Img Src : Canva

వర్షాకాలంలో అంటువ్యాధులకు దూరంగా ఉండటం ఎలా?

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలంగా వ్యాప్తి చెందడం తెలిసిందే. అయితే వీటికి ప్రభావాలకు గురికాకుండా అరోగ్యంగా ఉండటం ఎలా అన్నది, ఇప్పుడు పరిశీలిద్దాం.

Img Src : Canva

వర్షాకాలంలో అంటువ్యాధులకు దూరంగా ఉండటం ఎలా?

వర్షాకాలంలో నీటి కాలుష్యం అధికం. కలుషిత నీటి ద్వారా టైఫాయిడ్, కలరా వంటి అంటువ్యాధులు సంభవిస్తాయి. వాటిని తొలగించడానికి త్రాగే నీటిని కనీసం 15 నిమిషాలు మరిగించి సేవించాలి. వాటర్ ప్యూరిఫైయర్‌ని వంటి ప్రత్యామ్నాయాలు ఉపయోగించడం ఉత్తమం.

Img Src : Canva

నీటిని మరిగించి త్రాగండి

వర్షాకాలంలో క్రిమికీటకాలు సంచారం అధికం. అవి సంతాన వృధ్ది చేసుకునే కాలం ఇదే. అవి మిమ్మల్ని ప్రభావితం చెయకుండా ఉండటానికి మీ చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోండి. బయట నుండి వచ్చిన తరువాత లేదా ఆహారాన్ని తీసుకునే ముందు పరిశుభ్రత ముఖ్యం.

Img Src : Canva

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి

వర్షాకాలంలో ఆహార పదార్ధాలపై కప్పి ఉంచడం మంచిది. లేదంటే క్రీమికీటకాలు ఆహారాన్ని కూడా కలుషితం చేస్తాయి. ఈ కాలంలో నిల్వ చేసిన అహారాలకు దూరంగా ఉండాలి. అపరిశుభ్ర వీధి ఆహారం, పచ్చి కూరగాయలు నివారించండి. నిత్యం తాజాగా, వేడిగా తయారు చేసిన ఇంటి ఆహారాన్నే తీసుకోవాలి.

Img Src : Canva

తాజా, వేడి ఆహారాన్ని తినండి

వర్షాకాలంలో నిల్వ నీరు ఉన్న చోట దోమలు తమ సంతతిని పెంచుకుంటాయి. దోమల పెరుగుదలను ఆపడానికి నిలిచిపోయిన నీరు పేరుకుపోకుండా నిరోధించండి. కుండలు మరియు కూలర్లు వంటి కంటైనర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి ఖాళీ చేయండి.

Img Src : Canva

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

దోమలు తమ సంతతిని పెంచుకోకుండా నిల్వ నీరు ఉన్న చోట కిరోసిన్, డిడిటి పౌడర్, బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లాలి. అంతేకాదు పడుకునే ముందు దోమల వికర్షక క్రీమ్, విద్యుత్ వికర్షకాలు మరియు దోమతెరలతో దోమల కాటు నుండి రక్షణ పోందేలా చూసుకోండి.

Img Src : Canva

దోమల వికర్షకాలను ఉపయోగించండి

రుతుపవనాల కాలంలో పొడిగా ఉన్న దుస్తులను ధరించాలి. అంతేకాదు ఎలాంటి దోమల కాటుకు గురికాకుండా శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే నిండైన బట్టలను ధరించాలి. వర్షాకాలంలో తేమ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించకోవాలి. అందుకని గాలి చొరబడని దుస్తులను ధరించాలి.

Img Src : Canva

తగిన దుస్తులు ధరించండి

వర్షకాలంలో పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. ఈ తరహా ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ పాదాలను పొడిగా ఉంచండి. వర్షంలో తడిసి వచ్చిన తర్వాత కాళ్లను శుభ్రంగా కడిగి, పొడి బట్టతో తుడిచి పూర్తిగా ఆరనివ్వండి.

