స్టార్ ఫ్రూట్: ఆకారంలోనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలలోనూ ఇది స్టార్.!

స్టార్ ఫ్రూట్స్ విటమిన్ బి, విటమిన్ సి, గల్లిక్ యాసిడ్ పుష్కళంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను నిర్వహణ, మెరుగుపర్చడానికి ఈ విటమిన్లు, ఖనిజాలు అవసరం.

విటమిన్ బి, విటమిన్ సి:

జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి అవసరమైన కరిగే ఫైబర్‌తో పాటు, స్టార్ ఫ్రూట్‌లో కరగని డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది

కరిగే ఫైబర్‌కు మంచి మూలం

తక్కువ చక్కెర స్థాయిలు ఉండటంతో, దీనిని మధుమేహం లేదా బరువు తగ్గించాలని ప్రయత్నించేవారు కూడా తీసుకోవచ్చు.

తక్కువ కేలరీలు, మితంగా చక్కెర

స్టార్ ఫ్రూట్‌లో ఉండే అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు సోరియాసిస్, డెర్మటైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తాయి.

వాపు నివారణ

స్టార్ ఫ్రూట్లోని రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ జీవక్రియను నియంత్రిస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ పెద్దమొత్తంలో మలం ఏర్పడటానికి, ప్రేగు కదలికలను సాఫీగా సాగేలా చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది

స్టార్ ఫ్రూట్స్‌లోని మూత్రవిసర్జన లక్షణాలు.. శరీరం నుండి అదనపు నీటిని, టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. ఈ పండు కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

ఆయుర్వేదంలోనూ కడుపు పూతల చికిత్సలో ఈ పండును ఉపయోగిస్తన్నారు. దీని సారాలలో టెర్పెనోయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, మ్యుసిలేజీలు అల్సర్‌లకు చికిత్స చేస్తాయి.

యాంటీ అల్సర్ లక్షణాలు:

ఈ ఫ్రూట్ లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ఏజెంట్లతో పాటుగా, సిఓపిడిని తగ్గించి శ్వాసకోశ సమస్యలను మెరుగుపర్చుతుందని అధ్యయనం నిర్ధారించింది.

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం

రక్తపోటు, హృదయ సంబంధిత ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడే అత్యంత అవసరమైయ్యే పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్‌లు స్టార్ ఫ్రూట్‌లో ఉన్నాయి

మెరుగైన గుండె ఆరోగ్యం:

నిద్రలేమి సమస్యకు స్టార్ ఫ్రూట్ చక్కటి పరిష్కారం. ఇది నిద్రను ప్రేరేపించడంలో సహాయపడే గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్ (జిఏబిఏ) రసాయనాన్ని సక్రియం చేయడంలో సహాయపడుతుంది.

నిద్రలేమి లక్షణాల నివారణ