Img Src : iStockphoto
ప్రకృతి అందించిన ఔషధీయ మూలికలు, మొక్కల నుంచి ఆరోగ్య ప్రయోజనాలు పోందేవచ్చు. వాటిలోని సహజ ఔషధ గుణాలు మనకు తెలియకుండానే శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటీ అసరాతోనే కరోనా కష్టకాలాన్ని దాటేలా చేసింది ఆయుర్వేదం.
Img Src : iStockphoto
ఈ ఔషధీయ మూలికలలో పుదీనా, తులసి, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, త్రిఫల, అతిబల, అశ్వగంధ, తిప్పతీగ వంటివి ఉన్నాయి. వీటిలో అన్నీ తాజాగా లభ్యం కావు కాబట్టి వాటి పోడులను కూడా వినియోగించుకుని ప్రయోజనం పోందవచ్చు.
Img Src : iStockphoto
ఈ మూలికలను గ్లాసు నీటిలో నానబెట్టి మరుసటి ఉదయం ఒడ గట్టి తాగడం వల్ల శరీరం, మనస్సు అద్భుతంగా పునరుజ్జీవం పోందుతుంది. ఈ నీరు తీసుకోవడం సహజమైన అభ్యాసంగా మారితే అనేక వ్యాధులను దరిచేరనీయదు.
Img Src : iStockphoto
నీటిలో శీతలీకరణ లక్షణాలతో పాటు జీర్ణక్రియను ప్రేరేపించి, వ్యవస్థను శుభ్రపరుస్తుంది. దీనిలో ఔషధ గుణాల మూలికల ఉన్న కారణం చేతా వాటిలోని కీలకమైన నూనెలను నీరు గ్రహిస్తుంది. వీటిని తాగడం వల్ల సహజ రోగనిరోధక శక్తి పెరిగుతుంది.
Img Src : iStockphoto
మెంతులు.. పోషకాలు, ఔషధ గుణాల పవర్‌హౌస్. నానబెట్టిన మెంతి నీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. అపానవాయువు, అజీర్ణం, జీర్ణ సమస్యలతో పాటు నీరు నిలుపుదలను నివారిస్తాయి.
Img Src : iStockphoto
మెంతుల్లోని అమైనో ఆమ్లాల సమ్మేళనాలు ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 1-2 టీస్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
Img Src : iStockphoto
తులసి యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటిపైరేటిక్, యాంటిసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్‌తో సహా లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఇమిడివున్నాయి. ఈ ఆకులు చర్మ ఆరోగ్యం మెరుగుపర్చ, అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేస్తుంది.
Img Src : iStockphoto
నానాబెట్టిన తులసి నీరు జ్వరం, జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తులసి నీరు ప్రభావవంతమైన మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. మూత్రపిండాల నుండి విషాన్ని, వ్యర్థాలను బయటకు పంపుతుంది. గ్లాసు నీటిలో 5-6 తులసీ ఆకులు వేసి నానబెట్టాలి.
Img Src : iStockphoto
ఎర్రచందనం (ఇండియన్ రెడ్‌వుడ్) చెట్టు బెరడులో ఔషధ గుణాలు అపారం. ఇవి మూత్రపిండాల రుగ్మతలు, మధుమేహం, రక్తపోటు, చర్మ వ్యాధుల చికిత్సలో సహాయపడతాయి. ఎర్రచందనం నానబెట్టిన నీరు దాహార్తిని తీర్చుతుంది.
Img Src : iStockphoto
ఎర్రచందనం చెట్టు బెరడులను లేదా వాటి పోడిని నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టి, ఆ నీటిని వడకట్టి, సేవించడం వల్ల చర్మ ఛాయకు అదనపు నిగారింపు వస్తుంది. శరీర కణాలు, కణజాలాలను పునరుజ్జీవింపజేస్తుంది.
Img Src : iStockphoto
ధనియాలు.. రుచిని జోడించే ఈ సుగంధ ద్రవ్యం భారతీయ వంటకాల్లో డిమాండ్ ఎక్కువ. వీటిలో అజీర్ణం, మలబద్ధకం, పొత్తికడుపు తిమ్మిరి, సాధారణ జలుబు వంటి జీర్ణశయాంతర సమస్యలకు చికిత్స చేయడంలో ఆయుర్వేదమే సిఫార్సు చేస్తోంది.
Img Src : iStockphoto
వీటిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, అస్థిర నూనెలు పుష్కలం. ధనియా నీటిని తాగడం వల్ల అసిడిటీ, నోటిపూత, మధుమేహం, కీళ్లనొప్పులు, తలనొప్పిని నివారిస్తుంది. ధనియాలను గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టి, వడకట్టి త్రాగాలి.
Img Src : iStockphoto
దాల్చినచెక్క, ప్రధానమైన మసాలా దినుసు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆక్సికరణ ఒత్తిడి, మంటను తగ్గిస్తాయి. మొటిమలు సహా చర్మ సమస్యలతో పోరాడుతాయి.
Img Src : iStockphoto
దాల్చిన చెక్క బెరడు పొడిని గోరువెచ్చని నీటితో కలుపుకుని తాగితే మనస్సు, శరీరానికి ఓదార్పులభిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రించి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. దంత కావిటీస్‌ను నివారించడంతో పాటు నోటి దుర్వాసనను తాజాగా మారుస్తుంది.
Img Src : iStockphoto
త్రిఫలం (ఉసిరి, కరక్కాయ, తానికాయ) మిశ్రమాన్ని ఆయుర్వేదంలో డీటాక్సీఫైయర్, బేధిమందుగా వాడుతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని అందిస్తాయి. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు దరి చేరనీయదు. ఇది చర్మానికి కాంతినిస్తుంది.
Img Src : iStockphoto
త్రిఫల మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలుపి అప్పుడే సేవించవచ్చు. దీని బలమైన భేదిమందు లక్షణాల కారణంగా మలబద్ధకం సహా వ్యర్థాలను తొలగిస్తుంది. ఒక టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసి రోజూ సేవించండి.
Img Src : iStockphoto