Img Src : Canva

మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోండి

వర్షాకాలంలో అంటువ్యాధులకు గురికాకుండా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలను తీసుకోండి. వ్యాధులతో పోరాడడంలో ముందుండే అల్లం మరియు పసుపు వంటి ఆహారాలలోని యాంటిఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను మీ రోజూ వారి ఆహారంలో చేర్చుకోండి.

Img Src : Canva

మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి

వర్షాకాలంలో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే జలుబు మరియు ఫ్లూ వంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు. జనసాంధ్రత అధికంగా ఉన్న ప్రాంతాలు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.

Img Src : Canva

రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి

వర్షాకాలంలో కంటికి కనిపించని సూక్ష్మక్రిముల సంచారం అధికంగా ఉంటుంది. వీటిని సంహరించడానికి మరియు వాటి వ్యాప్తిని నివారించడానికి మీ ఇంట్లో ఎక్కువగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా క్రిమిసంహారకాలతో శుభ్రపర్చడం వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.

Img Src : Canva

క్రిమిసంహారక మందులను వాడండి

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఇంట్లో ఈగలను తిరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇవి సూక్ష్మక్రీముల క్యారియర్లుగా వ్యవహరించి వ్యాధులను ప్రబలిస్తాయి. ఆహారాలు, ఇతర తినే పదార్ధాలపై కప్పి ఉంచడం లేదా గాలి చొరబడని కంటైనర్లలో ఉంచడం ఉత్తమం.

Img Src : Canva

ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయండి

వర్షాకాలంలో ఏ మాత్రం తేమ ఉన్న ప్రాంతాలు కనిపించినా అక్కడ సూక్ష్మక్రీములు అవాసాలుగా మలుచుకుంటాయి. వ్యాధిని మోసే తెగుళ్ళను ఆకర్షించకుండా నిరోధించడానికి ప్రతిరోజూ చెత్తను కవర్ చేసిన డబ్బాలలో పారవేయండి.

Img Src : Canva

మీ వ్యర్థాలను నిర్వహించండి

వర్షకాలంలో అధిక తేమ వల్ల మీకు సాధారణం కంటే ఎక్కువ చెమట పట్టవచ్చు. తేమ కారణంగా దాహం తక్కువ వేయవచ్చు. కాబట్టి, మూడు లీటర్ల నీటిని తీసుకుని శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. శుభ్రమైన, సురక్షితమైన నీటిని మాత్రమే త్రాగాలి.

Img Src : Canva

మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి

సాధారణంగా శీతల పానీయాలు, ఐస్ క్రీములలో అదనపు చక్కర నిల్వలు అధికంగా ఉండే అనారోగ్య కారకాలు అని తెలిసిందే. వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండండి, ఇవి గొంతును చికాకుపెట్టి, ఇన్ఫెక్షన్లకు గురి చేసే ప్రమాదం ఉంది.

Img Src : Canva

శీతల పానీయాలను నివారించండి

అనారోగ్య లక్షణాలను మన శరీరం మనకు ముందస్తుగానే చెబుతుంది. అయితే వాటిని విస్మరించకుండా తగు చర్యలు తీసుకోవడం ద్వారా, త్వరగా కోలుకోవచ్చు. అంతేకాదు మీ పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి వైద్య సలహా మరియు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

Img Src : Canva

మీ శరీరాన్ని చెబుతున్నది వినండి

వర్షాకాలంలో దుస్తులను ఇంటి లోపలే ఆరవేయడం ద్వారా అంటువ్యాధుల నుండి తప్పించుకోవచ్చు. ఆరుబయట బూజు మరియు బ్యాక్టీరియా పేరుకుపోకుండా నిరోధించడానికి, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో బట్టలను ఇంటి లోపల ఆరబెట్టండి.

Img Src : Canva

మీ దుస్తులను ఇంటి లోపల ఆరబెట్టండి

ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి కాలానుగూణంగా సంక్రమించే సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. రుతుపవనాల సమయంలో చల్లని గాలి కూడా ప్రభావితం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త సుమా.!

Img Src : Canva

చివరి చిట్కా