ఏలకులు (ఇలైచి) 10 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

Img Src : iStockphoto

ఏలకులు (ఇలైచి) వంటింటి మసాల్లాల్లో మరొక సుగంధ పదార్థం, దీని ప్రత్యేకమైన సువాసన, గొప్ప రుచి వంటలను రుచికరం చేస్తుంది. సుగంధ ద్రవ్యాల రాణిగా పిలువబడే ఇలైచిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఔషధీయ గుణాలు దాగివున్నాయి.

Img Src : iStockphoto

ఏలకులలో అనేక అరోగ్య ప్రయోజనాలు, ఔషధగుణాలు:

ఇలైచిలో ఫైటోకెమికల్స్ సినియోల్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, గొంతు సమస్యలు, జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి విషాకీటకాలు, విషపాములకు విరుగుడుగా వాడుతారు.

Img Src : iStockphoto

ఏలకులలో పుష్కలంగా ఫైటోకెమికల్స్ సినియోల్:

ఇలైచి ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపర్చి ఆస్తమాను నయం చేస్తుంది. శ్వాసకోశ అలెర్జీల చికిత్సలో ప్రభావవంతం. ఈ మసాలా శరీరాన్ని వేడిగా ఉంచడమే కాకుండా దగ్గు, జలుబు, తలనొప్పిని తొలగిస్తుంది.

Img Src : iStockphoto

దగ్గు, జలుబును నయం చేసే ఇలైచి

ఇలైచీ బలమైన వాసన, రుచిని, ఇంద్రియ అంశాలను సక్రియం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఏలకులలో ఉండే మిథనాలిక్ ఎక్స్‌ట్రాక్ట్, ఎసిడిటీ, అపానవాయువు, అజీర్ణం, కడుపు నొప్పులు వంటి జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తాయి.

Img Src : iStockphoto

జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఇలైచి:

ఏలకులు అధిక రక్తపోటును తగ్గించి తద్వారా గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్‌ఎన్‌టి మెడికల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనం, ఏలకులు రక్తపోటును తగ్గించి యాంటీఆక్సిడెంట్ స్థితిని 90శాతం మెరుగుపర్చిందని వెల్లడించింది.

Img Src : iStockphoto

రక్తపోటును నియంత్రించే ఇలైచి:

క్యాన్సర్ చికిత్సలో ప్రభావాన్ని చూపే ఇలైచీ, పెద్దపేగు క్యాన్సర్‌ బాధితుల్లో మంటను, ప్రభావాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదల నిరోధించి, వాటి మరణాన్ని ప్రోత్సహిస్తుంది. కొలొరెక్టల్ క్యాన్సర్‌పై 48 శాతం సానుకూల ఫలితం చూపింది.

Img Src : iStockphoto

కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించే ఇలైచి:

వీటిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు దంత సమస్యలు, నోటి దుర్వాసనను నయం చేస్తాయి. నోట్లోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియాకు హాని కలగకుండా ఇన్ఫెక్షియస్ మైక్రోబ్స్ మాత్రమే నిరోధిస్తుంది. దంత సమస్యలకు శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ప్రసిద్ది చెందింది.

Img Src : iStockphoto

దంత సంరక్షణలో ఇలైచీ:

ఏలకుల నూనెలో అత్యుత్తమ కాంపౌండ్ సినియోల్ క్రియాశీలకంగా వ్యవహరించి నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా సంహరిస్తుంది. కావిటీస్ అభివృద్ధిని నిరోధించి, దంతాలను శుభ్రపర్చి, దంత క్షయాన్ని అడ్డుకుంటుంది.

Img Src : iStockphoto

నోటి దుర్వాసన, కావిటీస్ కు ఇలైచితో చెక్:

మూత్రపిండాల ద్వారా వ్యర్థాలను తొలగించే ఇలైచి డైయూరిటిక్ గా పనిచేస్తుంది. అంటువ్యాధులతో పోరాడి టాక్సిన్స్‌ సహా పేరుకుపోయిన కాల్షియం, యూరియాను తొలగించి మూత్రనాళం, మూత్రాశయాన్ని శుభ్రపరుస్తుంది.

Img Src : iStockphoto

శరీరాన్ని డిటాక్సిఫై చేసే ఏలకులు: