Img Src : Unsplash
ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న మసాల దినుసు అల్లం. వంటలతో పాటు దీనిని ఔషధంగానూ ఉపయోగిస్తారు.
Img Src : Unsplash
వికారం, కడుపు నొప్పి, పైత్యం సహా ఇతర ఆరోగ్య సమస్యలకు అల్లం ఒక ప్రసిద్ధ నివారణి. దీనిని తాజా (పచ్చి) అల్లంగా, ఎండిన అల్లంగా (శోంఠి)గా తీసుకుంటారు.
Img Src : Pexels
జింగిబర్ అఫిసినేల్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే అల్లం వేలాది సంవత్సరాలుగా చైనీస్ వైద్యంలో, భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.
Img Src : Unsplash
అల్లంలోని జింజెరోల్స్, షోగోల్స్ అనే కాంపౌండ్లు వికారం, వాంతులు నివారిస్తాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
Img Src : Unsplash
అల్లం జలుబు నుంచి అర్థరైటిస్ నోప్పులు, వాపులకు ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియ మద్దతు, బిపి, మధుమేహం, క్యాన్సర్, సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుంది.
Img Src : Unsplash
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ప్రేగులలో ఏర్పడే వాయువులపై ప్రభావం చూపుతాయి. జీర్ణవ్యవస్థలో కదలిక పెంచుతుంది.
Img Src : Unsplash
అల్లం మార్నింగ్ సిక్ నెస్ సహా క్యాన్సర్ వల్ల వచ్చే వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని జింజెరోల్స్, షోగోల్స్ వికారం, వాంతులు నివారిస్తాయి.
Img Src : Unsplash
క్యాన్సర్ రోగులలో వికారం తగ్గించడంలో 0.5 గ్రా నుంచి 1.0 గ్రా మోతాదు అల్లం-శోంఠి అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Img Src : Unsplash
చాలామంది జలుబు లేదా ఫ్లూ నుండి కోలుకోవడానికి అల్లం టీని తాగేస్తారు. అయితే దీనిని సమర్థిస్తూ ఇప్పటివరకు ఎలాంటి సైటింఫిక్ ఆధారాలు లేవు
Img Src : Unsplash
మానవ కణాలలో ఒక శ్వాసకోశ వైరస్‌పై శోంఠి ప్రభావాన్నిపరిశోధించగా, శ్వాసకోశ వ్యవస్థను రక్షిస్తుందని తేలింది. రోజువారీ అల్లం వినియోగం రోగనిరోధకతకు మద్దతునిస్తుంది.
Img Src : Unsplash
అల్లం ప్రయోజనాలలో వాపులను తగ్గించడం, నొప్పి నుండి ఉపశమనం కల్పించడం, హృదయనాళ ఆరోగ్యానికి మద్దతునివ్వడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి.
Img Src : HealthShots