Img Src : iStockphoto
బరువు తగ్గాలంటే పొత్తికడుపు వద్దనున్న అధిక కొవ్వు పెను సవాల్ విసురుతుంది. అనేక కారకాలచే ప్రభావితమై నిరంతర సమస్యగా కొనసాగే ఈ బెల్లీ ఫ్యాట్ ను కరగదీయడం, నియంత్రిచడం కూడా కష్టతరమే. ఏళ్లుగా పేరుకుపోయిన కొవ్వును నెలల్లో తొలగించడం కష్టమే.
Img Src : iStockphoto
ఆహారంలో బరువు తగ్గడం, పొట్టలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేలరీలు, చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు హానికరమని గమనించడం ముఖ్యం. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం.
Img Src : iStockphoto
కాగా బెల్లి ఫ్యాట్ ను కరిగించడంలో ప్రోటీన్ ప్రాముఖ్యత ఉందని ఇప్పటికే చాలా మంది డైటీషియన్లు చెప్పారు. ఉదయం అల్పాహారం నుంచే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం బొడ్డు కొవ్వు కరిగించడంలో గొప్పగా సహాయపడుతుందని చెప్పారు.
Img Src : iStockphoto
ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి ఏర్పడుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు.. ఏదైనా చూసినా దానిని తినాలన్న కోరిక కూడా కలగకుండా అరికడుతుంది. దీంతో బరువు తగ్గించే డైట్ ఫాలో అవుతున్నవారికి సంతృప్తినిస్తుంది.
Img Src : iStockphoto
ప్రోటీన్-రిచ్ భోజనం జీవక్రియను పెంచి, ఇది త్వరగా జీర్ణం కాకుండా ఆకలిని అరికడుతుంది. దాదాపుగా కడుపులో సంపూర్ణత్వ భావాలను ప్రోత్సహించి, దేనిపైకి దృష్టిని మళ్లించదు. అదే సమయంలో పొట్ట కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది.
Img Src : iStockphoto
ప్రోటీన్ ఫుడ్ కు దాదాపుగా పూర్తి విరుద్ధంగా, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. కొవ్వు నిల్వకు దారితీయడంతో పాటు బరువును పెంచేస్తుంది. కాబట్టి, అల్పాహారాన్ని "ప్రోటెనైజ్" చేయాలని డైటీషియన్ల సలహా.
Img Src : iStockphoto
ఈ నాలుగు సాధారణ అల్పాహార వంటకాలు ప్రోటీన్ కంటెంట్‌ను మెరుగుపరచడానికి సులభమైన మార్గాలని డైటీషియన్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పులు అల్పాహారంలో క్రమంగా పెద్ద సర్దుబాట్లకు దారితీసే చిన్న మార్పులు కావచ్చునని సిఫార్సు చేస్తున్నారు.
Img Src : iStockphoto
1) పోహాలో 7-8 వేరుశెనగలు, మొలకలు, బఠానీలను జోడిస్తే చాలు. 2) ఉప్మాలో బీన్స్, 7-8 వేరుశెనగలను జోడించాలి, 3) పరాఠాలను చేసే రోటీ పిండిలో చిక్‌పా పిండిని కలపాలి. 4) దోస/ఇడ్లీలలో ప్రోటీన్ పెంచేందుకు వేరుశెనగ చట్నీ జత చేయాలని డైటీషియన్ల సిఫార్సు.
Img Src : iStockphoto
వేరుశెనగలు, బఠానీలు, పనీర్, బేసన్‌లలో శాఖాహార ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి వంటశాలలలో సులభంగా అందుబాటులో ఉంటూ క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అయితే పల్లీలలో క్యాలరీలు ఎక్కువైనా ఫైబర్, పోషకాలు పుష్కలం కాబట్టి తినాల్సిందే.
Img Src : iStockphoto
అల్పాహారం ప్రోటీన్ రిచ్ తో పాటు కాల్షియం జతపర్చడానికి గుడ్లు అనుకూలమైన ఎంపిక. ఇక దోసెలు, ఇడ్లీ పిండిలో రాగి, జొన్న, బజ్రా మొదలైన మిల్లెట్లు కలుపుకోవడం తప్పనిసరి. ఉప్మాలోనూ మిల్లెట్లు జోడించడం లేదా మిలెట్ల ఉప్మా చేయడంపై అన్వేషించండి.
Img Src : iStockphoto
Thanks for reading!
Img Src : iStockphoto