Img Src : iStockphoto
ఏలకులు (ఇలైచి) వంటింటి మసాల్లాల్లో మరొక సుగంధ పదార్థం, దీని ప్రత్యేకమైన సువాసన, గొప్ప రుచి వంటలను రుచికరం చేస్తుంది. సుగంధ ద్రవ్యాల రాణిగా పిలువబడే ఇలైచిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఔషధీయ గుణాలు దాగివున్నాయి.
Img Src : iStockphoto
ఇలైచిలో ఫైటోకెమికల్స్ సినియోల్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, గొంతు సమస్యలు, జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి విషాకీటకాలు, విషపాములకు విరుగుడుగా వాడుతారు.
Img Src : iStockphoto
ఇలైచి ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపర్చి ఆస్తమాను నయం చేస్తుంది. శ్వాసకోశ అలెర్జీల చికిత్సలో ప్రభావవంతం. ఈ మసాలా శరీరాన్ని వేడిగా ఉంచడమే కాకుండా దగ్గు, జలుబు, తలనొప్పిని తొలగిస్తుంది.
Img Src : iStockphoto
ఇలైచీ బలమైన వాసన, రుచిని, ఇంద్రియ అంశాలను సక్రియం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఏలకులలో ఉండే మిథనాలిక్ ఎక్స్ట్రాక్ట్, ఎసిడిటీ, అపానవాయువు, అజీర్ణం, కడుపు నొప్పులు వంటి జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తాయి.
Img Src : iStockphoto
ఏలకులు అధిక రక్తపోటును తగ్గించి తద్వారా గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్ఎన్టి మెడికల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనం, ఏలకులు రక్తపోటును తగ్గించి యాంటీఆక్సిడెంట్ స్థితిని 90శాతం మెరుగుపర్చిందని వెల్లడించింది.
Img Src : iStockphoto
క్యాన్సర్ చికిత్సలో ప్రభావాన్ని చూపే ఇలైచీ, పెద్దపేగు క్యాన్సర్ బాధితుల్లో మంటను, ప్రభావాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదల నిరోధించి, వాటి మరణాన్ని ప్రోత్సహిస్తుంది. కొలొరెక్టల్ క్యాన్సర్‌పై 48 శాతం సానుకూల ఫలితం చూపింది.
Img Src : iStockphoto
వీటిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు దంత సమస్యలు, నోటి దుర్వాసనను నయం చేస్తాయి. నోట్లోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియాకు హాని కలగకుండా ఇన్ఫెక్షియస్ మైక్రోబ్స్ మాత్రమే నిరోధిస్తుంది. దంత సమస్యలకు శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ప్రసిద్ది చెందింది.
Img Src : iStockphoto
ఏలకుల నూనెలో అత్యుత్తమ కాంపౌండ్ సినియోల్ క్రియాశీలకంగా వ్యవహరించి నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా సంహరిస్తుంది. కావిటీస్ అభివృద్ధిని నిరోధించి, దంతాలను శుభ్రపర్చి, దంత క్షయాన్ని అడ్డుకుంటుంది.
Img Src : iStockphoto
మూత్రపిండాల ద్వారా వ్యర్థాలను తొలగించే ఇలైచి డైయూరిటిక్ గా పనిచేస్తుంది. అంటువ్యాధులతో పోరాడి టాక్సిన్స్ సహా పేరుకుపోయిన కాల్షియం, యూరియాను తొలగించి మూత్రనాళం, మూత్రాశయాన్ని శుభ్రపరుస్తుంది.
Img Src : iStockphoto