగేనా? దేనిలో అధిక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?

0
యోగర్ట్ అంటే పెరుగేనా? దేనిలో అధిక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?

పెరుగు అనగానే తెలుగింటి లోగిళ్లలో మాకు తెలుసు అంటారు. తెలుగనే కాదు.. యావత్ దేశంలో పెరుగంటూ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇక పెరుగన్నం రుచి ఎరుగని వారుండరు. ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని కొన్ని దేవాలయాలలో పెరుగన్నం అదేనండీ దద్దోజనం ఒక్కటి మాత్రమే మూలవిరాట్ కు నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన ఎన్ని వంటకాలున్నా అవన్నీ ప్రసాదంగా చూపించి వెనక్కు వచ్చేవే. ఇది మనదేశంలో పెరుగుకు వున్న విశిష్టత. అయితే పెరుగు ఎలా చేస్తారన్నది కూడా మన దేశంలో రమారమి చిన్నపిల్లల నుంచి అందరికీ తెలుసు. అయితే మనం ఇంతగా అస్వాదించే పెరుగుతో బోజనంలోని చివరి ముద్దలు తినకపోతే కడుపు వెలితిగానే ఉన్నట్లు భావిస్తాం. పెరుగుతో కనీసం నాలుగు ముద్దుల అన్నం తింటేనే కానీ కడపు నిండిన భావన మనవారిలో కలగదు అంటే అతిశయోక్తి కాదు.

అయితే ఇంతటి ప్రత్యేకమైన పెరుగు కేవలం భారతీయులకు మాత్రమే సొంతమా.? లేక ప్రపంచవ్యాప్తంగా పెరుగుకు ఇదే విశిష్టత ఉందా.? అన్న సందేహాలు తలెత్తితే.. మనం పెరుగు అని పిలుచుకునే పదార్థాన్నే వారు పాల ఉత్పత్తులతో కృతిమంగా తయారు చేసుకుని యోగార్ట్ అని పిలుచుకుంటున్నారు. అయితే, మన పెరుగు వాళ్ల యోగర్ట్ ఒక్కటేనని ఇప్పటికీ ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు. కానీ అవి ఒకేలా కనిపించినంత మాత్రాన.. ఒకటి కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పెరుగు అనేది పాల ఉత్పత్తి, పాలను రాత్రి పూటి వేడి చేసి అవి గోరవెచ్చగా చల్లారిన తరువాత వాటిలో పెరుగు తోడు వేసి.. రాత్రంతా అలా పెడితే ఉదయానికి పెరుగులా తయారు అవుతుంది. అయితే ఉత్తర భారతంలో మాత్రం పెరుగుకు బదులుగా వెనిగర్, నిమ్మరసం వంటి పుల్లటి పదార్థాలతో పాలను కలిపి పెరుగును తయారు చేస్తారు. దీనినే హిందీలో దాహీ అని అంటారు. పెరుగును తయారు చేయడం చాలా సులభం, మీరు పాలలో కొన్ని టీస్పూన్ల నిమ్మరసం లేదా వెనిగర్ వేసి 6-8 గంటలు అలాగే ఉంచితే చాలు.. పాలు పెరుగుగా మారుతాయి. అందుకు కారణం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇది పెరుగు తోడు వేసిన పాలను అరు గంటల వ్యవధిలో పెరుగలా మార్చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అనాదిగా వస్తున్న పెరుగు తయారీచేసే ఆచారం.

అయితే, పాలతో కాకుండా పాల ఉత్పత్తులను తీసుకుని బ్యాక్టీరియా ఫర్ మెంటేషన్ ప్రక్రియ ద్వారా పెరుగు సృష్టించడం యోగార్ట్. ఇందుకోసం లాక్టోబాసిల్లస్ బల్గారికస్ బ్యాక్టీరియాతో పాటుగా స్ట్రెప్టోకోకస్ థర్మోఫిల్స్ ను ఉపయోగిస్తారు. కాబట్టి పెరుగు లేదా యోగార్ట్ లలో దేనని తింటే ఆరోగ్యకరం. ఎందుకు అధిక అరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే, ఈ పోస్ట్‌ని చూడండి.

పెరుగు, యోగార్ట్ మధ్య తేడా ఏమిటి?

