వైన్ నుంచి మెడిసిన్ వరకు గ్రేప్సీడ్ ఆయిల్ ప్రయోజనాలు

Img Src : iStockphoto

ద్రాక్ష పండు చిన్నగా, గుత్తులు గుత్తులుగా ఉండే బెర్రీ పండ్లు. తీపి, కాసింత పులుపును పులుముకుని, చక్కని గుజ్జులో చిక్కని రసంతో నిండి ఉంటుంది. ఈ పండ్లు రెండు రకాలు తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్షగా లభ్యమవుతాయి. తాజా పండ్లును అస్వాదించేందుకు పిల్లలు, పెద్దలు పోటీ పడతారు.

Img Src : Unsplash

ద్రాక్ష పండ్లను ఎక్కువగా వైన్, జామ్‌లు, జెల్లీలు, రైసిన్, వెనిగర్, తయారీతో వినియోగిస్తుంటారు. ఈ ద్రాక్ష తీగ నుంచి వచ్చే పండ్లలోని గింజలతో గ్రేప్సీడ్ ఆయిల్ తయారు చేస్తారు. శతాబ్దాల కాలం నుంచి గ్రేప్ సీడ్ అయిల్ లోని ఔషధ గుణాలను వినియోగిస్తున్నారు.

Img Src : Unsplash

గ్రేప్సీడ్ ఆయిల్ చర్మం నిగారింపుకు, జుట్టుకు మెరుపును అందించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు ఔషధంగా కూడా వినియోగిస్తారు. మలబద్ధకం, క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులకు చికిత్స చేస్తారు. దీంతో పాటు వివిధ ఉత్పత్తులలో ఉపయోగించారు.

Img Src : iStockphoto

గ్రేప్సీడ్ ఆయిల్ ఉప ఉత్పత్తి. తాజా ద్రాక్షాల నుంచి వైన్ కోసం రసం తీసిన తర్వాత మిగిలిన విత్తనాల అవశేషాల నుంచి గ్రేప్సీడ్ ఆయిల్ తీస్తారు. ఈ నూనెను 20 శతాబ్దాలలో యూరోపియన్లు చర్మం, దృష్టి సమస్యలను నయం చేయడంలో సహయపడతుంది.

Img Src : iStockphoto

గ్రేప్సీడ్ ఆయిల్‌లో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, లినోలెయిక్ యాసిడ్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టుకు పోషణను అందిస్తాయి. దీనిని సౌందర్య సంరక్షణ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులోని నాన్-కామెడోజెనిక్ లక్షణాలు చర్మం రంధ్రాలను మూసుకుపోనీయవు.

Img Src : iStockphoto

గ్రేప్సీడ్ నూనెలో ఒమేగా 6 లినోలెయిక్ యాసిడ్ వల్ల చర్మ కణ త్వచాన్ని పోషించడంతోపాటు మొటిమలను నయం చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రంధ్రాలు మూసుకుపోకుండా నిరోధించి, చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.

Img Src : iStockphoto

గ్రేప్సీడ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఎర్రబడిన చర్మాన్ని నయం చేసి బ్రేక్‌-అవుట్‌లను నివారించడంలో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా మొటిమలకు అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలకు చెక్ పడుతుంది.

Img Src : iStockphoto

గ్రేప్సీడ్ ఆయిల్‌లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాంపోనెంట్ ప్రోయాంతోసైనిడిన్ చర్మపు రంగును సమం చేసి, హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించి, చర్మ ఛాయ పునరుద్ధరణకు మద్దతు ఇస్తుంది. ఈ నూనెలోని విటమిన్ ఇ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా తోడ్పడతాయి.

Img Src : Unsplash

గ్రేప్సీడ్ ఆయిల్ నోటి ద్వారా తీసుకున్నప్పుడు మెలస్మా (హైపర్పిగ్మెంటేషన్‌) తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రేప్సీడ్ ఆయిల్ దట్టమైన పోషక ప్రొఫైల్, విటమిన్లు A, C, E, చర్మంపై ముడతలు, గీతలు, మచ్చలు పడకుండా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.

Img Src : iStockphoto

ఆలివ్, కొబ్బరి నూనె కంటే గ్రేప్‌సీడ్ ఆయిల్ చాలా తేలికైన కారణంగా సులభంగా వ్యాపించి, జుట్టును జిడ్డుగా మార్చకుండా తేమగా, కండిషన్ చేస్తుంది. యాంటీమైక్రోబయల్ ప్రాపర్టీ ఫ్లాకీ హెయిర్ స్కాల్ప్‌ను క్లియర్ చేయడంలో, చుండ్రును దూరం చేయడంలో సహాయపడుతుంది.

Img Src : Unsplash

విటమిన్ ఇ సమృద్ధి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, లినోలిక్ ఫ్యాటీ యాసిడ్ బలమైన మేన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొద్దిగా వేడిచేసిన గ్రేప్సీడ్ ఆయిల్ తో స్కాల్ప్‌ మసాజ్ చేయండి, రాత్రంతా తలను టవల్‌తో కప్పి, ఉదయాన్నే వాష్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Img Src : Unsplash

ద్రాక్ష విత్తానాల ఆయిల్ విశేషాలను తెలుసుకున్నారు కదా.. ఎలాంటి చర్మంపైనా ప్రతికూలత లేకుండా పనిచేసే ఈ నూనెను ఒక్కసారి ఔషధంగా వినియోగించి, చర్మంతో పాటు జుట్టు కూడా మెరిసేలా చేసుకోవాలని ఉందా.? అయితే ఎందుకు ఆలస్యం.

Img Src : Unsplash