Img Src : iStockphoto
వర్షాకాలం.. అందునా బయట వర్షం పడుతుందీ అంటే సాధారణంగా మంచంపై నుంచి దిగాలంటే బద్దకం. తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ప్రయత్నాలు చేయాల్సివస్తుంది. ఈ నీరసానికి కారణం బయట వాతావరణం. అదే తాజాగా అనుభూతి చెందకుండా చేస్తుంది.
Img Src : iStockphoto
రుతుపవనాలు, వర్షం, చంచలమైన వాతావరణం రోజంతా వెచ్చగా, హాయిగా దుప్పట్లలో సేద తీరాలని కోరుకునేలా చేస్తోంది. అయితే దీనికి ఆహారం కూడా జతకలుస్తుంది. అదెలా అంటే.. వర్షంలో వేడివేడి పదార్థాలను కోరుకుని తినేస్తాం. అదే నిరసాన్ని తెచ్చిపెడుతుంది.
Img Src : iStockphoto
వర్షాలతో, ఆహారంలో మార్పులు వస్తాయి. వేసవిలో జిహ్వచాపల్యాన్ని నియంత్రించుకున్నా.. వర్షాకాలంలో మాత్రం అదుపుచేసుకోలేక వేయించిన ఆహారాన్ని కోరుకుంటారు. ప్రతిసారీ పకోడాలు, సమోసాలు, మిర్చిబజ్జీలు అస్వాదిస్తారు. ఈ క్యాలరీ-దట్టమైన వంటకాలు మిమల్ని లాపుగా చేసేస్తాయి.
Img Src : iStockphoto
వేయించిన ఆహారాలలో కొవ్వులు, పిండి పదార్థాలు ఎక్కువ, వాటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగుతుంది. ఇది శరీరంలో శక్తి లోపానికి దారితీస్తుంది. దీంతో అలసట, సోమరితనం, నిద్రపోవాలని అనిపిస్తుంది. ఆహారంలో మార్పే దీనికి పరిష్కారం.
Img Src : iStockphoto
ఆహార నిపుణులు, డైటీషియన్లు ఎల్లప్పుడూ మీ ఆహార నియమావళిని క్రమమైన వ్యవధిలో సర్దుబాటు చేయాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో, ఆరోగ్యంగా, శక్తివంతంగా, ఫిట్ గా, ఉత్సాహంగా ఉండటానికి నీరు, కాలానుగుణమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Img Src : iStockphoto
మసాలా చాయ్ వర్షంలో ఉత్సాహానిస్తుంది. ఈ పానీయంలో జోడించిన లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాల ఘాటైన సువాసన పోషకాల మిళితం. ఇవి సీజనల్ వ్యాధులతో పోరాడుతూనే పోషకాలు, రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
Img Src : iStockphoto
వర్షాకాలంలో డీప్ ఫ్రై చేసిన వంటకాలు, వేయింపుల కన్నా పోషకాలతో నిండిన సూప్ చక్కని సంతృప్తినిచ్చే ప్రత్యామ్నాయం. దీంతో శరీరానికి మంచి పోషకాలు, బలం, మంచి మొత్తంలో ద్రవాలు అందుతాయి. ఇక సూప్ తీసుకోవడాన్ని ఎవరు కాదంటారు.
Img Src : iStockphoto
పోషకాలతో నిండిన పప్పు, బియ్యం సరైన మొత్తంలో తీసుకుని, శక్తివంతమైన పిండి పదార్థాలను అందించే ఖిచ్డీ ప్రసిద్ద వంటకం. ఖిచ్డీ తయారు చేయడం సులభం కాబట్టి, దీన్నే ఎక్కువగా చేస్తుంటారు. ఇది ఓదార్పునిచ్చే రుచికరమైన వంటకం.
Img Src : iStockphoto
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే సమయంలో కషాయాలు తీసుకోవడం అనావాయితి. వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసే కషాయాలు రోగనిరోధకశక్తి, బలాన్ని అందించడంతో పాటు సీజనల్ వ్యాధులతో పోరాడతాయి.
Img Src : iStockphoto
ప్రేగు కదలికలు, జీర్ణక్రియ, జీవక్రియలు సవ్యంగా సాగితేనే శక్తి పునరుత్పత్తి. దీంతో ఆరోగ్యంగా, సంతోషంగా, చురుకుగా ఉంటాం. గ్యాస్, అసిడిటీ, ప్రేగు సమస్యల వంటి వర్షాకాల గట్ సమస్యలను అరికట్టడానికి, ఆహారంలో తగినంత ప్రోబయోటిక్స్ (పులియబడిన) చేర్చుకోవాలి.
Img Src : iStockphoto
ప్రోబయోటిక్స్ శరీరంలో సమతుల్యతను కాపాడి, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా ఉత్పత్తికి దారి తీస్తుంది. ఇవి పేగు కదలికలను సవ్యంగా సాగేలా చేయడంతో పాటు ఉబ్బసం, గ్యాస్, వంటి సమస్యలను శాంతపరుస్తాయి. ఇవి పోషకాలతో పాటు ప్రయోజనకరమైన ఆహారం.
Img Src : iStockphoto
వర్షాకాలంలో వేయించిన ఆహారాన్ని వదులుకోవాలా అంటే? అస్సలు కానే కాదు! అయితే అరోగ్యంగా ఉంటూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మంచి పౌష్టికాహారంతో పాటు ఆరోగ్యకరమైన సమతుల్యతను కొనసాగించాలన్నదే ఉద్దేశ్యం.
Img Src : iStockphoto