పెరుగు తయారు చేయడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా గోరువెచ్చని పాలలో కొద్దిగా పెరుగును తోడు 6-8 గంటల వేచి ఉంటే తర్వాత చక్కటి గడ్డ పెరుగు తయారవుతుంది. పెరుగు సహజమైనది, ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో సులభంగా తయారు చేయబడుతుంది. దీనిని తయారు చేసే ప్రక్రియలో ఎటువంటి బ్యాక్టీరియా అవసరం లేదు. ఇది ప్రోబయోటిక్ కూడా కాదు.

అయితే బ్యాక్టీరియాను ఉపయోగించి పాలను, పాల ఉత్పత్తులను ముక్కలు చేయడం ద్వారా యోగార్ట్ తయారు చేయబడుతుంది. పాలను ముక్కలు చేసే ప్రక్రియను యోగార్ట్ కల్చర్ అని అంటారు. పాలను ఇలా ముక్కలు చేసిన తరువాత బ్యాక్టీరియాను వాటిలో కలుపుతారు. ఇక యోగార్ట్ పారిశ్రామిక ఉత్పత్తి కావడంతో పాటు ఇందులో రుచి కోసం పలు రకాల ఫ్లేవర్లను కూడా కలిపే అవకాశం ఉంది. దీంతో ఇది రుచికరంగా ఉంటుంది. యోగార్ట్, పెరుగు మధ్య ప్రధాన వ్యత్యాసం ఇది.

యోగర్ట్ ద్వారా కలిగే అరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం:

yogurt vs curd 1
  • యోగర్ట్ మీ జీర్ణక్రియకు పెంపోందిస్తుంది.
  • ప్రేగు కదలికను సక్రమంగా ఉంచేలా దోహదపడుతుంది.
  • మీ శరీరంలోని అరోగ్యకర బ్యాక్టీరియాను మెరుగుపరుస్తుంది.
  • హానికారక బ్యాక్టీరియాను సంహరించడంలోనూ దోహదపడుతుంది.
  • ప్రతిరోజూ యోగర్ట్ తిసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతం చేస్తుంది.
  • యోగర్ట్ లో బరువు తగ్గడానికి సహాయపడే ప్రోటీన్ ఉంది.
  • బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది.
  • ఎముకల ఎదుగుదలకు కావాల్సిన కాల్షియంను అందిస్తుంది.
  • ఎముకలు ప్రాక్చర్ అయ్యే ప్రమాదాలను కూడా నివారిస్తుంది.
  • నిత్యం యోగర్ట్ తీసుకోవడం ఎముకలకు కవచంగా నిలుస్తుంది.
  • మంటను తగ్గిస్తుంది: మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, గుండె సంబంధిత లేదా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతుంటే, ఆయా మంటను తగ్గించడానికి యోగర్ట్ దోహదపడుతుంది.
  • ఆకలిని అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి కావాల్సిన క్యాలరీలను తక్కువ మోతాదులోనే తీసుకునేలా చేస్తుంది. తద్వార బరువు తగ్గడంలోనూ దోహదపడుతుంది.

పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

yogurt vs curd 2
  • పెరుగులో యోగర్ట్ లాగానే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం:
  • పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • పెరుగులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి.
  • పెరుగులో ఉండే యాక్టివ్ బ్యాక్టీరియా మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పెరుగు కాల్షియం, ఫాస్పరస్ లను పుష్కలంగా కలిగిఉంటాయి
  • పెరుగు నిత్యం తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • చర్మాన్ని తేమగా ఉంచే మంచి గుణాలున్నాయి.
  • లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల మీ ముఖంపై ముడతలను నివారిస్తుంది.
  • వృద్ధాప్య ప్రారంభ సంకేతాలతో పోరాడుతుంది.
  • పెరుగు జుట్టు ఆరోగ్యానికి మంచిది.
  • తలలోని చుండ్రుతో లాక్టిక్ యాసిడ్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియా సమర్థవంతంగా పోరాడుతుంది.
  • కాబట్టి ఇవి యోగర్ట్, పెరుగు మధ్య కొన్ని తేడాలు.. అవి అందించే అరోగ్య ప్రయోజనాలు.
Exit mobile version