Img Src : iStockphoto

వర్షాకాలంలో సాధారణంగా ప్రబలే అతిసారంతో జాగ్రత్తా.!

వర్షాకాలం వచ్చిందంటే చాలు అంటువ్యాధులు ప్రబలుతాయి. వర్షం నీరు నిలిచిపోవడం నీరు, గాలి కూడా కలుషితమై పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్యం పాలవుతుంటారు. ఈ కాలంలో వాంతులు, విరోచనాలతో వచ్చే అతిసార వ్యాధి (డయేరియా) నుంచి జాగ్రత్తగా మెదలాలి.

Img Src : iStockphoto

వర్షాకాలంలో అతిసార వ్యాధితో జాగ్రత్తా:

ఈ కాలంలో కలుషితమైన నీరు వదులుగా లేదా నీటితో కూడిన విరోచనాలు జరగుతాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిలిచిపోయిన నీటిపై బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవాలు తమ సంతతిని పెంచుకుని ఆహారపదార్థాలపై దాడి చేసి అతిసార వ్యాధి వ్యాప్తింపజేస్తుంది.

Img Src : iStockphoto

కలుషితమైన నీరు అతిసారానికి కారకం:

వర్షాకాలంలో పరిశుభ్రత లోపించడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అతిసారం వ్యాప్తి చెందుతుంది. ఈ కాలంలో వర్షపు నీరు నిల్వలో సూక్ష్మక్రీములు లక్షల్లో తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈ కలుషిత నీరు, ఆహారం అతిసార వ్యాధి వ్యాప్తికి మరింత ప్రబలంగా ఉంటుంది.

Img Src : iStockphoto

పరిశుభ్రత లోపం వ్యాధి ప్రబలేందుకు కారణం:

చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అధికంగా వర్షాకాల డయేరియా ప్రభావాలకు గురవుతారు. అతిసారం లక్షణాలు తరచుగా నీటి మలం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, కొన్నిసార్లు జ్వరం కలిగి ఉండవచ్చు.

Img Src : iStockphoto

చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధి బాధితులపై ప్రభావం:

వర్షాకాలంలో సంభవించే అతిసార వ్యాధితో శరీరం నుంచి నీరు వెళ్లిపోవడం అందోళన కలిగించే ముఖ్యమైన పరిస్థితి. అధిక విరేచనాల నుండి శరీరం నుంచి ద్రవ నష్టం తీవ్రంగా ఉంటుంది, దీనిని తక్షణమే నియంత్రించని పక్షంలో ప్రాణాంతకం కావచ్చు.

Img Src : iStockphoto

శరీరం నుంచి ధ్రవం వెళ్లడం ప్రాణాంతకం కావచ్చు:

వర్షాకాలం వచ్చిదంటే చాలు వేడి వేడి ఆహార పదార్థాలను కాసింత చల్లబడగానే తినేయాలి. ఇక నీటిని కూడా మరిగించి, గోరువెచ్చగా ఉండగా అందులో తులసి, పుదీనా ఆకులు వేసి తీసుకోవాలి. చల్లారితే సూక్ష్మక్రీములు దాడి చేయవచ్చు.

Img Src : iStockphoto

వర్షాకాలంలో నీరు, ఆహారాన్ని ఎలా తీసుకోవాలి?

నీటిని శుద్ది చేసే అర్వో ఫిల్టర్ల నీటిని వినియోగించినా అరోగ్యకరమే. ఇక ఆహారం పూర్తిగా వండినట్లు నిర్థారించుకున్న తరువాత వాటిని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అతిసార సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించుకోవడమే అవుతుంది.

Img Src : iStockphoto

శుద్ది చేసిన నీరు, పూర్తిగా ఉడికిన ఆహారం మంచిది:

నీటిని విరేచనాల నివారణలో సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షితమైన నీటి వినియోగించాలి. సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. అతిసారం ప్రబలితే సకాలంలో వైద్య సహాయం, ఓఆర్ఎస్ తీసుకోవడం, వైద్య సలహాలను పాటించడం చాలా అవసరం.

Img Src : iStockphoto

వర్షాకాలంలో పరిశుభ్రత చాలా అవసరం

అతిసారంతో బాధపడేవారు శరీరం నుంచి బయటకు వెళ్తున్న ధ్రవాన్ని భర్తీ చేయడంతో పాటు త్వరితగతిన కట్టడి చేసుకునేందుకు ఒక గ్లాసు నీళ్లను పాత్రలో పోసి మరిగనివ్వాలి. నీరు గోరువెచ్చగా ఉండగా అందులో చెంచా చక్కర, చిటికెడు ఉప్పు వేసి కలిపి తాగాలి.

Img Src : iStockphoto

అతిసార వ్యాధికి వంటింటి చిట్కా:

అతిసార వ్యాధి సోకినవారు నిరసంగా మారిపోతారు. ఒక పాత్రలో టీస్పూన్ జీలకర్ర, రెండు కప్పుల నీటిలో వేసి, నీరు ఒక కప్పు ధ్రవంగా మారేంతవరకు మరిగించాలి. చల్లారిన తరువాత దానిని తీసుకోవాలి. ప్రతి 2గంటలకు ఇలా చేస్తే అతిసారం కట్టుబడుతుంది.

Img Src : iStockphoto

అతిసార వ్యాధికి హోమియో చిట్కా: